అకాల వైధవ్యం బారిన చెంచు యువతులు – విషాదంలో నల్లమల

 – డా|| బెల్లి యాదయ్య

”భారతదేశం ఓ బహుత్వ సమాజం. అది ప్రజాస్వామ్యం, చట్టపాలన, వ్యక్తిగత స్వాతంత్య్రం, సామాజిక సంబంధాలు, (సాంస్కృతిక) వైవిధ్యాలతో అద్భుతాన్ని సృష్టిస్తుంది. బుద్ధిజీవిగా గడపడానికి ఎంత అద్భుత ప్రదేశం!… భారతదేశాన్ని పునరావిష్కరించడానికి మళ్లీ పదిసార్లు పుట్టినా నాకేం అభ్యంతరం లేదు’ అని అనుభూతి పరవశంగా పేర్కొన్నాడు రాబర్ట్‌ బ్లాక్‌వెల్‌. ఈయన అమెరికా రాయబారిగా మనదేశంలో పనిచేశాడు. 2003లో తన వీడ్కోలు ప్రసంగంలో రాబర్ట్‌ బ్లాక్‌వెల్‌ పైవిధంగా స్పందించాడు. నిజమే ఒక ఉపఖండంగా పేర్కొనబడిన భారతదేశాన్ని రాబర్ట్‌ బ్లాక్‌వెల్‌ మాత్రమే కాదు, మరొకరెవరైనా ఇంతకు మించిన అభిభాషణ చేయాల్సిందే తప్ప ఎంతమాత్రం కనిష్టం చెప్పాల్సిన పరిస్థితి ఉండదు. మెగస్తనీస్‌, ఫాహియాన్‌, యువాన్‌త్సాంగ్‌, మార్కోపోలో మొదలు ఇటీవలి మెకంజీ, హైమన్‌ డార్ఫ్‌ వరకు విదేశీ యాత్రికులు మనదేశ సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతలకు ముగ్దులైనవారే. ఇక్కడి జీవన వైవిధ్యాలనూ జీవ వైవిధ్యాన్నీ నమోదు చేసినవారే. యావత్ప్రపంచం చేత సమున్నతంగా కీర్తించబడడానికి భారతదేశం ఆపాద మస్తకం అడవులతో పర్వతాలతో నదీనదాలతో మైదానాలతో చారిత్రక కట్టడాలతో అంతకుమించిన కళా సంస్కారాలతో శోభించడమే కారణం. ఇందుకు వీటి పరిరక్షకులైన ఆదిమ (ఫస్ట్‌ నేషన్స్‌) జాతులకు మనం ఎంతగానో ఋణపడి వున్నాం.

ప్రఖ్యాత రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతిరాయ్‌ ఒరిస్సాలోని నియమగిరి ప్రాంతంలో ‘వేదాంత అలుమినా లిమిటెడ్‌’ చేపట్టిన బాక్సైట్‌ త్రవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గిరిజనులను ఉద్దేశించి ఇట్లా |దీ ళితిజీ గీళిజీజిఖి, రీబిఖీరిదీవీ శినీలి ళీళితిదీశిబిరిదీ రిరీ బి ళీతిబీనీ లీరివీవీలిజీ శినీబిదీ గీజీరిశిరిదీవీ లీళిళిదిరీ బిదీఖి గీరిదీదీరిదీవీ బి ఔళిళిదిలిజీ ఆజీరిచిలి, | రీబిజితిశిలి గిళితివ2. అన్నారామె. నాగరిక సమాజాలు పండిత ప్రకాండులకంటే గిరిజనులు ఎంతటి మహత్తరమైన పనులు చేస్తున్నారో అరుంధతిరాయ్‌ మాటల్లో బోధపడుతుంది. ప్రకృతితో మమేకమై అడవులను కొండలను కాపాడుతూ నాగరిక సమాజానికి పట్టణ సమాజానికి సర్వస్వాన్ని పరోక్షంగా అందిస్తున్న ప్రతి గిరిజనుడికి ఆదివాసీ తెగకు వనేతర ప్రాంతవాసులంతా సాగి మొక్కవలసిన అవసరాన్ని అరుంధతిరాయ్‌ ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది.

‘సత్యం కవిత్వం కంటే ఉత్కృష్టమైనది. వర్తమానం గతం కంటే ఘనమైనది’ అనేది నానుడి. ఒక జాతికి ఎంత ఘనచరిత్ర ఉన్నా దాని వర్తమానం బాగా లేకపోతే అట్టి జాతి, దాని అపూర్వ విజ్ఞానం ప్రమాదంలో పడతాయి. ఆ సమయంలో ఇంతలింతలు వర్ణించే కవివరేణ్యుని ఇంద్రధనుస్సు వాక్యాలకంటే మేలిమి కవిసమయాల కంటే వాస్తవాధీనమైన చర్చ, మామూలు సంభాషణ ఎంతో గొప్పది. ఆ చర్చ సంభాషణలవల్ల ప్రమాదపుటంచున నిలబడ్డ జాతికి కాస్తో కూస్తో మేలు జరగగలదనేదే పైనానుడిలోని అంతరార్థం. ఈ దిశగానే ఇవాళ విద్యావంతులు, అకడమిక్‌ సంస్థలు గిరిజన తెగల గురించి ఆలోచించి కదలవలసి వుంది.

ఆధునిక సాహిత్యం సంఘసంస్కరణనూ ఆత్మగౌరవ పోరాటాలనూ అస్తిత్వ ఉద్యమాలను పరిపోషిస్తున్నది. స్త్రీవాద సాహిత్యం కూడా ఈ త్రికోణాల్లో పరచుకున్నది. ”పురుషస్వామ్య సమాజంలో స్త్రీలు బాల్య వివాహాలకు, అవిద్యకు, సహగమనాలకు నిర్బంధ వైధవ్యాలకు గురి అవుతూ దుర్భరమైన జీవితాలను గడుపుతుంటే ఆ పరిస్థితిని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు” ఆనాడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగునాట ఆయనతో మొదలైన స్త్రీజనోద్ధరణ భావన స్త్రీలే తమ గురించి తాము విజృంభించి రాసుకునేంత చైతన్యంలోకి విస్తరించింది. 1975-85 దశాబ్దాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంతో స్త్రీల సమస్యలపైన యావత్‌ ప్రపంచం దృష్టి పెట్టింది. ”స్త్రీల జీవితాల్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల దృక్పథం” స్త్రీవాదంగా బలపడింది. పరిస్థితులను సమస్యలను విశ్లేషించడానికి స్త్రీవాదులు, మహిళా సంఘాలు సమాఖ్యలు తెరపిలేని పోరాటాలనూ చేస్తూ వస్తున్నారు. పత్రికలు, మీడియా కూడా ఫెమినిస్టు దృక్పథాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం కల్పిస్తూ వచ్చాయి. వ|దీఖిరిబి ళీరివీనీశి లీలి శినీలి గీళిజీజిఖి’రీ జిబిజీవీలిరీశి ఖిలిళీళిబీజీబిబీగి, లీతిశి రిశి’రీ బిజిరీళి ళిదీలి ళితీ శినీలి ళీళిరీశి వీలిదీఖిలిజీ రీదిలిగీలిఖివ5 నాలుగు దశాబ్దాల మహిళా ఉద్యమాల ప్రభావం వల్ల గృహరంగం నుంచి లెజిస్లేచర్‌ వరకు గల అసమానతలను స్త్రీలు స్వశక్తితో అధిగమించగలిగారు. అవని నుండి అంతరిక్షం వరకు సమానావకాశాలను తీసుకొనే విధానపరమైన ఎన్నో సంస్కరణలకు మహిళా చైతన్యం కారణభూతమైనది.

