యధేచ్ఛగా సాగుతున్న మైనర్‌ బాలికల సెక్స్‌ రాకెట్‌

 

(అనిత సాహసగాధ)- ఉదయమిత్ర

బతుకుదెరువు కోసం నాసిక్‌లోని ఓ పల్లెటూరి నుండి ఓ మైనర్‌ బాలిక మొదలెట్టిన ప్రయాణం… చివరకు వ్యభిచార గృహంలో ముగిసింది.. ఇంత జరిగినా.. ఇక ముందు ఇట్లాంటివి జరుగనీయకుండా ఎట్లాంటి చర్యలు దీసుకోలేదు సదరు ప్రభుత్వం. ఉద్యమకారులు చెప్పేదేమంటే, ఏదో మొక్కుబడిగా కొందరు వ్యభిచారగృహ యజమానులనూ, వారి సహచరులనూ అరెస్టు చేసి చేతులు దులిపేసుకున్నారేగాని ఈ ‘సెక్స్‌ రాకెట్‌’ వెనుక అసలు సూత్రధారులు పట్టుబడనేలేదు…

ఈ విషవలయం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న 14 సంవత్సరాల అనిత (పేరు మార్చబడింది) ప్రస్తుతం ‘ధూలే’ వసతిగృహంలో ఆశ్రయం పొందుతోంది. ఆమె ‘హిందూ’ పత్రికలో మాట్లాడుతూ, ఈ సెక్స్‌ రాకెట్‌లో ప్రథమ ముద్దాయి అయిన బే బీరాయ్‌ చౌదరి గురించి విస్మయం గొలిపే విషయాలు చెప్పుకొచ్చింది.. ”మీకు తెలుసా.. మా దగ్గర కేవలం మైనర్‌ బాలికలే దొర్కుతారు” అంటూ బాహాటంగా చెబుతుండేదంట! ”కేవలం టీనేజీ అమ్మాయిలే దొర్కడం మా ఇంటి ప్రత్యేకత అంటూ ఫోన్లో చెప్పగా విన్నాను..” అని చెప్పుకొచ్చింది అనిత.. ”ఒకమ్మాయికి కేవలం పదమూడేళ్ళే ఉండేవి.. ఒకరిద్దరికి 16 సం||లు, 17 సం||లు ఉండేవి. బేబీబాయ్‌ ఇంటికొచ్చే ప్రతిమగాడికీ ఈ విషయం తెలిసే వొచ్చేవాళ్లు” అందామె.. బేబీబాయ్‌, ఆమె కొడుకు గణేష్‌లు యధేచ్ఛగా మైనర్‌ బాలికల్ని ఇతర నగరాలకు అమ్మేసేవాళ్లు..

ప్రస్తుతం అనిత కేసులో సహకరిస్తున్న ప్రముఖ సంఘసేవిక ప్రతిభా షిండే ఈ విషయంలో పోలీసుల మీద విరుచుకుపడ్తుంది. ”అనిత వెంట్రుకవాసిలో తప్పించుకో గలిగిందిగాబట్టి, ఆ పిల్ల ఈ సెక్స్‌ రాకెట్‌ గుట్టు విప్పగల్గింది.. అయినప్పటికీ, ఈ రాకెట్‌కు అసలు సూత్రధారి అయిన ముంబయివాసి హసన్‌ మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు.. ఇంకా మిగిలిన అమ్మాయిల గతేంది? వాళ్లను కనుగొనడంలో పోలీసులెందుకు విఫలమవుతున్నారు? పోలీసుల రికార్డుల ప్రకారమే ధూలే, జల్గావ్‌, నందుర్బార్‌ ప్రాంతాలనుండి ఒక్క సంవత్సరంలోనే 75 మంది మైనర్‌ బాలికలు మిస్సయ్యారు..” అంది షిండే.. ”అనితకు ఫోటోలు చూయిస్తే ఆ పిల్ల ఇద్దరు ‘మిస్సింగ్‌’ అయిన అమ్మాయిల్ని గుర్తుపట్టగల్గింది. అసలు ఈ పోలీసులు మిగతా అమ్మాయిల ఆచూకీ ఎందుకు కనుగొనడం లేదు..” అంటూ వాపోయిందామె.

