ఒకానొకప్పుడు తల్లికి హెచ్ఐవి వుంటే బిడ్డకి హెచ్ఐవి సోకకుండా నివారించడం అసాధ్యం అనుకునేవారు. కాని వైద్యశాస్త్ర ప్రగతితో హెచ్ఐవి తల్లినుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా నివారంచడం సాధ్యమవుతోంది.
ఇంతకుముందు హెచ్ఐవి తల్లులకి పుట్టే పిల్లల్లో నూటికి 20 నుంచి 48 మందికి హెచ్ఐవి వచ్చేది. కానీ ఇప్పుడు తగిన చికిత్సతోను, కౌన్సిలింగ్ తోను, కాన్పు సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంతోను హెచ్ఐవి తల్లులకి పుట్టే పిల్లల్లో కేవలం 2 నుంచి 8 మందికే హెచ్ఐవి సంక్రమిస్తోంది. కొన్ని ప్రసూతి కేంద్రాలలో హెచ్ఐవి తల్లులకి పుట్టే శిశువులలో వందమందిలో ఒకరిద్దరికే హెచ్ఐవి పరిమితమవుతోంది.
పిపిటిసిటి సెంటర్స్ లో తగిన కౌన్సిలింగ్ తోను, న్యూట్రిషన్ సపోర్టుతోను, ఆరోగ్య విజ్ఞానంతోను, కాన్పు జాగ్రత్తలతో హెచ్ఐవి తల్లినుండి ఆ వ్యాధి సోకకుండా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడుతున్నారు.
హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రొటక్షన్ గురించి సరైన శ్రద్ధ, అవగాహన అవసరం. అప్పుడే హెచ్ఐవి ఉన్నప్పటికీ గర్భవతి అయిన తల్లి ఆరోగ్యం బాగుంటుంది. శిశువు హెచ్ఐవి సోకని శిశువుగా జన్మిస్తుంది.
(వాసవ్య మహిళా మండలి సౌజన్యంతో)
హెచైవి వచ్చిన ఎన్ని సంవత్సరాల వరకు బిడ్డ ను కనవచ్చు
నాకు హెచైవి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది.
నేను బిడ్డ ని కనే అవకాశం ఉందా