వఐబిజితిశిలి శినీలి జీరిరీలి ళితీ శినీలి ళీళిఖిలిజీదీ బిరీరీలిజీశిరిఖీలి 21రీశి బీలిదీశితిజీగి |దీఖిరిబి గీళిళీలిదీ బీళిదీరీబీరిళితిరీ ళితీ నీలిజీ జీరివీనీశిరీ బిదీఖి ఖిబిజీదీరిదీవీ శిళి వీళి శినీలి ఖిరిరీశిబిదీబీలి రిదీ రీనీబిచీరిదీవీ తీలిళీరిరీదీరిరీళీ 2.0′ బిరీ ళీలిదీ ఊజీలిళీలీజిలివ6 గా మహిళా స్వరం పెరిగింది. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందన్న సంస్కర్తల వాక్యం సాకారమైంది. కార్పొరేట్‌ యాజమాన్యాల బోర్డు రూముల్లో సైతం మహిళ ప్రాధాన్యం పెరిగింది. కేవలం ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో, పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో పనిచేసే వాళ్లుగా మాత్రమే కాకుండా పురుషులే చేయగలరనుకున్న ఆటోమానిఫాక్చరింగ్‌, టెల్‌కో, టాటా మోటార్స్‌లలో పనిచేయగల వ| గీబిరీ దీళిశి ఖిళిరిదీవీ గీళిజీదీవీ. ఐళి | రీనీళితిజిఖిదీ’శి గీళిజీజీగి. ందీలి | ఖిలిబీరిఖిలిఖి దీళిశి శిళి బీబిజీలి గీనీబిశి చీలిళిచీజిలి గీలిజీలి రీబిగిరిదీవీ బిలీళితిశి ళీలి, దీళిశినీరిదీవీ లీళిశినీలిజీలిఖి ళీలివ7. (సుధామూర్తి, దేశంలో తొలి మహిళా ఇంజనీర్‌) అంటూ కర్తవ్య పారాయణతనూ సంకల్ప బలాన్ని నేటి మహిళ మేటి మహిళగా నిరూపించుకుంటున్నది. ప్రసిద్ధ మాజీ పోలీసు అధికారి కిరణ్‌బేడీ ఈబిజీలి శిళి ఈళి లో చెప్పినటు వబీనీబిదీవీలి రిరీ శినీలి జిబిగీ, వీజీళిగీశినీ రిరీ ళిచీశిరిళిదీబిజి: బీనీళిళిరీలి గీరిరీలిజిగివ8 మార్పులకు తట్టుకొని నిలబడగలిగే స్థాయిని అందుకున్నారు. ”పురుషులకన్నా మహిళల్లో మరింత సమర్థవంతంగా విశ్లేషించి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువ. ఆర్థికవృద్ధిలో పారిశ్రామిక వేత్తల విజయాలు కీలకం. ఇందులో లింగ వివక్షకు తావుండనక్కర్లేదు. సృజనాత్మక ఆలోచనలు సహజ సిద్ధమైన నైపుణ్యాలతో మహిళలు వ్యాపార రంగంలో రాణించగలరు. మహిళలు చేపట్టిన ఏ పనిని మధ్యలో వదిలిపెట్టరు. అంకితభావం, కష్టపడేతత్వం ఉంటుంది” అని ఋజువు చేసుకుంటున్నారు. అయినా లింగవివక్ష పూర్తిగా పోయిందని చెప్పలేం. ఎందుకంటే వస్త్రలిదీఖిలిజీ ష్ట్రళిజిలిరీ రిదీ ఖరిదీఖిరీ ళితీ ఆలిళిచీజిలివ10 కదా. ఏ అభద్రతైతే తమ పాలిట శాపంగా ఉన్నదో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని వ|దీరీలిబీబితిజీరిశిగి రిరీ బి చీజీరిళీలి ళీళిశిరిఖీబిశిళిజీవ11 అంటూ ఆకాశంలో సగం అనే మేథోకృషితో స్త్రీలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అధునాతన విద్య సాంకేతిక పరిజ్ఞానం అందించిన చేయూతతో అనుకున్న లక్ష్యాలకు విప్లవాత్మకంగా చేరుకుంటున్నారు.

