సెట్టున్గొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు

జె.సుభద్ర

అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్లజోలికిబోలే… వాల్ల వార్తకు బోలే…. వాల్లను నల్లనండ్లే….. తెల్లనండ్లే….. ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం.

మా సందాల మేము మా అడివిల సెట్లోలిగ సెలిమలోలిగ, పిట్టలోలిగ, తేనెతుట్టెలోలిగ బతుకుతున్నోల్లం. మీ బాస, మీ యేషాలు తెల్వనోల్లం. మీ కంకెర వనాలకు మేమచ్చినవ, ఉత్తరిచ్చినవ… మరి మీరెందుకు మా బతుకు సెరువుల బండలెత్తేస్తుండ్రు. మా మీన జులుం జెయ్యమని మీకెవలు అతికారమిచ్చిండ్రు? ఆల్ల తలపండ్లు వలుగ. మీ నీతులు ఎవరు తయర్జెసిండ్రు? మీ నీతుల కగ్గి వెట్ట…. సేతికి గింత మట్టంటకుంట పంచనామ జేస్తిరి. పాపాత్ములను పయిలంగనే వుంచితిరి. మేమే ఆగం కుక్కలోలిగ ఎక్కడెక్కన్నో కంకెర గట్లు తిరిగితిమి. ఏందో వనవక్కులాట గవ్వి వయి గానేవె… గవ్వి మా పాలిట మంట్లె బెట్టిన అక్కులే అయినయి. సిమిటి వనాల సెట్టు నీడల్ల నిజాలు నిలువెత్తు నిలుస్తున్నా…. కండ్లగ్గంతలు గట్టుకున్న పంచాదులు మమ్ములను అన్యాలం జేసిండ్రు. దాదు లేదు, ఫిరాదు లేదు.
గా వదర్జోడు వెర్దోపు తోడేల్లు బాయనెట్లతో పోలీసు బట్లేసుకున్నయి. వాటింట్ల పీనుగెల్ల, వాటిందొంగలు బొడువ వాటినానం నరుక, వాటిగ్గడ వ అసోంటి గోసేరాను. వాటి పిల్ల పిల్ల తరాలకు మా పాపం దాకి సావ. వాటినెత్కకట్కపోను. మా కేసు పంచాజ్జేసి కొట్టేసిండ్రాట. రేపు మమ్ములగడ అడివిల్నించి సెట్టుం గొట్టేసినట్లు కొట్టేస్తరు.
మాది ఎంత తోడుకున్నా ఒడువని సొద. గీ సొదలు ఏకలవ్యుని కాంచి, కొమురంబీము కాంచి వాకపల్లి దాక గిదే ఎత, గిదే కత. మమ్ముల అడివిలున్న సెట్టు పుట్ట పిట్ట సకులం జీవరాసి నంతట్ని ఆగంజెయ్య వడ్తిరి. మీ సపుకు జెట్ట బుట్టా… మీ కన్ను వడి మా అడివంత అంగట్ల అవ్వ నిడ్సిన బిడ్డోలిగ ఆగమైతంది. మీ కండ్లు మంచియిగాదు. సీతువకండ్లు. ఎనుకటికాంచి ఎవనెవని కండ్లో అన్ని మా అడివిమీన్నే… వమీన్నే… పెద్ద పెద్ద రాకాసి మిషిండ్లేసి మా అడివితల్లి కుల్లబొడిసి కొల్లగొట్టి రాల్లున్నయని వొకడు, రత్నాలున్నయనొకడు, ఏందో బాక్సైట్లాట గవ్వివున్నయని యింకోడు మా అడివిని బంగంజేసి బజార్ల బెడ్తండ్రు. మా అడ్వికి వీసమొత్తు కీడు జేసెరుగం. మా కట్టెమీద పిడికెమీద గూడ ఏందో కేసులు బెట్టి మమ్ముల దొంగల్జేత్తండ్రు.
