– డా. వహీదా, హైదరాబాద్
వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది. ప్రకృతి నియమాలను పాటించని కారణంగానే మనిషి దీని బారిన పడుతున్నాడు. మొట్ట మొదట ఈ వెరస్ 1981 లో అమెరికాలో ఆరోగ్యంగా వున్న హోమో సెక్సువల్ శరీరంలో కన్పడింది. ఇదే ఎయిడ్స్ ప్రారంభ సన్నివేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో 30 మిలియన్‌ల వ్యక్తులు ఎయిడ్స్ బారిన పడనుండగా, వీరిలో 90% శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారే కావడం, ఈ మహమ్మారిని ఎదుర్కొనలేని పేద దేశాలు కావడం నగ్న సత్యమన్నది మనం గుర్తించాలి.
మొదటి దశంలో ఇది మారు మూల గ్రామాల్లో ఆరంభమైనా 1981 నాటికి, నగరాల్లోని, లైంగికంగా చురుకుగా వుండే వర్గాలకు పాకింది. దక్షినాసియాలోఎ చాలా మెల్లగానే మొదలైనా ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరింది. సెక్స్ వర్కర్‌ల ద్వారా మొదట్లో వ్యాప్తి చెందినా, ప్రస్తుం వారిని దాటి మాములు మధ్య తరగతిలో వేగంగా ప్రవేశించింది. 15-50 సంవత్సరాల వయస్సు వారిలో ఇది ప్రబలంగా వుంది.
దీనిని అరికట్టాలంటే ఒకటే మార్గం. ప్రజల్ని చైతన్య పరచడం – కండోమ్‌ల ఉపయోగాన్ని గురించి ప్రచారం చేయడం, లైంగిక వ్యాధుల నివారణ, సురక్షిత శృంగారం గురించి ప్రచారం చెయ్యడం జరగాలి.
వీటన్నింటికన్నా ముఖ్యమైనది. మనిషి ప్రకృతి నియమాలకు బద్ధుడు కావడం ప్రకృతిలో ఏ ప్రాణికీ లేని ఆలోచనా శక్తి మనిషి కుంది. మంచి చెడులను నిర్ణయించుకునే విచక్షణ వున్న మనిషి, తన విశృంల జీవన శైలితో తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడంతో పాటు తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మనం మనుష్యులుగా ప్రవర్తిద్దాం. మానవాళి ఉనికికే సవాల్‌గా మారిన హెచ్ఐవి/ ఎయిడ్స్ ను పారదోలుదాం.