అభివృద్ధి, అభ్యుదయకర ఆలోచనలు చేస్తున్న మహిళలు స్వయంకృషి ద్వారా వన్నెకెక్కిన మహిళలు, స్వావలంబన సాధికారత దిశగా వడిగా అడుగులేస్తూ వ|దీ శినీరిరీ బివీలి గీలి బిజిజి దీలిలిఖి శిళి నీబిఖీలి శీళిలీరీ బిదీఖి గీలి దీలిలిఖి శిళి జీలిఖిరితీరిదీలి శిజీబిఖిరిశిరిళిదీబిజి జీళిజిలిరీ రిదీ బి తీబిళీరిజిగి. ఇలి దీలిలిఖి శినీలి గీళిజీది చీజిబిబీలి శిళి జీలిబిజిరిరీలి శినీబిశి గీలి నీబిఖీలి బి జిరితీలి బిదీఖి దీలిలిఖి శిరిళీలి తీళిజీ తీబిళీరిజిగి. ఊనీరిరీ నీబిఖీరిదీవీ రిశి బిజిజి జిరిదీలి రిరీ బి వీజీలిబిశి బీళిదీ శీళిలీ ళీలిదీ నీబిఖీలి చీతిజిజిలిఖి ళిదీ గీళిళీలిజీ రీళి శినీలిగి ఖిళి రిశి ళిదీవ12 అనే స్థాయికి ఎదిగిన మహిళలు (పట్టణ గ్రామ సమాజాల్లో) ఒకవైపు ఉంటే మనదేశంలో అసలు ఏ మార్పూ రాకపోగా నానాటికీ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడుతూ భయానకంగా నిశీధిమయ వ్యధాభరిత జీవితాలను గడుపుతున్న అబలలూ అభాగ్య స్త్రీలు ఇంకోవైపు ఉన్నారు. ఈ అభాగ్య స్త్రీలే గిరిజన స్త్రీలు. ఈశాన్య భారతానికి చెందిన ఇరోమ్‌ షర్మిల గురించి మనందరికీ తెలుసు. ఆమె పుష్కరకాలంగా నిరాహార దీక్ష చేస్తున్నది. గిరిజన ఆవాసాల్లో సైనిక దళాలు చేస్తున్న అకృత్యాలకు నిరసనగా, సైనిక బలగాల ఉపసంహరణ జరిగే వరకూ తన పోరాటం ఆగదని షర్మిల చెపుతున్నది. గిరిజన స్త్రీలపై నాగరికుల లైసెన్సు దాడులు జరుగుతున్నాయనడానికి ఉదంతాలెన్నో చూపవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు నూరేళ్ళ ఆనందంగా వైవాహిక జీవితాన్ని గడపవలసిన చెంచు స్త్రీలు యుక్తవయస్సులోనే భర్తని పోగొట్టుకొని అకాల వైధవ్యం బారిన పడిన దిగ్భ్రాంతికర స్థితి ఒక ఎత్తు వారివారి ఆవాసాల్లో (పెంటలు) కలిసి పలకరించినప్పుడు నాకు కలిగిన బాధను నేనిట్లా

”నిలువెల్లా ఆర్తి

నిలదీస్తున్న దీనత్వం

నిలబడలేని అచేతనం

ఒక అంధమయ సుప్తావస్థ

ఒక గడ్డకట్టిన దుఃఖ స్థితి

ఇది ఇవాళ చెంచు యువ వితంతువుల పరిస్థితి’ అని రాసుకున్నాను. దీన్ని అంతమొందించడానికి అడవి వెలుపలి నాగరిక పట్టణ సమాజాల్లోని అభివృద్ధి చెందిన స్త్రీలు, మహిళా సంఘాలు, రచయితలు, మేధావులు కదలిరావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ”చట్ట ప్రకారం చెంచుల వంటి తెగలు జాతులు అన్ని హక్కులు పొందడానికి తగిన వాతావరణం మనం ఏర్పరిస్తే ఇంత కాలం తెల్లవాడి చదువులు వల్లెవేస్తున్న మనకు ప్రపంచంలో గుర్తింపు మాత్రమే కాదు బడుగు ప్రజలకు ఆ వనరుల మీద అధికారం దక్కేందుకు దారి తీస్తుంది.” అని అభిప్రాయాన్ని అందరం బలపర్చవలసిందే.

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డు తెగల జాబితాలో మూడవ కులం చెంచు. వీళ్లు పూర్తిగా ఆదివాసీలు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఇండియన్‌ అమేజాన్‌గా పేరుగాంచిన నల్లమల అభయారణ్యంలోని కొండలు, గుట్టలు చెంచుల నివాస స్థలాలు. రాష్ట్రంలోని రెండు ప్రధాన జీవనదుల్లో ఒకటైన కృష్ణానది అభయారణ్యం గుండా పారడం విశేషం. హరిత ఖజానాగా నల్లమలకు పేరున్నప్పటికీ ”అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలోనే ఉండరు.” బ్రిటిషు ఏలుబడికింద ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీకీ స్వతంత్రరాజ్యంగా ఉన్న నైజాం ప్రాంతానికీ ఉత్తర దక్షిణ సరిహద్దులుగా ఉన్న కృష్ణానదికి ఇరువైపులా నల్లమల ఉన్నప్పటికీ ఇక్కడి చెంచుల్లో ఏ మార్పు రాలేదు. వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా చెంచులు జీవనం గడుపుతారు. లింగమయ్య (శివుడు) భద్రకాళి (పార్వతి) వీరి ఆరాధ్య దైవాలు. భాష తెలుగే అయినప్పటికీ ప్రత్యేకమైన పదజాలం చెంచుల మాటల్లో కనిపిస్తుంది. చంద్రుణ్ణి బాలుడంటరు. చెలిమలను ‘బుగ్గ’లంటరు. గుట్టను కొరవ అంటరు. వ్యవసాయాన్ని కాపిరం అంటరు. చెంచు స్త్రీలను ఎవరైనా అక్క అనాల్సిందే. పురుషులను బావ అనవలసిందే. బావబావమరుదుల మైత్రి చెంచుల్లో గొప్పది. నల్లగా కురుమట్టంగా రింగుల జుట్టు, వెడల్పైన ముఖం, చప్పిడి ముక్కు పొడవాటి దవడలు కలిగివున్న చెంచులు ఆఫ్రికన్లకు తోబుట్టువుల్లా అనిపిస్తారు. పురుషులు తెల్లగోచిపాతలు, స్త్రీలు నూలు రవిక చీర ధరిస్తారు. విల్లంబులు చెంచుల ఆయుధాలు. హిందూ సమాజ సంపర్కం వల్ల అడవి వెలుపలి మైదాన ప్రాంత చెంచుల్లో కొంత సాంస్కృతిక సంకరం కనిపిస్తున్నప్పటికీ ఆదిమ సమాజపు లక్షణాలైన ప్రకృతి, ఆరాధన, వనదేవతల పట్ల విశ్వాసం, వేట, యుద్ధం తదితరాలు ఇప్పటికీ అడవిలోపలి (ఈలిలిచీ తీళిజీలిరీశి) పెంటల్లోని చెంచుల్లో చెక్కుచెదరలేదు. ఆశుసాహిత్యం, నెమలి నృత్యం, కోతినృత్యం చెంచుల సొంతం. డప్పు, వీరణం, బుక్క (డమరుకం) వేణువు వీళ్ల వాయిద్యాలు, వీరి రూపకాల్లో సింగిసింగడు ప్రధాన పాత్రలు. ఇప్పపువ్వుతో చేసిన సారాయిని సేవించడం పూర్వం నుంచి వీళ్లకున్న పానీయ సంస్కృతి. మూలికా వైద్యంలో వీళ్ళు రారాజులు. చెంచుకథలు జానపద వాఙ్మయంలో ప్రసిద్ధమైనవి. వినుకొండ వల్లభరాయుడు ‘క్రీడాభిరామం’లో, జాషువా ‘గబ్బిలం’లో చెంచుల ఆటపాటల గురించి ప్రస్తావించారు. అహోబిలం, శ్రీశైలం ఆలయాలు వందల ఏండ్లుగా చెంచుల సంరక్షణలోనే ఉంటూవస్తున్నాయి.

వేల సంవత్సరాలుగా నల్లమల అభయారణ్యాన్ని తమ పవిత్రభూమిగా భావిస్తూ వస్తున్న చెంచులు 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 14000 మంది ఉండేవారు. నేడు ఆ సంఖ్య 8000లకు తగ్గింది. పులుల సంరక్షణ మీద ప్రత్యేక దృష్టి నిలిపిన ప్రభుత్వాలు చెంచు సమాజపు క్షీణతను చెవిన పెట్టక పోవడం మహావిషాదం. ఈ విషాదానికి చెంచు యువతుల అకాల వైధవ్యం ప్రధాన కారణం. అకాల వైధవ్యానికి మద్యపానం, వైద్యసౌకర్యాలు కొరవడడం, విద్యావగాహన లేకపోవడం ముఖ్య కారణాలుగా కన్పిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలలు, ఆవాస వైద్యశాలలు ఉన్నా పేరుకే. వీటి వలన చెంచుల విద్యా వైద్యాల్లో పెద్దగా మార్పులేదు.

తరగతిని ప్రారంభించడానికి ముందు విద్యార్ధుల పరిసరాల్లో ఉపాధ్యాయుడు పర్యటించాలనేది గిజుభాయి నినాదం. దీన్నే నేను అనుసరిస్తాను. అనుసరించాను.

గత మూడు విద్యా సంవత్సరాల్లో (2010-11, 2011-12, 2012-13) మహబూబ్‌నగర్‌ జిల్లా నల్లమల దాపున గల నోటిఫైడ్‌ ఏజెన్సీ ఏరియాలోని ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నప్పుడు చెంచుల జీవితంపై అధ్యయనం ఆరంభించాను. అచ్చంపేట, అమ్రాబాద్‌, డిండి, చందంపేట, లింగాల, ఉప్పునుంతల, కొల్లాపూర్‌, పెదకొత్తపల్లి మండలాల్లోని చెంచు ఆవాసాలను సందర్శించాను. చెంచులతో మాట్లాడాను. చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలు కలచివేశాయి. మిగతా సమస్యలు అటుంచితే విడో సమస్య నన్ను తీవ్రంగా బాధించింది. వివిధ రకాల సమావేశాలను నిర్వహించాను. పత్రికల్లో వ్యాసాలను వెలువరించాను. ‘అభయోన్ముఖం’ పేరుతో వ్యాసాల సంపుటి ముద్రణలో ఉన్నది. ప్రత్యేకించి ‘వంద’ విడో ఇంటర్వ్యూలు కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నాను. ఆ ఇంటర్వ్యూల్లోని కొందరి బాధామయ ఇతివృత్తాలను ఈ వ్యాసం ద్వారా ద్రవిడ విశ్వవిద్యాలయం – కుప్పంలో స్త్రీ సమస్యలపై జరుగుతున్న జాతీయ సాహిత్య సదస్సు దృష్టికి తేదలచాను.

”బతుకు పట్ల కనీసపు ఏ ఆశా లేకుండా, విధి వశాత్తు అన్నీ జరుగుతాయి అని విశ్వసిస్తూ తమ వంతు ఏ మానవ ప్రయత్నం, చర్యకూ పూనుకోని అశక్తులుగా అవగాహనారహితులుగా మా చెంచులున్నారు. అన్ని చోట్ల అందరూ మారిండ్రు. మా వోళ్లు మారడం లేదు” అంటున్న ప్రధానాచార్యులు, అచ్చంపేట నుండి ”నాగరిక సమాజంలో మెలగడం ఇంకా తెలియదు. ఇతర సమాజాలతో కలసి జీవించే విధాన్ని నేర్పించాలి” యం.డి. జహంగీర్‌ గ్రామ కార్యదర్శి, బాణాల ”దాదాపు పురుషులందరూ సారా తాగుతున్నరు. సరిగ్గా తినరు. పనికి పోవడం తగ్గింది. భార్యా పిల్లల గురించి ఒక్క నిమిషం ఆలోచించరు. సన్న పిల్లలు ఈడులో ఉన్న ఆడోళ్ళు ఆగమైతున్నరు. ఫారెస్టుల ఉద్యోగాలివ్వాలి. క్రమశిక్షణ నేర్పించాలి” నిమ్మల విష్ణు సర్పంచ్‌ బాణాల, ”మార్పు చెందడానికి సంబంధించిన బేసిక్‌ ట్రైనింగ్‌ కావాలి. ఎక్కడికి ఉంటే అక్కడికి అట్లానే కాలం గడిపే అమాయక స్వభావమే తప్ప ప్రశ్నించే నడవడి అలవడలేదు. పునర్వివాహాలతో ఏకీభవిస్తాను. చెంచుజాతి నశిస్తే నీతి నిజాయితీ ఉన్న మనుషులు, పాతివ్రత్యం కల్గిన స్త్రీలు భూగోళం నుంచే నిష్క్రమిస్తారు. ఇందుకు ఆరోగ్యం పట్ల విద్య పట్ల మోటివేషన్‌, రీమ్యారెజెస్‌ గురించి చెప్పే సమావేశాలు ఇక్కడ అవసరం?” కాట్రాజు తిర్పతయ్య, కొండనాగుల, హెచ్‌.ఎం. ఆశ్రమ పాఠశాల బాణాల , ”రెండో పెళ్లి చేసుకొమ్మనే బదులు మొదటి భర్తలు పూర్ణ ఆయుష్కులుగా బతికేందుకు అవసరమైన అవగాహన, చట్టాలు, భద్రత మాకు కల్పించండి. అప్పుడు మేం అనుకునే శీలపవిత్రతకు భంగం వుండదు. మా అక్కచెల్లెళ్లు విషాదం నుండి బయటపడుతారు” బల్మూరు బక్కమ్మ రంగాపూర్‌ అచ్చంపేట మండలం, ”చెంచుగూడేల్లో స్కూళ్లుంటాయి. పిల్లలు రారని టీచర్లు పోరు. హాస్పిటల్స్‌ ఉంటాయి. సిబ్బందిలేక కొన్ని ఉన్నా సరియైన సౌకర్యాలు లేక కొన్ని సిబ్బంది నిర్లక్ష్యంతో కొన్ని మొత్తానికి ఫలితం వుండదు. ఆహారమైనా, ఆరోగ్యమైనా అంతా ఐటిడిఏ చూస్తది. భార్యాభర్తలు పొద్దున లేస్తే తాగుతరు. వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోరు. పిల్లల గురించి పట్టించుకోరు. అంతోఇంతో చదువుకొని ఉద్యోగాలు వచ్చిన డెవలప్డు చెంచులు పెంటల్లోకి వెళ్లరు. ఒకరిద్దరు సదుద్దేశంతో వెళ్లి అవేర్‌నెస్‌ కల్పించే ప్రయత్నం చేసినా బాధితులు పట్టించుకోరు” చందూనాయక్‌ నమస్తేతెలంగాణ రిపోర్టర్‌ స్థానికులు అభిప్రాయపడుతున్నరు.

పెళ్లి నూరేళ్ల పంట అనేది తెలుగువారి నుడికారం. అన్ని కులాలు తెగల్లో సమాజాల్లో పెళ్లి స్త్రీపురుషుల మధ్య ఆమోదయోగ్యమైన సెక్సు తద్వారా తమ జాతుల వృద్ధి విస్తరణకు ఏర్పడినట్టే వివాహవ్యవస్థ చెంచుల్లో కూడా అదే లక్ష్యంతో ఏర్పడింది. బాహ్య సమాజాల్లో వివాహం, కుటుంబం, వృత్తి, ఆర్థికవనరులు, ఆచార్యవ్యవహారాల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ చెంచుల్లో మార్పు ఏ కొంచెం కూడా రాలేదు. బాల్యవివాహాలు, అపరిపక్వ గర్భధారణ, పౌష్టికాహారలోపం చెంచులను స్త్రీలను పిల్లలను బాధిస్తున్న అంశాలు. స్వచ్ఛమైన జలాలు, ఆహారం, గాలి అందుబాటులో ఉన్న ప్రజలు ఆరోగ్యవంతులుగా వుంటారు అనేది ఒక అవగాహన, నల్లమల అడవిలో స్వచ్ఛమైన జలాలు, ఆహారం, గాలి అందుబాటులో వున్నా మరి చెంచులు ఎందుకు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆలోచిస్తే దృష్టికి వచ్చిన సమస్యలు అనేకం. విషజ్వరాలు, పాముకాటు, మృగాల దాడి మొదలైనవాటికంటే కాపుసారా వాడకమే చెంచులను పూర్తిగా బలిగొంటున్నది. నిత్యం తాగి తూలే చెంచుపెంటల్లో ఇదివరకటి శ్రమతత్వం కానరాదు. అడవిని కాదని దూరాలకు వలసపోయిన పురుషులు తిరిగి భద్రంగా రావడం లేదు. స్థానికంగా వనవాసీ కళ్యాణి పరిషత్‌, కోనేరు సంస్థ, గిరిజన సంఘాలు చెంచుల సమస్యలపట్ల స్పందిస్తున్నా వాటికి శక్తి చాలడం లేదు. ఎంత చెప్పినా ఎన్ని చేసినా అడవి మనుషులు కదా, మారరు అనేక వాదన నల్లమలలో వేళ్లూనుకున్నది. మిగతా చోటలో మార్జినల్‌ లేబర్‌లో ఉండే ఘర్షణ రాజకీయ వైరుధ్యాలు చెంచుల్లోనూ కనబడతాయి. ప్రభుత్వం నిధులు ఖర్చును గణాంకాల్లో చూపుతున్నా రోజురోజుకు చెంచుల పరిస్థితి దిగజారుతున్నదే కానీ ఎదుగుదల ఎంతమాత్రం కన్పించదంటున్నారు అధికారులు. వెరసి సంఘంలో ఏ ఘర్షణ ఏ ఉత్పాతం తలెత్తినా తిరిగితిరిగి అది స్త్రీ నెత్తిమీద పడ్డట్టు ఇప్పుడు చెంచుస్త్రీలు నెత్తిమీద మోయలేనిభారం, ముఖంలో రాలిన బొట్టు, కళ్లల్లో అంతులేని నైరాశ్యం. ఐటిడిఏ, ఆర్‌.డి.టి. ఇచ్చిన ఇండ్లు ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమి, వితంతు పెన్షను ఇతరత్ర సౌకర్యాలు ఏవీ చెంచు స్త్రీలకు భరోసా ఇవ్వడం లేదు. అప్పులు, పిల్లల పెంపకం, దైనందిన జీవితంలోని వత్తిళ్లు, తోటివారి నిందలు చెంచు వితంతువులను పెద్దయెత్తున కుంగదీస్తున్నాయి. ముప్ఫైఐదు సంవత్సరాలలోపు మహిళల్లో డెబ్భై ఎనభై శాతం వైధవ్యం బారిన పడుతున్నారు.

దేశంలోని మిగతా గిరిజన తెగలతో పోల్చుకుంటే చెంచులకు ఉద్యమించే శక్తి లేదనే చెప్పాలి. అడవిలో స్వేచ్ఛగా తిరగనివ్వని పరిస్థితి మీదకూడ చెంచులేమీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే ”ఉద్యమం అంటే యుద్ధం. యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి. సైన్యం అంటే జనం. పిల్లలే కదా జనం అయ్యేది. మరి పెనిమిటే లేనపుడు చెంచుస్త్రీ సైన్యాన్ని ఎట్లా కంటుంది. మాట్లాడకపోవడానికి ఉద్యమం చేయలేకపోవడానికి మాకు జనం తక్కువ వుండడమే కారణం” అంటున్నది బల్మూరు బక్కమ్మ. చెంచు పిల్లలు సింగిల్‌ పేరెంట్‌ చిల్డ్రెన్‌ కావడంవల్ల చదువుల్లోనూ డ్రాప్‌అవుట్స్‌గా మారుతున్నారు.

ఇదిట్లావుంటే చెంచుల్లో భర్తలు వదిలేసిన భార్యలు కూడా అధికంగానే వున్నారు. వీళ్ల మానసిక పరిస్థితి భిన్నం. ”ముండోళ్లలా పింఛను ఇస్తే తీసుకుంట. రానోపోనోడు లేనట్టేకదా” అంటున్నది ఉడుతనూరి మాసమ్మ (23). మాసమ్మ భర్త లింగయ్య ఛత్తీస్‌ఘడ్‌ వలస పోయాడు. సంవత్సరం నుంచి అడ్రసు లేడు. తనకు ఒక ఆడపిల్ల. పేరు కవిత. ఒకటో తరగతి చదువుతున్నది. ప్రతి చెంచు పెంటలో ఇట్లాంటివాళ్లు ఇద్దరు ముగ్గురు తారసపడతారు.

