893 సంవత్సరంలో ప్రపంచంలో మొదటిసారిగా న్యూజిలాండ్‌లో స్త్రీలకు వోటు హక్కు ఇవ్వటం జరిగింది. అంతకు ముందు ప్రపంచమంతా పురుషులకే వోటింగ్ హక్కువుండేది.
– ఈ హక్కు కోసం ఆ దేశంలో 31,872 మంది స్త్రీలు సంతకాలు చేసి, ఏడు సంవత్సరాల పాటు ఆందోళన చేసి కాటేషెప్పర్డ్ అనే మహిళా నాయకురాలు పార్లమెంటుకు సమర్పించింది.
– బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎలిజబత్ ఏట్స్ అనే మహిళ మొదటి సారిగా మేయర్‌గా ఎన్నికైంది.
….
– స్త్రీని ఉన్నత స్థితిలో ఉంచగలిగినపుడే ప్రపంచానికి ముక్తి, మోక్షం. స్త్రీ శారీరక బానిసత్వపు సంకెళ్ళను తెంచుకొని బయట పడగలిగినపుడే ఆమె నిజస్వరూపం ఏమిటో, ప్రకృతిలో ఆమెకు కలిగిన స్థానం ఏమిటో ప్రపంచానికి అవగతమవుతుంది.
అబ్బూరి ఛాయాదేవి తండ్రి మృత్యుంజయుడు పుస్తకం నుండి
సేకరణ : వి.హనుమంతరావు