సామాన్య
2005లో నేనో హిందీ మూవీ చూశా పహేలి అని ప్రధాన తారాగణం షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ.
పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే మతిపోయింది. ఎటువంటి కథ ఇది, ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని ముఖ్యంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర దెయ్యం, పక్షిలా వచ్చే సన్నివేశం,దాని అరుపు (సంగీతం- కీరవాణి), అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి. ఆ సినిమా 1973 Pokiesలో వచ్చిన దువిధా అనే హిందీ సినిమాకి రీ మేకింగ్ అని మాత్రమే అప్పుడు నాకు తెలుసు.
ఆ సినిమాకి మూలమైన కథ ఎవరిదీ, ఏవిటీ నాకేమి తెలీదు. తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత కథ అని. ఆ తరువాత కొన్నాళ్లకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ”విజ్జి” అనువాద కథల సంకలనం ”సందిగ్ద” చదవడం జరిగింది. ప్రతికథ ఒక షాక్. అంతకుమించీ స్త్రీ వాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది.
కథ – మూడు ముక్కల్లో ఏంటంటే… ఒక మగాడు… వాడికి అందమైన అమ్మాయితో పెళ్ళవుతుంది.
పెళ్లి చేసుకొని వచ్చే దారిలో ఓ దెయ్యం ఆ పిల్లని చూసి మొహిస్తాడు. వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు.
కొత్త పెళ్లి కూతుర్ని వదిలి ఏదో వ్యాపారానికి సుదూరానికి వెళ్లిపోతాడు. అప్పుడి దెయ్యం.
మగాడి వేషంలో వచ్చి ఆపిల్లతో కాపురం మొదలెడతాడు. కానీ నిజం చెబుతాడు. నిజం చెప్పినా నా ఆ పిల్లవాడిని కోరుకుంటుంది.
గర్భవతి కూడా అవుతుంది.
మగాడు వస్తాడు విషయం తెలుస్తుంది. నేను నిజమైన మగాడినంటే నేను నిజమైన మగాడినని పోట్లాడుకుంటారు. తీర్పుకు రాజు దగ్గరికి వెళ్తూ వుంటే, మార్గమధ్యంలో ఒ గొర్రెల కాపరిదయ్యాన్ని బంధించి సమస్యని పరిష్కరించేస్తాడు.
ఎలా బంధించి వేస్తాడు అంటే అతను అంటాడూ ”ఏడుసార్లు చిటికేవేసేలోగా ఎవరైతే ఈ నీటిబుర్రలో దూరుతారో వాడే పడక గదికి నిజమైన యజమాని” అని. అంతే ఆ పిల్లని అమితంగా ప్రేమించే దెయ్యం ఆ నీటి బుర్రలోకి దూరేస్తాడు.
అంతా బానే ఉంది, పడక గదిలోకి అసలు మగాడు వచ్చేసాడు. కానీ అప్రమేయంగా ఇద్దరు మగవాళ్ల మధ్య నలిగిన ఆమె జీవితం సంగతి ఏంటి? పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి? ఆ పిల్ల మనసులో పీటం వేసుకుకూచున్న ఆ దెయ్యం మీది ప్రేమ సంగతేంటి? ఏడు చిటికెలు వేసి దానిని కూడా ఏదైనా నీటి బుర్రల్లోకి పిగలిగే గొర్రెల కాపరులు వుంటే ఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివిన అనేక సంవత్సరాల తరువాత కూడా, వెంటాడే కథ ఈ ”ఉల్ఘన్” (సంశయం), చూసిన తరువాత అట్లాగే గుర్తుండి పోయే సినిమా పహేలి.