– మారియాన్ ఋ్లమ్ (డచ్ భాష్‌లో) అసీఫా బాను (తెలుగుసేత)
స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు నిశ్శబ్ధంగా ఉండు
ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది
స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక
అప్పుడు మాకు భయపడే అవసరముండదు
నా భావాలు, పనులు తేడాగా ఉన్నా
స్వేచ్ఛగా ఉన్నానంటే కచ్ఛితంగా రేపే ఒక రోజు అని
ఈ రోజు రోజు కన్నా తక్కువ అని అనుకోవడం
స్వేచ్ఛగా ఉన్నానంటే తలుపులు వేసుకొని
ఏవైతే గుప్తంగా కోసుదూరంగా పెట్టాలో
అవన్నీ తెరపైన చూడు.
స్వేచ్ఛగా ఉన్నానంటే మొద్దు నిద్దుర
ఎందుకంటే వేరే వాళ్ళ గొంతులు నిశ్శబ్దం చేయబడినవి
స్వేచ్ఛగా ఉన్నానంటే ఎప్పుడైన ఏవైన తినేసి
మిగిలిన యెంగిలిని ఆకలి కేకలను నిశ్శబ్దం చేసె
పత్రికలలో పూడ్చి వేయడం
స్వేచ్ఛగా ఉన్నానంటే నాకు యేది స్వేచ్ఛనిచ్చినదో
స్వేచ్ఛగా ఉండ నిస్తున్నదో
నాకు నా స్వేచ్ఛలో ఏదైతే ప్రతి రోజు
ఖైదీగా పెడుతుందో
తెలియకుండా ఉండడం
స్వేచ్ఛగా ఉన్నారంటే ఎవరో వస్తారని
నేను ధర్మంగా నమ్ముతున్న
నా భయం నుంచి నాకు విముక్తి కలిగిస్తారని
ప్రతీక్షించడం
స్వేచ్ఛ అంటే నా భావాలను అతికించి
నా చుట్టు పక్కల నా మనసులో నిండినా
కానీ నీ పట్టులో రాకుండ ద్కకుండా పోవడం.
స్వేచ్ఛ అంటే నాకు రక్షణ కలిగించడం
నీ విచారాలతో యేవైతే
వేరేగా ఉన్నాయో నాకన్నా.
స్వేచ్ఛ అంటే దాని అర్థం
నాకు స్పష్టంగా ఉన్నాకాని నీకు
తెలియక పోవడం.
అప్పుడు స్వేచ్ఛ నాకు ఓటమి
నీకు మృత్యుదండం
అప్పుడు స్వేచ్ఛ నిరంకుశమైన ఆవిరి
కాని ఒకవేళ ఆది నాకు సమ్మతి
అంగీకరిస్తే మన ఇద్దరి సమ్మ్యతో
నీకు నా పొంగుతున్న స్వేచ్ఛలో నుంచి
కొంచెం ఇవ్వగలిగితే
కొద్దికాలం లేక కొనసాగినంత కాలం వరకు
నీకు విముక్తి నీయటానికి
నా ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి అణచి వేసే స్వేచ్ఛతో. Pokies