హెచ్ఐవిలోనూ లింగవివక్ష

(అనువాదం- వనజ)

పాజిటివ్ మహిళల దీనస్థితి

హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా? ప్రజల జీవితాలలోని నిత్యసత్యాలు, (హెచ్ఐవి) పాజిటివ్ మహిళల ప్రాధాన్యతలతో ప్రారంభించడం ద్వారా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆఫ్ ఉమెన్ లివింగ్ విత్ హెచ్ఐవి/ ఎయిడ్స్ (ఐసిడబ్ల్యు) ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐసిడబ్ల్యు, హెచ్ఐవి పాజిటివ్ మహిళలచేత, వారికోసమే నడుస్తున్న నెట్వర్క్.

లైంగికత- హెచ్ఐవి/ ఎయిడ్స్ అసమానత గుర్తింపు

హెచ్ఐవి/ ఎయిడ్స్ లైంగిక అసమానతలకు దారితీసేదే కాదు, మహిళల్ని, పురుషుల్ని, పిల్లల్ని మరింత ప్రమాదకర స్థితిలోకి నెడుతుంది. పురుషులతో, సెక్స్ వర్కర్స్ తో, మత్తుమందు తీసుకునేవారితో లైంగిక సంబంధాలు కొనసాగించేవారిని ‘ప్రమాదపుటంచున ఉన్నవారు’ గా ఇటీవలి వరకు నిర్వచించడం, వేరు చేయడం వల్ల ‘సురక్షితం’గా ఉన్నారనుకున్న వివాహిత మహిళలు, వయసుమీరిన మహిళలతో సహా సాధారణ ప్రజలలో పెరుగుతున్న రోగాన్ని గోప్యంగా వుంచింది, ఇప్పుడు బాగా ప్రమాదకరమైన హెచ్ఐవి/ ఎయిడ్స్ తో జీవిస్తున్నవారిలో దాదాపు 50 శాతం మంది మహిళలే (యు ఎన్ ఎయిడ్స్, 2002) నని అంచనా. వ్యక్తులుగాను, సంఘంలో తల్లులూ, సంరక్షకులుగాను ఉన్న మహిళలలో ఇప్పుడు హెచ్ఐవి/ ఎయిడ్స్ ఉధృతంగా వుంది.

సంప్రదాయ ఆరోగ్య మార్గాలు నాడు, నేడు, రేపు కూడా సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, మానవహక్కుల కోణాలను విస్మరించి అరకొరగానే అందుతాయి. పురుషుల, మహిళల లైంగిక పునరుత్పత్తి హక్కులపై దృష్టి కేంద్రీకరించడం పరిస్థితిని సవరించే ందుకు ముఖ్యమైన మార్గమవుతుంది. హెచ్ఐవి/ ఎయిడ్స్ కి దారితీసే పేదరికంతో సహా వివిధ అసమానతలను పరిష్కరించే, లైంగిక సంబంధాలు కాకుండా ఇతర మార్గాల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడినవారి హక్కులను కూడా గుర్తించేలా విస్తృత పరిధిలో మానవహక్కుల కార్యక్రమం కూడా అవసరం. కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎగనెస్ట్ ఉమెన్ (సిఇడిఎడబ్ల్యు) ఇలాంటిదే ‘ఉమెన్ అండ్ హెచ్ఐవి/ ఎయిడ్స్ ది బార్సిలోనా బిల్ ఆఫ్ రైట్స్ (జూలై, 2002) కూడా మరొక ఆయుధం. ఇందులో వివిధ ఇతర అంశాలతో పాటు సమానత్వపు హక్కు, ఆర్థిక స్వాతంత్య్రం, విద్య వంటి అంశాలున్నాయి.

ఎయిడ్స్ చుట్టూ ఉన్న నిరాదరణ, నింద, బహిష్కారం అంశాలు బహిరంగ చర్చలు జరగకుండా చేశాయి, ప్రయోజనకర స్పందనను ఆలస్యం చేశాయి. హెచ్ఐవి/ ఎయిడ్స్ తో జీవిస్తున్న వారి జీవితాలను మరింత భారం చేశాయి. మహిళల లైంగిక అవసరాలపై ప్రత్యేక నియంత్రణ, ఆంక్షలు ఉన్నాయి. పురుషులతో, యువకులతో, వికలాంగులతో పునరుత్పత్తి దశ దాటిన వారితో పురుషులు తాము కలిగివున్న లైంగిక సంబంధంతో సహా – ఎవరు దేనిని వ్యక్తీకరించాలి, లేక, వ్యక్తీకరించకూడదు- వంటి ‘ లైంగిక అవసరాల సాంఘిక నిర్మాణం’ – ప్రజలకు సరైన లైంగిక ఆరోగ్య సమాచారం, సేవలు అందడం లేదని వెల్లడిచేస్తోంది.

బంధుత్వాలలో నిర్ణయాలు చేసే విషయానికి వస్తే, పురుషులు ఆధిపత్యం వహించాలని, మహిళలు అణిగిమణిగి వుండాలని అనుకుంటారు. అసమాన భాగస్వాములు తాము ఎప్పుడు, ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొనాలి, లైంగిక సంబంధంగా వచ్చే వ్యాధులు (ఎష్టిఐ), హెచ్ఐవి నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై చర్చించలేకపోతున్నారు. పురుషులకు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు వుండటాన్ని సహించడం, సెక్స్ గురించి పురుషులకు ఎక్కువ తెలిసివుండాలనుకోవడం వల్ల వారు, వారి భాగస్వాములు కూడా ప్రమాదంలో పడుతున్నారు, లైంగిక వైద్య సలహాను కోరడానికి వారు సంసిద్ధులు కాకుండా అడ్డు తగులుతోంది.

హెచ్ఐవి, జెండర్, పేదరికాల మధ్య బహువిధాల సంబంధం వుంది. తాత్కాలిక మనుగడకోసం వత్తిడిని తట్టుకోవడానికి పేదమహిళలు ‘ మనుగడ సెక్స్’ వైపు మళ్ళవచ్చు. అది వారి దీర్ఘకాల అనారోగ్యానికి, హెచ్ఐవి వ్యాధితో మరణానికి దారితీస్తుంది. ప్రజలు ఆరోగ్య విజ్ఞానం పొందడం, నివారణోపాయాలను తెలుసుకోవడం, చికిత్స పొందడానికి కూడా వారి పేదరికం అడ్డువస్తుంది. ఇది స్త్రీ పురుషులిద్దరి విషయంలోనూ వాస్తవమే అయినా, లైంగిక అసమానతలు పేదరికపు అనుభవాలు తమ ప్రభావాన్ని మహిళలపై ఒకరకంగాను, పేదరికంనుంచి బయటపడగల పురుషుల సామర్థ్యంపై ఒకరకంగాను వేస్తుంది. సామాజిక వ్యయంలో కోత, మహిళలు, బాలికలపై వారే సాంఘిక భద్రతా బాధ్యతలు స్వీకరించాల్సిన వత్తిడిని పెంచుతాయి- కుటుంబంలో సంపాదించే సభ్యులు అనారోగ్యం పాలవడమో లేక మరణించడమో జరిగితే అనారోగ్యంతో వున్నవారి సంరక్షణా చూడాలి. కుటుంబం జరుగుబాటుకు ఒక ఉపాధినీ వెదుక్కోవాలి. హెచ్ఐవి/ ఎయిడ్స్ లో అదృశ్యంగా వుండే ప్రభావాలలో ఇదొకటి.

దురదృష్టవశాత్తు, హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాప్తిని, ప్రభావాన్ని అరికట్టేందుకు ఉన్న చాలా మార్గాలు లింగ వ్యత్యాసాలను, అసమానతలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యాయి. సెక్స్, పునరుత్పత్తి నిర్ణయాలలో పురుషాధిక్యాన్ని, స్త్రీల మౌనాన్ని కొన్ని కార్యక్రమాలు మరింత బలోపేతం చేయగా, మిగిలినవి స్త్రీ పురుషుల వివిధ అవసరాల, పరిమితులపై స్పందించాయే తప్ప, లింగ వివక్షతను సవాల్ చేయలేకపోయాయి. కార్యక్రమాలు (జోక్యాలు) మహిళల సాధికారత, జెండర్ అంశాలను మార్చేవిగా వుండాలి.

