‘జై కిసాన్‌ ఉద్యమం’ లో కలసి రండి ఆగస్టు 10, 2015… ఛలో ఢిల్లీ – రైతు స్వరాజ్య వేదిక పిలుపు

ఈ నేల మనది … ఈ పంట మనది … మన హక్కులను రక్షించుకునేందుకు
‘జై కిసాన్‌ ఉద్యమం’ లో కలసి రండి
ఆగస్టు 10, 2015… ఛలో ఢిల్లీ – రైతు స్వరాజ్య వేదిక పిలుపు
తెలంగాణా రైతన్నలారా, రైతక్కలారా, ఒక పది నిమిషాలు మన పల్లెల విషయం, నేద్యం విషయం మాట్లాడాల.
దేశమంతటా జై కిసాన్‌ పేరుతో రైతులు కదులుతున్నరు. ఢిల్లీని కదిలించనీకి పోతున్నరు. దీంట్లో చెప్పినవి మీకు నచ్చితే మీరూ పదిమందితో మాట్లాడాల. జై కిసాన్‌ ఉద్యమంలోకి రావాల. తెలంగాణా గడ్డ నుంచి రైతుల గోస వినిపించాల.
మనమంతా పోరు చేసి తెలంగాణా తెచ్చుకున్నం. సంబరాలు చేసుకున్నం. సంవత్సరం రోజులు అయిపోయినయి. ఇప్పుడు మన రైతుల బతుకులెట్ల వున్నాయి అని ఆలోచించాలి. మళ్ళా వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. పాత సర్కార్ల లాగానే ”ఇవి రైతు ఆత్మహత్యలు కాదు. పెళ్ళాంతో పోట్లాడినాడు, ఒంట్లో బాగాలేక
ఉరిపోసుకున్నడు” అని ఈ సర్కారు ూడా చెప్తున్నది. 1,030 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే, 98 మాత్రమే గుర్తించింది. ”ఆత్మహత్యలు తగ్గిపోయినయ్‌” అంటూ వుంది.
అయితే, మనకు తెలుసు పల్లెలల్లో పరిస్థితి. కరువు వచ్చినా సర్కారు గుర్తించలే. వడగండ్లు, వానలతో పంట నష్టం వచ్చినా నష్ట పరిహారం ఇవ్వలే. పంట సీజన్‌ మొదలైనా బ్యాంకులోళ్ళు అప్పులు ఇవ్వట్లే. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలే. భూమి లేనోళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తామనిరి. అది ముందుకు బోలే. తెలంగాణ సర్కారు ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ 43 శాతం పెంచింది. మరి ఎండనక, వాననక కష్టపడే రైతులకు కనీస ఆదాయం ఎందుకు గ్యారంటీ ఇయ్యూడదు?
ంద్రంలో సర్కారు ూడా రైతులను మోసం చేస్తున్నది
ప్రభుత్వం రైతుల భూములు లాక్కొనుడు మీద ముప్పై ఏండ్ల నుండి రైతులంతా పోరాడినాక 2013లో కొత్త భూనేకరణ చట్టం వచ్చింది. దానిని మోడీ సర్కారు పక్కనపెట్టి కంపెనీలకు అనుూలంగా ఆర్డినెన్స్‌ తెచ్చింది. దేశమంతా రైతులు కోపంతో వున్నారు. బీఎన్‌ లాంటి సంఘాలు, ఇతర అన్ని రైతు సంఘాలూ ూడా ఈ ఆర్డినెన్స్‌ వద్దంటున్నాయి. కానీ మోడీ సర్కారు రైతుల మాట వినక కంపెనీల మాట వింటున్నది.
ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం రైతులతో చర్చ లేకనే ప్రభుత్వం భూమి లాక్కోవచ్చు. తెలంగాణాలో ూడా 6 పారిశ్రామిక కారిడార్ల పేర్లతో పెద్ద భూ దందా మొదలైంది. వీటితో లక్షల ఎకరాలు రైతుల చేతుల నుంచి పోతయి. ఇప్పటిదాకా ‘సెజ్‌’ల పేరుతో లాక్కొన్న భూముల సంగతే పత్తా లేదు.
