వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన సుజాతకు,

గతవారం నుంచీ నీ గురించే ఆలోచిస్తున్నాను. బాగా గుర్తొస్తున్నావు. ఇది వరకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలిసే వాళ్ళం. తెనాలి వెళ్ళిపోయాక దూరం పెరిగిపోయింది. నీ సమస్యల్లో నువ్వు మునిగిపోయావ్‌? ఎప్పుడన్న చిరుజల్లుల్లా నీ నవ్వును మోసుకొచ్చే ఫోన్‌ మాత్రం నీ మాటల మూటల్ని కుమ్మరించి పోతుండేది. నీకు ఉత్తరం రాస్తేనన్న ఆ వెలితి తీరుతుందనిపించి రాస్తున్నాను. ‘ప్రతిభ స్త్రీలకు స్వంతం’ అనడానికి లైవ్‌ ఎగ్జాంపుల్‌గా ఎప్పుడూ నువ్వు నాకు కన్పిస్తావు. 84′ లోనే ‘సుప్త భుజంగాలు’ అనే నవల రాసావు. అలాగే 96′ లో ‘సుజాత కథలు’, 99′ లో ‘రెప్పచాటు ఉప్పెన’, 2007లో ‘నెరుసు’ లాంటి కథలు, పుస్తకాలు రచనాశక్తికి నిదర్శనాలుగా నిలిచాయి. 2009 లో నువ్వురాసిన ‘రాతిపూలు’ నవల ఒక అద్భుతం అనుకో. అప్పుడప్పుడే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న యువతీ యువకులు వారి సరికొత్త జీవన విధానాలకు దర్పణం అది. గురజాడ ఊహించిన ఆధునిక స్త్రీవి నువ్వేనన్పిస్తుంది. ఎందుకంటే అది సకాలంలో ముద్రింపబడి వుంటే తొలి నవలగా నీదే అయ్యుండేది. ఒక కొత్త ఆధునిక జీవితాన్ని, సంఘర్షణలను చర్చించిన నవల అది. అవునూ సుజాతా! 2012 లో అనుకుంటా ’24/7 ఛానల్‌’ – అనే నవల ‘సారంగ’ వెబ్‌ మ్యాగజైన్‌లో సీరియల్‌గా వచ్చింది కదూ!

86′ నుంచే జర్నలిస్ట్‌గా నీ జీవితం మొదలైంది కదా! 86′ నుంచి 95′ వరకూ విజయవాడ ‘ఉదయం’ లో సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పనిచేశావు. ఆంధ్రజ్యోతి వీక్లీలో అసోసియేట్‌ ఎడిటర్‌గానే కాక, కొత్త పత్రికల్లో చేరి అవి నిలదొక్కుకుని, ఎదిగేంత వరకూ నీ కృషే వెనకుంది. నాకు గుర్తున్నంత వరకూ, ‘హారతి’ మాసపత్రికకు, మేనేజింగ్‌ ఎడిటర్‌గా, ‘విజేత’, ‘స్నేహ’, ‘సెల్యూట్‌’, ‘రైతు సేవ’ వంటి వాటికి ఎడిటర్‌గా పనిచేశావు. ‘కళ్యాణమస్తు.కామ్‌’ – కి కూడా కంటెంట్‌ ఎడిటర్‌గా ఉన్నట్లున్నావు. ‘సందడి.కామ్‌’కి కూడా కదూ!