ఇక వితంతువుల దగ్గరికి వస్తే వాళ్ల కన్నీళ్లూ గంభీరంగానూ కథనాలు హృదయవిదారకంగా వున్నాయి. అమ్రాబాద్‌ మండలం మాచారం పెంటలో దాసలి మల్లమ్మ (25), దాసలి సాయిలమ్మ (38), కాట్రాజు పద్మ (30) ఉడుతనూరి పార్వతమ్మ (40), ఉడుతనూరి మాసమ్మ (45), నల్లబోతు ఎల్లమ్మ (45), నల్లబోతు రాములమ్మ (45), అచ్చంపేట మండలం చందాపూర్‌ పెంటలో – దాసరి చిట్టెమ్మ (28), రంగాపూర్‌లో నల్లబోతు చిట్టెమ్మ (35), దాసరి శోభ (30), నిమ్మల ఎల్లమ్మ (28), చౌటపల్లిలో నల్లబోతు సాయిలమ్మ (28), రంగాపూర్‌లో నల్లబోతు చిట్టెమ్మ (35), దాసరి శోభ (30), నిమ్మల ఎల్లమ్మ (28), చౌటపల్లిలో నల్లబోతు సాయిలమ్మ (28), రాయ లింగమ్మ (30), బాణాలలో – దాసరి లింగమ్మ (30), ఉడుతనూరి వెంకటమ్మ (30), చౌడం చిట్టెమ్మ (38), బల్మూరి లక్ష్మమ్మ (40), ఉడుతనూరి చిట్టెమ్మ (32), నిమ్మల ఎల్లమ్మ (35) ఇట్లా అన్ని పెంటలలో ఇంటికి ఒకరిద్దరు యువ వితంతువులున్నారు. అందరి భర్తల మరణానికి కారణాలు దాదాపుగా ఒక్కటే. తాగే వ్యసనం తద్వారా టి.బి., క్యాన్సర్‌, పసిరికలు వంటి రోగాలు. ఒకరిద్దరు మాత్రమే ప్రమాదవశాత్తూ చనిపోయినవారుంటారు. పిల్లలందరినీ బాగా చదివించాలని ప్రయోజకులను చేయాలనే తపన అందరిలోనూ బలంగా కన్పించింది. కానీ, వితంతు మహిళలంతా రకరకాల జబ్బులతోనూ, మానసిక వత్తిళ్లతోనూ సతమతమవుతున్నందున పిల్లల భవిష్యత్తును చూస్తామో లేదో అనే సంశయాత్మ వాళ్లలో కనబడుతున్నది.

ఈ దశాబ్దంలో చెంచుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత ఆరు సంవత్సరాలుగా ఐటిడిఏ అంబులెన్స్‌ డ్రైవర్స్‌గా పనిచేస్తున్న దాసరి నిరంజన్‌ ”యాక్సిడెంట్‌ కేసులు, టి.బి., డెలివరి కేసులు, టైఫాయిడ్‌, కామెర్లు, అతిసార పేషెంట్స్‌ను కర్నూలు, మహబూబ్‌నగర్‌, హైద్రాబాదులకు తీసుకెళ్తుంటాను. డబ్బు పెట్టి ముందు జాగ్రత్తగా చూయించుకునే తాహతు చెంచులకు లేదు. ఐటిడిఏ మీద ఆధారపడతరు. పిఓ. సార్‌ చూపిస్తరు. తక్కువైతది అనుకుంటరు. ఈలోగా ప్రాణమే పోతుంది. ఒకవేళ హాస్పిటల్‌కు వస్తే ఏ రిపోర్ట్సు ఉండవు. తీవ్రరూపం దాల్చినంక డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి” అని అన్నాడు.

వలసలవల్ల వితంతువులు పెరుగుతున్నారు. చెంచులను దళారులు వేరే రాష్ట్రాలకు తీసుకుపోతారు. అక్కడ పురుషులు వేరే గ్రామ చెంచుస్త్రీలతో పరిచయం ఏర్పరచుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మొదటి భార్యను వదిలేస్తున్నారు. ఒకవేళ భార్యలు నిలదీస్తే ”మొగోడు కాదు అన్నంక వాని వెంటపోతే అడవికి తోలుకపోయి బాణాలు గురిపెట్టి చంపుతరు” అని బల్మూరు బక్కమ్మ చెప్తున్నది. చందాపూర్‌ చెందిన దాసరి గురువయ్యను పునర్వివాహం గురించి అడిగినపుడు ”రెండో పెళ్ళి ఆలోచన చేస్తున్నం. రెండో పెళ్లి ఎక్కడా కాలేదు. చేసుకుంటే తప్పేం లేదు. వాళ్లు సుఖసమ్మతిగ బతకాలె” అన్నాడు. నల్లమలకు అప్పాపూర్‌ చెందిన తోకల గురవయ్య ”చెంచోడికి ఆశలేదు. అడివి తల్లిని నమ్మినంతకాలము చెంచోడికి తిండికి లోటు లేదు. కానీ ఇప్పుడు చెంచోడిని అడివికి దూరం చేస్తున్నారే, ఇంక చెంచోడు బతకడం ఎట్ల?” అంటాడు. ఇట్లాంటి ఒకదాన్కొకటి సంఘర్షించుకునే ప్రశ్నలూ, జవాబులూ చెంచు ఆవాసాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

పెంటల్లో స్త్రీపురుషులనే భేదం లేకుండా సారాయి తాగుతున్నరు. తాగి పడుకున్న తల్లి స్తనంనుంచి చంటిపిల్ల పాలుతాగుతున్న దృశ్యాన్ని ఎర్రపెంట (లింగాల మండలం)లో చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కోతినుంచి పాలుతాగుతున్న కోతిపిల్లకు ఈ చెంచుపిల్లకు ఏంటి తేడా అనుకున్నాను. ”ఆడవాళ్ళు తాగుతున్నరు. మొగోళ్లు మరీ ఎక్కువ తాగుతున్నరు. ఆడది కట్టడి చేస్తె కొంతల కొంతనన్న మొగోడు మార్తడు. నేను కూడా ఒకప్పుడు బాగా తాగేదాన్ని. ఇప్పుడు మానిన” అని బల్మూరు బక్కమ్మ చెప్తున్నప్పుడు ఒక చిన్నపాటి స్పృహ చైతన్యం కల్గిన స్త్రీని కలిసినందుకు నాకు ఆనందం కలిగింది.

చెంచుపెంటల్లో నైరాశ్యం నుంచి దిగ్భ్రాంతి నుంచి కోలుకోని యువ వితంతువులను మిగతా నాగరిక సమాజంలోని స్త్రీలతో పోల్చినప్పుడు ఎక్కడా ఏ విషయంలోనూ పొంతన ఉండదు.” ”ఖగి చీబిజీలిదీశిరీ గీలిజీలి రిదీ బిబీబిఖిలిళీరిబీరీ రీళి | వీజీలిగీ తిచీ రిదీ బి నీళితిరీలితీతిజిజి ళితీ లీళిళిదిరీ. ఖగి జుతిదీశి శిళిళి గీబిరీ బి గీళిదీఖిలిజీతీతిజిజి రీశిళిజీగి శిలిజిజిలిజీ. ఐళి శినీలి జిళిఖీలి తీళిజీ రీశిళిజీరిలిరీ గీబిరీ రిదీబీతిజిబీబిశిలిఖి రిదీ ళీలి బి ఖీలిజీగి గిళితిదీవీ బివీలి” అంటున్న కథారచయిత్రి జర్నలిస్టు వినీతా మొక్కిల్‌కూ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేలగీతలు గీస్తూనో తల పక్కకు దించుకునో చెంచు వితంతువులు మాట్లాడతారు తప్ప ఎవరూ తలెత్తి ధైర్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మహిళ తలెత్తుకుని ప్రశ్నించడమో జవాబివ్వడమో కదా స్త్రీవాదం. ఒకే కాలంలో ఒకే నేలమీద తమనుతాము అద్భుతంగా ఆవిష్కరించుకునే చైతన్యం కల్గిన మహిళలు, అసలేమాత్రం గొంతుల్లేని ఆశల్లేని అక్షరజ్ఞానంలేని మహిళలు ఉండడం మన సమాజంలోని భారీ ఎత్తుపల్లాలకు నిదర్శనం.

ఈ అమాయకపు అడవిపడుచులను ఎవరు వితంతువులుగా మార్చుతున్నారు? భర్తలా? అత్తామామలా? తల్లిదండ్రులా? లేదంటే అడివా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు అరిందమ్‌ చౌధురి మాటలు ”-మన ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేకమంది హంతకులతోనే కూడుకొని ఉంది… మన రాజకీయ నాయకులలో చాలామంది చేసే నిజమైన హత్యల గురించేకదా. సరైన ఆరోగ్యం, ఆహారం, ఉపాధి కల్పించకుండా వారి ప్రజలను వాళ్ళు చేసే హత్యల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ మూడు ప్రాథమిక అవసరాలను బట్టే ప్రభుత్వ పనితీరును నిర్ణయించాలి. వీళ్ళు మన జనాభాలో 45 సంవత్సరాలలోపు ఉన్నవారిలో 40 శాతం మందిని చంపేస్తున్నారు.”29 గుర్తొస్తున్నాయి. బహుశా నల్లమల చెంచుల యువకుల మరణాలన్నీ ఈ నలభై శాతం లోనివేనని చెప్పకతప్పదు.

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అడవి కళ్లముందు అన్యాక్రాంతం అయిపోతున్నది. సోరసోర పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం కాగితాల మీద అన్ని లెక్కలు కేటాయింపులు చూపెడుతున్నా, సిబ్బంది విధుల్లో లోపం అధికారుల్లో పర్యవేక్షణ లోపం అంతకుమించి కొరవడిన ఆచరణవాద దృక్పథం చెంచుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంవత్సరంలో 10 రోజులు కూడా పాఠశాలలో కూర్చోలేని చెంచుపిల్లలు 10వ తరగతి చదువుతున్నా కనీసం చదవడం రాయడం రాని పిల్లలు 21వ శతాబ్దపు పట్టణ సమాజపు పిల్లలతో ఎట్లా పోటీపడతారనేది కూడా ఇవాళ చెంచు వితంతు స్త్రీ ముందున్న సమస్యలు. సంశయం. ”జు నీలిబిజిశినీగి రీళిబీరిలిశిగి రిరీ శినీలి ళిదీలి శినీబిశి రిఖిలిదీశిరితీరిలిరీ లివితిబిజిరిశిగి బిరీ ఖీబిజితిలి బిదీఖి శినీతిరీ బీలిజిలిలీజీబిశిలిరీ శిజీతిలి నీతిళీబిదీరిశిగి బిదీఖి ఖిలిళీళిబీజీబిబీగి”30 అనే అభిప్రాయానికి చెంచుపెంటలు ఆమడదూరం. చెంచులకు ఆహారం ఉపాధి గురించి దిగులు లేదు. అడవి ఈ రెంటినీ తీరుస్తుంది.

ఇప్పుడు చెంచులకు కావల్సిందల్లా ఆరోగ్యం, విద్య, గౌరవం, బొట్టురాలని జీవితం. వీటిని సాహిత్యం, స్త్రీవాదం పట్టించుకోవాలి లేదంటే చెంచుజాతి మిగలదు. నల్లమలే లేకపోతే అటవీ ఉత్పత్తుల కొరతను ప్రాకృతిక విపత్తును మొత్తం సమాజం తీవ్రంగా ఎదుర్కోగలదు. ఏ సమాజంలోనైనా మార్పులకు విప్లవాలకు సాహిత్యమే దన్నుగా ఉంటుంది. చెంచుల వర్గాలకు పొంచివున్న అంతిమ ఘడియలను రూపుమాపాల్సిన బాధ్యత కూడా అభివృద్ధి చెందిన స్త్రీలది, కలాలది, మేధావులది. ఆఖరున నేను చెప్పదలుచుకున్న మాటలు జాన్‌కెర్రీ అభిప్రాయంలో ”శాంతి అంటే యుద్ధం లేకపోవడం కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరు మరింత సుస్థిరత సంపదల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసే పరిస్థితులు ఉండడం. ప్రతి పౌరుడు దేశ భవిష్యత్తుకై తన వంతు సహకారం అందించేలా సాధికారత పొందని పక్షంలో ఏ దేశము శాంతి నిర్మాణంలో విజయవంతం కాలేదు. మహిళలకు కేంద్ర పాత్రలేని ఏ శాంతిప్రక్రియ మనజాలదు”31 అని మీ ముందు పెడుతున్నాను. ఇది నల్లమల చెంచు మహిళకు కూడా వర్తిస్తుంది.

పాద సూచికలు

1. రాబర్ట్‌ బ్లాక్‌వెల్‌ : గాంధి అనంతర భారదేశం: రామచంద్ర గుహ పుట

2. జుజీతిదీఖినీబిశిరి ష్ట్రళిగి: జురిళీ రిరీ శిళి రీనీతిశి జీలితీరిదీలిజీగి రిదీ శ్రీబిళీబివీరిజీరి – ఊనీలి కరిదీఖితి 28-12-2013 చీబివీలి దీళి. 12

3. డా|| జెర్రా అప్పారావు, ఆధునిక తెలుగు సాహిత్యం – మహిళాభ్యుదయం : ఒక పరిశీలన, యోజన మాస పత్రిక మార్చి 2014 పుట 12

4. డా|| జెర్రా అప్పారావు, ఆధునిక తెలుగు సాహిత్యం – మహిళాభ్యుదయం: ఒక పరిశీలన, యోజన మాస పత్రిక మార్చి 2014 పుట 12

5. జుశినీతిజి ఊనీబిదితిజీ బిదీఖి ష్ట్రలిళీబి శ్రీబివీబిజీబిశీబిదీ, శ్రీళి నీళితిరీలి తీళిజీ గీళిళీలిదీ: ఊరిళీలిరీ ళితీ |దీఖిరిబి ఖబిజీబీనీ 8 2014 చీబివీలి 12

6. ఓళిజీలి గీళిజీఖి, ంతిశి ఉళిళిది, 16 ఈలిబీ 2013 చీబివీలి శ్రీళి.1

7. ఐతిఖినీబి ఖతిజీశినీగి, ఇళిళీలిదీరీ రీచీలిబీరిబిజి జూళీచీళిగీలిజీ, ఖబిజీబీనీ 2013 చీబివీలి శ్రీళి. 8

8. చరిజీబిదీ ఔలిఖిరి: ఈబిజీలి ఊళి ఈళి, ఆబివీలి శ్రీళి. 11

9. గవర్నర్‌ నరసింహన్‌: మహిళల భాగస్వామ్యంతో గొప్ప విజయాలు, ఈనాడు దిన పత్రిక తేది: 19-12-2012 పేజీ నెం. 9.

10. ఏఖిబిగిబిళీ ష్ట్రళిగి, ఇళిళీలిదీరీ రీచీలిబీరిబిజి, జూళీచీళిగీలిజీ, ఖబిజీబీనీ 2013 చీబివీలి దీళి.4

11. ఐనీలిరిజిబి చతిళీబిజ్ష్మీ ఇలిజిజి లీలిరిదీవీ, శినీలి కరిదీఖితి, ఐతిదీఖిబిగి ఖబిజీబీనీ 16, 2014. ఆబివీలి 10

12. స్త్రజిళిజీరిబి రీశిలిరిదీలిళీ, |దీశిలిజీఖీరిలిగీ: ఓలిళీరిదీరిరీళీ నీబిరీ లీలిలిదీ ళీబిఖిలి తీతిదీ తీళిజీ 40 గిలిబిజీరీ వీరిఖీలి రిశి బిదీళిశినీలిజీ 60 ఊరిళీలిరీ ళితీ |దీఖిరిబి అబిదీతిబిజీగి 19-2014 చీబివీలి శ్రీళి. 16

13. శివ, నల్లమలలో చెంచుల ప్రపంచం – సమీక్ష, నడుస్తున్న చరిత్ర మాస పత్రిక ఆగష్టు 2013 పుట 48.

14. వికీ పీడియా, చెంచులు వ్యాసం.

15. దాసరి సైదులు, ప్రధానాచార్యులు అచ్చంపేట: ఇంటర్వ్యూ

16. యం.డి. జహంగీర్‌ గ్రామ కార్యదర్శి, బాణాల: ఇంటర్వ్యూ

17. నిమ్మల విష్ణు సర్పంచ్‌, బాణాల: ఇంటర్వ్యూ

18. కాట్రాజు తిర్పతయ్య, కొండనాగుల, హెచ్‌.ఎం. ఆశ్రమ పాఠశాల బాణాల, ఇంటర్వ్యూ

19. బల్మూరు బక్కమ్మ రంగాపూర్‌, ఇంటర్వ్యూ

20. చందూ నాయక్‌ నమస్తే తెలంగాణ రిపోర్టర్‌, అచ్చంపేట ఇంటర్వ్యూ

21. బల్మూరు బక్కమ్మ రంగాపూర్‌, ఇంటర్వ్యూ

22. ఉడుతనూరి మాసమ్మ చౌటపల్లి ఇంటర్వ్యూ

23. దాసరి నిరంజన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌, రంగాపూర్‌ ఇంటర్వ్యూ

24. బల్మూరు బక్కమ్మ రంగాపూర్‌; ఇంటర్వ్యూ

25. దాసరి గురువయ్య చందాపూర్‌, ఇంటర్వ్యూ

26. తోకల గురవయ్య – ఆశ లేని చెంచోడు, నడుస్తున్న చరిత్ర మాస పత్రిక ఏప్రిల్‌ 2011 పుట 25

27. బల్మూరు బక్కమ్మ రంగాపూర్‌ ఇంటర్వ్యూ

28. ఙరిదీలిలిశినీబి ఖళిదిదిరిజి, ఉరితీలి రిరీ బి బీళిళీచీజిబీబిశిలిఖి ఔతిరీరిదీలిరీరీ : కగిఖిలిజీబిలీబిఖి బీనీజీళిదీరిబీజిలి ఐతిదీఖిబిగి 16 ఖబిజీబీనీ 2014 చీబివీలి దీళి. 26

29. అరిందమియమ్‌: అరిందమ్‌ చౌదరి – ద సన్డే ఇండియన్‌ జాతీయ సమాచార పత్రిక మే 3-16 2010 పుట 09

30. ఔరిదీఖితిరీ ఐ శ్రీ శ్రీబిగిలిజీ, ఖరిదీఖిరీ రీబీబిచీలి, |దీఖిరిబిదీ జూనిచీజీలిరీరీ 8/3/2014 ఆబివీలి శ్రీళి. 8

31. జూన్‌ కెర్రీ, అమెరికా విదేశాంగ మంత్రి, మహిళల తోనే సమ్మళిత శాంతి, ఆంధ్రజ్యోతి 8 మార్చి 2014 పుట 4.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.