మరణం అనే పదం వింటేనే నాకు ఏదో తెలియని భయం. మనకు రెండో జన్మ ఉంటుందన్న నమ్మకాన్ని నేను నమ్మను. ఆ పరమాత్ముడు మనకు జన్మనిచ్చినట్టే మరణాన్ని కూడా రాస్తాడు. కానీ ఆ మరణాన్ని పొందేలోపే చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అనుకోకుండా కలిగే మరణాలు చాలా తక్కువ. తమకు తాముగా మరణించటం అనేది నా దృష్టిలో ఎంతో పెద్ద సాహసం. అది మన లోకంలో చేసే సాహసాల కంటే చాలా గొప్పది. కానీ అది హృదయం నిండా బాధతో, దుఃఖంతో మరియు కన్నీళ్ళతో చేసేది. అది ఎంత బాధతో చేస్తారంటే తాము రాసే సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుంది. అలాంటిది సూసైడ్ నోట్ సాహిత్యంతో కూడి ఉండటం ధైర్యంవలనే రాయగలిగింది. ఆమే ర్యాగింగ్ అనే పిశాచి వలన బలైన విద్యార్థిని రిషితేశ్వరి. ఆమె నవ్వు అందమైన పువ్వు. కానీ ఆ పువ్వు నలిపివేసింది ఓ నరకలోకమైన నాగార్జున యూనివర్సిటీ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా ఇంకెన్ని జరుగుతాయి? దీనిని నిర్మూలించటం ఎలా? అనే ప్రశ్నలు నాలో పుష్పించినపుడు ఏమైనా సరే, ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ ఏదోకటి తప్పనిసరిగా చెయ్యాలి. ఆమె రాసిన ఉత్తరం చదివితే హృదయాన్ని అర్థం చేసుకుంటే ఆర్మీ సైనికులు కూడా కరిగిపోతారు. గురువులంటే తమ విద్యార్థుల యొక్క హృదయాల్ని అర్థం చేసుకోగలగాలి. కాని అలాంటి గురువులే దుర్మార్గాలని ప్రోత్సహిస్తే విద్యార్థులు ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలి? రిషితేశ్వరి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదంటే ఏం చెయ్యాలి? ఏ చర్యలు చేపట్టాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఎప్పుడొస్తుంది జవాబు. ర్యాగింగ్ వలన ఇంకెన్ని పువ్వులు రాలిపోతాయి. దీనికేంటి మార్గం? ఆడపిల్లలంటే అలుసు, ఎవరికుంటుంది వారిలాంటి మనసు, వారి జీవితాలకు ఎప్పుడుంటుంది అర్థం, వారి జీవితాలు ఎప్పుడు చేరుతాయి పరమార్థం.
ఇంకెప్పుడు దూరమౌతాయి ఆడవాళ్ళ కన్నీళ్ళు
ఎప్పుడు జీవిస్తారు ఆనందంగా వాళ్ళు
”అన్యాయంగా రాలిపోతున్న జీవితాలను వికసింపజేద్దాం”