సీతారాం
నీకో విషయం చెప్పాలని ఉంది
చెప్పమంటావా?
వద్దులే
చెపితే ఏమీ అనుకోవుగా
ఇదిగో చెప్పబోతున్నాను
అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తోంది
చెప్పమనా
చెప్పాలనిపిస్తోంది
చెప్పమంటావా
చెప్పేస్తున్నాను
చెప్పాక నన్ను నువ్వేమీ అనొద్దు
చెపుతున్నాను
ఇదిగో చెప్పేస్తున్నాను
మరే..
ఇప్పుడు
సర్ఫ్ ఎక్సెల్ ధర కేవలం ఇరవై రపాయలే!
మీరు ఇప్పటిదాకా చదివింది కవిత కాదు. చివరకు వచ్చాక విషయం చసి మీకు చిర్రెత్తుకొచ్చి ఉండాలి. ఇదేమిటో అర్థం పర్థం లేని పని చేస్తున్నాడని అనుకోకండి. మనమూ, మన పిల్లల నిజంగా అర్థం అర్థం లేని పనుల్నే చేస్తున్నాం. పైన మీరు చదివిన వాచకం ఒక ఎస్‌ఎంఎస్ మాత్రమే. దీన్ని బయెటెక్నాలజీ చదువుతున్న రవళి పంపించింది. ఇదే టెస్ట్‌ను చాలామందికి ఫార్వర్డ్ కూడా చేసి ఉంటుంది. ఆ అమాయి నాకు పంపిన మెసేజ్ చదివి ఆనందిస్తాననుకొంది. కానీ నేను మొదట బాధ పడ్డాను. ఆ తరువాత కోప్పడ్డాను. అప్పట్నుంచి నాకు మెసేజ్‌లు పంపడం మానేసింది. బహుశా తాను పంపిన మెసేజ్‌లను మెచ్చుకునే వారికి పంపుతనే ఉండొచ్చు. ఇట్లాంటి ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం ఒక వ్యాపకంగా వ్యాధిగా మారింది చాలామందికి. ఇది తప్పని సరిగా ఒక రుగ్మతేనని మనం బాహాటంగా చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటారా?
రవళి పంపిన ఎస్‌ఎంఎస్ చదివిన రోజే అనుకున్నాను. ఈ పిల్ల డిగ్రీ ఫెయిలవుతుందని. కేవలం రవళి మాత్రమే ఫెయిల్ కాలేదని రవళి స్నేహబృందం అంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫెయిలైందని తరువాత తెలిసింది. వాళ్ళు ఫెయిల్ కావడానికి వెతికి చపిన కారణాలు విన్నాక నాకు చాలా భయమేసింది. ఒకటి తమ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగా లేదు. రెండు కాకతీయ విశ్వవిద్యాలయంలో పేపర్లను అనర్హులైన వారితో దిద్దించారు. త్వరగా పలితాలు ప్రకటించాలనే తొందరలో ఎవరు పడితే వాళ్లు దిద్దటం వల్ల తాము ఫెయిలయ్యమని సూత్రీకరణ కూడా చేశారు. ఈ సూత్రీకరణకు మద్ధతు అదే కళాశాలలో పాఠాలు చెబుతున్న యువలెక్చర్లనుంచీ రావటం మరీ విడ్డూరం. రవళితో సహా ముక్తకంఠంలో అందర నినదించిన విషయం అదే.
తాను విఫలం కావటానికి తన చేతిలో ఉన్న సెల్‌ఫోనే కారణమని రవళి గుర్తించడం లేదు. రోజుకి తాను స్వీకరించే ఇన్ కమింగు కాల్స్ కానీ, తాను చేసే అనవసర కాల్స్ కానీ తన సామార్ధ్యాలను కాలం వృధా చేయటమనే రూపంలో దెబ్బతీశామని ఒప్పుకోవడానికి రవళి సిద్ధంగాలేదే. అంతే కాకుండా ఈ సెల్‌ఫోన్ వల్లనే చదువులో తన ఏకాగ్రత లోపించిందని కూడా రవళి అంగీకరించడం లేదు. పైగా తన కుటుంబ సభ్యులకు తాను క్రమేణా మానసికంగా దూరమవుతున్న విషయన్ని కూడా గమనించడం లేదు. ఎవరో ఒకరు ఫోన్ చేసి మాట్లాడక పోయినా, తాను ఎవరికో ఒకరికి ఫోన్ చేసి ఏదో ఒక విషయం మాట్లాడక పోయినా తనలో అసహనం పెరిగి పోతున్న వైనాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నది రవళి.
