మహిళలు : సోషలిజం

డా|| మానేపలి

ఆగస్ట్‌ బెబెన్‌ (1840-1913) ప్రముఖ జర్మన్‌ మార్క్సిస్టు

విప్లవకారుడు. మార్క్స్‌ ఏంగిల్స్‌లకు సమకాలికుడు. 1869లో జర్మన్‌ సోషల్‌ డేమోక్రసీ (పార్టీని) విల్‌హెల్మ్‌ వీబ్నిష్ట్‌తో కలిసి వ్యవస్థాపించాడు.

జర్మనీ పార్లమెంట్‌ రీహ్‌స్టాగ్‌లో 1867 నుంచీ సభ్యుడు. చాలా చిన్నవయసులో వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం వున్నవి. ఫ్రాంకో ప్రష్యన్‌ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజాస్వామ్యవాదిగా, ప్రగతి శీలిగా 1872లో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. పార్లమెంట్‌లో బెబెల్‌ ప్రసంగాలు నిప్పులు చెరిగినట్టుండేవి. ఆయన గ్రంధాల్లో ”నా జీవితానుభవం నుంచి” (ఫ్రమ్‌ మై లైఫ్‌ – ఆత్మ చరిత్ర), మహిళలు – సోషలిజం (విమన్‌ అండ్‌ సోషలిజం) మిక్కిలి ప్రసిద్ధి చెందినవి.

”మహిళలు-సోషలిజం” అనే గ్రంథాన్ని మొదట 1879లో రచించినా దాన్ని క్రమంగా అభివృద్ధిపరచి ఎన్నో నూతన ఆలోచనలు జోడించి 1950 తిరిగి రచించాడు. అది న్యూయార్క్‌లో ”సోషలిస్టు లిట్రేచర్‌” కంపెనీవారు ప్రచురించారు. దాన్ని ఇటీవల యదాతథంగా పునర్ముద్రించింది. అఖిలభారత ప్రజాతంత్ర మహిళసంఘం వారు (ఐద్వా) దాన్ని తెలుగులో అనువదింపజేసి ప్రచురించారు. (సెప్టెంబరు 2012) ఈ గ్రంథాన్ని వివిధ మహిళా సంఘాల్లో పనిచేసే కార్యకర్తలే కాక, అక్షరాస్యులైన సామాన్య మహిళలందరూ బాగా దృష్టిపెట్టి చదవాలి. అధ్యయనం చెయ్యాలి. సమకాలీన పరిస్థితుల్తో అన్వయించుకుంటూ కార్యాచరణ రూపొందించుకోవాలి. తెలుగు అనువాద ప్రతికి 16 పేజీల సుదీర్ఘమైన ముందుమాట రాశారు వామపక్ష మహిళా ఉద్యమ నాయకురాలు బృందా కారత్‌. ఈ గ్రంథంలోని 30 అధ్యాయాల్లోనూ వివిధ విషయాల్ని విపులంగా చర్చించాడు ఆగస్ట్‌ బెబెల్‌.

ఆదిమ సమాజంలో స్త్రీ, మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల ఘర్షణ, క్రమంగా మాతృస్వామ్య విధానం పూర్తిగా కనుమరుగై పితృస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం, మధ్య యుగాల్లో స్త్రీ, క్రైస్తవ మతంలో స్త్రీ, మధ్యయుగాల్లో వచ్చిన వివిధ సంస్కరణోద్యమాలు, కుటుంబం, వివాహ వ్యవస్థ, సంతానం కని – పురుషుడి శృంగార/భోగ వస్తువుగా పరిణామం, గృహ యజమానురాలి స్థాయినుంచి బానిస స్థాయికి పతనం, వేశ్యా వృత్తి – బూర్జువా సమాజంలో ఒక సామాజిక అవసరంగా (సెక్యువల్‌ ఔట్‌ లెట్‌) స్త్రీ, ఆధునిక (16,17,18 శతాబ్దాలు) యుగంలో స్త్రీల పరిస్థితిలో మెరుగు, విద్యా-ఉద్యోగ-పరిశ్రమల రంగంలో స్త్రీ, రాజ్యాంగ వ్యవస్థ, చట్టం దృష్టిలో స్త్రీ, క్రమ పరిణామం, వ్యవసాయ రంగంలో అత్యవసర శ్రమశక్తిగా మహిళ, వర్తమాన ప్రజాస్వామ్య- సోషలిస్టు వ్యవస్థలో స్త్రీ, జనాభా నిష్పత్తిలో తగ్గుతున్న స్త్రీల సంఖ్య, ఓటు హక్కు, విడాకుల చట్టం – ఇలా అనేక అంశాల్ని తనదైన కోణంలో చర్చించాడు బెబెల్‌.

స్త్రీల సమాన హక్కులు – అనే అంశంపై కొంత చర్చ సాగింది. దీన్ని ముందుమాట రాసిన బృందాకారత్‌ మరింత విపులంగా చర్చించారు. చాలా ముఖ్యంగా స్త్రీల లైంగికతపై కొంత ఆలోచనలు చేశారు. ఆధునికయుగంలో, అభివృద్ధి చెందుతున్న నాగరికతా క్రమంలో ఉద్యోగ-విద్యా రంగాల్లో చట్టపరంగా స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగిన మాట నిజమే. కాని మొత్తంగా పురుష జాతికి – స్త్రీలపై వివక్ష పోలేదు. విచ్చలవిడి కామ ప్రవృత్తి పోలేదు. దీనిలో మీడియా దుష్టపాత్ర కూడా లేకపోలేదు. ముఖ్యంగా 1960-80-90ల తరవాత, సినిమాల్లోనూ, టీవీ కార్యక్రమంలోనూ అప్రజాస్వామిక ధోరణి, విశృంఖల ప్రేమ కలాపాలు, అర్ధనగ్న నృత్యాలూ బాగా పెరిగాయి. యువతలో ఈ దృశ్యాల ప్రభావం బాగా ఎక్కువై ధూమపానం, మధ్యపానం గణనీయంగా పెరిగింది. అదొక ఫాషన్‌గా మారిపోయింది.

మహిళా సంఘాలవారు మారుతున్న ఈ పరిస్థితులపై పోరాటం చెయ్యాలి. సామాన్య మహిళల్ని చైతన్యపరచాలి. ముఖ్యంగా పని పరిస్థితులల్లో స్త్రీలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. ప్రభుత్వం, పోలీసులు, చట్టం – ఇవి తగిన న్యాయం చేస్తాయనుకో కూడదు. వాటినిండా విపరీతమైన పురుషాహంకార భావజాలం వున్నదన్న సంగతి గుర్తించాలి. సమైక్య ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. క్లారాజట్కిన్‌, అలెగ్జాండ్రా కొల్లంటాయ్‌, రోజా లగ్జంబర్గ్‌, వర్జీనియా వూల్ఫ్‌, సైమన్‌ ది బాద్రా – మొదలైన రచనల్ని కూడా అధ్యయనం చెయ్యాలి. ఆయా అంశాల్ని దేశ కాలమాన పరిస్థితులకు అన్వయించుకోవాలి.

ఈ అన్నింటికీ ఆగస్ట్‌ బెబెల్‌ ”మహిళలు-సోషలిజం” అనే గ్రంథం ఇరుసువంటిది. మహిళా సంఘాలవారే కాక, ఉపాధ్యా యులు, ఉద్యోగులు, కార్మిక అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ముగ్గురు, నలుగురు గ్రూపులుగా ఏర్పడి అధ్యయనం చెయ్యాలి. దీక్షతో, సైద్ధాంతిక స్పష్టతతో పనిచెయ్యాలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో