ఆమెకు
సాంప్రదాయబద్ధంగా వచ్చిన అవకాశాలు లేవు.
పెద్దలు సంపాయించి పోయిన న్థిరాస్థులంతకు లేవు.
బ్రతకాలనే సాధనేచ్ఛ తప్ప!
కష్టాలూ అవమానాలూ అలల తడవై
ఈడ్చికొడుతుంటే
బాధ మనసును ఉప్పులా పేరుకు బోతుంటే
పూట గడవని స్థానే
పూటకో గడపని నమ్ముకుని
తెలివితేటల్ని అమ్ముకుని
ఒక్కో మెట్టు ఎక్కుతూ
పెద్దవాళ్ళ నీడన ఎదుగుతూ
కనిపించిన వృక్షాల్లాంటి కొడుకుల చెంత
నేద తీరాలనే కోరిక తీరమే దాటనివ్వని ప్రశ్నలతో
తుఫాను లేపుతున్నది.
నువ్వేం చేసావు? నువ్వేం పెట్టావు? ఏం మిగిల్చావంటూ
వడ్డించిన విస్తరిలా తయారుచేనిన జీవితాన్ని
అనుభవిస్తూనే- ఎంగిలిస్తరాకులా
ఈడ్చి పెంటపాలు చేనే
అధమాధములైనాయి కన్న పాశాలు!
అందునేేమో
ఈ బంధాలు పల్చనవుతున్నాయి.
ముసలి ప్రాణులిప్పుడు
ముది శాలలకు పోవడాని వువ్విళ్ళూరుతున్నాయి
కబేళాకు తరలే ఆవుల్లాగా!!!