నేటి యువతకు ఒక రోల్ మోడల్ అంటూ ఎవరూ లేకపోవడమే అసలు విషాదం. ఒక రోల్ మోడల్ కాకుండా అనేక రోల్ మోడల్స్ ఉండడం మహా విషాదం. పిల్లలకు సెల్‌ఫోన్‌లు బర్త్‌డే కానుకలుగా ఇచ్చి చదివించుకుంటున్న తల్లిదండ్రులకు నా నమస్కారం. సెల్లు లేనివాడ్ని ఆదిమ మానవుడిగా పరిగణిస్తున్న వారికి పాదాభివందనం. సాంకేతిక విప్లవం సమాచార వ్యవస్థల విప్లవాత్మక మార్పుల ఫలితం అందుబాటులోకి నిర్విరామంగా వస్తున్న వస్తు సంచయన్ని పరిమితులు, అవసరాల మేరకే ఉపయెగించుకోవాలన్న ఎరుక లేని జాతికి, ఎరుకపరచలేని వారికి మరీ మరీ నమస్కరిస్తున్నాను.
ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఉపయెగించే వాడు నిజమైన వినియెగ దారుడు కాడని తెలుసుకోలేక పోతున్న మనందరి రేపటి సమాధుల మీద ఓ దండేస్తున్నాను. అదుపు, నియంత్రణ లేని వస్తు వినిమయ వ్యవస పరులైన వారదంరికీ మానసిక సంతులనం దెబ్బతిని, ఆ వస్తువులను అందుకోలేనప్పుడు క్షణికావేశాలకు లోనై తప్పుడు నిర్ణయలు తీసుకోగల ప్రమాదం ఉందని ఏ సామాజిక శాస్త్ర పరిచయం లేకుండానే తెలియ పరుస్తున్నందుకు నన్ను మన్నించండి. ఆర్ధిక సంస్కరణల రెండో దశ ముగిసేనాటికి ప్రత్తి రైతుల్లాగా, చేనేత కార్మికుల్లాగా మన మధ్య తరగతి సామూహిక ఆత్మహత్యలకు గురి కాబోతున్నదని తెలియజేయకుండా ఉండలేని నా ఆశ్తకతను మన్నించండి.
ఎందుకంటే దృక్పధ రాహిత్యం అనే మన బలహీనత మీదనే ఇవాళ ప్రపంచం బ్రతుకుతోంది ఎం.ఎస్.ఎమ్‌లు బతుకు తున్నాయి. దృక్పథ రాహిత్యం ఎవరికీ అంటే మనకే. ఎవరిదీ అంటే మనదే.
రవళిని తప్పు పట్టి ప్రయెజనం లేదని తెలుసు నాకు. మొన్నటికి మొన్న తాజ్ మహల్‌ని ప్రపంచపు ఏడు వింతల్లో నిలిపేందుకు వామపక్ష ఎం.ఎల్.ఎలతో సహా ప్రచారం చేశారు. ‘తాజ్‌కు ఓటెయ్యండి’ అన్నారు. ఎస్‌ఎంఎస్‌లు ద్వారా తాజ్‌కు ఓటెయ్యడమంటే ప్రపంచం బ్యాంకుకి ఓటెయ్యడమే కదా! నతన ఆర్ధిక విధానాల వెల్లువని సర్వోత్కృష్టంగా ఆమోదించడమే కదా.
అందెందుకు నిన్నటికి నిన్న ఓ జాతీయ ఛానెల్‌లో పాటల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న సుప్రసిద్ధ సంగీత దర్శకుడు తన న్యాయ నిర్ణయస్థానం నుంచి వైదొలగుతున్నానని ప్రకటించాడు. నిష్క్రమణకు కారణం తాను గెలవాలని, గెలుస్తుందని ఆశించిన ఓ గాయని తగినన్ని ఎస్‌ఎంఎస్ ఓట్లు పడక ఓడిపోయింది. బప్పీదా ఆ పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి ఓ మాటన్నాడు ”నువ్వు లేని ఈ కార్యక్రమంలో నేను ఉండటం అర్ధరహితం” అన్న ఆ సంగీత దర్శకుడ్ని ఓడిపోయిన గాయని ఎంతో ప్రాధేయపడగా తిరిగి న్యాయనిర్ణేతగా ఉండేందుకు అంగీ కరించాడు. బప్పీదా మనల్ని ఎస్‌ఎంఎస్ ఓట్లేసేందుకు ఎంత నైతిక వత్తిడికి గురి చేస్తున్నాడో, మరెంత ఎవెషనల్ బ్లాక్ మెయిలింగుకు పాల్పడు తున్నాడో మనమేమైనా గ్రహించామా?
