”ఇండియాస్ డాటర్” డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్‌తో స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు కలిసి ”Voices for Gender Justice” పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీని మీద ఒక కరపత్రాన్ని రాసి అందరికీ పంచారు.
ఆ తరువాత మార్చి 19వ తేదీన ఇందిరాపార్క్ దగ్గరి ధర్నా చౌక్‌లో ఒక పూటంతా ధర్నా చేయడం, ఆ తర్వాత అక్కడే ర్యాలీ చేయడం జరిగాయి. అనంతరం అందరూ కూర్చుని చర్చించి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్‌కి ఒక లేఖ రాయాలని నిర్ణయించారు. అందరి సంతకాలతో ఆ లేఖను పంపించడం జరిగింది.
ఇక ముందు కూడా Voices for Gender Justice వేదిక కింద భిన్నమైన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. అందరూ తరుచుగా కలవాలని, కలిసి పని చెయ్యాలని తీర్మానించారు.