ఆకాశంలో సగం
భూమిలో సగం
ఇచ్చేసాను తీసుకో
ఏమైతుంది?
పెత్తనమంతా నాదేగా?
ఎం.ఎల్.ఏ. వవుతావా… కా..
ఎం.పి వవుతావా.. ఓ..
మంత్రివవుతావా… న్వీట్ పంచుతాను
ఏదైతేనేం?
నీ మగన్ని నేను
నీ ముందు నేను నీ వెనుక నేను
పొలం నీపేరు నుందా
భూమి నీ పేరునుందా
రేషన్ కార్డు
ఫించన్ కార్డు
అన్నీ నీ పేరయితేనేం
పెత్తనం నాదేగా
చట్టాలు నీవే
చదువులో నాకంటే నీవే గుబాళింపు
ఊళ్లేలటమే కాదు
ఉద్యోగాలలో నీవే ముందు
కార్పొరేట్ సామ్రాజ్యం నీ చేతుల్లో.
అయితేనేం?
నేను ఇంటికి రాగానే టీ ఇవ్వాల్సిందే
రాత్రి నా తలనొప్పి
అమృతాంజనం రాయాల్సిందే
రిజర్వేషన్ నీది రాజ్యం నాది