తాళ్ళపెల్లి సంజీవ్, లింగబత్తిని మల్లయ్య, గజవాడ ప్రభాకర్
స్త్రీ ఆత్మగౌరవాన్ని ఏ సమాజం అర్థం చేసుకుంటుందో ఆ సమాజంలో సంస్కారం వికసిస్తుంది.
స్త్రీ, పురుషుల మధ్య సామాజిక జీవనంలో భేద భావాలు అంతగా వుండవు. భారతీయ సంస్కృతిలో మాతృశక్తి కల్పన ఇటువంటి దృష్టితోనే చేయబడింది.
మమత, స్నేహం, సంస్కార శీలత, బంధుత్వం, మానవీయ దృక్కోణం వంటి సుగుణాలు ఉన్న చోట స్త్రీల పట్ల గౌరవం, మర్యాద పెరిగి సంస్కార
వికసితమౌతుంది. ”పరస్త్రీ తల్లితో సమానం అనే సంస్కారం పురుషుల హృదయంతరములలో నిక్షిప్తమైనపుడు ఈ సమాజములో స్త్రీ పూజింపబడుతుంది.
అటువంటి సమాజమే సంస్కారవంతమైన సంస్కృతి కలిగి ఆదర్శంగా ఉంటుంది”. కుటుంబాన్ని చైతన్యం చేసి, సమాజాన్ని జాగృతం చేసేది స్త్రీయే. స్త్రీలలో
ఆధ్యాత్మిక భావం ఉంటే సమాజం మూడు పూలు ఆరుకాయలుగా వికసిస్తుంది. మధ్యయుగకాలంలో స్త్రీల వికాసం తగ్గిపోయింది. కౌటిల్యుని అర్థ శాస్త్రంలో
స్త్రీకి సముచిత స్థానం లేదు. మను ధర్మ శాస్త్రంలో స్త్రీకి ప్రాధాన్యత లేదు. నవనాగరిక సమాజంలో సైతం స్త్రీకి గౌరవ మర్యాదలు దక్కడం లేదు. ఉత్పత్తి
యంత్రంగా పరిగణిస్తూ నాలుగు గోడలకే పరిమితం చేయడం జరిగింది. బాల్య వివాహాలు, శిరోముండనం, బలత్కారాలు, పరిత్యజించడం,
బహుభార్యత్వం, సంతానంకనే యంత్రాలుగా చూడటం ప్రారంభమైంది. ఉద్యోగాలకు దూరంగానే ఉంచడం జరిగింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో స్త్రీలు
వంటింటికే పరిమితమైనారు. స్వతంత్ర జీవనాన్ని కోరుకునే స్త్రీని అవహేళన చేసేవారు. సఖీ, సచీవ, సమభారిణి వంటి పాత్రలను పోషించవలసిన స్త్రీని
దాస్యురాలుగా చస్తున్నారు. ఇది సమంజసం కాదు. శ్రేయస్సుకూడా కాదు. ”ఒక దేశ ప్రగతికి అత్యుత్తమ కొలబద్ద ఆ దేశ స్త్రీల పట్ల వ్యవహరించే తీరు”.
నారిత్వం యొక్క పరిపూర్ణత స్వాతంత్య్రంలోనే ఉంది. హిందూ స్త్రీలు ప్రపంచంలోని ఇతర స్త్రీల కంటే ఎక్కువ ఆధ్యాత్మిక, దైవచింతన కల్గిన వారు
అయినప్పటికి సమాజంలో చాలా చోట్ల రకరకాల హింసకు గురి అవుచున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 60 సం||లు గడిచినా, మహిళల స్ధితిగతులు మెరుగు పరిచేందుకు దశాబ్ధాల తరబడి శ్రమిస్తున్నా వీసమెత్తు ఫలితం దక్కలేదనడంలో
అతిశయెక్తి లేదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగంలో మహిళల పాత్ర పెరిగినపుడే మహిళలకు ఆర్ధిక స్వాతంత్య్రం సిద్దిస్తుంది. ఆర్ధిక స్వాతంత్య్రం మాట
అటుంచి సగటు భారత మహిళలకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ సాధికారం ఇంకా అందని ద్రాక్షే.
న్యాయమూర్తి కృష్ణయ్యర్ మాటల్లో చెప్పాలంటే మనం ఎన్ని ఉపన్యాసాలు దంచినప్పటికి, మనదేశంలో స్త్రీలకు సంబంధించిన వాస్తవ స్ధితి అమానుషంగా
ఉందనేది తిరుగులేని సత్యం. అవమానాలు భరించడం, వివక్షతకు గురికావడం అనేది నేటి స్త్రీల దయనీయ స్థితి. అయితే స్త్రీలు మేలుకొంటున్నారని,
ఆధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని చెప్పడానికి అనేక సూచనలు సాక్య్షమిస్తున్నా అనేక రంగాలలో అనేక చోట్ల రకరకాల వేధింపులు
జరుగుతున్నాయి. వీటిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించినప్పటికి ప్రభుత్వాలు స్త్రీల
సమస్యల విషయంలో అశ్రద్ద వహించడం జరుగుతనే ఉంది.
స్త్రీల కోసం బహుళ సంఖ్యలో ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. సాధారణ చట్టాల స్థానంలో అనేక సవరణలు చేస్తున్నారు. అయినప్పటకీ అనేక సమస్యలు
ఉద్భవిస్తూనే ఉన్నాయి. సమస్యల వలయంలో చుట్టుకుంటూనే ఉన్నారు. వారిపై జరుగుతున్న దాడుల సంఖ్య ఏటికి ఏడు పెరుగుతున్నదే తప్ప తగ్గడం
లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబకారణాలు, ఆర్థిక కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
స్త్రీ, పురుష నిష్పత్తి 1981లో 947 ఉంటే 2001లో 920కి తగ్గింది. అంటే సమాజంలో పురుషుల సంఖ్య పెరుగుతుంది. స్త్రీల సంఖ్య తగ్గుతుంది. స్త్రీ
మనిషిగా మనుగడ కొనసాగించేందుకు వీలు లేకుండా పోతుంది. అంటే ”స్త్రీకి స్త్రీగా జన్మించే హక్కు లేకుండా పోతుంది”.
స్త్రీ-పురుష నిష్పత్తి తగ్గుదల వల్ల మహిళలపై ఇంటా బయటా అనేక నేరాలు జరుగుతున్నాయి. వైవాహిక జీవితంలో మహిళలపై హింస కూడా ఆందోళన
కలిగించే అంశం. పోలీసు శాఖ ప్రతి సంవత్సరం 5 వేల వరకట్నపు కేసులు నమోదు చేస్తున్నది. అదనపు వరకట్న వేధింపు కేసులు సుమారు 30
వేలు నమోదవుతున్నాయి. ఇద్దరు భార్యలను కలిగి వుండటం, వివాహానంతరం భార్యను వదిలి వేయడం, విడాకులు తీసుకోవడం లాంటి సంఘటనలకు
సంబంధించిన కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు న్యాయస్థానాలలో సువరు 5 లక్షల కేసుల వరకు పెండింగులో
ఉన్నాయని గణాంక వివరాల అంచనా.
మహిళలపై జరుగుతున్న పలు అత్యాచారాలు పరిశీలిస్తే ప్రతి సంవత్సరం రమారమి 12 వేల మానభంగం కేసులు, 13 వేల అపహరణ కేసులు, 26
వేల అకృత్యాలు, 11 వేల వేధింపు కేసులు, దేశంలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదు అవుతున్నాయని అంచనా. ఇవి పోలీసు స్టేషన్లో వాస్తవంగా
నమోదు అయ్యే కేసుల వివరాలను బట్టి మాత్రమే తెలుసుంది.
కొన్ని కేసులు పోలీసు స్టేషన్లో నమోదు కావడం లేదు, సరియైన సమాచారం అందక నేరపరిశోధనలో అర్థాంతరంగా రద్దు కావడం వల్ల మహిళల సమస్యల
పట్ల సరియైన అవగాహన లేకుండా పోతుంది.
గృహహింసపై జరిగిన ఒక అధ్యయనంలో అనేక దారుణమైన అంశాలు వెలుగు చూశాయి. 2002 నుండి 2007 మధ్య ఐదేళ్ళ పాటు సెంటర్ ఫర్
సోషల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం కొనసాగింది. సుమారు 1808 మంది బాధితులు ఢిిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ సెల్
సాయం కోసం రాగా వారిని స్వచ్చంద సంస్థ స్వచేతన్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్టుల బృందం ద్వారా కౌన్సిలింగు నిర్వహించారు. ఇందులో అనేక
దిగ్భ్రాంతి గొలిపే విషయలు బయటపడ్డాయి.
* బాధిత మహిళలు గృహహింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు సగటున 4.2 సంవత్సరాలపాటు చిత్రహింసలు,
వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్నారు.
* ఈ మహిళల్లో 78% మంది తమ బంధువులు, పిల్లలు, బయటివారిముందే భర్తల నుండి మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.
* 60% మంది మహిళలకు వారి పిల్లల నుండి గృహ హింసకు వ్యతిరేకంగా మద్దతు లభిస్తోంది. 17 శాతం మంది విషయంలో పిల్లలదీ
తమ తల్లులకు మానవ కవచంగా మారి కాపాడుతున్నారు.
* భర్తలు ఇంటి నుండి గెంటేసిన సందర్భాలలో తమ తల్లిదండ్రులు ఆశ్రయం కల్పించినట్లు 23% మంది మహిళలు తెలిపారు.
* ఉత్తర భారత దేశంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గృహహింసను పోలీసులు సైతం కుటుంబ వ్యవహారంగా పరిగణిస్తున్నారు.
ఇటువంటి మహిళలను ఆదుకునే స్వచ్చంధ సంస్థలు ఇక్కడ తక్కువేనని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి తెలిపారు.
* భర్తలు వేధింపులకు వరకట్నమే ప్రధాన సమస్య అని 54% మంది బాధిత మహిళలు తెలిపారు.
* భర్తల ఒక పథకం ప్రకారం తమపై హింసకు పాల్పడుతున్నట్లు 22% మంది మహిళలు అభిప్రాయపడ్డారు.
* సాధారణంగా మహిళలపై హింస రాత్రివేళల్లోనే అధికం. రాత్రి పదిన్నర నుండి పన్నెండున్నర గంటల మధ్య ఈ ఘటనలు
జరుగుతున్నాయి.
* బాధిత మహిళలో 36% మంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నట్లు తెలిపారు.
* చెంపదెబ్బలు, చేతులతో బాదడం, చేతికందిన వస్తువులతో కొట్టడం, జుట్టుపట్టుకొని లాగడం వంటి హింసలకు 41% మంది మహిళలు
గురవుతున్నారు.
* విపరీతంగా కొట్టడం వంటి హింసలకు, బాధలకు 32% మంది మహిళలు గురవుతున్నారు.
* 22% మంది మహిళలు తాము దాదాపు చావుకు సమీపంగా పెళ్ళి బయటపడినట్టు తెలిపారు.
* వనసికపరమైన, ఉద్వేగపరమైన వేధింపులకు గురి అయిన మహిళల సంఖ్య ఐదుశాతం.
* దాదాపు 48% మంది మహిళలు తమ భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిపారు.
వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించినట్లయితే…
* ప్రపంచవ్యాప్తంగా యసిడ్ దాడులకు గురి అవుతున్న వారి సంఖ్య 5000. ఒక్క మనదేశంలో 2000.
* భారత్‌లో 29 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురి అవుతున్నది.
* దేశ వ్యాప్తంగా ప్రతి 43 నిమిషాలకు ఒక యువతి కిడ్నాప్ అవుతున్నది.
* ప్రతి 26 నిమిషాలకు ఒకరు బలత్కార యత్నానిక, తీవ్రమైన దాడికి గురి అవుతున్నారు.
* ప్రతి 93 నిమిషాలకు ఒక మహిళ హత్య చేయబడుతున్నది.
* దేశంలో నమోదయ్యే మొత్తం లైంగిక వేధింపుల కేసులు 21% ఆంధ్ర ప్రదేశ్‌లోనే.
రాష్ట్రంలో మహిళలకు రక్షణకు కరువు అవుతుంది. స్త్రీలపై అకృత్యాల కేసులు సగటున రోజుకు 57, వరకట్నపు చావులు (హత్యలు) రోజుకు కనీసం 2,
ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు మహిళలపై నేరాల కేసులు 15,315. గత సంవత్సరం ఇదే మాసానికి 12,747. ఈ తరహా కేసుల పెరుగుదల
రేటు 20.14 శాతం. వీటిలో అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, కరీంనగర్ జిల్లాలో నవెదు అవుతున్నాయి.
గత సెప్టెంబరు నెల వరకు వరకట్న హత్యలకు సంబంధించి 79 కేసులు నమోదయ్యయి. ఈ హత్యలు సైబరాబాద్ కమిషనరేటు పరిధిలో (11)
ఎక్కువగా జరిగాయి. ఆ తరువాత స్థానం మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో వరకట్న చావుల విషయంలో పరిస్థితి మరీ భయంకరంగా
ఉంది. ఇలాంటి కేసులు గత తొమ్మిది నెలల్లో ఏకంగా 473 నమోదు అయ్యయి. వీటిలో వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో ఎక్కువగా ఉన్నాయి.
అంటే వరకట్న హత్యలు, చావులు కలిపి ఇప్పటికి రాష్ట్రంలో 552 కేసులు నమోదయ్యాయి.
మహిళలపై వేధింపుల విషయనికొస్తే గత తొమ్మిది నెలల్లో 7534 కేసులు నమోదు అయ్యాయి. అంటే రోజుకు రాష్ట్రంలో 28 వేధింపుల కేసులు
నమోదవు తున్నాయి.
రేపు కేసుల విషయనికొస్తే గత సెప్టెంబర్ వరకు 810 నమోదయ్యాయి. అంటే రోజుకు కనీసం ముగ్గురు స్త్రీలు లేదా బాలికలు కామపిశాచులకు
బలవుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయనికి 739 కేసులు పోలీసుల రికార్డులకు ఎక్కాయి. అత్యాచార కేసులు మహబూబ్‌నగర్ జిల్లాలో
అత్యధికంగా 63 ఉండగా, కరీంనగర్ జిల్లాలో 61, ఖమ్మం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. పోలీసుల దాకా వెళితే పరువు పోతుందని బాధను
తమలోనే దిగమింగుకునే అభాగ్యులు ఇంకెందరో ఉన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల కేసులను నమోదవుతున్న జిల్లాల వారిగా పరిశీలిస్తే ఈ క్రింది సమాచారం తెలుస్తుంది.
జిల్లాపేరు వరకట్న అత్యా వరకట్న ఆత్యహత్యలు వేధింపులు కిడ్నాపులు
హత్యలు చారాలు మరణాలు
హైదరాబాద్ 4 31 19 35 644 29
రంగారెడ్డి 0 11 15 13 51 11
సికింద్రాబాద్ 9 30 27 31 504 27
మహబూబ్‌నగర్ 7 45 16 49 127 33
నల్గొండ 3 42 25 26 297 35
వరంగల్ 5 37 34 43 337 40
కరీంనగర్ 5 48 34 39 396 72
కర్నూలు 5 27 06 27 098 29
చిత్తూరు 0 18 17 38 246 47
గుంటూరు 1 27 18 31 295 48
పశ్చిమ గోదావరి 1 28 19 23 288 37
విశాఖపట్నం 2 21 13 13 391 25
కృష్ణ 3 31 14 25 495 42
ఈ విధంగా రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు దినదినం పెరుగుతూనే ఉన్నాయి కాని తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన
కారణం విపరీతంగా పెరుగుతున్న ఆడశిశువుల హత్యలు. దీనికి తోడు ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల మూలంగా గర్భంలో వున్న శిశువును
లింగనిర్దారణ పరీక్షల ద్వారా తెలుసుకొని ఆడశిశువులను చాలా మంది గర్భవిచ్ఛిత్తిని చేయించుకుంటున్నారు. తత్ఫలితంగా సమాజంలో స్త్రీల నిష్పత్తి
తగ్గడం మూలంగా ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
హిందూస్త్రీలు ప్రపంచంలో ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందగలరని స్వామి వివేకానంద అభిప్రాయపడితే, నేడు అందుకు విరుద్దంగా స్త్రీల పరిస్థితి
కనబడుతుంది.
ు స్త్రీ జీవన యదార్థ చిత్రీకరణ సమాజంలోని ఇతరులవలె, సాహిత్యకారులు, సినిమా, నాటక కళాకారులు, పాత్రికేయుల బాధ్యత కూడా
ఉంది.
ు స్త్రీని భోగవస్తువుగా వీరందర చిత్రీకరిస్తూనే ఉన్నారు.
ు వినోదం కోసం మహిళలు సినిమాలలో అంగాంగ ప్రదర్శనలు చేయడం, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడంను ఆధునికతగా
చిత్రీకరించడం వలన స్త్రీల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది.