ఇక, ఎలక్ట్రానిక్‌ మీడియాలోకి ఓసారి తొంగి చూస్తే నువ్వు ఎంత విస్తరించుకొనిపోయి కన్పించావో తెల్సా! ఈటివి-2 లో 2003 నుంచి 2008 వరకూ ‘సఖి’ ప్రోగ్రామ్‌ని డిజైన్‌ చేసింది నువ్వేకదా! నేను కూడా ‘పుస్తక పరిచయం’  చాలా పుస్తకాలకు చేశానప్పుడు. ఆర్థికంగా తోడ్పాటు కూడా ఉండేది ఆ రోజుల్లో. స్త్రీల కార్యక్రమాన్ని, రొటీన్‌కి భిన్నంగా స్త్రీల విలువల కోసం, వ్యక్తిత్వ నిరూపణ కోసం సుమారు 2000లకు పైగా ఎపిసోడ్స్‌ రాశావు. ఆ తర్వాత యన్‌.టి.వి.లో 2008 ఆ ప్రాంతంలో స్త్రీల ప్రోగ్రామ్స్‌ 1500లకు పైగా పనిచేశావు. హెచ్‌.ఎమ్‌.టి.వి., టి.వి.7 లో ప్రోగ్రామింగ్‌ హెడ్‌గా కూడా చేశావు. నువ్వు ఏ ఛానల్‌లో ఉన్న నీ ప్రోగ్రామ్‌ వెనక నీ సిన్సియారిటీ, ప్రతిభ, మార్క్‌ కన్పిస్తూనే ఉండేవి. ‘సిటీ కేబుల్‌’ పెట్టిన తొలి రోజుల్లో మొట్టమొదట తెలుగు కథగా నీ ‘నెచ్చెలి’ కథను ‘సువర్చలా సుందరకాండ’ పేరుతో నాటకంగా వేశారు కదా! తొలి తెలుగు కథా ప్రసారంగా లభించిన క్రెడిట్‌ నీకే దక్కింది. గుర్తొస్తే గర్వంగా ఉంటుంది నాకు. ఆలిండియా రేడియోలో, వివిధ పత్రికల్లో కథలూ, వ్యాసాలు చాలా రాశావు. వాటన్నింటినీ నువ్వు ఒకచోట పెట్టుండవు కూడా కదూ! అవునూ నాకిప్పుడే గుర్తొచ్చింది. నువ్వు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనో కథ రాసాను. ‘శరీరపు గుర్తు పొడి అక్షరాలేనా’- అనేది. అత్తింటికి వెళ్ళేటప్పుడు పేరును కోల్పోయిన ఓ స్త్రీ జీవితమది. నేను ఆ కథను ఎక్కడో పోగొట్టుకున్నాను. సుమారు 30 ఏళ్ళపాటు అటు ప్రింట్‌ మీడియాలో, ఇటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో నువ్వెంతగానో రాణించావు. ‘వనిత’ టి.వి. కోసం, ‘సినీ సందడి’, ‘అంత్యాక్షరి’, గేమ్స్‌ లాంటి 100 ఎపిసోడ్లు చేసిపెట్టావు కదా! ‘తేజ’ టి.వి.లో ‘ఫ్యూచర్‌ ఫాక్‌’ అనే సీరియల్‌కి 13 ఎపిసోడ్ల వరకూ వర్క్‌ చేశావు. దానికి చాలా పేరు వచ్చింది, విభిన్నంగా ఉందని. సీఫెల్లో ప్రొఫెసర్‌గా

ఉన్న హరిబండి లక్ష్మి గారు నీ 13 కథల్ని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు. అవి ‘ఇండియన్‌ లిటరేచర్‌’, ‘ప్రతిభ’ లోనూ వచ్చాయి. వాటిని ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌’ పేరుతో బుక్‌గా వేద్దామనుకున్న నీ కోరిక ఇంతవరకూ తీరనే లేదు. ఆర్‌. శాంతసుందరి గారు కూడా హిందీలోకి నీ కథల్ని అనువాదం చేశారు కదూ! వృత్తి ధర్మంలో భాగంగా, విద్యుల్లత, శ్యామ, గోపి, కరుణ లాంటి పెన్‌ నేమ్స్‌తో కొన్ని వేల ఆర్టికల్స్‌ రాసుంటావ్‌. సుజాతా! ఓ సారన్నావ్‌ గుర్తుందా నీకు? ‘మట్టి మారాజు’ పేరుతో మీ నాన్నపై రాసిన కథ నీకెంతో ఇష్టమని. నాక్కూడా ఇష్టమది. ఇక ‘తూకంబతుకు’ కథ ఎవరికైనా నచ్చుతుం దనుకో. ‘నిద్రపోతా సావీ’ అనే నీ కథ నీడలా నన్ను చాన్నాళ్ళు వెంటాడింది. నీ రచనలన్నీ నిశ్చల జీవితాల్లో ఆలోచనల వలయాల్ని రేపుతాయి. వాస్తవాల్ని చెబ్తుంటాయి. ఒకచోట నిలువ నీవు. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఉద్వేగ పరుస్తాయి. ఇక నీకొచ్చిన అవార్డులు అతి తక్కువ. 2001లో అనుకుంటా! ‘రెప్పపాటు ఉప్పెన’కు మధురాంతకం రాజారాం – ‘కథాకోకిల’ అవార్డ్‌, 2006లో విశిష్ట మహిళా పురస్కారం, 2008 లో జర్నలిస్ట్‌ ప్రతిభా పురస్కారం, 2013లో

ఉత్తమ రచయిత్రిగా తె.యు. కీర్తి పురస్కారం, 2014లో పరుచూరి రాజారాం స్మారక అవార్డ్‌ వచ్చాయి కదూ! ఎప్పటికీ ఇలా నిలిచిపోవాలనే నా కోరిక. నిన్ను చూడాలని వుంది నిజంగా. తొందర్లోనే కలవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘భూమిక’ ఈ సంవత్సరం పెట్టిన పోటీల సభ బాగా జరిగింది. ఈసారి కవిత్వంలో మొదటి బహుమతి వారణాసి నాగలక్ష్మికి, కథలో శాంతి ప్రబోదకి వచ్చాయి. ఇక, ఉండనా మరి.

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో