గృహహింసనుండి మహిళలకు రక్షణ చట్టం 2005లో చట్టంగా రూపొందిన విషయం, ఆ తర్వాత 2006 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన విషయం మనకందరికి తెలుసు.
అయితే దీని వెనక మహిళా సంఘాలు, సంస్థలు స్త్రీల సమస్యలపై పనిచేసిన గత 30 సంవత్సరాల అనుభవంతోసహా, ఈ చట్టంకోసం జరిపిన 10
సంవత్సరాల ఉద్యమ పోరాట కృషి ఫలితంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఇంకా సరిగ్గా అమలు కావడం లేదు. రక్షణాధికారుల
నియమకాలు జరగలేదు. అమల్లోకి వచ్చి సంవత్సరం అయినా మన రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక సిబ్బంది నియమకంగానీ, బడ్జెట్
కేటాయింపులుగానీ జరగలేదు. ఈ చట్టం గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రచార కార్యక్రవలను చేపట్టిన దాఖలాలు దేశంలోకానీ, మన రాష్ట్రంలోగానీ కానరావు.
మన రాష్ట్రంలో మహిళా శిశు శాఖలో పనిచేసే ప్రాజెక్ట్ డైరెక్టర్లను అదనపు బాధ్యతతో రక్షణాధికారులుగా నియమించడం జరిగింది. ప్రజలకు, ముఖ్యంగా
స్త్రీలకు అసలు ఈ చట్టం గురించిన కనీస సమాచారం తెలియదు. అసలు ఇలాంటి చట్టం వచ్చిందనీ, తాము, ఎదుర్కుంటున్న రోజువారీ హింసను ఈ
చట్టం గుర్తించిందనే విషయంకూడా తెలియదు. ఈ చట్టం నేరంగా ఏమిటో రక్షణాధికారులు అంటే ఎవరెవరో ఎక్కడ వుంటారో వారికి ఫిర్యాదు ఎలా చేయలో
ఏమేమి ఉపశమనాలను, రక్షణను పొందవచ్చో అనే అంశాలపై నేటికీ చాలామంది స్త్రీలకు తెలియదు. చట్టంపై కొన్ని మహిళాసంఘాలు, సంస్థలు,
ప్రచారం జరుపుతున్నా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీడియను ఉపయెగించుకొని చేయల్సిన ప్రచారం జరపలేదు.
పరిస్థితి ఇంత దారుణంగా వుంటే ఈ దానిపై దుష్ప్రచారం మొదలైంది. ఇదంతా చట్టాన్ని అమలు చేయకుండా జరిగే దుష్ప్రచారంగా చూడాలి. ఎందుకంటే
ఇలాంటి దుర్వినియెగ సంఘటలేవీ చట్టంపై పనిచేస్తున్న సంఘాలెవ్వరి దృష్టికి రాలేదు. కనీసం ప్రభుత్వం అంటే రక్షణాధికారుల దృష్టిలో కూడా లేవు.
ఉంటే రుజువు చేయవచ్చు. అసలు పూర్తి స్థాయి వినియెగంలోకి రాని చట్టం దుర్వినియెగం అవుతుందని చెప్పడం విడ్డూరం. ఇలాంటి అపవాదులు
అన్యాయం.
ఈ చట్టం వచ్చినప్పటినుంచి చట్టంపై అవగాహనా లోపం వల్ల చట్టంలో ఏముందో స్త్రీలకు ఇది చేయగలిగే మేలు ఏమిటో అర్ధం చేసుకోకుండానే దీని మీద
వ్యతిరేక ప్రచారం చాలా ఉత్సాహంతో జరుపుతుండటం గమనించాలి. ఈ చట్టం ప్రకారం కుటుంబ హింస నుండి స్త్రీలకు ప్రాధమిక స్థాయినుంచే రక్షణ
కల్పించాలని, నివాసం, పిల్లలు అనే అంశాల్లో మానసికస్థైర్యం ఇవ్వాలనీ అర్ధరాత్రి రోడ్డున పడకుండా రక్షణ ఉపశమనాలను అందించాలనేదే ముఖ్య
ఉద్దేశ్యం కానీ ఈ చట్టానికి క్రిమినల్ పరిధి లేదు.
అయితే జనవరి 6న గౌరవనీయులైన మన మంత్రి రేణుకాచౌదరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రతినిధితో మాట్లాడుతూ, గృహహింస నిరోధక చట్టాన్ని
సమీక్ష చేస్తామనీ, పురుషుల అభిప్రాయలను సేకరిస్తామనీ, వారి అభిప్రాయలకు విలువ ఇవ్వదలిచామని ప్రకటించారు. కాని పదేళ్ళగా బిల్లు
రూపొందటానికీ అది చట్టంగా రావటానికి జరిగిన ప్రక్రియల్లో కేంద్ర స్థాయిలో మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, అన్ని రాష్ట్ర స్థాయిలలోని
సంఘాలతో చర్చలు జరిగాయి. చాలా సంఘాల్లో పురుషులు కూడా అన్ని స్థాయిలో వున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ స్థాయిలో కమిటీ, లా కమిటీ
అనేక సమావేశాలను నిర్వహించడం, విస్తృత స్థాయిలో చర్చలు, వాదోపవాదాలు, మార్పులు చేర్పులు జరిపిన తర్వాతే చట్టం రూపంలోకి ఎంతవచ్చింది.
ఇదంతా మర్చిపోయి ఎవర్నో బుజ్జగించడానికి దీనిని మళ్ళీ రివ్యూ చేయడం ఎంత అర్ధంలేని విషయమో అలోచించండి. చట్టం అమలును
సమీక్షించాలి. కేసులు ఏమవుతున్నాయో, ఇచ్చిన అర్డర్లు అమలవుతున్నాయా లేదా? అవ్వకపోతే అందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?
రూపొందించాల్సిన నిబంధనలేమిటో వాటిని అమలు చేయటానికి కావాల్సిన యంత్రాంగం ఏలా వుండాలో, రాష్ట్రాల జనాభా, స్త్రీల నిష్పత్తిని అనుసరించి
బడ్జెట్ కేటాయింపులు ఎలా వుండాలో లాంటి అంశాల్లో ప్రభుత్వం కసరత్తులు చేయలి. సమావేశాలను నిర్వహించాలి. అంతేకాని, సమీక్ష చేయల్సింది
చట్టాన్ని కాదు. స్త్రీల అంతస్థుకు సంబంధించిన గణంకాలను సేకరించాలి. అందులో విస్తృత స్థాయిలో సర్వే జరగాలి.
ఒకవైపు స్త్రీలపై హింస విపరీతంగా పెరిగిందని వివిధ స్థాయిలో గణాంకాలు తెలుపుతున్నాయి. మన రాష్ట్ర డి.జి.పి అన్ని స్థాయిల్లో హింస పెరిగిందని
ప్రకటన కూడా చేసారు. ఈ హింస ఇంటా బయటా చాలా ఆందోళనకర స్థాయిల్లో పెరుగుతోంది. వరకట్న హత్యలు, లైంగికదాడులు, ప్రేమ పేరు మీద
హత్యలు, స్త్రీలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు, పనిచేసే స్థలంలో అవమానాలు, ఆవహేళనలు, అవమానించే భాష, బెదిరింపుల అన్నీ కూడా చాలా
ఎక్కువయ్యయి. మీడియ దృష్టికి వచ్చేవి సరే. అసలు బయటికి పొక్కనివి మరెన్నో. వివిధ స్థాయిల్లో మహిళా సంఘాలను, మహిళా సంస్థలను
కుటుంబ సలహా కేంద్రాలను, గ్రామీణ పట్టణ స్థాయిల్లో కుల, మత పంచాయితీల దగ్గర నమోదయిన కుటుంబ హింస నుండి రక్షణ కోసం స్త్రీలు
ఆశ్రయించిన కేసులు, నేర పరిశోధన శాఖ సేకరించిన గణాంకాలు, దేశ వ్యాప్తంగా నమోదైన కేసులపై లెక్కలు లేవు. వాటిలో పరిశీలించిన, విచారించిన,
అమలు చేసిన కేసుల వివరాలు ప్రభుత్వ స్థాయి శాఖల్లో కూడా అందుబాటులో లేవు.
అందుకే ఈ ఫోరమ్ తరఫున మేము ఈ కింది అంశాల అమలును డిమాండ్ చేస్తున్నాం.
1. చట్టాన్ని సమీక్షించడం కాదు..చట్టం అమలు తీరుని సమీక్షించడం అవసరం.
2. ప్రజలలో చట్టంపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.
3. మండలానికో రక్షణాధికారిని నియమించాలి.
చట్టం అమలులోకి వచ్చిన పడకొండు నెలలకి బడ్జెట్ కేటాయించడం ఒక లోపం అయితే ఈ చట్టం అమలు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో నుంచి
న్యాయవాదుల చేతుల్లోకి వెళ్లడం మరో లోపం. అంతేకాదు న్యాయధికారులకు చట్టంపై ఉన్న చులకన భావం తొలగాలి.
వీటన్నింటినీ సమీక్షించడంతోపాటు..సంవత్సరకాలంలో ఏఏ జిల్లాల్లో ఎన్ని కేసులు నమోదైయ్యాయో ఎన్ని పరిష్కారం అయ్యాయో పరిశీలిస్తే అమలులో
ఉన్న లోపాలు అర్ధం అవుతాయి. ఆ వివరాలు
జిల్లా డి.వి ఆక్ట్ కింద రాజీ అయిన కేసులు డి.ఐ.ఆర్ మధ్యంతర ఉత్తర్వులు ఫైనల్ ఆర్డర్
నమోదైన కేసులు ఫైల్ చేసిన కేసులుజారీ చేసిన కేసులుపొందిన కేసులు
శ్రీకాకుళం 23 2 12 0 2
విజయనగరం 13 0 10 0 0
విశాఖపట్నం 55 0 42 0 1
తూర్పుగోదావరి 38 1 34 0 12
పశ్చిమ గోదావరి 55 3 40 0 0
కృష్ణా 409 68 65 4 18
గుంటూరు 124 20 124 0 0
నెల్లూరు 43 25 43 0 25
చిత్తూరు 35 1 16 0 3
కడప 122 0 110 2 10
కర్నూల్ 166 42 89 26 24
అనంతపూర్ 49 5 24 0 1
ప్రకాశం 72 18 72 11 9
అదిలాబాద్ 90 13 85 78 33
నిజామాబాద్ 39 5 24 38 4
కరీంనగర్ 79 24 38 4 0
ఖమ్మం 81 8 21 0 0
వరంగల్ 110 38 25 1 1
మహాబూబ్‌నగర్ 23 2 21 0 3
నల్గొండ 19 10 9 0 1
మెదక్ 34 0 34 0 5
హైద్రాబాద్ 315 45 169 17 9
రంగారెడ్డి 156 38 118 2 20
ఫోరమ్ ఫర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డి.వి. ఆక్ట్ 2005