ు సమాజంలో జాగృత భావాలను నిర్మించవలసిన బాధ్యత కలిగిన ప్రసార మాధ్యమాలే ఎక్కువగా బీభత్సానికి విలువల విధ్వంసానికి
ఆస్కారమిస్తున్నాయి.
ు కుటుంబ సభ్యుల సమేతంగా కలిసి సినిమాలుచూడకుండా హాని కలిగించే అంశాలు సినిమాల్లో చిత్రించడం జరుగుతున్నది.
ు అందాల పోటీలలో కనబడే దృశ్యాల వెనుక, వాణిజ్య ప్రకటనల వెనుక ఈ భోగవాదవృత్తి కనబడుతుంది. ఆ ప్రవృత్తిని పెంచటానికై
మహిళల సౌందర్యారాధన పేరుతో వాణిజ్య ప్రకటనలకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమస్యలన్నింటికి చట్టం పరిష్కారాన్ని సచించాలి. దాంతోపాటు
జాగృతమైన సావజిక శక్తి కూడా ఉద్యమించాలి.
ు ఆధునికత పేరుతో సంస్కృతికి భంగం కలిగించే అంశాలను, సినిమాలను, సీరియల్స్‌ను, స్త్రీ వేషధారణను ప్రతిఘటించవలసిన బాధ్యత
సమాజంలో ముందుగా (స్త్రీ లోకం) మహిళా లోకంపై ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ముగింపు :
సమాజంలో సగ భాగమైన స్త్రీలు ఈ దేశంలోవున్న వనరులను పదవులను సగభాగంగా ఉండే విధంగా ఆర్థిక సామాజిక, సాంఘిక, సాంస్కృతిక పరమైన
అంశాలలో స్త్రీకి సమానత్వ స్థానం కల్పించుట గురించి, హత్యలు లేని, ఆత్మహత్యలు లేని, ఆందోళనలు లేని, అలజడులు లేని, జీవితాలను గడిపే
విధంగా భావించి ప్రభుత్వాలు చొరవచపాలి తప్ప స్త్రీని ఒక ఉత్పత్తి యంత్రంగా, స్త్రీ ద్వారా సుఖాన్ని మాత్రమే ఆశించే భౌతిక కోరికలు పొందే విధంగా
చూడకూడదు.
ప్రభుత్వం మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రవలను చేపట్టడం మాత్రమే కాదు, మహిళలకు సాధికారిత కల్పించడాన్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే
అది రాబోయే తరాలపై దుష్ప్రభావం చూపుతుందన్న నిజాన్ని గుర్తెరగాలి. ఈ నిర్లక్ష్యం ప్రభావం మానవ వనరుల నాణ్యత పైన, వాటి ఉత్పాదకత పైన,
వారి వైఖరి పైన, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడులతో ఎదురయ్యే ముప్పుకు ఎదురు నిలవడం వంటి వాటి పైన కూడా వుంటుందని గ్రహించాలి.
స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా స్వయం సమృద్ధ్ది సాధించడమంటే అది స్వయం సమృద్ధ్ది గల స్వతంత్య్ర సమాజం దిశగా
ముందడుగని చెప్పుకోవాలి.
మహిళలు ప్రతిదానికి నిస్సహాయంగా తమ భర్తలపై అధికంగా ఆధారపడకుండా కుటుంబం మంచికి సంబంధించిన విషయలలో ముఖ్యమైన నిర్ణయాలను
స్వతంత్రంగా తీసుకొన్నప్పుడే వారి జీవన ప్రమాణాలు అసాధారణంగా మెరుగుపడతాయి.
మహిళలు తమ జీవన భృతిని తాము సంపాదించుకోగలిగితే అది దారిద్య్ర నిర్మూలన ఉద్యమానికి కూడా చేయూతనిస్తుంది. అయితే ఆర్థిక సాధికారిత
ద్వారా మాత్రమే మహిళ ఆకలిని జయించగలుగుతుంది.
నెను చల బధపదను. ఒక అబ్బఇ వలన నను ప్రెమ అని మొసమ చెసదు .ఎపుదు నెను అందరికి దురమ గ వుంతునౌ
ఇ అబ్బలిలని చపెయలి
ఇ అబ్బఐలను చపెయాలి