డా. మానే్పల్లి
అంతర్జాతీయంగా 1975ను – మహిళా సంవత్సరంగా పరిగణించారు. తరువాత 1975-85 మహిళా దశాబ్దం అన్నారు.
1980ల్లో తెలుగు దినపత్రికలన్నీ ఒక పూర్తి మహిళా పేజీతో ప్రకటించేవి. మూడేళ్లు దాటేసరికి ఆ పేజీలన్నీ వంటలు వార్పులు, కుట్లు-అల్లికలు,
గృహాలంకరణా – ఉద్యోగాల – ఈ స్థాయికి దిగాయి. 1985 వచ్చేసరికి మహిళామార్గం, భూమిక, మాతృక వంటి పత్రికలు రానారంభించాయి.
1975-80ల నాటికే తెలుగులో రంగనాయకమ్మగారు ఒక ప్రభంజనంలాగా స్త్రీవాద రచనలు చేస్తున్నారు. అరుణతార, ప్రజా సాహితి మొదలైన పత్రికలు
మహిళా సమస్యల మీద ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తుండేవి. క్రమంగా ఓల్గా, సత్యవతి, చంద్రలత, కుప్పిలి పద్మ వంటి రచయితలు కొండేపూడి నిర్మల,
ఘంటసాల నిర్మల, జయప్రభ, షాజహానా వంటి రచయిత్రులు బయల్దేరారు. స్త్రీవాద సాహిత్యానికి ఒక ఊపు వచ్చింది. ఇవ్వాళ స్త్రీవాదం గట్టిగా
నిలదొక్కుకుంది. ఆడపేర్లతో రాసే మగరచయిత్రులు తోకముడిచారు.
గురజాడ రచనల్లో స్త్రీవాదం అంతర్లీనంగా వుంది. చలం స్త్రీవాది అవునో కాదో గాని – స్త్రీకి లైంగిక లేదా కుటుంబ జీవితంలో స్వేచ్ఛ కావాలని గట్టిగా
వాదించాడు. ఒక జీవితకాలం కలం పోరాటం సాగించారు. తెలుగులో స్త్రీవాదానికి పునాది వేసిందాయనే. అరసం, విరసం కవుల్లో రచయితల్లో
స్త్రీవాదులు లేరు. విమల, రత్నమాల, కృష్ణాబాయి గార్లు కొంత మినహాయింపు.
సైమన్ దిబవో అనే ఫ్రెంచి రచయిత – ”సెకండ్ సెక్స్” అనే అత్యద్భుతమైన రచన చేసింది (1944-రెండు భాగాలు, ఆ తరవాత ఒకే భాగంగా ఇంగ్లీషులో
వచ్చింది – 750 పేజీల బృహద్రచన). స్త్రీవాదంలో అంతర్జాతీయ సంచలనం సృష్టించిన అరుదైన విలువయిన రచన. (దాన్ని నేను తెలుగు చేశాను
సంక్షిప్తంగా.) హెచ్‌బిటి వారు ప్రచురించారు 2000లో. అందులో కొన్ని పొరపాట్లు దొర్లాయి. సవరణలతో పునర్ముద్రణ కావలసి వుంది.
అంతర్జాతీయ రంగంలో ఫెమినిజం ఇవ్వాళ ఒక సిద్ధాంతంగా, ఒక ఆలోచనా విధానం గా స్థిరపడింది. వర్జీనియా వుల్ఫ్ ఒక గొప్ప స్త్రీవాద రచయిత్రి.
రష్యాల్లో అలెగ్జాండ్రా కొల్లంటయ్ పేరు చెప్పుకోవాలి. ఆమె రాసిన పెద్దకథ ”మూడుతరాలు” తెలుగులో వచ్చి 1990ల్లో చాలా దుమారం లేపింది.
జొహన్న బ్రెన్నర్ ప్రముఖ స్త్రీవాది. స్త్రీవాద అధ్యయన సంస్థ కోఆర్డినేటర్‌గా (పోర్ట్‌లాండ్ యూనివర్శిటీ, ఓరగా) పనిచేస్తున్నది. చిరకాలంగా
స్త్రీలహక్కులు – ముఖ్యంగా పునరుత్పత్తి రంగంలో పనిచేస్తున్నది. స్త్రీవాద సమస్యలపై, జండర్ వివక్షపై, స్త్రీల హక్కులపై – న్యలెఫ్ట్‌్ రివ్యూ, జండర్
అండ్ సొసయిటీ మొదలైన అంతర్జాతీయ పత్రికల్లో అనేక రచనలు ప్రచురించింది. ఇప్పుడు మనం ఆమె పుస్తకం – ఉమెన్ అండ్ వర్క్ గురించి
మాట్లాడుకుందాం. దీనిని న్యూయార్క్‌లోని మంత్లీ రివ్యూ ప్రెస్ ప్రచురించింది. (ఇండియాలో ఆకార్ బుక్స్, ఢిల్లీ 2006, 336 పేజీలు, 300 ర||)
ఈ పుస్తకంలో నాలుగు భాగాలున్నాయి. స్త్రీవాద భావజాల ప్రారంభం, పంతొమ్మిదవ శతాబ్ది నాటి చరిత్ర, క్రమ పరిణామం – ఈ అన్ని అంశాలనూ
సాకల్యంగా చర్చించింది జొహన్నా. ఆమె మరొక ముగ్గురు సహచరులతో కలిసి – మూడు వ్యాసాలు రాసింది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని
ఒక క్రమపద్ధతిలో వింగడించి నిర్దిష్టమైన ప్రణాళిక రపొందించుకొని – సమర్ధవంతమైన రచన సాగించింది. ఎక్కడికక్కడ తన భావాలను, స్పందనలను
వివరిస్తూ సమకాలీన చరిత్ర గమనంలోంచి ఉదాహరణలు పిస్తూ ముందు సాగింది. ఎవరైనా స్త్రీవాదం గురించి చర్చించదలిస్తే – ఇదీ మార్గం సుమా –
అన్నంత చక్కగా సాగింది ఆమె రచన.
