కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సంస్థ 1977లో ప్రారంభమైంది. నాటి నుండి వేలాది సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రముఖ కవులను, కళాకారులను సత్కరిస్తూ వస్తున్నది. 1980లో కిన్నెర పబ్లికేషన్స్ ప్రారంభించి నేటి వరకు 100 గ్రంథాలను ప్రచురించి సాహితీ లోకానికి అందించాము. వీటిలో ‘పల్లవి’, ‘ఆధునిక కవిత-అభిప్రాయ వేదిక’, ‘శ్రీరమణమహర్షితో సంభాషణలు’, ‘తెలుగు భాషావైభవం’, ‘ఒంటరి పూలబుట్ట’, ‘మా నాన్నగారు’, ‘అమ్మ’, ‘పాడనా తెలుగుపాట’ మొదలైన విశిష్ట గ్రంథాలున్నాయి. తెలుగు జాతికి అక్షరార్చన చేస్తున్న మహామహుల వివరాలతో ఒక సంకలనం తేవాలని కిన్నెర సంకల్పించింది. కవిత్వం, కథ, నవల, నాటకం, నృత్యరూపకం, కార్టున్, వ్యాసం, విమర్శ, సినీరచన, పత్రిక సంపాదకత్వం వంటి అన్ని సారస్వత రంగాలలో కృషిచేసిన సృజనశీలుర వివరాలు అన్నీ ఒక్కచోట చేర్చి అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆశయంతో ‘తెలుగు రచయితల డైరక్టరీని’ గతంలో ప్రచురించాము. ఈ సంచికలో సుమారు 1100 మంది రచయితల వివరాలు ప్రచురించడం జరిగింది. ఇంకా చాలామంది రచయితలు, పుస్తక ప్రచురణకర్తలు డైరక్టరీలో తమ వివరాలు ప్రచురించవలసిందిగా కోరుతూ ఉత్తరాలు రాస్తున్నారు. వీరందరికోసం రెండవ ఎడిషన్ ప్రచురింప తెలపెట్టాము. కావున మీ పబ్లికేషన్స్ వివరాలను అప్లికేషన్‌లో పొందుపరచి ఫోటో జతచేసి పంపించవలసిందిగా కోరుతున్నాము. మొదటి సంచికలో తమ వివరాలు ప్రచురితమైన పక్షంలో మళ్ళీ పంపనవసరంలేదు. తెలుగు రచయితల డైరక్టరీ రెండవ సంచిక ఉగాది సందర్భంగా మార్చి 20, 2015న ఆవిష్కరిస్తున్నాము. తెలుగు రచయితల డైరక్టరీ రెండవ ఎడిషన్ ప్రచురణకోసం పైన వివరాలను తెలుపుతూ మీ పత్రికలలో ప్రచురించి మీ పాఠకులకు, రచయితలకు తెలియజేయవలసిందిగా కోరుతూ….
________________________________________________
2-2-647/153, Flat No: 101&102, Maddali Golden Nest, Central Excise Colony, Hyderabad-13
Phone : 27426666, 27425577, Cell : 9866057777. e-mail: info@kinnera.net