ఈ రాత్రి నీకోసమొక దీపం వెలిగిస్తాను

– మూలం: సుజానాముర్ని, అనువాదం: సీతారాం

ఈ రాత్రి
నీకోసం ఒక దీపాన్ని వెలిగిస్తాను
అనుభూతుల్ని కలిసి పంచుకున్న మిత్రులకోసం
మమ్ముల్ని ఈపాటికే దాటిపోయిన వారి కోసం
మా కన్నా ముందే ఓ ఉదాహరణై నిలిచిన వారి కోసం
నేనో దీపాన్ని వెలిగిస్తాను
దేనికీ లొంగిపోకూడదనుకుని వారు అమరులయ్యారు
ఆ మిత్రులకోసం
వారే నేర్పిన వేదన, నిరాశ
స్పష్టంగా మాలో ఓ శక్తిగా పునరుత్థానమవుతాయని
ఆ బోధ మాకేదో నూత్నశక్తి కాగలదని
ఇప్పటిదాకా మేం గుర్తించలేకపోయినందుకు
ఓ దీపాన్ని వెలిగిస్తాను.

బహుశా
ఇది మానవ రోగ నిరోధక శక్తిని విధ్వంసం చేసే
వైరస్ సమస్య మాత్రమే అయితే
నేనెందుకు దైహిక బాధకంటే
మానసిక బాధనే అధికంగా పడతానో చెప్పు
నీ జీవితపు చివరి నిమిషాన
మృత్యువు నీ దరిచేరిన సమయాన
నీకు ఒక్క వీడ్కోలు ముద్దైనా ఇవ్వకుండా
ఎందుకు నిరోధింపబడాలో నువ్వు చెప్పు
నువ్వెంత అమానుషంగా
ఏకాకిగా నీ సమూహం చేత
చూడబడ్డావో నేనిప్పుడు చూస్తున్నాను
నా మనోనేత్రం సాక్షిగా
ఓ ప్లాస్టిక్ కాగితంలో చుట్టబడిన నీ దేహం
నువ్వు కప్పుకునే నీ మెత్తటి తెలివెన్నెల దుప్పటి
ఎగిసే మంటల్లోకి విసిరేయబడటాన్ని వీక్షిస్తున్నాను
దీనికీ వైరస్సే కారణం కదూ!

నువ్వెంతో క్షణ క్షణ అనుక్షణ వ్యధను భరించాక
నిన్ను నువ్వే తిరస్కరించుకున్నట్లు
ఆ బలమైన మంటై ప్రజ్వరిల్లడం దర్శిస్తున్నాను
మరి
నా మాటేమిటంటావా?
వీటన్నిటి ద్వారా నీకు సమీపాన్నే ఉన్నాను
విషాదం, శూన్యం నాకు తోబుట్టువులుగా
నేనూ నీకు దగ్గరలోనే వున్నాను
ఏదో సహాయం అందుతుందని
నావైపే అడుగులు వేస్తూ వస్తుందని ఆశించే వ్యవధి
లేకుండానే,
అంతా ఇలాగే జరుగుతుంది
భవిష్యత్తు గురించి ఓ రవ్వంత ఆశనేదే లేకుండా
సమస్తమూ ఇంతే జరుగుతుంది
నీకు జరిగినట్లుగానే
మరినేనా?
నేను ఆశించిందేమిటో?
రేపటికైనా
నాకు అందుతుందో లేదో ఇప్పటికీ నాకు తెలీదు.

ఈరాత్రి
ఈ దీపాన్ని నీకోసమే వెలిగిస్తాను
జీవితం, ప్రేమ నుంచి నేనిప్పటికే
పొందిన సంపూర్ణ అర్థంతో
ఈరాత్రి నీకోసమే
నేనీ దీపాన్ని వెలిగిస్తాను
నిజాయితీ మిళితమైన
ఓ మెత్తని స్పర్శ కోసం
జాతీయత, భాషా పరిమితులు లేని
ఓ మానవీయ స్పర్శ కోసం
ఈ దీపాన్ని ఈ రాత్రి నీ కోసం వెలిగిస్తాను
ఇప్పటికే నిర్విరామంగా పోరాడిన మిత్రుల కోసం
ఇంకా దృఢంగా ప్రతిఘటిస్తున్న స్నేహితుల కోసం
నీ కోసం ఈ దీపాన్ని వెలిగిస్తాను.

ఈ దీపం కాంతులీనుతుంది మిత్రమా!
రేపటి ఉదయభానుడు
మన ఆశల అల్లికతో కాంతులు చిమ్ముతాడు
మనం వినాలని ఆకాంక్షించే
ఓ మధుర గీతాన్ని మన కోసం పంపుతాడు
ప్రేమ ఎప్పటికీ అంతరించదు కనుక
ఆ నులివెచ్చని ఆప్యాయత దృఢంగా తిరిగొస్తుంది
తన కిరణాలతో భూమిని తడుపుతూ

మిత్రమా!
మనల్ని బలోపేతం చేసే ప్రేమను కౌగిలించుకో
అన్ని సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్దపడు
ప్రేమ మహత్తరమైంది కదా!
అది సదా చిరంజీవి
ఎందుకంటే జీవితం
అమూల్యం… అమోఘం… అమేయం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో