ఇంగా అనే అమ్మాయి ఒక ఊళ్ళో నివశిస్తూ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నదిగా ఉండటం వలన పేరుపెట్టాలనే ఆలోచన ఎవ్వరికి రాలేదు. ఊరు చిన్నదే అయినా అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్ని చాలా చిన్నవిగా ఉండేవి. ఇళ్ళు చిన్నవే అయినప్పటికి అన్ని సదుపాయాలతో ఉండేవి. ప్రతి ఇంట్లోను ఒక విశ్రాంతిగది, చలిమంట వేసుకోడానికి వీలుగా కుంపటి, వంటగది, బ్రెడ్ తయారు చేసుకోడానికి ఒక పొయ్యి, అనేక పడక గదులు
ఉండేవి.
ఆ ఇళ్ళల్లో నివశించే వాళ్ళంతా పొట్టి పొట్టిగా ఉండటం వల్ల వాళ్ళ ఇళ్ళు ూడా చిన్నవిగా ఉండేవి. ఇంగాతో పాటు, ఆమె తల్లి, అక్క చెల్లెళ్ళు, బంధువులు, ఇంకా ఊళ్ళో ఉండే ఆడవాళ్ళంతా పొట్టిగానే ఉండేవారు. అందు ఆ ఊరికి పేరు పెట్టాలనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు.
ఇలాంటి పేరులేని ఊళ్ళో, చిన్నచిన్న ఇళ్ళల్లో బతుకుతున్న తల్లులూ, ూతుళ్ళూ పొద్దున లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేవరూ శాండ్విచ్‌లు తయారుచేయటంలో తలమున్కలౌతూ ఉండేవారు. ప్రతిరోజూ రెండు పూటలా ప్రతి ఇంటి గుమ్మం ముందు తలుపంత పెద్దసైజు శాండ్విచ్‌లను, పెద్దపెద్ద భవనాల్లో ఉండే మగవాళ్ళకి పంపడానికి సిద్ధంగా ఉంచేవారు. వీటిని మాంసం, జున్ను, చట్నీలతోను ూరగాయలతోను తయారుచేనేవారు. ప్రతి స్త్రీ తను తయారుచేసిన శాండ్విచ్, మిగతావారు తయారు చేసిన దానికంటే రుచిగా ఉండాలని తాపత్రయ పడేది. ఈర్ష్యతోను, ఆతృతతోను పక్కింటివాళ్ళ శాండ్విచ్‌వైపు చూసేవాళ్ళు. ఈ విధంగా తయారైన శాండ్విచ్‌లను, పెద్ద పెద్ద భవనాల్లో ఉండే మగాళ్ళ కోసం తీసుళ్ళెడానికి మూడుపూటలా వ్యాన్‌లొచ్చేవి. వ్యాన్‌లు వెళ్ళిపోగానే తల్లులూ, ఆడపిల్లలూ మరలా శాండ్విచ్‌లు తయారుచేయడంలో మునిగిపోయేవారు.
ఈ పల్లెలో ఉన్న అందరిలోకి ఇంగా ఉత్సాహంగా చురుకుగా ఉండేది. తనకి తెలియని విషయాలను గురించి ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదల కలది ఇంగా. ఒకరోజు వాళ్ళమ్మ దగ్గర చేరి ”ఆ పెద్ద పెద్ద భవనాల్లో ఏం జరుగుతుంది” అని అడిగింది.
అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఇంగా తల్లి ”ఇంగా! నువ్వు చాలా విసిగిస్తున్నావు. అక్కడ ఏం జరిగితే నీందుకు? అందరిలాగా వినయ విధేయతలతో ఉంటూ, రుచికరమైన శాండ్విచ్‌లు తయారుచేయడం నేర్చుకోరాదూ?” అని కోప్పడింది.
ఇంగా కనిపించిన వాళ్ళందరిని ఇదేమాట అడిగేది. ఒక రోజు వాళ్ళ నానమ్మనడిగింది. ”అత్యవసరమైన, అతిముఖ్యమైన పనులు చేస్తారని” చెప్పింది నానమ్మ. ”అతిముఖ్యమైన ఉత్తరాలు రాసి పోన్ట్ చేస్తార”ని అత్త, ”జరగబోయే విషయాలను ముందుగా కనుక్కుంటారని, బడ్జెట్ లెక్కలు, స్టాటిస్టిక్స్ లాంటి పెద్దపెద్ద పనులు చేస్తార”ని అక్క చెప్పింది. ఇంగా అందరు చెప్పింది విన్నది గాని, ఆమె సందేహాలు తీరకపోగా అంతా అయోమయంగా అన్పించింది.
ఇలా ప్రయోజనం లేదనుకుని, శాండ్విచ్‌లు తీసుళ్ళేె వ్యాన్‌లో ఆ పెద్దపెద్ద భవనాలకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకుంది ఇంగా. మధ్యాహ్నం వ్యాన్ రాగానే, ఎవ్వరికి కనబడకుండా రెండు శాండ్విచ్‌ల మధ్య జాగ్రత్తగా ూర్చుంది. అరగంట ప్రయాణం తరువాత, వందలకొద్ది అంతస్థులున్న భవనం ముందాగింది వ్యాన్.
శాండ్విచ్‌లను వ్యాన్‌లోనుండి దించి లోపలకి చేరవేస్తున్న సమయంలో, జాగ్రత్తగా వీధిగుమ్మానికి దారితీసే మెట్లవైపు పరుగెత్తింది ఇంగా. పైకి వెళ్ళగానే ఆమెకి, ఎరుపు బంగారు రంగులున్న యూనిఫారం వేసుకున్న మనిషి ఒక పెద్ద బల్ల ముందు ూర్చుని కనిపించాడు. అతని పక్కనున్న బల్లమీద ‘సమాచారం’ అని రాసి
ఉన్న బోర్డు ఉంది.
”ఎంత బాగుంది! ఇక్కడ రాజు ూడా ఉన్నాడు. ఇక్కడేం జరుగుతుందో ఆయనని అడిగి తెలుసుకోవచ్చు” అనుకుని ఇంగా కొంచం సంకోచంగా, చిన్నగా దగ్గి
”రాజుగారూ! నన్ను క్షమించండి. నాకొక సమాచారం కావాలి.” అని అడిగింది.
ఆ పెద్దమనిషి వార్తాపత్రికలోంచి తలెత్తి చూసి ”తెలివి తక్కువ పిల్లా! నేను రాజును కాను. ఇక్కడ పనిచేసే బంట్రోతుని. నీకు ఏం కావాలి?” అని గొణిగాడు.
ఇంగా ధైర్యం తెచ్చుకుని ”ఈ పెద్ద భవనంలో తండ్రులు ఏం చేస్తారు? నాకు చెబుతావా?” అంది.
”నువ్వో మొండి పిల్లలా ఉన్నావ్! ఇక్కడి వాళ్లు దిన, వార, మాస, త్రైమాస మరియు వార్షిక పత్రికల కోసం రాస్తూంటారు” అని చెప్పి పత్రికలో తలదూర్చేసుకున్నాడు. ఇంగాకి ఏమీ అర్థం కాలేదు.
ఇంతలో పసుపు పచ్చ బూట్లు, బూడిద రంగు ప్యాంట్ వేసుకున్న ఒకాయన లోపలికి వెళ్లటం చూసి, ఆయన వెన వెళ్తూ, ”అసలు వాళ్ళు రాసేవన్నీ ఏమిటి?” అని తనను తను ప్రశ్నించుకుని మనని ఏడిపించేవి కాకుండా, మంచి మంచి కథలు రాస్తూ ఉండి
ఉండొచ్చు” అని తనకి తనే సమాధానం చెప్పుకుంది. వాళ్ళిద్దరు ఒక చిన్న గదిలోకి వెళ్ళగానే వాళ్ళ వెనక తలుపులు మూసుకొని, వాళ్ళు పైకి వెళ్ళారు. ఇంగా ఆలోచనల్లో, ఆశ్చర్యంతో చూస్తుండగానే అది 199వ అంతస్తులో ఓ గది ముందు ఆగింది. ఆ గదిలో అనేక మంది మగవాళ్ళు ఒక గుండ్రటి బల్ల చుట్టు ూర్చొని, పనిచేస్తూ, మాట్లాడుతూ ఉండటాన్ని చూసింది.
వాళ్ళేమి మాట్లాడుతున్నారో వినటానికి, ఏమి రాస్తున్నారో చూడటానికి ఇంగా ముందుగా కుర్చీ, తరువాత బల్ల మీదకి ఎక్కింది. ఆమెకి దగ్గరగా ూర్చుని ఉన్న నల్లటి మీసాలతో ఎఱ్ఱటి టై కట్టుకున్న ఒక పెద్దమనిషి ”ఇక్కడ ఏమి చేస్తున్నావు పాపా?” అని అడిగాడు. ఇంగా తను ఏవిధంగా కష్టపడి శాండ్విచెస్‌తో పాటు చేరుకుందో చెప్పబోతుంటే వినిపించుకోకుండా ”మంచి సమయానికి వచ్చావు. ఈ పెన్సిల్ చెక్కిపెట్టు” అని పెన్సిల్ ఇచ్చి ఎట్లా చెక్కాలో చెప్పాడు. ఇంగా చెక్కి ఇవ్వగానే దానిని అన్యమనస్కంగా తీసుకున్నాడు. నల్ల మీసాలాయనకి పక్కన ూర్చున్న ఇంకోకాయన ”చాలా బాగుంది” అని ”నా పెన్సిల్ ూడా చెక్కివ్వు” అని తన పెన్సిల్ ఇచ్చాడు. ఈయనకి ూడా పెద్దపెద్ద మీసాలున్నాయి. కానీ కొంచెం ఎర్రరంగులో
ఉన్నాయి. ఈ విధంగా బల్ల చుట్టూ ూర్చున్న మగవాళ్ళు ఇంగా పెన్సిళ్లు చెక్కిస్తూ ఉంటే, మాట్లాడుతూ, రాస్తూ ూర్చున్నారు. ఈ విధంగా కొంచెంసేపు పని చేసిన తరువాత, ఒక పెద్ద పళ్ళెంలో, శాండ్విచ్‌లు తీసుకురావటాన్ని ఇంగా చూసింది. బల్ల చుట్టూ ూర్చున్న మగవాళ్ళు, రాయటం, మాట్లాడటం ఆపకుండానే దానిలో ఏముందో ూడా పట్టించుకోకుండా గబగబా శాండ్విచ్‌లు మింగేస్తున్నారు.
వాళ్ళు శాండ్విచ్‌లు రుచినిపొగుడుతారని ఇంగా ఎదురుచూసింది. కానీ ఎవ్వరూ దాని గురించి ఒక్క మాట ూడా మాట్లాడలేదు. అవన్నీ మీసాల క్రింద అదృశ్యమై పోతున్నాయి. కానీ ఏమి తింటున్నారో పట్టించుకోవటం లేదు. దానికి సంబంధించి ఒక్క మాట ూడా మాట్లాడటం లేదు. అది చూసి ఆశ్చర్యంతో, నిరుత్సాహంతో ఆలోచించుకుంటూ పెన్సిల్ చెక్కటానికి వెళ్ళిపోయింది ఇంగా.
పెన్సిల్ చెక్కుతూ, ఆలోచిస్తూ ”ఇక్కడికి వచ్చి మంచి పని చేశాను. ఇప్పుడు నిజంగా నేను చాలా ముఖ్యమైన పని చేస్తున్నాను. నేను చెక్కుతున్న పెన్సిళ్ళు, దిన, వార, మాస, త్రైమాస, వార్షిక పత్రికలు రాయటానికి ఉపయోగపడుతున్నాయి. ఇంట్లో అయితే శాండ్విచ్‌లు తయారు చెయ్యటం, టీ తయారీ అన్నీ విసుగుపుట్టే పనులే” అని తనకు తనే చెప్పుకుంది ఇంగా.
రాత్రిపూట, బల్లమీద వదిలి పెట్టిన పేపర్ల మధ్య పడుకొనేది. ఉదయాన్నే మీసాల నాన్నలు రావటానికి ముందే నిద్రలేచి పెన్సిల్ చె్కమరని శుభ్రపరచి సిద్ధంగా ఉంచేది. శాండ్విచెస్ రాగానే, తను ూడా చిన్న ముక్క తిని సాధ్యమైనంత గట్టిగా ”ఎంత రుచిగా ఉందో!” అనేది. కానీ ఆమెని ఎవ్వరూ పట్టించుకొనేవారుకాదు.
ఇంగా పని చేస్తూ, వాళ్ళు మాట్లాడుకునేవి వింటూండేది.
”ఆన్ట్రేలియాకి చెందిన 20 మంది యువ శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాల రీసెర్చ్ చేసి పలుచటి కళ్ళజోళ్ళని కనుగొన్నారు”.
”ఒక యువ అథ్‌లెట్ మగతనంతో 65 సెం.మీ.ల హైజంప్ చేసి ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు.”
ఈ విధంగా మాట్లాడుకుంటూ, రాసుకుంటూ, కొంచెం సేపటికి వాళ్ళు గది బయటకు పోగానే మరికొంతమంది పెన్సిళ్లతో వచ్చేవారు. ఇంగా వాళ్ళ పెన్సిళ్ళు చెక్కుతూ మాటలు వింటూండేది.
ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకొనే విషయాలు వినీ వినీ, ఇంగాకి విసుగొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి అర్థంగాలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తించింది. అక్కడ పెద్ద ఉత్సాహకరంగా అనిపించేవి ఏమీ జరగటం లేదు. ఆమెకు విసుగు, నిరుత్సాహం కలిగాయి. అంత ఉత్తేజకరంగా లేని విషయాలు రాయటం కోసం పెన్సిళ్ళు చెక్కి, ఇచ్చే పని ూడా విసుగ్గా ఉంది. వీళ్ళెవ్వరూ తమ పల్లె గురించి ఒక్క మాటైనా రాయరేమిటి? వాళ్ళ తల్లుల గురించి కానీ, పిల్లల గురించి గానీ, వాళ్ళు పంపే శాండ్విచ్‌ల గురించి కానీ ఒక్క మాటైనా మాట్లాడకుండా రోజుకు రెండు సార్లు తిండిపోతుల్లాగా, క్రమం తప్పకుండా పరధ్యానంగా తింటూనే ఉంటారు అని తనలో తాను అనుకుంది ఇంగా.
ఒకరోజు ఇంగా బూడిద రంగు మీసాలాయన్ని ”శాండ్విచెస్ గురించి మీ పత్రికల్లో ఎందుకు రాయరు?” అని అడిగింది. దానికి అతడు ”నోర్మూసుకో! పిచ్చిపిల్లా. ఇక్కడ మేము గంభీరమైన విషయాలు చర్చించటం నీవు చూడటం లేదా? నీ శాండ్‌విచ్ కథలతో మమ్మల్ని వేధించకు. ఎవడు పట్టించుకుంటాడు శాండ్‌విచ్‌ల గురించి?” అని ఆమెపై కేలు వేశాడు. ఇంగా బిత్తరపోయింది. ”శాండ్విచెన్ గురించి ఎవరు పట్టించుకుంటారా!? అవి దొరకకపోతే, మీరేమి తింటారు?” అని అడిగింది. కానీ, బూడిద రంగు మీసాలాయన పట్టించుకోలేదు.
ఆ రోజు రాత్రి ఇంగా నిద్రపోలేక పోయింది. ”ఇక్కడ వీళ్ళు ఒక్క మగవాళ్ళ గురించే మాట్లాడతారు”. ఎవరు ఎన్ని మీటర్లు ఎత్తు ఎగిరారో, ఇంవెరో అడవి గొర్రెల్ని చంపారనో మాట్లాడుకుంటారు తప్ప రుచికరమైన శాండ్‌విచ్‌లను, జావ్‌ులు, టీ, వంటి అతి ముఖ్యమైన పనులు జరుగుతున్న నా ఊరు గురించి ఏమీ మాట్లాడరేమిటి? ఎవ్వరూ దాని గురించి చర్చించరేమిటి?
ఇలా ఆలోచిస్తూ ఇంగా మర్నాడు పొద్దుట వాళ్ళమీద కోపంతో పెన్సిల్ చె్కమరని శుభ్రపరచకుండా, పేపర్ల మధ్య మాట్లాడకుండా ూర్చుంది. 12 గంటల కొచ్చే శాండ్విచ్‌ల వాన్ కోసం ఎదురుచూసి అది రాగానే, తువాళ్ళ బుట్టలో ూర్చుని తన ఊరుకు చేరుకుంది.
ఇంటి దగ్గర ఇంగా కనిపించకపోవటంతో తల్లి చాలా కలత పడింది. ఆమె ఇంటికి వచ్చిందని తెలిసి నానమ్మ, అత్తలు, ఇంటి పక్కల వాళ్ళు అందరూ ఆనందంతో చూడటానికి వచ్చారు. వాళ్ళందరు ఒ సారి ”ఇంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా?” అని అడిగారు. ”నాన్నలుండే పెద్ద భవనానికి వెళ్ళాను. అక్కడ ఏమి చేస్తారో తెలుసుకున్నాను” అని తను అక్కడ చూసినవి, వాళ్ళు మాట్లాడే విషయాలు చెప్పటం మొదలు పెట్టింది. శాండ్విచ్‌లు అక్కడికి ఎలా చేరేది. అక్కడి మగ వాళ్ళు అవి ఎలా ఉన్నాయో ఏమాత్రం పట్టించుకోకుండా, ఎలా తింటారో చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ తమ పల్లె గురించి కొంచెం ూడా ఆలోచించటం లేదని, ఒక్క మాట ూడా మాట్లాడటం లేదని చెప్పింది. బూడిదరంగు మీసాలాయన ”ఎవరు పట్టించుకుంటారు మీ శాండ్విచ్‌ల గురించి?” అని అనటం గురించి ూడా చెప్పింది.
ఊళ్ళో వాళ్ళందరూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళుగా వచ్చి ఇంగా చెప్పేది వినేవాళ్ళు. కొత్తవాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంగా మళ్ళీ మొదలు పెట్టి చెప్పేది. పల్లెలోని ప్రతి వాళ్ళకీ ఇంగా సాహసం గురించి తెలిసిపోయింది. ఊళ్ళోని వాళ్ళందరూ ఈ విషయాన్ని గురించే చర్చించడం మొదలు పెట్టారు.
ఇంతకు ముందు ఆ ఊరి ఆడవాళ్ళు శాండ్విచ్ తయారీ గురించి తప్ప ఇంకొక మాట మాట్లాడేవారు కారు. ఇంగా చెప్పింది విన్నాక ప్రతి వారిలోను కొత్త కొత్త రుచులతో, కొత్త రకాల శాండ్విచ్‌లు తయారు చేయాలనే ఆసక్తి పోయింది. ఎంత అనాసక్తతతో ఉన్నారంటే, శాండ్విచ్‌ల మధ్య పొద్దుట, సాయంత్రం ఒ ూర పెట్టి తయారు చేస్తున్నారు. ఇలా ఇంతకు ముందెప్పుడు జరగలేదు. పక్కంటి
వాళ్ళు ఏమి చేస్తున్నారో చూడాలనే ఉత్సాహం ూడా పోయింది. ఆడవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకోవటం జరిగితే వాళ్ళు ఇంగా చెప్పిన విషయాల గురించే చర్చించుకునేవారు. సమయాన్నంతా చర్చల్లో గడిపి, అతి కొద్ది సమయంలో శాండ్విచ్‌లు చేసి పెట్టేస్తున్నారు. కొన్ని రోజుల తరువాత, శాండ్విచ్‌ల మధ్య ూర ూడా పెట్టటం మానేశారు. వీధి మూలల్లోను, పల్లె మధ్యలోను ఆడవాళ్ళంతా చిన్న చిన్న గుంపులుగా చేరి గంటల తరబడి చర్చిస్తూ విషయాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేవారు. ఇంగా తిరిగి వచ్చిన 16 రోజుల తరువాత, కొన్ని గుమ్మాల్లో శాండ్విచ్‌లు పెట్టటం ూడా మానేశారు.
ఆ క్షణం నుంచి, ఒక అసాధారణమైన, అద్భుతమైన విషయం జరిగింది. ఆ పల్లె పెద్దదిగా అవటం మొదలయ్యింది. తల్లులు, పిల్లలు, నానమ్మలు, అత్తలు, చిన్న పాపలు, ఇళ్ళు, కుర్చీలు, ఇళ్ళ చుట్టూ ఉండే కంచె, గడియారాలు, మంచాలు, పొగగొట్టాలు, ఓహ్! ఒకటేమిటి, అన్నీ మెల్లమెల్లగా పెరగటం మొదలయ్యింది. ఒకరోజు పెద్ద భవనంలోని మగవాళ్ళు కిటికీల్లోంచి ఈ విషయాన్ని గమనించారు. కొన్ని నెలల తరువాత ఆ పల్లె మిగతా పల్లెల లాగా మార్పుచెందింది. మగవాళ్ళంతా ఆశ్చర్యంతో తలమునకలయ్యారు.
”ముందుగా శాండ్విచ్ స్ట్రైక్ మొదలుపెట్టారు. తరువాత ఒక్కొక్క మెట్టుగా ఎదగటం మొదలు పెట్టారని” బూడిద రంగు మీసాలాయన, నల్ల మీసాలాయన కోపంతో పళ్ళు నూరుకున్నారు. కొద్ది కాలం తరువాత మెల్ల మెల్లగా తండ్రులు ూడా ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ పిల్లలతో ఆడుకోవటం తల్లులతోపాటు తండ్రులు ూడా పని చేయడం మొదలుపెట్టారు. ఇది ఇంగాకీ, ఆ ఊర్లో ఉన్న మిగతా పిల్లలకీ చాలా ఆనందం కలిగించింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags