సరిత ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ పూర్తి స్థాయిలో ఎర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని కమీషన్‌ వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు. Report Photo 2 మహిళా కమీషన్‌ వారి కార్యక్రమాలను మొదలు పెట్టడానికి కావల్సిన ప్రణాళికను తయారు చేయడానికి మరియు స్త్రీలు, అమ్మాయిల విషయంలో మహిళా కమీషన్‌ పనిచేయడానికి అవసరమైనటువంటి దిశా నిర్దేశాల ప్రణాళికను తయారుచేయడానికి గాను రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని సంస్థలను ఆహ్వానిస్తూ ఒక సదస్సు ”మహిళలు – అధిగమించాల్సిన సవాళ్లు” ను జూలై 6వ తేదీన జూబ్లీహాల్‌, హైదరాబాద్‌లో నిర్వహించారు.Report Photo 1
ఈ సదస్సుకు అన్ని జిల్లాల సోషల్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు, ఇతర సంస్థల ప్రతినిధులు, మహిళా శిశు అభివృద్ధి శాఖ, పోలీస్‌ శాఖల నుండి అధికారులు హాజరయ్యారు. మొదట మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ డా|| త్రిపురాన వెంకటరత్నం సదస్సుకు హాజరయిన సభ్యులందరికీ ఆహ్వానం పలికారు, కమీషన్‌ కొత్త సభ్యులను పరిచయం చేసి, ఈ సదస్సు ఉద్దేశ్యాన్ని వివరించారు. తర్వాత సదస్సుకు ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మహిళా, శిశు అభివృద్ధిశౄఖ మంత్రివర్యులు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ బి. సుభాషిణ్‌ రెడ్డి గార్లు జ్యోతి ప్రజ్వలన అనంతరం సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జెండర్‌ తరహా కార్యక్రమాలకు 43 కోట్లు కేటాయించి పలు రకాల శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్త్రీలు, అమ్మాయిలపై పెరుగుతున్న హింసను ఆపడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేస్తోందని, అయితే ఎక్కువగా కోర్టు అమలుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం జరుగుతోందని, దానికి న్యాయమూర్తులు తగు చర్యలు తీసుకొనే విధంగా చేయడం వల్ల స్త్రీలకు సత్వర న్యాయం కల్పించాలని జస్టిస్‌ సుభాషిణ్‌రెడ్డి గారిని కోరారు. తర్వాత జస్టిస్‌ సుభాషిణ్‌ రెడ్డి గారు ప్రసంగిస్తూ వివాహ నమోదు చట్టం, విద్యా హక్కు చట్టం పట్ల ప్రభుత్వం విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, అదే విధంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు మరియు చట్టాలను సక్రమంగా అమలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటికి గాను స్త్రీలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, స్వతంత్ర స్థాయి ప్రొటెక్షన్‌ ఆఫీసర్లును నియమించాలన్నారు. బ్రిటన్‌లో అమలవుతున్న ”విట్‌నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీం” లాంటి పథకాలను మన రాష్ట్రంలో కూడా చేపట్టాలని చెప్పారు. రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ శ్రీ ఉమాపతి, ఐ.పి.ఎస్‌. గారు ఈ క్రింది కొన్ని విషయాలపై కమీషన్‌ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కుటుంబ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం, 2005, లైంగిక దాడులు (నిరోధక) చట్టం (నిర్భయ చట్టం) వంటి వాటిపై వివిధ రకాల కార్యక్రమాలతో (పోస్టర్లు, టీ.వీ.లో స్క్రోలింగ్స్‌, లీగల్‌ సర్వీస్‌ అథారిటీ పారా లీగల్‌ వాలంటీర్స్‌ ద్వారా విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చేయాలన్నారు. కమీషన్‌ సభ్యులు జమున మాట్లాడుతూ మహిళా కమీషన్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ఇందిరా క్రాంతి పథం క్రింద ఏర్పాటయిన సోషల్‌ యాక్షన్‌ కమిటీల ద్వారా అమలు చేయడానికి ప్రణాళిక చేస్తున్నామన్నారు. డా|| సునీతా కృష్ణన్‌ పిల్లల సంరక్షణ, చట్టాల సక్రమ అమలులో కొత్త విధానాలను ఏర్పాటు చేసుకోవడం మరియు కొత్త చట్టాలను తయారు చేయటంలో సూచనలను ఇవ్వడం, షెల్టర్‌ హోమ్స్‌ నిర్వహణ సక్రమంగా ఉండేలాచేయడం మరియు ప్రభుత్వ సేవలను స్త్రీలు పొందేటట్లు కార్యక్రమాలను తయారు చేయడం వంటి అంశాలను కమీషన్‌ ఉద్దేశ్యంగా పెట్టుకున్నారని, అయితే వీటిపై పని చేయడానికి ఏ విధమైన పాత్రను కమీషన్‌ నిర్వహించాల్సి ఉంటుంది అన్న సూచనలను తెలపాలన్నారు. సభకు హాజరయిన సభ్యులందరూ గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్క గ్రూపు ఒక్క అంశంపై చర్చించారు. గ్రూపుల వారీ అంశాలు: (1) కుటుంబ హింస మరియు కులం (2) వివిధ రకాల లైంగిక దాడులు / లైంగిక హింస (3) నిర్ణయాధికారంలో స్త్రీలు (4) అమ్మాయిల సంరక్షణ (5) స్త్రీలు, అమ్మాయిలలో ట్రాఫికింగ్‌ గ్రూపులలో ఒక్కో అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల స్థాయి, ఏర్పాటు చేయబడ్డ చట్టాలు – వాటి అమలు – ఉన్న గ్యాప్స్‌, వాటిని సక్రమంగా అమలు చేయడానికి మహిళా కమీషన్‌ చేపట్టవలసిన చర్యలు / పాత్రలపై దీర్ఘంగా చర్చించి మహిళా కమీషన్‌కు సూచనలను ప్రెజెంట్‌ చేయటం జరిగింది. మహిళా కమీషన్‌ సభ్యులు ఈ సూచనలను తీసుకొని వీటన్నింటినీ కలిపి ఒక ప్రణాళిక తయారు చేసి అందరికీ సర్కులేట్‌ చేస్తామని తెలిపారు. చివరగా వందన సమర్పణతో మహిళా కమీషన్‌ సదస్సు విజయవంతంగా ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.