జీవితం కమర్షియల్ బ్రేకులమయం!
ఇంకేం చేస్తాం. కారుణ్య యంకర్‌గా ఉన్న లిటిల్ చాంప్స్‌కి కడు కారుణ్యంతో ఓటేస్తాం. ఎందుకంటే అద్భుత ఆశ్చర్యకర ప్రతిభావంతులయిన పిల్లలు పదే పదే నేను గెలవాలనుకుంటే అంటూ మొదలు పెట్టే ఎస్‌ఎంఎస్‌ద్వారా ఓటెయ్యండి అంట అడుగుతారు. ఏం చేస్తాం? గ్రాండ్ ఫినేల్ పోటీల్లో ఆ పిల్లల్ని చస్తే ఒక ప్రక్క సంతోషమూ, మరో ప్రక్క ఏడుపూ వచ్చాయి. సంతోషం వాళ్ళు అలా పాడినందుకు, ఏడుపు వాళ్లు వ్యాపారుల కోసం పాడినందుకు. చివరకు పోటీల్లోనుంచి వైదొలగిన ఓ గంధర్వ బాలుడు గొంతులో, గుండెలోతుల్లో కనుకొలకుల్లో ఎన్నో నీళ్లు కుక్కుకుని పాడాడు ఓ పాట” ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు”అని అసలు ఎవరికి ఏమి జరుగుత ఉందో ఊహించశక్యం కాని ద్రవస్థితిలో ఉన్నాం. ఆ పాట తన ఓటమిలోంచి పాడిందో, మనలందర్నీ తలచుకుని బెంగతో పాడాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు.
కేవలం 200 గజాల స్థలం కోసం ఆ పిల్లలు పాడారు. వదాన్యులు, వితరణ శీలులు భరి కానుకలు ఇచ్చారు. చెక్కు పంచారు. ఆ పిల్లలకు ఏవేవో బహూమానాలు ప్రకటించారు. సంగీత సారమెరిగిన వారు ఆ పిల్లలను గాన గంధ్వరు లంటున్నారు. నాకు మాత్రం వాళ్ళు మరో విధంగా కనిపిస్తున్నారు. ఆ పిల్లల గాన మాధుర్యం మాట ఎట్లా ఉన్నా, వారు నాకు బాల కార్మికులుగానే కనిపిస్తున్నారు.
వ్యాపార ప్రపంచం పాటలు పాడే పిల్లల ప్రతిభను వెలికి తీసే క్రమంలో ఆ పిల్లల ప్రతిభను అడ్డంగా పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నదని మీకు తెలుసు. ఆ పిల్లల్ని ఈ ప్రాయెజిత వెట్టి కార్యక్రవలనుంచి విముక్తం చేయల్సిందిగా మానవ హక్కుల కమీషన్‌ను సవినయంగా కోరుతున్నాను. ఆ పిల్లల తల్లిదండ్రులను కోరెదేమంటే మీ పిల్లల ప్రతిభను వ్యాపారుల ముందు అమ్మకానికి పెట్టొద్దని, వాళ్ళ గొంతులు నిసర్గ సెలయేరుల్లాగా ప్రవహించనియ్యండి. ఆ గొంతుల్ని బ్రాండ్ ఇమేజ్‌లకు, బ్రాండెండ్ ఇమేజ్‌లకు తాకట్టు పెట్టకండి.
బహుశా రవళి కూడా ఆ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటు వేసే ఉంటుంది.
ఈ కాలమ్ ముగించే లోపున నాకు మరో మెసేజ్ వచ్చింది. దాంట్లో ఒక చిన్న ప్రశ్న ‘హైట్స్ ఆఫ్ క్రేజీ’ అంటే అని వేసి వెంటనే సమాధానంగా ‘లుంగీకి జిప్’ పెట్టించుకోవడం అని ఉంది. అదృష్టవశాత్తు ఈ సారి ఎస్‌ఎంఎస్ రవళి పంపలేదు. ఈ సారి మెస్‌జ్ స్పందనగారు పంపారు. స్పందన ఎవరో కాదు రవళి వాళ్ళ పెద్దక్క!?
బండ్ల మాధవ రావు గారి “గుప్పిట్లో భూగోళం” చదువుండి.
సెల్లు బానిసత్వం ఎంతగా ప్రబలిపోతున్నదో తెలుస్తది.
http://www.pranahita.org/2007/10/guppitlo_bhugolam/
ఏ వ్యాపకమైనా, పరికరవాడకమైనా “వ్యసనం”గా మార్తె ప్రమాదమే!
టి.వి. చూడనివ్వని / చూడలేని రోజులల్ల తలకాయనొప్పితో బాధపడే గృహిణులూ, పిల్లలున్నారనీ తెలుస్తె ఆశ్చర్యపోతాం!
2001 లో, ముంబయినగరపు కేబుల్ సంస్థల 5 రోజుల సమ్మె సమయంలో, మొదటి రెండురోజులను దుర్భరంగా గడిపిన జనాలే, తరవాతి రోజుల సాయంకాలాలను పార్కుల్లో (tv జూసుడు ఎంత బందిఖాన గదా), మిత్రులతో, బంధువులతో, సాంఘిక/సేవా/భక్తి కార్యక్రమాలలో సకుటుంబంగా గడిపి ఎంత ఆనందాన్నిపొందిండ్రో.. అనుభవించినవాండ్లెందరో పత్రికలద్వారా తెలిపారు.
ఇక SMS ల విషయానికొస్తే, TV/RADIO/MOBILE కంపెనీలన్ని తమతమ వాణిజ్యావసరాలకోసం ప్రకటనలను గుప్పిస్తూ, ఈ “లఘు వ్యాఖ్య” ల ద్వారా ధనాన్ని సంపదిస్తున్నయి. (పోటీ పోస్టుకార్డుల్లాగనే, వీటిధర మామూలు sms ల కంటె పిరం; అది తెలిసినా/తెలువకా మనోళ్ళు అత్యుత్సాహంగ పాల్గొంటున్నరు.
ఇగ – voting(OUT) the contestants through sms అన్నది, ఎంత విధ్వంసకరమైందంటె.. Indian Idol అనె ఒక కార్యక్రమంలో చివరగా sms ల లెక్కన గెలిచినవాడు “అన్యాయంగ” గెలిచిండని ఒక Radio RJ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగ బెంగాల్లో అల్లర్లు చెలరేగినయి.
నిజానికి ఈ programme ను చివరిదాకా చూసిన మా ఇంట్లోల్లందరుకూడ తీవ్రంగ నిరాశపడ్డరు. ఎందుకంటె, contestant లో ప్రతిభ ఎట్లావున్నా తనకు నచ్చిన / మెచ్చిన contestant కోసం ఒక్క ధనికుడైన వ్యక్తి (One of the viewers) తనస్థోమతనుబట్టి ఎన్ని లక్షల SMS ల వోట్లైనా వెయ్యచ్చు. తన ఇష్టాన్ని యావద్భారత ఎన్నికగా మార్చవచ్చు. ఇదెక్కడి ప్రజాస్వామ్య పద్ధతి?
TV Channels వారి రాబడి కోట్లలో ఉండబట్టి వాళ్ళుగూడ income ను ఇస్తున్న contestantలతోనే కార్యక్రమాలను నడిపిస్తున్నరన్నది నిర్వివాదాంశం. (దాంట్ల కొంత commercials/ads ద్వారా వచ్చినా, పాపులేషన్లకు, పిస్స పాపులారిటీలకు, వీర/వెర్రిఅభిమానులకు కరువులేని దేశమాయె, వాండ్లకు SMS ల ద్వారాగూడ మస్తురాబడాయె)
ఈ మధ్య నాగ్గూడ SMS ల తోని నెత్తినొప్పి ఎక్కువైంది (రాత్రిలేదు/పగలులేదు). ఫలానా కారు గెలుచుకో, ఫలాన 6 ప్రశ్నలకు జవాబిస్తె ఇంకేదో ఫ్ర్రీ అనీ.. ప్రతి sms కు 6/- మాత్రమే అని!!
ఇట్ల రోజుకో యాభయి మెస్సేజులు.. మెసేజ్ బాక్సు క్లీంజేసుడే పని!!
నాకు తల్కాయదిర్గిపోయి – తెలిసిన help lines అన్నిటికి మాట్లాడి, do not distrurb option అనందొకటున్నదని తెల్సుకొని దాని ద్వారా DNC ACT అన్న message ను 53733 నంబరు పంపించి activiate చేయించుకున్న.
ఇప్పుడు నాకు 45 రోజుల తర్వాతనే “బంధవిముక్తి”. తర్వాత “కీక్..కీక్..” అని సౌండ్ వస్తె అది ఇంపాంర్టెంట్ విషయమని తెలిసి నిద్రలేసైన చూస్త.
ఇప్పుడైతె, దీవాలి ధమాకా-జువ్వా (I mean జూదం and not తారాజువ్వ) మెస్సేజులతొ నా సెల్లు… ఫుల్లే!!!!!!!!!!
Good one.
Mobile companies should not bother consumers.