కొడవలెత్తిన ప్రశ్న కొదురుపాక రాజవ్వ – జూపాక సుభద్ర

కొదురుపాక రాజవ్వంటే కొంగు నడుముకు సుట్టి కొడవండ్లెత్తిన ఒక పోరాటం, 1977 నుంచి జరిగిన సిరిసిల్లా జగిత్యాల పోరుబిడ్డ, ఒక మెట్టి వ్యతిరేక పోరాటం, దొరల గడీల మీద ఒక దండయాత్ర. బతుకే పోరాటమైన జీవితాలు, పోలీసు క్యాంపులు, కల్లోలిత ప్రకటనలు, వూల్లిడిసిపెట్టి కుటుంబాలకు కుటుంబాలే అడవులు గుట్టలుబట్టి చెట్టుకొకరు పుట్టకొకరైన ‘సంగం’ చరిత్ర రాజవ్వది. దొరలు పోలీసుల నిర్బంధాలు, జైళ్ళు, కేసులు, ఎన్‌కౌంటర్లు, అత్యాచారాలు, చావైనా రేవైనా పోరాటంలోనే తేల్చుకోవాలనే చైతన్యాలు మొత్తంగా… సిరిసిల్లా జగిత్యాల పోరాటాల చరిత్రంతా తెల్లగిచ్చే గునపము కొదురుపాక రాజవ్వ చరిత్ర.

జాతీయోద్యమ ఫలితాలే కాదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల్లో భూమి పంపక విజయాలు  రాజవ్వకు చేరలేదు. యీ ఉద్యమం పంచిన పది లక్షల ఎకరాలు అణగారిన కులాలకు చెందిన దాఖలాలు లేవు. తర్వాత వచ్చిన తొలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, నక్సల్బరి పోరాటాలు, ఎమర్జెన్సీ తర్వాత అణగారిన కింది కులాలు ఆధిపత్య కులాలమీద భూస్వామ్య ఫ్యూడలిజమ్మీద పోరాడినయి. నిజానికి సిరిసిల్లా జగిత్యాల పోరాటాలు కమ్యూనిస్టులు చెపుతున్నట్లు వర్గ పోరాటాలు కాదు అగ్రకులాల మీద బహుజన కులాలు చేసిన పోరాటంగా చెప్పాలి. భారతదేశంలో జరిగినవన్నీ కులపోరాటాలే. కులం కారణంగానే ఆర్థిక వ్యత్యాసాలేర్ప డినయి. పురాణాలు, ఇతిహాసాల్లో జరిగిన ఘర్షణలు అన్నీ కుల పోరాటాల చరిత్రలు, కులజెండర్‌ చరిత్రలు.

సిరిసిల్లా  రైతు కూలీలు, జగిత్యాల రైతు కూలీలంతా, వెట్టి కూలీలంతా వృత్తి కులాల ఆడ మగవాల్లే. ఆ పోరాటాల్లో, పల్లె పల్లెలు పెనుబల్లేలైన చరిత్రలు, పాముల్ని తరిమిన చీమల సాహసాలు. ఈ ఉద్యమ ములో కొదురుపాక రాజవ్వ మహిళా సంగం కార్యకర్త. అధ్యక్షులుగా చాలా పల్లెల్ల బహుజన కులాల మహిళల్ని కూడగట్టి, మగనాయకుల కన్నా దొర గుండెల్లో గునపా లు దించే కార్యక్రమాలు చేస్తూ విస్తరించింది. ఆ పోరాటాన్ని, చైతన్యాల్ని అణచివేయడానికి మహిళా సంగం అధ్యక్షురాలైన ఒక వెట్టి మాదిగ దానికి, మా గొడ్ల కొట్టాలల్ల మా గొడ్ల రొచ్చెత్తి పోసేదానికి యింత పొగరా… అని ఆమెని దొర గుండాలు సామూహిక లైంగిక దాడికి గురి చేసిండ్రు. తర్వాత

ఉద్యమకారుల మీద తీవ్ర నిర్బంధం ప్రయో గించి అగ్ర కులాలమీద జరిగిన పోరాటాన్ని పోలీసు క్యాంపులతో, కల్లోలిత ప్రాంతాలుగా అణచివేసిండ్రు. ఏ ఉద్యమాల్లో అయినా అత్యాచారాలకు గురయింది ఎక్కువగా దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు ఇంకా బహుజన కులాల మహిళలే కనిపిస్తుంటరు. పాలకుర్తి ఐలమ్మ బిడ్డ నర్సవ్వ నుంచి కొదురుపాక రాజవ్వ, వాకపల్లి మహిళలు, సోనీ సోరి లాంటి ఇంకా ఎందరో మహిళలు.

ఈ పుండ్లన్ని సలుపుతుంటే.. 2013లో అప్పుడు తెలంగాణ ఉద్యమం జోరుగ నడుస్తుండిన కాలం.. చరిత్రలు మట్టిపొరల్లో మగ్గుతున్న దళిత, ఆదివాసీ మహిళల నుంచి వినాలి అనే ఆలోచనతో… సిరిసిల్లాలో పోరాట యోధురాలు, బాధితురాలు కొదురుపాక రాజవ్వతో… ఆ పోరాటాల ఘటనలు, ముచ్చట్లు వాటి కుల రాజకీయాలు, జెండర్‌ రాజకీయాలు వెలికి తీసుకొద్దామనే అభిప్రాయంతో ఒక పాత మిత్రుడి సహకారంతో రాజవ్వ కోసం కొదురుపాకకు బోయిన.

రాజవ్వతోపాటు అప్పటి నాయకు లను  మాదిగ్గూడెంలనే కల్సిన. కుడుకుల దుర్గన్న, ఉప్పలయ్యను కూడా పలకరించిన. రాజవ్వను సిరిసిల్ల పోరాటం గురించి అడుగంగనే ‘దొరోనితోని యేగలేగ సంగంల జేరినం, వానితోని యిప్పటికేగలేక పోతన్నం. అది గోస గాదు, లెక్క గాదు. శానమంది సచ్చిపోయిండ్రు, జేల్లబడ్డరు, కేసులైనయి, మమ్ముల గోసబుచ్చుకున్న దొరోడు యిప్పటికి సర్పంచిగనే సేత్తండు. నాయమెక్కడుండె, గింతన్యాలమైనా మాకేం దక్కింది. ఆగమై పోయినం, సెట్లపోంటి, గుట్టలపోంటి బత్కినం, శాన నెల్లు వూల్లెకు రాలే…’ అంది. ”రాజవ్వకైతే మా కష్టమొచ్చె, రాజవ్వ అప్పుడెంత బలంగుండె. నాట్లు, కలుపులు, కోతలు గుత్తదారై ఎకురాలకెకు రాలకు బట్టి ఆడోల్లనందర్ని యెంటేసుకుని పంజేసేది. అట్లనే దొరోని మీదికి ఆ ఆడోల్లనందర్ని మహిళా సంగంలకు కూడగట్టింది. యే మొగోనికెక్కువ పంజేసింది సంగంల” అని పోలీసుల దెబ్బలకు నడవలేని పరిస్థితులున్న నాయకుడు కుడుకుల దుర్గన చెప్పుతుండె.

వాల్లు రోమాలు నిల్సుండే కతలు రాజవ్వ గురించి చెపుతుంటే… అంత సాహసి ని ఏ మహిళా  సంగాలు పట్టించుకోలే… ‘విముక్తి ఉద్యమాల్లో తెలంగాణ స్త్రీలు’ అని ‘అనుభవాలు దృక్పథాలు’ అనే పేరుతో వచ్చిన పుస్తకాల్లో రాజవ్వ బతుకు యుద్ధం, సాహస చరిత్రలు ఈ సవర్ణ మహిళలకు కనబడవెందుకో.

(18-8-2016న భౌతికంగా  బతుకు చాలించిన కొదురుపాక రాజవ్వకు నీలి సలాములతో…..)

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.