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో బీజప్రాయంగా ప్రారంభమైన స్త్రీవాద ఉద్యమం క్రమంగా ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కాలానికి కాలూనింది. స్త్రీలకు
ఓటుహక్కు, ఉద్యోగాల్లో భాగస్వామ్యం, ఆస్తి పంపకాల్లో భాగం, కుటుంబ జీవితంలో వెసులుబాటు, సంతానంపై హక్కు, విడాకుల హక్కు, భద్రత – ఈ
మొదలైన అంశాలన్నిటిపైనా సుదీర్ఘ పోరాటం సాగింది. ముస్లిం చట్టంలో ఇద్దరు స్త్రీల సాక్ష్యం – ఒక పురుషుని సాక్ష్యంతో సమానం. పరదా,
బహుభార్యాత్వం, తలాక్ – అన్నీ సమస్యలే. ఆడదాని జీవితంలో అడుగడుగునా అడ్డంకులే, ముళ్లకంపలే. అరిటాకు వచ్చి ముల్లుమీద పడినా,
ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా నష్టం అరిటాకుకే నని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక్కడ భారతదేశంలో కూచుని మనం ఏమేవె ఊహించుకుంటాం –
పాశ్చాత్యదేశాల్లో స్త్రీల పరిస్థితి ఎంతో మెరుగుగా ఉందని భ్రమపడతాం. కాని పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుంది. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా స్త్రీల
స్థితిగతులు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే ఉద్యమాలు బలోపేతమయ్యక – పురుషస్వామ్య పెత్తందారీ విధానం కొంత వెనకడుగు వేసి వుండవచ్చు.
కాని అది చాలదు. స్త్రీలు మానవజాతి మనుగడకు మూలాధారమైన సృష్టికర్తలు. వారు ఆకాశంలో సగం. ఆస్తిలో, ఉద్యోగంలో, చదువులో, హక్కుల్లో –
అన్ని రంగాల్లో వారికి చెరిసగం భాగ స్వామ్యం ఉండాలి. చట్టసభల్లో మహిళలకు 331/3% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆవెదం పొందుతుందా
లేదా అమలవుతుందా లేదా అనే సంగతి అలా వుంచి – అసలు చర్చకు సభలో ప్రవేశించనే లేదని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అసంఘటిత రంగంలో
మగకూలీ రేటు కంటె, ఆడకూలీ రేటు తక్కువ కావడం – మన వెనకబాటుతనానికి ప్రబల నిదర్శనం. స్త్రీలపై వివక్ష తొలిగి పోవాలంటే – జరగవలసిన
పోరాటం ఎంత యినా వుంది. తుది సమరం ప్రారంభమయింది కాని – గమ్యం సుదరంగా వుంది. సమైక్య శక్తులతో త్యాగాలతో రక్త తర్పణంతో
ముందుకు సాగాలి. పురుష స్వామ్య భావజాల దౌష్ట్యానికి ముక్కుతాడు పొయ్యలి. నిరోధించి నిలబడగలగాలి.
మొదటి అధ్యాయం లైంగిక వివక్ష – చారిత్రక నేపథ్యం – ఇందులో మూడు ప్రకరణాలు – తొలి ప్రకరణం – స్త్రీలపై తరతరాలుగా జరుగుతున్న అణచివేతపై
ఒక పునరాలోచన – చర్చ – విశ్లేషణ. మైకేల్ బారెట్ అనే ఆమె రచించిన ”నేడు మహిళలపై అణచివేత పుస్తకంపై విశ్లేషణ – అందులోని వివిధ అంశాల
పరిశీలన. మహిళలపై జరిగే హింసలో కుటుంబపాత్ర – సంతాన సాఫల్యం – పునరుత్పత్తి రాజకీయలు మొదలగు అంశాల్ని వివరించింది రచయిత్రి.
జొహన్న స్వయంగా స్త్రీవాద ఉద్యమ కార్యకర్త. ప్రత్యుత్పత్తి, సావజిక భద్రత, హక్కులు మొదలగు విషయల్లో పనిచేస్త విశేషానుభవం గడించారు. ఆ
అనుభవం, మహిళాసమస్యల పట్ల గల నిబద్ధత ఆమెని ఈ పరిశీలనా గ్రంథం రాయించాయి. రెండవ ప్రకరణం – లైంగికత – రాజ్యం, మూడవ ప్రకరణం
లైంగికత అమెరికాలో కార్మికవర్గ చరిత్ర.
రెండవ అధ్యాయం – మహిళలు సాంఘిక సమస్యలు. ఇందులో మళ్లీ మూడు ప్రకరణాలు. పేదరికం, సంక్షేమం – సంస్కరణలు, మొదలగు అంశాలపై
చర్చ వుంది.
మూడవ అధ్యాయం – కుటుంబ రాజకీయలు – ఇందులో రెండు ప్రకరణాలు. సోషలిస్టు – ఫెమినిజం, ప్రజాస్వామ్యం స్త్రీవాదం ఇత్యాది చర్చ.
నాల్గవ అధ్యాయం – మహిళావాదం – వర్గరాజకీయలు – ఇందులో ప్రధానంగా అమెరికన్ పౌర సవజంలో మహిళల సమస్యల చర్చ వుంది.
చివర – ముగింపు అధ్యాయంలో వర్క్సిస్టు కోణంలో మొత్తం మహిళా సమస్యల చర్చ – విస్తృతంగా వుంది. వివిధ దేశాల్లో సమకాలీన స్థితిగతుల
నేపథ్యంలో చర్చ విశ్లేషణ విమర్శ పరిశీలన సాగుతుంది.
జొహన్న బ్రెన్నర్ – ఇరవై, ఇరవై ఒకటవ శతాబ్దాల (ప్రారంభకాలం) నాటి ఫెమినిస్టు రాజకీయల్ని, ఉద్యవల్ని, పోరాటాల్ని చర్చించి – కొన్ని కీలకమైన
అంశాల్ని పరిశీలించింది. ఈ పుస్తకంలో జొహన్న లేవనెత్తిన కొన్ని మౌలిక ప్రశ్నలకు సవధానాలు అన్వేషించవలసి వుంది. మహిళా సమస్యలపట్ల
శ్రద్ధాసక్తులు కలవారు, ఉద్యమకారులు, కార్యకర్తలు చదవవలసిన పుస్తకం. మహిళా ఉద్యవల పట్ల – శ్రామిక మహిళల కంటే, మధ్యతరగతి, ఉన్నత
తరగతి స్త్రీలే ఎక్కువ ఉపయెగాల, రాయితీల పొందారని రచయిత్రి నిరపించిన అంశాన్ని మనం కాదనలేం.
మహిళా ఉద్యమకారుల్ని, విప్లవ కారులు పట్టించుకోవడం లేదనే విమర్శ కూడా ఆలోచించవలసి వుంది. వారు వర్గపోరాటం, సాయుధ పోరాటం,
విప్లవం – మొదలగు అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యం మహిళా సమస్యలకు ఇవ్వలేదు – ఇవ్వడం లేదు అనే అంశం కూడా విస్తృతంగా చర్చించవలసి
వుంది. వర్గపోరాటంలో – మహిళాసమస్యలు ఒక భాగం అనే అంశాన్ని మహిళా ఉద్యమకారులు అంగీకరించడం లేదు. విప్లవకారుల ఎజెండాలో
మహిళా సమస్యలకు గల స్థానం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మనదేశంలో-మహాశ్వేతాదేవి, అరుంధతీరాయ్,వందనశివ, గీతా హరి హరన్ వంటి సావజిక కార్యకర్తలు, నయన్ తార సెహగల్, భారతీ ముఖర్జీ, శశిదేశ్
పాండే, నర్గీస్ దలాల్, అనితా దేశాయ్ – వంటి రచయిత్రులు ఆలోచించవలసి వుంది.
ఇవ్వాళ కమ్యూనిస్టు పోరాటంలో, ఉద్యమంలో మహిళా సమస్యలకు ప్రముఖస్థానం ఇవ్వవలసిన అవసరం వున్నదనే విషయం కూడా – లోతుగా,
విస్తృతంగా చర్చించవలసి వుంది. ఈ పుస్తకం ఆ దిశగా జరిగే ఆలోచనలకు బాగా సహకరిస్తుంది
డా. మానేపల్లి గారు,
పత్రికలు ” మహిళల సమస్యలకు ” ఇస్తున్న ప్రాధాన్యతపై “చర్చ” జరగాల్సిన అవసరమున్నది…
మీకు అభినందనలు….
> ఈ వ్యాసంపై ఒక్క మహిళ స్పందించకపోవడం శోచనీయం….
E-mail: PUTLURIR@YAHOO.COM