గాపొద్దు… ‘అన్నలొచ్చిండ్రని’ తోడేలు గన్నులొచ్చి వమీన జులుం జేసి ఆగంజేత్తే… కీడయిందని నీల్లల్ల మునిగితిమి యెర్కలేక. గిదే మాకు వెసమైతదని దెల్వకపాయె. నీల్ల మునిగితే గాయలు గాలికి కొట్కపోతయ…. గవ్వి మీ పరిచ్చలల్ల తేలకుంటే మామీద జరిగిన దాడిని కండ్లార జూసిన మా ఎర్ర సెల్కలనడుగుండ్రి సెంపమీన గొట్టినట్లు సెప్తయి. పోడుగొట్టిన మా పంట పొలాల్ని మందలియ్యుండ్రి పెనుగులాడిన యిలాకలు యిడమర్సి జూపిత్తయి. మా సెట్లన్ని సెరిగినట్లు సెప్తయి. ఆకుల్ని అడుగుండ్రి ఆనవాల్లు అన్నింటిని జూపిస్తయి ససిన పురుగు బషంత పూసలు గుచ్చి నిజం సెప్తయి. పట్టలన్ని రెక్కల డోలు గొట్టి వట్లాడ్తయి. అడివిలకు రాండ్రి సత్యమంత ఆవలించినట్లు కనపడ్తది. మిమ్ముల సుట్టిముట్టి సుదు లాయించకుంట నిజం జెప్తయి. పలిగిన వ గాజు గుండెల్ని, సినిగిన వ సిగ్గు పేల్కల్ని సీర్కపోయిన మా సెర్మాలు, సెరువులయిన మా దుక్కాల్ని గవన్ని సూసినయి.
రక్తంగారినట్టు మా గాయాలు కమిలి కారిపోలేదు. యింకా కడుపుల కల్లపెల్ల మండుతనే వున్నయి. మా సూపిచ్చే ఆనవాల్లు సాలుగా తోడేల్లకు తాడెయ్యడానీకి. కాని గన్ని గుండెలు మీకు లేకపాయె. మీరు మీరంత వొక్కటే. తోడేలుకు తోడేలు ఆగంజేత్తదా, బైటేత్తదా…. గా బాయినేట్లను భంగం జేయొద్దనే వ కన్యాలం జేసిండ్రు. గాటిని కాపాడనీకే మీ కంకెర రాజ్జెం వొక్కటైంది.
ఎవలెవలో మంత్రులాట, వయల పక్కీర్లోలిగనే వున్నరు యింకెవలో మానవక్కుల సారట నమ్ముకంగ కడుపుల తల్కాయ వెట్టి మాట్లాడినట్లే మాట్లాడితే మాకు మంచి జేత్తరనుకుంటిమి. కానిగిట్ల కడుపుల కత్తులు వెట్టుకొని కావలిచ్చుకుంటరను కోలే…. మీద మెరుగులు లోపట పురుగులు వెట్టుకుంటరని మాకేమెర్క. మాకు నాయం జేసి మమ్ముల కంగాలుజేసినోల్లకు దండుగ్గట్టిచ్చి జేల్ల బెడ్తరనుకుంటిమి
మా రాజ్జెం నీతి సెలిమసల్లి నట్లే వుంటది. దయసెమలెప్పటికి వూర్తయి. గందికే మా వోల్లు మీ జులుం గాయలకు తానాల్జేయించి కులంల కుటింబంల కలుపుకున్నరు. మీ కంకెర రాజ్జెం నీతులు మా అడివి రాజ్జెంల కింకా అడుగు
వడనియ్యలే… మీ రాజ్జెవెలో వుంటే మేము కులానికి, కుటింబానికి దరమై ఎండుటాకులోలె యేడ కొట్కపోదువె….. మీ రాజ్జెంల వ తీరుగ అన్యాలమైన ఆడోలు కోకొల్లలట….. మీ కంకెర రాజ్జెంకగ్గివెట్టా…. మా రాజ్జెమే మెరుగు.
వకు మీ కంకెరోల్లందరు వొక్క తీరుగనే అగుపడ్తరాయె. గా బడిది కంకెర బాయినెట్ల నెట్ల గుర్తు వడ్తం, ఎట్ల పశ్యనాత్‌ జేస్తం జెర జెప్పుండ్రి. గదే వ అడివిలోల్లను ఒక్కసారి జూత్తె ఎన్నేండ్లయినా మర్సిపోము. గంతెందుకు మా వనంల ఒక్కసారి సూసినసెట్టును, పిట్టను, ఆకును, వలాన్ని, వంకల్ని, డొంకల్ని, సమస్త జీవరాసిని ఎన్ని తీర్లున్నా, ఎన్ని రంగులున్నా అవలీలగ ఆనవాల్లు వడ్తం. ఏడాకుల కిందున్న ఎసోంటి జీవాన్నైనా గుర్తువడ్తంగానీ మీ రాజ్జెం మన్సుల్ని యదివట్టలేక పోతిమి. మా అడివిల కోటొక్క సెట్టును, జీవరాసుల పేర్లు యది మరువకుంట సెప్తం. మీరు సెప్పగలుతరా…. వకలివైనయి వకు దెలుస్తయి! మీకలివైనవి మీకు దెలుస్తయి. గిండ్ల మీరు తెల్వికల్లోల్లు ఎట్లయితరు మేము తెల్విలేనోల్ల మెట్లయితిమి. గది తెలుసుకోకుంట మమ్ముల అడివిల జీవాలోలె సత్తిరి.
మీ రాజ్జెపోల్లు కొందరు మా దిక్కు నిల్సొని మొత్తుకున్నా…. కొట్టుకున్నా మమ్మల్ని సెర్ల సాపలోలె గడ్డకేసి వాల్ల గడ్డంతా తిప్పినా నాయం జరుగకపాయె. ఓ దిక్కు మామీదేం జరుగలేదంటుండ్రు. యింకో దిక్కు వకు గొడ్లిత్తం, బర్లిత్తం, పైసలిత్తం అని మా మంటలు సల్లారగొట్టనీకి జూస్తుండ్రు. గిట్లుంటయి మీ కంకెర రాజ్జెం కైతుకాలు. ఏందో కైకర మందర సవాల్లేస్తరు మీ బాసర్తంగాను, యసదెల్వది. ఆకుకు అందకుంట పోకకు పొందకుంట ప్రశ్నలేసి పరేషాన్‌ జేస్తరు. మీరే మీద్ది కింద వెట్టి కిందిది మీద వెట్టి అడిగితిరి. మమ్ముల్నే పొంతన లేకుంట వట్లాడ్తన్నమని బద్నాం జేయవడ్తిరి. మీ వోలె మాకు అరువై నీతులుండయి. కోటవెట్టినట్లుంటయి మా మాటలు సేతలు. ఆకు పసరోలె వుంటయి మా నీతులు. పానంబొయినా మానం బోవద్దనే నీతులు గావు మాయి.
మీ తోడేల్లనాదుకోనీకి మమ్ముల డాలుబోలు జేసి మాకేసునే గాదు గీ అడివిల్నుంచి మమ్ముల్ని సెట్లను కొట్టేసినట్లు కొట్టేసే కుట్రలు మా కర్తమైతన్నయి. మా అడివి కడుపుల బాయినెట్లు బెట్టి పుట్టల్ని, పిట్టల్ని, సెట్టు సేమని, సమస్త జీవరాసిని, బాక్సైట్లని బంగారవెలె తోడుకొని బైటికి తోలినట్లు మమ్ముల మా తల్లి కడుపుల నుంచి ఆవలి కెల్లగొట్టి ఆగంజేసే మీ కుతంత్రాలను సాగనియ్యం.
మీయి సీతువకండ్లు. మీ సీతువ కండ్లనుంచి మా అడవి తల్లిని కన్నబిడ్డనోలె కాకులు గద్దలు కొట్టకుంట సాదుకుంటం కాపాడుకుంటం. మా పానాలు బొయినా…. మీ కంకెర రాజ్జెంల మేము రాము. పోయి పోయి మీరే మా రాజ్జెలం కత్తరు. గప్పుడు మీ కత మేమే తేలుస్తం తియ్యుండ్రి.

Share
This entry was posted in మాక్క ముక్కు పుల్ల గ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.