‘నాన్నా… వెరీ సారీ!” కథ నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ప్రాబ్లమ్ చూస్తాము. కానీ పిల్లలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చెయ్యడం, పరిస్థితుల్ని కన్విన్స్ చేయడం బాగుంది మేడం. ఈ కథలో నాకు నేను కనిపించాను అమ్మ….. 🙂 -సమీర్ శర్మ (ఇ-మెయిల్)
”మట్టిలో మాణిక్యాలు”- అవును, అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. కాని ఇలా నిలదీసే వారు లేరు కదా ప్రభుత్వాన్ని. చాలా చక్కగా వ్రాసారు. -సుజ్జనే (ఇ-మెయిల్)
నవంబర్ 2014 సంచికలో తురగా జానకీరాణి గారి గురించి పి. సత్యవతిగారు రాసిన సంపాదకీయంలో కొన్ని అచ్చు తప్పులు దొర్లాయి. ముఖ్యంగా తురగా కృష్ణమోహన్ అనే వాక్యంలో ‘తురగా’ బదులు ‘తరచుగా’ అని పడింది. దీనివల్ల ఆ వాక్యం అర్థం మారిపోయింది. జరిగిన పొరపాటుకి పి.సత్యవతి గారికి, జానకీరాణి గారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియచేసుకుంటున్నాం. – ఎడిటర్
”ఏమీ చేయలేమా”- ఆపలేకపోతే అంతకంటే మరి విషాదం ఏదీ ఉండదు. బాగా అడిగారు రమాసుందరి గారూ! ధన్యవాదాలు” – కరిముల్లా (ఇ-మెయిల్)
”మ్యారీడ్ టు భూటాన్”- ప్రజలు ఏ మేరకు ఆనందంగా ఉన్నారన్న దాన్ని బట్టి జాతి ప్రగతిని బేరీజు వేస్తున్న ఏకైక దేశం భూటాన్. వేలెడంత లేని దేశం ప్రపంచ పెద్దలకే చెప్పడం వినడానికి ఆశ్చర్యంగా అనిపించింది.
-వై.పద్మజ (ఇ-మెయిల్)
”నానమ్మ ఆలోచన” కథ చాలా బాగుంది. సందేశాత్మకంగా ఉంది. – ఏ.హైమవతి (ఇ-మెయిల్)
”మాదిగ పుటుక కాదు” తలకాడు తలపులు తలలో దూరి తైతక్కలాడినాయి. – బి.వి. లక్ష్మీనారాయణ (ఇ-మెయిల్)
‘కలిసి నడుద్దాం’ కథ బాగుంది. నాగవేణికి శుభాకాంక్షలు, కొత్తవారి రచనలను ప్రచురించి ఉత్సాహపరుస్తున్నందుకు భూమిక సత్యవతి గారికి అభినందనలు. – సౌజన్య (ఇ-మెయిల్)
‘సమత నిలయం, స్వప్న రాసిన ‘రవళి – కుక్క పిల్ల’ కథ చాలా బాగుంది. పిల్లలు చక్కగా వ్రాస్తున్నారు. సృజనాత్మకంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి కథలు, కవితలు ఎన్నో రాయాలి, బాగా చదవాలని ఆశిస్తున్నాము. పిల్లలందరికీ అభినందనలు. – అంజలి (ఇ-మెయిల్)