– భూమిక
జులై పన్నెండు శిలాలోలిత పుట్టిన రోజు. ఆ రోజున తన మూడో కవితా సంపుటి ‘గాజునది’ని ‘భూమిక’ తరపున ఆవిష్కరించమని కోరింది. అలాగే ఎన్నాళ్ళగానో పెండింగులో వున్న నా ప్రయాణానుభవాల పుస్తకం కూడా దానితోపాటు ఆవిష్కరిస్తే బాగుంటుందని సూచించింది. నా పుస్తకం తయారవ్వలేదు. అయినా సరే చేద్దాంలే అని తనకి హామీ ఇచ్చేసాను. మీటింగ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి ప్రెస్‌క్లబ్ బుక్ చేసేసాం కూడా.
జూలై పన్నెండు సాయంత్రం 6:30కి సరదా సరదాగా పుస్తకావిష్కరణ సభ మొదలైంది. ఈ సభకి బోలెడు ప్రత్యేకతలున్నాయి. ఎలాంటి హంగూ, ఆర్భాటాలు, గజమాలలు, భారీ మెమోంటోలు లేకుండా హాయిగా జరిగింది. అలాగే విశిష్ట అతిథులు, ఆత్మీయ అతిథులు శ్రేష్ట అతిధులు లాంటివారు ఎవ్వరూ లేకుండా అందరూ ఆత్మీయులే ఈ సభా వేదిక మీద ఆసీనులయ్యారు.
శిలాలోలిత పుస్తకం ‘గాజునది’ని వాళ్ళ అబ్బాయి సాహిర్ భారతి ఆవిష్కరించడం మరో విశేషం. సాహిర్ పుస్తకాన్ని ఆవిష్కరించి… తన తల్లి పుస్తకాన్ని ఆవిష్కరించగలగడం. తనకెంతో గర్వంగాను, సంతోషంగాను వుందని చెబుతూ… వాళ్ళమ్మ భుజం చుట్టూ చెయ్యేసి ‘మేరి ప్యారి మా’ అంటూ ఎంతో ఆర్ద్రంగా ఓ పాట పాడాడు. ఆ తర్వాత నారాయణ శర్మ, సుజాత పట్వారి ‘గాజునది’ గురించి మాట్లాడారు.
కొండవీటి సత్యవతి యాత్రానుభవాల పుస్తకం ‘తుపాకీ మొనపై వెన్నెల’ను ప్రముఖ విద్యావేత్త, నిజామాబాద్ నుంచి వచ్చిన అమృతలత ఆవిష్కరించారు.

”ఓవైపు ఎండ…. మరోవైపు వర్షం… మధ్యలో భూమినీ ఆకాశాన్ని కలుపుతూ ఏడు రంగుల హరివిల్లు కన్పించినపుడు…. ఏ పనుల్లోనో పడి ఇంట్లోనే వుండిపోయిన అమ్మలని చేయిపట్టి బరబరా లాక్కొచ్చి, ‘ఎంత సేపూ పనేనా? ఆ ఇంధ్రధనుస్సు చూడూ, ఎంతందంగా వుందో” అంటూ చిన్నపిల్లకి మల్లే కేరింతలు కొట్టే సత్యవతి పసిమనసు… అడుగడుగునా ఈ పుస్తకంలో కన్పిస్తుంది.” అంటూ కితాబిచ్చారు అమృతలత. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి తర్జుమాలో చేయించి, కలర్ ఫోటోలు పెట్టి” సారే జహాసే అచ్ఛా హిందూస్తాన్ హమరా” అని పేరు పెడితే అందరికీ టూరిస్ట్ గైడ్‌గా ఉపయోగపడుతుందని ఎంతో ఆత్మీయంగా సెలవిచ్చారు.
ఆ తర్వాత సత్యవతి నేస్తాలు తహసిల్దార్ గీత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. పుస్తకం గురించే కాకుండా సత్యవతితో తమకున్న అనుబంధం గురించి మాట్లాడారు. తాను తొలిసారి సత్య చెయ్యిపట్టుకుని రాంచీ వరకు ప్రయాణం చేసానని, తనతో ప్రయాణం అద్భుతంగా వుంటుందని చెబుతూ గీత, అది అడవైనా, కొండలైనా సముద్రాలైనా, చిల్కా సరస్సు అయినా… ఆ ప్రయాణం ఎంతో హాయిగా వుంటుందని గీత చెప్పింది.
ప్రశాంతి మాట్లాడుతూ…. తనకిలాంటి సాహిత్య సభలలో మాట్లాడే అలవాటులేదని, మొదటిసారి మాట్లాడుతున్నానని చెబుతూ సత్యవతితో తన అనుబంధం ఇటీవలిదే అయినా తామిద్దరి మధ్య చక్కటి స్నేహం నెలకొందని… తనని పేరుతో పిలవడం తనకు కష్టమని అందుకే ‘అమ్ము’ అని పిలుస్తానని ‘అమ్మూ’కి ప్రయాణాలంటే చాలా ఇష్టమని, ప్రయాణానుభావాలను చాలా వివరంగా రాయడం, పాఠకుల్ని తనవెంట తీసుకెళ్ళడం తన ప్రత్యేకతని చెప్పింది.
ఆ తర్వాత సాహిర్ ఫ్రెండ్స్ చాలా మంది శిలాలోలితతో అనుబంధం గురించి మాట్లాడారు. నెల్లుట్ల రమాదేవి, వారణాశి నాగలక్ష్మి తమ స్పందన తెలిపారు. శిలాలోలిత తన ప్రతిస్పందనని క్లుప్తంగా వివరిస్తూ… ప్రాణనేస్తాలైన సత్య, గీతలకి ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం తనకు చాలా బావుందని చెప్పింది. యాకూబ్ వందన సమర్పణతో ఆ నాటి సభ ముగిసింది.