కేవలం తన ధైర్యం, ధృడసంకల్పం ద్వారా మాత్రమే అనిత తప్పించుకోగల్గింది గాని, మైనర్‌ బాలికల్ని ఈ రాకెట్‌ నుండి తప్పించడాన్కి ఈ ప్రభుత్వం చేసింది శూన్యమేనని ఆమె కథ వింటే అర్థమవుతుంది.

అతిపేదరికంవల్ల, అనిత బాల్యంలోనే చదువొదిలి పెట్టింది.. బతుకుదెరువుకోసం నాసిక్‌కు వొచ్చి నవంబర్‌ 2012లో ఓ షాపులో సేల్స్‌ అమ్మాయిగా పనికి కుదిరింది.. ఆమెకు నెలకు 2400 రూ||లు మాత్రమే ఇచ్చేవాళ్లు.. అక్కడే ఆమెకు కవితభాట్‌ ఖండే అని స్త్రీ పరిచయమయ్యింది (ఈమెను తర్వాత వ్యభిచారనేరం కింద అరెస్టు చేశారు.) అనిత ఒప్పుకుంటే ఆమెకు ”ధూలే”లో ఓ మంచి ఉద్యోగం ఇప్పిస్తాననీ, రోజుకు వెయ్యి రూపాయలు దొర్కుతాయనీ ఆశ చూపించింది.. అక్కడ్నుంచి ఆమెను మెల్లిగా బేబీబాయ్‌ చౌదరి ఇంటికి చేర్చింది.. మొదటిరోజాపిల్ల వంటమనిషిగా పనిచేసింది. ”అక్కడికి చాలామంది వొచ్చేవాళ్లు. అయినా నేను సర్దుకుపోవాలనుకున్నాను. కాని నా స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అదే చివరి రోజు అవుతుంది అని ఊహించలేదు..” అందామె. రెండోరోజు ఎప్పట్లాగే ఏం వంట చేయాలని అడిగితే, ఎవరూ మాట్లాడలేదు. అయినా ఆ పిల్లకు అనుమానం రాలేదట! ఆ తర్వాత ఎవరో కొత్తకొత్తవాళ్ళొచ్చి అమ్మాయిల్ని బెడ్‌రూముల్లోకి తీసుకెళ్లడం మొదలెట్టాక ఆమెకు అనుమానం మొదలయ్యింది.

అక్కడికో డాక్టరు వొచ్చేవాడు.. వాడు మత్తుమందు లాంటిదేదో ఇవ్వాలని చూసేవాడు.. కాని, రోజూ అనిత వాడితో గొడవ పెట్టుకునేది. తన దగ్గరకొచ్చే విటుల్తోనూ గొడవపెట్టుకునేది. వాళ్లు ఈమె గురించి బేబీబాయ్‌ దగ్గర ఫిర్యాదు చేసి వెళ్లేవాళ్లు..

వ్యభిచారానికి సహకరించని అమ్మాయిల్ని రక్తం కారేట్టు కొట్టేవాళ్లు. ఒకసారి అనిత పొట్టి దుస్తులు వేసుకోనందుకు, బేబీబాయి ఆగ్రహానికి గురయ్యింది.. డాక్టరిచ్చిన ఇంజక్షన్లతో ఆమె బరువు పెరగడం మొదలయ్యింది.

ఇంతటి నిర్బంధంలోనూ, అనితచుట్టుపక్కల విషయాల్ని క్షుణ్ణంగా గమనించడం మొదలెట్టింది. అక్కడ్నుంచి ఎక్కువమంది అమ్మాయిల్ని ముంబయిలోని ‘హసన్‌’ అనే వ్యక్తికి సరఫరా చేసేవారని గమనించగల్గింది. ”అమ్మాయిలందర్నీ లైను మీద నిలబెట్టేవాళ్లు. వాడొచ్చి అమ్మాయిల్ని పరిశీలించి రేటు గట్టేవాడు.. అయితే బేబీబాయ్‌ ఎంత వేడుకున్నా, నన్ను మాత్రం కొనేవాడు కాదు” అందా అమ్మాయి.

ఓ రెండు నెలల తర్వాత, అనిత తప్పించుకోగల్గింది గాని, ఆమెను వెంటనే గణేష్‌ (బేబీబాయ్‌ కొడుకు) పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు.. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే చంపేస్తామని బెదిరించాడు.. ”ఇక నేనిక్కడే చచ్చిపోతానేమో” అనుకుందా అమ్మాయి.

అయినా ఆ పిల్ల తన ప్రయత్నం మానలేదు.. ఈసారి అవకాశం ఇంకో రూపంలో వొచ్చింది.. బేబీబాయి మనుమరాలు (3) పొరపాటుగ తలుపు తెరవడంలో అనిత మరోసారి తప్పించుకోగల్గింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ”పూజాపాటిల్‌” అనే మరో ఏజెంట్‌ కంటబడ్డది. (ఈమె కూడా వీళ్ల వ్యభిచార గృహానికి తరచుగా వొస్తూ ఉండేది). ”నన్ను మా నాన్న దగ్గరికి చేరుస్తానని పూజ నమ్మించింది.. అందుకు భిన్నంగా నన్ను మూడు హోటళ్లకు తిప్పి.. అక్కడికి వచ్చే మగాళ్లతో పడుకోమని బలవంతం జేసింది” అందామె. చివరకు అనితను దీసుకొని ధూలే బస్‌స్టాండ్‌లో నిల్చిఉండగా వాళ్లు పోలీసుల కంటబడ్డారు..

కాని.. అనిత కష్టాలు అంతటితో తీరలేదు.. అక్కడి అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ (జుఐ|) ”పావ్రా” ఆ పిల్ల పట్ల అతిదురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో కనీసం ఓ|ష్ట్ర నమోదు చేయలేదు. ఈలోపున తాను అనితను పట్టుకున్నాని బేబీబాయ్‌కి ‘ఉప్పందించాడు’. దాంతో ముందు జాగ్రత్తగా ఆమె తన ఇంటిలోని మైనర్‌ బాలికల్ని వెంటనే తప్పించేసింది. ”పావ్రా నా కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి జేశాడు.. నాకు లక్షరూపాయలిప్పిస్తాననీ, ఎంచక్కా ఇంటికి వెళ్లిపోవొచ్చనీ హామీ కూడా ఇచ్చాడు.. దానికి నేనొప్పుకోలేదు.. అందుకు, నన్నూమానాయన్నూ చంపుతానని బెదిరించాడు” అందామె.

అయితే ఈ కేసును ఈఐఆ మోనికా రౌత్‌ తీసుకోవడంలో మలుపు దిరిగింది. ఆమె ఈ కేసును సీరియస్‌గా తీసుకొని బేబీరాయ్‌, గణేష్‌, కవిత, పూజ మరికొందరిని అరెస్టు చేసింది. ఆమె ”హిందూ” పత్రికలో మాట్లాడుతూ వివరాలు వెల్లుడించడాన్కి తిరస్కరించింది. ఈకేసు పూర్వాపరాలు వెల్లడించడంగాని, పావ్రాను వొదిలిపెట్టడం గురించి గాని ఆమె కామెంట్‌ చేయలేదు.. ”కేసు కోర్టులో ఉన్నందున నేనేమీ చెప్పలేను. అంతా చట్టం చూసుకుంటుంది” – అంది మోనికా రౌత్‌.

తన కథ, తనలాంటి వాళ్లను బంధవిముక్తుల్ని చెయ్యడాన్కి స్ఫూర్తినిస్తుందని అనిత ఆశ. ”తప్పుచేసేవాళ్లకి తమ తప్పు తెల్సు.. నిజం బైటపడ్డాక ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు..” అంటూ ఎంతో నమ్మకంతో చెబుతుందామె. చూద్దాం. ఆమె ఆశ నెరవేరుతుందేమో..

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.