వర్తమానలేఖ – శిలాలోలిత

పియాతిప్రియమైన గంగ గార్కి, ఎలా ఉన్నారు? నిన్న (జనవరి, 20) మిమ్మల్ని చూసి సంతోషంగా అన్పించింది. ‘సుశీలా నారాయణరెడ్డి’ పేరిట గత ముప్పై రెండేళ్ళుగా స్త్రీలకు అవార్డులివ్వడం చేస్తున్నారు. ఈసారి వీరలక్ష్మి అక్కకు ఇవ్వడం చాలా బాగా అన్పించింది. రచయిత్రులు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఇవ్వాలి అని పెట్టుకోవడం వల్ల గుర్తింపుకు రాని అనేకమందికి మీ ద్వారా సాహిత్య గౌరవం దక్కుతోంది. కొంత కొంత మందిని చూస్తే, చూసిన తొలిక్షణాల్లోనే జన్మాంతర సంబంధమేదో ఉన్నట్టుగా ఒక ఆత్మీయత కలుగుతుంది. యాకూబ్‌ మిమ్మల్ని తొలిసారిగా పరిచయం చేసినప్పుడే నాకదే భావన కలిగింది. మీ చిరునవ్వులో స్నేహ సుమం కన్పించింది. అప్పట్నించి ఇప్పటి దాకా మీపట్ల అభిమానం పెరిగిందే కానీ, తరగలేదు.

బాల్యంలో నేను కవిత్వం మొనలు పెట్టిన రోజుల్లోనే, సినారె గారి కవిత్వం రేడియోలో విని అలా రాయడానికి ప్రయత్నించేదాన్ని. అందరూ ఉగాది కబుర్లు చెప్పుకుంటుంటే, రేడియో ముందు కూర్చుని కవిత్వం వినడం ప్రత్యేకతగా అనుకొనేదాన్ని. ఆయన పెద్ద కూతురు మీరని తెలియగానే, ఒక గాఢానుభూతి కలిగి, పరిచయం మరింతగా పెరిగింది. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని నదుల పేర్లను తన కూతుళ్ళకు పెట్టిన సాహిత్య సముద్రుడు ఆయన. పేరుకు తగ్గ వ్యక్తి మీరు. గంగలా నెమ్మదిగా ప్రవహించడమేకాక, గంభీరంగా వుండకలరు. అదే సమయంలో కెరటాల హోరుతో చిరునవ్వుల సందడినీ ప్రోది చేయగలరు. విస్తృతంగా  చదివే మీ అలవాటువల్ల సాహిత్యంలో ఒక భాగమై పోయారు. ఏడేళ్ళకే తల్లిని కోల్పోయిన మీరు, మీకు తెలియకుండానే, మీలో అంతర్గతంగా ఉన్న పరిపాలనా దక్షతవల్ల, ఇంటిని భుజాలకెత్తుకున్నారు. అప్పట్నించి ఇప్పటిదాకా, భుజాలు మార్చుకుంటున్నారే తప్ప, ఎత్తిన బరువులు దించలేదు. సినారె గారి పట్ల మీకున్న అపారమైన ప్రేమ ఆయనకు మిమ్మల్ని తల్లిని చేసింది. అన్నీ మీరై, అందరూ మీరై ఆయనకు బాసటగా నిలిచారు. చాలా తక్కువ మందిలోనే ఈ క్వాలిటీ ఉంటుంది. భారతదేశమంటేనే ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లు. మన సంస్కృతి అది. వ్యష్టి కుటుంబాలు ఎక్కువైపోయి, సమిష్టి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ స్థితిలో, ఒక రోల్‌ మోడల్‌గా మీ కుటుంబం అందరికీ కన్పిస్తోంది. వ్యక్తుల మధ్య బాంధవ్యాల లతలు ఎలా అల్లుకు పోతాయో తెలుస్తోంది. నలుగురు కూతుళ్ళు, వారి కుటుంబాలన్నీ ఒక్క దగ్గరే కలిసి మెలిసి ఉండటం ఎంతో ముచ్చట గొలిపే అంశం. ఏకత్వంలో భిన్నత్వం. ఎవరికి వారి వ్యక్తిగత స్వేచ్ఛను మిగిలిస్తూనే అందర్నీ ఒప్పించే, మెప్పించే, మీ కృషి, శ్రమ, నాకెప్పటికీ ఆనందాన్ని కల్గించే విషయం. మీ గురించి ఇలా రాయడం మీకిష్టముండదని తెలుసు. ఐనా నాకు మీరంటే ఎంత స్నేహమో చెప్పడానికి ఈ అక్షరాలే వారధి కదా!

నారాయణరెడ్డి గారి సాహిత్య ప్రస్థానమంతా ఒక పూలగుత్తి అనుకుంటే, అందులోని అంతస్సూత్రమైన దారం మీరు. ఆ పూలపరిమళం దారాన్ని అంటుకొనే

ఉంటుంది. కాబట్టి నా లెక్కప్రకారం మీరు ఖచ్చితంగా రాస్తారు. డైరీల్లో దాచుకొనే

ఉండుంటారు. నిజం చెప్పండి. నాకోసారి ఆ అక్షరాల్ని చూపించరూ! ఎందుకంటే నన్నయకు నారాయణభట్టు సహకరించి నట్లుగా, మీరు రచనలన్నింటినీ రాస్తూ, ఫెయిర్‌ చేస్తూ పోయారు. పదో ఏట నుంచే ఫైనాన్సియల్‌ విషయాలన్నీ డీల్‌ చేయాల్సిన అవసరం ఏర్పడడంతో అలవాటు పోయిం దన్నారు. ఈ రోజుకీ డబ్బుల విషయాలు నాన్నకి ఇష్టం లేదు, పట్టించుకోరు అన్నారు. చూసుకొనే మీరున్నారు కాబట్టి ఆయనకు నిశ్చింత దొరికింది. క్లాసికల్‌ టచ్‌ వున్న పాటలు మీకిష్టం కదా! ఏకవీర, గులేబకావళి కథ పాటల్ని ఇప్పటికీ ప్రేమిస్తారు కదా! బాల మురళీకృష్ణ పాటలు విన్నప్పుడల్లా తృటిలో నాక్కూడా మీరు గుర్తొస్తారు. కరీంనగర్‌ హనుమాజీపేటలో పుట్టి, హైదరాబాద్‌లో జీవిస్తున్న మీరు పుస్తక ప్రియులు కాకుండా ఎలా ఉంటారు? శరత్‌, చలం, కొ.కు., గోపీచంద్‌ ఉప్పల, ఓల్గా, ఇలా ఏకోభిరుచున్న మనం దగ్గరయ్యాం. ఓల్గా మీరూ రాసుకున్న ఉత్తరాల్లో స్నేహం వికసించడమే కాకుండా సాహిత్యాంశాలు అనేకం దొర్లుతుండేవి. మీ ఇండివిడ్యువాలిటీ వల్లనే ఇంటిపేరు మార్చుకోను అని అనుకున్నారు. కుటుంబా నికే ప్రయారిటీని ఎక్కువగా ఇస్తూ, నాన్నంటే ఉన్న అవ్యాజమైన ప్రేమే మిమ్మల్ని నడిపిస్తోంది. సుశీలగారన్నా మీకు చాలా ఇష్టం కదా! అమ్మను తలుచుకున్నప్పుడల్లా, చక్కని పోలికలతో, పొడవైన నొక్కులు నొక్కుల జుట్టుతో, స్వాభిమానం ఎక్కువైన, అభిమానవంతురాలైన అమ్మను తల్చుకో గానే, మీరు వద్దంటున్నా వినకుండా ‘నీటిపొర’ కంటిలో వచ్చి కూర్చుంటుంది. ప్రకృతి మీకు ప్రాణం, పెయింటింగ్స్‌ చాలా ఇష్టం. బెంగాలీ, మళయాళీ సినిమాలిష్టం. స్నేహితులిష్టం. స్నేహం చెయ్యడం ఇష్టం. వీలు ఏమాత్రం దొరికినా, ఫోన్లలోనయినా సాహిత్య విషయాలు మాట్లాడుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తారు. స్త్రీలకు పుస్తకాలు ప్రచురించుకోవడానికి ఆర్థికంగా సహాయం చెయ్యడం కూడా ఎంతో విలువైన విషయం కదూ! మీతో నాకున్న అనుబంధం, స్నేహం, నన్నెంతో ఆహ్లాదపరిచే విషయం. మీకున్నంత సహనం, ఓపిక, పరిపాలనా దక్షత నాకస్సలు లేవు. అందుక్కూడా మీరంటే గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇలాగైనా కాస్త తీరిగ్గా మాట్లాడుకోగలి గినందుకు సంతోషిస్తూ మీ నుంచి ఒక ఫోనో, ఉత్తరం కోసమో ఎదురుచూస్తూ…

మీ          – శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో