హెచ్ఐవి వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు

-రాజ్యలక్ష్మి

నా పేరు రాజ్యలక్ష్మి, మాది తెనాలి. మాకు అయిదుగురు అన్నయ్యలు. నేను ఒకతినే అమ్మాయిని. చిన్నప్పటినుంచి నన్ను అందరూ బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని అని. నాకు 17 ఏళ్ళలో పెళ్ళి చేశారు. పెళ్ళయిన 6 నెలలకు హెచ్ఐవి వుందని తెలిసింది. మా హస్బెండ్‌కి పెళ్ళయిన కొత్తలో బాగా జ్వరం వస్తుంటే అనుమానం వచ్చి హాస్పిటల్‌కి తీసికెళ్ళి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. తర్వాత నేను కూడా చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మామూలుగా చేయించాను. ఆ తర్వాత సంవత్సరానికి పాప పుట్టింది. పాపకి 3 ఏళ్ళు. పాపకి లేదు. డెలివరీ టైమ్‌లో నాకు, పాపకి డ్రాప్ వేసారు. పెళ్ళయినప్పటినుంచి మా అత్త మామలతో కలిసి లేడు. వాళ్ళకు నేను నచ్చలేదని నల్లగా వుంటానని, వాళ్ళ అబ్బాయికి నచ్చలేదని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ వుండేది. అతను ఫర్నీచర్ వర్క్ చేస్తాడు విజయవాడలో. మా అత్త వాళ్ళుండేది విజయవాడలో. కొన్ని రోజులు మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలింట్లో రెంట్ ఇచ్చి వున్నాం. వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటుండేవాళ్ళు. మా డబ్బులతో మేం తింటున్నా కూడా. తర్వాత ఇట్లా పాజిటివ్ అని తెలిసిన తర్వాత మా అత్త నీవల్లే వచ్చిందని, మా అబ్బాయికి లేదు అని అనేది. ఇంటి ప్రక్కవాళ్ళందరికి కూడా ఇలాగే చెప్పింది. నాముందు అనలేదు గానీ మా అమ్మవాళ్ళు వెళితే మీ అమ్మాయివల్లనే వచ్చింది, మీ అమ్మాయి మంచిదికాదు అనేది. మా ఆయన, నేను 3 ఏళ్ళు బాగానే వున్నాం. ఒకసారి మా హస్బెండ్‌కి హెల్త్ ప్రాబ్లం వచ్చి మా దగ్గర అసలు మనీ లేకుంటే హాస్పిటల్‌కి చూయించడానికి అత్తగారింటికి తీసికెళ్ళాను. అప్పటినుంచి అక్కడే వున్నాడు.నేను అపుడపుడు వెళ్ళి చూస్తాను. అక్కడ నేను వుంటే నన్ను సరిగ్గా చూడరు. అతన్ని బాగానే చూస్తారు. మొదట్లో అతనిని కూడా సరిగ్గా చూడలేదు. తర్వాత బాగానే చూస్తున్నారు. అతన్ని వాళ్ళ అమ్మ ఇంట్లో దిగబెట్టినప్పటినుంచి నన్ను అనుమానించడం, ఎవ్వరితో మాట్లాడుతున్నావు? ఇట్లా బాగా టార్చర్ పెడుతున్నారు. అక్కడ మేము పనిచేసుకోలేమని అమ్మవాళ్ళు తెనాలిలో వుంటారు. అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అమ్మవాళ్ళ సపోర్ట్ వుంటుంది, పాపని వాళ్ళు చూసుకుంటారు కదా అని తెనాలికి వెళ్ళిపోయాం. అతను విజయవాడలో వుండగా మీరు తెనాలి వచ్చేయండి అంటే రాను అన్నాడు. నీకు ఇష్టమైతే ఇక్కడికి రా. లేకపోతే లేదు. నేను రెండవపెళ్ళి చేసుకుంటాను నీవు రాకపోతే అని అంటున్నాడు. ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చినా సరే చేసుకుంటాడట. వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తున్నారట. రాకపోతే వదిలివేయండి ఆమె మంచిది కాదు, ఆమెకు హెచ్ఐవి గురించి అంతా తెలుసు అంటున్నారు. పెళ్ళి కాక ముందు అతనికి చెడు అలవాట్లు వున్నాయని చెప్పారు కాని దగ్గర సంబంధం అని చేసుకున్నాం. పెళ్ళయిన దగ్గరినుంచి ఎపుడూ అతనికి బాగుండేది కాదు. ఎప్పుడూ జ్వరం, పడుకొనే వుండేవాడు. ఇది నావల్ల వచ్చిందని చెప్పినందుకు అమ్మవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయవాడలో, నేను తెనాలిలో వుంటున్నాం. పాప నాదగ్గరే వుంది. పాపను కూడా అడగడు. తీసుకొస్తే చూస్తాను,నేను తెనాలి రాను అంటున్నాడు.

మొదట్లో టెస్ట్ చేయించి నపుడు హెచ్ఐవి అని తెలిసి నాకు రావడం ఏంటి? నేను ఏం చేయలేదుకదా అని చాలా బాధపడ్డాను. అమ్మ, అన్నయ్యవాళ్ళ దగ్గర చాలా ఏడ్చాను. మా హస్బెండ్‌కు కూడా చెప్పలేదు. చచ్చిపోతానని అన్నాను. వాళ్ళే నాకు ధైర్యం యిచ్చి ఆయన దగ్గరినుంచి వచ్చేయ్ మేమే చూసుకుంటామని చెప్పారు. మా అత్తమ్మ నేను వెళ్ళితే అన్నం కూడా పెట్టదు. బైటనుంచి బైటే వచ్చేస్తాను. కనీసం మంచినీళ్ళు తాగుతావా అని కూడా అనదు. మా తల్లిదండ్రులు కూడా ఆయనవల్ల వచ్చిందా? నా వల్ల వచ్చిందా అని చూడలేదు. వున్నన్నాళ్ళు మంచిగా వుండండి అనేవాళ్ళు. ఈమధ్య కొత్తగా నీవల్లే వచ్చిందేమో అని అతను అంటున్నాడు. నేను డైవోర్స్ కి అప్లై చేద్దామనుకుంటున్నాను. ఇంత అనుమానించే వాడు రేపు నిజంగా మా అన్నలతో మాట్లాడినా సరే చాలాపెద్ద ఇష్యూ చేస్తాడు అతను. నేను అతనితో చెప్పాను నావల్లేగాని, ఎవ్వరివల్లేగాని అనుకో వచ్చింది. ఇంకొక అమ్మాయికి నష్టం కలిగించకు, అంటే నాకు తెలుసు ఏం చెయ్యాలో, నీవు చెప్తే వినే పరిస్థితిలో లేను. వస్తే విజయవాడ వచ్చెయ్ అంటాడు. ఇపుడు నాకు 20ఏళ్ళు. అతను ఎప్పుడూ జ్వరంతో వుండేవాడు. సి.డి కౌంట్ తగ్గిపోయింది. కొన్ని రోజులు అయితే ఎవ్వరినీ గుర్తు పట్టలేదు. ఇపుడు కొంచెం పికప్ అయ్యాడు. కాని తలపోటు తగ్గట్లేదు. నేను యాక్షన్ ఎయిడ్ లో ఆరు నెలలనుండి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను.

మాకు తెలిసిన కో-ఆర్డినేటర్ మా పాపకి న్యూట్రిషన్ ఇస్తున్నారు. తెనాలిలో యాక్షన్ ఎయిడ్ బాగా తెలుసు. కౌన్సిలర్స్, హెచ్ఐవి పాజిటివ్‌లను యాక్షన్ ఎయిడ్ దగ్గరికి మందులకోసం పంపిస్తారు. మా హస్బెండ్‌కు సిడి కౌంట్ తగ్గిపోయింది. మందులకోసం యాక్షన్ ఎయిడ్ దగ్గరికి వెళ్ళితే తెలిసింది వీళ్ళు ఇట్లా పాజిటివ్స్ తో పనిచేస్తారని. ఆరు నెలలనుంచి న్యూట్రిషన్ ఇస్తున్నారు. మా హస్బెండ్‌కు కూడా మెడికల్ సపోర్ట్ చేస్తారు. యాక్షన్ ఎయిడ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు చెప్పినపుడు వింటాడు. మళ్ళీ వెళ్ళిన తరువాత మేడమ్ వాళ్ళు తెనాలి వచ్చేయమని అన్నారుకదా. అంటే మేడమ్ వాళ్ళ ముందు ‘ఊ’ కొడ్తాను, ఎవ్వరు చెప్పినా వినను. నీ ఇష్టమైతే రా అంటాడు. మెడిసిన్స్ కోసం వేలకు వేలు ఖర్చయ్యింది. అమ్మవాళ్ళు పెట్టిన బంగారం కూడా అమ్మేశాను. నా ఆరోగ్యం బాగానే వుంది. నేను మంచి డైట్ అంటే రైస్, టిఫిన్స్ తీసుకుంటాను. మెడిసిన్స్ ఏం వాడను నేను. ఈమధ్య అతనివల్ల హింస చాలా ఎక్కువయింది. అందుకే డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను.

