నిశ్శబ్దాన్ని చేధించాలి – శాంతిప్రియ

మంత్రాలకు చింతకాయలు రాలవని సామెత చెబుతారు! కాని మంత్రాల పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని వీధిపాలు చెయ్యొచ్చని మనకి కేస్‌స్టడీ చూస్తే అర్థమవుతుంది.

 ఉషది ప్రకాశం జిల్లాలో ఒక మండలం. చాలా తెలివైన పిల్ల. ఇంటర్‌ వరకు చదువుకొని పేదరికం కారణంగా చదువాపేసింది. వాళ్ళ వీధిలో ఉండే రఫీక్‌ అనే టాక్సీడ్రైవర్‌ని ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరవడంతో ఇద్దరి ఇళ్ళల్లోను సహజంగానే పెద్ద యుద్ధం జరిగింది. వీళ్ళు పెద్దవాళ్ళ మాట లెఖ్ఖ చెయ్యకుండా పెళ్ళి చేసుకొని కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నారు. రఫీక్‌ ఉషను, పిల్లల్ని ప్రేమగా చూసేవాడు. తమ స్థోమతకు మించి నారాయణ స్కూల్లో పిల్లల్ని చేర్పించాడు. అత్త, ఆడపడుచు, మరిదికి ఉష అంటే గిట్టేది కాదు. కాకుంటే ఉష వాళ్ళు పెళ్ళైనప్పటి నుండి వేరుగా వుండడంతో రోజూ వారీ చిరాకు లేకుండా వుంది. అందరు కలిసే ఫంక్షన్లప్పుడో, పండుగలప్పుడో ఉషను ఏదోఒకటి అనో, లేనిపోనివి కల్పించో, ఆమెను తప్పుపట్టే ఏ అవకాశాన్నీ వాళ్ళు వదిలేవాళ్ళు కాదు.

 అత్త ఉషతో అనవసరంగా పెద్ద గొడవ పెట్టుకుంది ”నాకు నా కొడుక్కి నువ్వు మీ అమ్మ కలిసి ఏదో మందు పెట్టారు. నాకందుకే అనారోగ్యం వచ్చింది. నాకొడుకు నా మాట వినకుండా నిన్ను పెళ్ళి చేసుకున్నాడు. నేను మంత్రగాణ్ణి తీసుకొస్తాను. అతను మీరు మందుపెట్టింది ఋజువు చేస్తాడు. ఋజువైతే నువ్వు మీ అమ్మావాళ్ళు అంతా ఈ వూరొదిలి వెళ్ళి పోవాలి! అని తిడుతూ ఒక రోజు ఆ ఊర్లో వున్న ఆమె బంధు బలగాన్నంతా పిలిచి పెద్ద పంచాయితి పెట్టింది. వొచ్చిన వాళ్ళందరూకూడా ”మీరు మందుపెట్టకపోతే ఋజువుకు నిలబడండి! భయమెందుకు ? తప్పు చెయ్యకపోతే ఋజువు చేసుకొండి ! అని చెప్పారు. బంధుబలగం లేని వాళ్ళవ టంతో వాళ్ళ అన్యాయానికి ఏడుస్తున్నారే తప్ప ఏం చేయలే పోతున్నారు.

 రేపు ఆదివారం ఇంటికి మంత్రగాడొస్తాడు అని అల్టిమేటం ఇచ్చారు. భర్త చూస్తే వాళ్ళ మాటలకు తందానతాన అంటున్నాడు. చీటికిమాటికి ఉషను తిడ్తున్నాడు. ఇన్నాళ్ళు తనపైన, తన పిల్లలపైన భర్త చూపించిన ప్రేమంతా ఎటుపోయిందో ఉషకు అర్థంకాక అయోమయంగా వుంది. మరిది శెలవులపై వచ్చి ఊర్లోనే వున్నాడు. తాగి రాత్రిపూట ఇంటిమీదకు వచ్చి ఉషతో గొడవపెట్టుకుని నువ్వు పిల్లల్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపో! మా అన్నకు బాగా కట్నం వచ్చేది. మంచి మర్యాద అన్నీ నీ వల్ల పోయాయి అని తిట్టాడు. ఉషకు ఇప్పుడిక పూర్తిగా అర్థం అయిపోయింది. అందరూ ఏకమై తన్ని వదిలించుకొని భర్తకు మళ్ళీ పెళ్ళి చేసే ఉద్దేశ్యంలో వుండే ఇదంతా చేస్తున్నారని! టి.విలో భూమిక స్త్రీలకోసం సహాయం చేస్తుందని ఇస్తున్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ చూసి ఊర్లోని స్నేహితురాలు ఉషకు ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. ఏమయినా సహాయం దొరుకుతుందేమోనని ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడికి గడ్డివాము ఆధారం దొరికినట్లు  వెంటనే మాకు కాల్‌ చేసి తన సమస్య అంతా ఏడుస్తూ చెప్పింది.

 మేం వెంటనే ఆమెకు ధైర్యం చెప్పి తనకు సహాయం చేయటానికి కొంతమంది ఆడవాళ్ళను పంపిస్తామని చెప్పాం! మహిళా సమత జిల్లా కోఆర్డినేటర్‌కి కాల్‌ చేసి ఉష ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి తన ప్రాబ్లం అంతా వివరించి మీరందరూ వెళ్ళి ఆ పంచాయితీలో ఆమె ప్రక్కన నిలబడండి. పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ దగ్గరకు మీరు వెళ్ళి  విషయం చెప్పి సహాయం తీసుకొండి! అని గైడెన్స్‌ ఇచ్చాం ! కొద్ది రోజులకు భూమికకు ఉష ఫోన్‌చేసి ధన్యవాదాలు చెప్పింది. ”ఆ అక్కావాళ్ళు (మహిళా సమత) మీరు చెప్పగానే వచ్చి నాకు అండగా నిలబడ్డారు. నాకు భలే ధైర్యం వచ్చింది. నేను గట్టిగా పోట్లాడినాను అంది”! అసలు ఆ రోజు ఏం జరిగిందో   చెప్పమంటే ఇలా చెప్పింది! ”ఆ మంత్రగాడు రెండు పొట్లాలలో రెండు రకాల పౌడర్లు తెచ్చాడు. ఒక రకం పౌడర్‌ వాళ్ళ నోట్లో వేస్తాడంట! నురగలు వస్తే నేను భోజనంలో మందు కలిపి మా అత్తకు, భర్తకు పెట్టినట్లంట! ఇంకో రకం మందు మా నోట్లో వేస్తాడంట! మా అమ్మకు, నాకు నురగలు వస్తే వాళ్ళు మాకు మందు పెట్టినట్లంట ! ఇద్దరి నోట్లోనూ ఒకే మందు గదా మేడం వెయ్యాలి. ఒక ఋజువు కోసం రెండు పొట్లాలెందుకు ! అందులోనే ఏదో మోసం వున్నట్టే కదా! అని నేను, మా ఇంటి ఓనర్‌ ఆ మంత్రగాణ్ణి బాగా తిట్టి బెదిరించాం. ముందుగానే మహిళా సమత  అక్కోళ్ళకి ఫోన్‌ చేసి పెట్టాను. వాళ్ళొచ్చి నన్ను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తోడ్కొనిపోయి కంప్లైంట్‌ ఇప్పించినారు. వాళ్ళు పోలీసు స్టేషన్‌లో పెద్ద సార్‌తో మాట్లాడినారు. ఆ సారు వెంటనే మా అత్తా, మా ఆయన, మా మరిది వాళ్ళను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే జైల్లో పెట్టిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. ఒక కాగితంపై నన్ను బాగా చూసుకుంటాం! బాధపెట్టం! ఇకపై ఇలాంటివి జరగవు! అని హామీ పత్రం రాయించుకున్నారట.

 మహిళా సమత వాళ్ళు ”ఇకపై నీకెప్పుడు సహాయం కావాల్సి వచ్చినా మాకు ఒక్క ఫోన్‌ కాల్‌ చెయ్యి మేం వస్తాం, నీ పక్కన అండగా వుంటాం” అని ధైర్యం చెప్పారట! ”ఇక నాకేం భయంలేదు” అని సంతోషంగా మా అందరికి థాంక్స్‌ చెప్పింది.   వెంటనే మేం భూమిక తరుపున మహిళా సమత వాళ్ళకు కంగ్రాట్స్‌, థాంక్స్‌ చెప్తూ మెయిల్‌ పెట్టాం.

Share
This entry was posted in రిపోర్టులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.