పత్తి మద్ధతు ధర 50 రూపాయలు మాత్రమే పెంచినరు (1 శాతం). ధాన్యం ధర 50 రూపాయలు మాత్రమే పెంచినరు (3 శాతం). రైతులకు అయ్యే ఖర్చు మీద 50 శాతం లాభం కలిపి ఇస్తామన్న బీజేపీ సర్కారు మళ్ళా మోసం చేసింది. రాష్ట్రాలలో ూడా రైతులకు బోనస్‌ ఇయ్యూడదు అని కట్టడి చేసింది.
రైతులు చేయి జాచి కాదు, పిడికిలి బిగించి అడగాలి
రైతులు గొంతెత్తి హక్కుల కోసం అడగాలి. చేయి జాచి కాదు, పిడికిలి బిగించి అడగాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ”జై కిసాన్‌ ఉద్యమం”లో పాల్గొనాలని రైతు స్వరాజ్య వేదిక పిలుస్తున్నది.
ముఖ్యంగా మనవి మూడు డిమాండ్లు :
భూనేకరణ ఆర్డినెన్స్‌ను ంద్ర సర్కారు వెంటనే వాపస్‌ తీసుకోవాలి. మన నేల మీద మన హక్కు వుండాలి. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సమగ్రమైన భూమి వినియోగ విధానం తీసుకురావాలి.
వ్యవసాయంలో రైతులకు కనీస ఆదాయం గ్యారంటీ చేసే చట్టం తేవాలి. ప్రతి రైతు కుటుంబానికి (భూమిలేని కౌలు రైతులు, వ్యవసాయ ూలీలకు ూడా) నెలకు 15,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ పే కమీషన్‌ రిపోర్టు వచ్చే ముందే రైతుల కోసం ఆదాయ కమీషన్‌ వెయ్యాలి.
ప్రకృతి బాగాలేక పంట నష్టం వచ్చినపుడు పూర్తి నష్టపరిహారం ఎకరానికి 10,000 రూపాయలు (కౌలు రైతులతో సహా) నష్టం జరిగిన మూడు నెలలలోపే అందించాలి. కరువును ూడా ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి, నష్ట పరిహారం అందించాలి.
ఈ కరపత్రంలో రైతు అని వాడుతున్నామంటే, దాని అర్థం – భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులు అని మాత్రమే కాదు. భూమిపై ఎటువంటి హక్కులు లేకపోయినా వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులు, మహిళా రైతులు, ప్రభుత్వ భూ పంపిణీ పథకాలలో భూమి పొందిన దళిత, ఆదివాసీ రైతులు, వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే వ్యవసాయ ూలీలు ూడా.
రైతు స్వరాజ్య వేదిక ఎన్నో సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలపై, అన్ని రైతు సమస్యలపై, రైతు అనుూల విధానాల కొరకు కృషి చేస్తున్నది. ఎన్నో ప్రజా సంఘాల, ఉద్యమకారులు, మేధావుల అనుబంధంతో రైతు స్వరాజ్య వేదిక ఏర్పడింది. తెలంగాణా ప్రతి జిల్లాలో రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు, అనుబంధ సంఘాలు మండల, జిల్లా స్థాయిలో పని చేస్తున్నారు. పల్లెలలో, పట్టణాలలో రైతాంగం మేలు కోరే ప్రతి ఒక్కరిని రైతు స్వరాజ్య వేదిక సభ్యులుగా ఆహ్వానిస్తున్నది.
ఈ డిమాండ్లు పెట్టి, ప్రభుత్వం కొన్ని పెద్ద కంపెనీల కోసమే పనిచేస్తదా? కోట్లాది మంది వ్యవసాయదారుల గురించి ూడా పట్టించుకుంటదా? అని ఇప్పుడే తేల్చుకుందాం.
‘జై కిసాన్‌ ఉద్యమం’ ఏమి చేస్తుంది?
ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపైన దేశమంతా వస్తున్న నిరసనను పెద్ద ఎత్తున చూపించడానికి ఒక మహా ప్రయత్నం ఈ జై కిసాన్‌ ఉద్యమం. దీనిని మొదట యోగేంద్ర యాదవ్‌ వంటి జాతీయ నాయకులు ”స్వరాజ్‌ అభియాన్‌” ప్రజాసంఘం ద్వారా మొదలు పెట్టారు. కానీ తరువాత కాలంలో దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలు, ప్రజా సంఘాలు దీనిలో భాగమయ్యాయి. తెలంగాణాలో రైతు స్వరాజ్య వేదిక, దానితో అనుబంధంగా వున్న అనేక సంఘాలు, ఇతర సంస్థలు ఈ వుద్యమంలో పాల్గొంటున్నాయి.
దీని ముఖ్య ఉద్దేశ్యం… పల్లె పల్లెలో కదలిక రావాల. రాజకీయ పార్టీల మీదనే ఆధారపడకుండా రైతులు నేరుగా వుద్యమంలోకి రావాల. పల్లెలలో యువత ఇందులో పాల్గొనాల. అట్లే, పట్టణాలలో యువత ూడా పల్లెలకి పోవాల. రైతుల కష్టసుఖాలు తెలుసుకోవాల. అన్నదాతలతో కలిసి పని చెయ్యాల. పోరాడాల.
లక్ష పల్లెల మట్టి ఢిల్లీకి :
‘జై కిసాన్‌ ఉద్యమం’ కార్యకర్తలు చేరిన ప్రతి పల్లె నుండి ఒక రైతు తన పొలంలో మట్టిని ఇచ్చి ఉద్యమానికి మద్ధతు తెలపాల. అది చిన్న కుండలో పెట్టి ఢిల్లీ తీసుకునిపోయి పార్లమెంటు ముందు ఆగస్టు 10న పెద్ద ప్రదర్శన చేస్తరు. లక్ష పల్లెల నుండి తెచ్చిన మట్టిని పార్లమెంటు ముందు పెట్టి ”ఈ నేల మాదిరో” అని కోటి గొంతుల బలంతో రైతులు సర్కారుకు హెచ్చరిక చేస్తరు.
పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా ట్రాక్టరు యాత్ర:
ఆగస్టు 1 నుండి 9 వరకు పంజాబ్‌ నుండి బయలుదేరి హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా వేలమంది రైతులు ట్రాక్టరు యాత్ర చేస్తూ ఆగస్టు 10వ తేదీకి ఢిల్లీకి చేరుతరు.
హైదరాబాదులో ఆగస్టు 7న రైతుల ప్రదర్శన :
‘జై కిసాన్‌ ఉద్యమం’లో భాగంగా తెలంగాణా జిల్లాల నుండి రైతులు, కార్యకర్తలంతా హైదరాబాద్‌ చేరి ప్రదర్శన చేస్తారు. వారిలో వీలైనంత మంది ఢిల్లీకి ప్రయాణం అవుతరు.
మనం ఏం చేయాలి?
మీ పల్లెలో రైతులంతా జై కిసాన్‌ ఉద్యమాలకు మద్ధతు తెలపండి. డిమాండ్ల పత్రం పై మీ సంతకం పెట్టండి.
మీ పల్లెలో ఒక రైతు పొలంలో మట్టిని కుండలో పెట్టి ఢిల్లీకి తీసుకురండి… వీలు కాకపోతే మా కార్యకర్తకు ఇచ్చి పంపండి.
మీ పల్లెలో కొంతమంది ఈ ఉద్యమంలో కార్యకర్తలుగా చేరండి. రైతు సమస్యలపై ఉద్యమాన్ని కలిసి నిర్మిద్దాం.
జై కిసాన్‌ ఉద్యమంలో చేరడానికి 011-46666662 నెంబర్‌కు మిస్‌కాల్‌ చెయ్యండి.
ఉద్యమంలో చేరుదాం… బలమైన గొంతును వినిపిద్దాం
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు : 9160309301. 9948897734
రైతు స్వరాజ్య వేదిక
తెలంగాణా రాష్ట్ర కమిటీ

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.