మా అమ్మవాళ్ళింటి చుట్టుపక్కల అందరికీ తెలుసు, కాని ఎవ్వరూ నన్ను అడగలేదు. వాళ్ళు బాగానే మాట్లాడతారు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అడిగితే ఎట్లా అని కాస్త భయపడతాను. కాని ఇంతవరకు ఎవ్వరూ అలా అడగలేదు. అమ్మ వాళ్ళది రెంట్ హౌస్ కాబట్టి ప్రాబ్లమ్. మా కాలనీలో చివరుండే ఇంటి వాళ్ళు మాత్రం ఒకసారి ఫోన్ చేసి నన్ను అడిగారు “ఏంది నీకు ఇట్లా వుందట కదా అని” మీకు ఎవ్వరు చెప్పారు అంటే మీ రోడ్డులో అందరికి తెలుసు కాకపోతే నీకు చెప్పట్లేదు. నీముందూ, వెనక చెప్పుకుంటున్నారు, నీకు, మీ హస్బెండ్‌కు వుందని అని అడిగారు. నేను ఏమీ అనలేకపోయాను.

మా అన్నయ్యలు, వదినలు కాని నన్ను దూరంగా పెట్టడం లేదు. వాళ్ళు నాకన్నా మా హస్బెండ్‌ను బాగా చూసుకునేవాళ్ళు. ఎపుడూ వీక్‌గా వుంటాడని ఫ్రూట్స్ అవి తెచ్చి పెట్టేవాళ్ళు. ఇపుడు అతను నాకు రావలసిన డబ్బులు ఇచ్చేయమను. మీవాళ్ళతో నాకేంటి అంటాడు. నన్ను విజయవాడ రమ్మని అంటాడు, నాకు తెనాలిలో జాబ్, రోజూ విజయవాడ వెళ్ళి రావాలంటే చాలా కష్టం. అతని ఫర్నీచర్ వర్క్ ఎక్కడయినా వుంటుంది కదా. అట్లా అంటే కూడా రాడు. ఇట్లా వుందని తెలిసి మా అమ్మవాళ్ళు గొడవచేస్తే చుట్టాలవాళ్ళు పాప పేరు మీద ఒక ఇల్లు కొన్నారు. పాపకు సపోర్ట్ వుంటుంది అనుకొన్నారు. అది 400/-రూ|| రెంట్‌కి ఇచ్చాం.ఆ అద్దెకూడా మా ఆయన తీసుకుంటున్నాడు. తెనాలిలో రెంట్ నేనే కట్టాలి. జరిగిన మూడు సంవత్సరాలు ఎట్లా వున్నాడో కాని ఈ అయిదు, ఆరు నెలల్లో చాలా మారిపోయాడు. ఎపుడూ చెయ్యికూడా చేసుకోనివాడు ఒక్కసారి చెంపమీద కొట్టాడు.

హెచ్ఐవి వుందని తెలిసి నన్ను మోసం చేసింది కాకుండా తెలిసి తెలిసి ఇంకొక అమ్మాయిని కావాలని పెళ్ళి చేసుకుని మోసం చేద్దామనుకుంటున్నాడు. ఇట్లా ఎవ్వరూ చెయ్యకూడదు. ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చెయ్యకూడదు. తెలిసి తెలిసి మరొకరి జీవితం నాశనం చెయ్యకూడదు.

హెచ్ఐవి వచ్చినంత మాత్రాన లైఫ్ అయిపోలేదు. చనిపోదామనే నిర్ణయం కూడా తీసుకోవద్దు. మామూలుగా అందరిలాగా వుంటూ మంచి డైట్, మందులు తీసుకుంటే అందరిలా బతకొచ్చు. మనస్సులో ఏ ఫీలింగ్స్ పెట్టుకోకుండా సంతోషంగా వుంటే లైఫ్‌ని ఇంకా పొడిగించుకోవచ్చు.

నాకు మొదట్లో హెచ్ఐవి మీద అసలు అవగాహన లేదు. కౌన్సిలింగ్‌కి వచ్చినపుడు కౌన్సిలర్స్ చెప్పారు. అయిదు నిమిషాలు అంతే. కొన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ చాలా సీరియస్ అయ్యాడు. బ్రతకడేమో అన్పించినపుడు యాక్షన్ ఎయిడ్ వాళ్ళు సహాయం చేశారు. ఏం ఫర్వాలేదని అతనికి మెడిసిన్స్ ఇప్పించి, నాకు జాబ్ ఇచ్చి ఎంతో సహాయం చేశారు.గవర్నమెంట్ హాస్పిటల్‌కి, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి పాజిటివ్ వున్నవాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్లీగా మాట్లాడి అట్లా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం. కొంతమంది తమపట్ల ఎంతో వివక్ష వుందని బాధపడతారు. నేను పాజిటివ్స్ తో మాట్లాడి వాళ్ళకి ధైర్యమిస్తాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.