ప్రజల నిత్య సత్యాలు, వారి ప్రాధాన్యతలతో ప్రారంభించడం తప్పనిసరి అవసరం. ‘ హెచ్ఐవి పాజిటివ్ మహిళలు ఏం కోరుకుంటున్నారు?’ అనే ప్రశ్నలపై ఐసిడబ్ల్యు పనిచేస్తుంది. అలాగే, భారత దేశంలోని ‘సోనాగచ్చి’ ప్రాజెక్ట్ సెక్స్ వర్కర్లు తమకు తాము నిర్దేశించుకున్న ప్రాధాన్యతలు, వారి క్లైంట్స్ (విటులు) తో సురక్షిత లైంగిక సంబంధం కోరే విషయాలపై వారికి అండగా నిలుస్తోంది.

సాధికారతను సాధించడానికి ప్రాథమిక అవసరం- సమస్యలు, పరిష్కారాలను నిర్వచించడంలో నిజమైన భాగస్వామ్యం, తమచుట్టూ ఉన్న సమాజం దూరంగా పెట్టకుండా, సహకారం అందిస్తే హెచ్ఐవి బారిన పడ్డ స్త్రీ పురుషులిద్దరూ గౌరవంతో, మెరుగైన జీవితాన్ని గడపగలరు. “నేను విలువగల మహిళనేనని నాకు తెలుసు” అని మెక్సికోలోని ఒక హెచ్ఐవి పాజిటివ్ మహిళ చెప్పింది. అలాంటి ధైర్యవచనాలు వ్యక్తులు, సంఘాలు, ఐసిడబ్ల్యు వంటి సంస్థలు చేసే సమిష్టి ప్రయత్నాలవల్ల వస్తాయి.

అయితే, వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థాగత, విస్తృత సామాజిక స్థాయిల్లో లింగ,అసమాన అధికారాలను నిర్లక్ష్యం చేస్తే ‘సాధికారత’ ఒక ఆదర్శంగానే మిగిలిపోతుంది. జెండర్ సంబంధాలలో అసమాన అధికారాల మార్పు హెచ్ఐవి పట్ల భాగస్వామ్య పరిష్కార విధానానికి వేసే నిచ్చెనకు హృదయం వంటిది. దీనిద్వారానే, స్త్రీ పురుషులిద్దరి భావ వ్యక్తీకరణ, సారూప్య నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వీలవుతుంది. కుటుంబ హింస తగ్గుదల, సెక్స్ పరమైన విషయాలలో స్త్రీ పురుషులిద్దరి మధ్య పరస్పర సమాచార వ్యక్తీకరణ వంటి ప్రభావాలు వుంటాయి.

సాధికారత, మార్పులకోసం జరిగే ప్రయత్నాలలోనైతే అభివృద్ధి సంస్థలు, సహకారం అందించేవారి మధ్య అధికార అసమానతలను సవాల్ చేయాల్సి వుంటుంది. అభివృద్ధి కార్యకర్తలు హెచ్ఐవి పట్ల తమ అభిప్రాయాలను, హెచ్ఐవి ప్రమాదంలో తమ స్థితిని ప్రశ్నించుకోవాలి. ‘నిపుణులు’, ‘ప్రమాదంలో ఉన్నవారి’ మధ్య కృత్రిమ విభజనను అలా పరిష్కరించాలి. అలాగే, మహిళా కార్యక్రమాలను నష్టపరిచే, లేక పురుషులకోసమే ఉద్దేశించి జెండర్ అసమానతలను పరిష్కరించని విధంగా కేవలం పురుషులకోసమే పనిచేసే కొత్త ధోరణులను కూడా ధిక్కరించాలి. లింగపర హింసను వ్యతిరేకించేందుకు కృషి చెయ్యాలి.

హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాధి తీవ్రతకు సేవల అందుబాటు, సామర్థ్యం పెంపుదల, పరిశోధన, బలపరచడం వంటి వివిధ మార్గాలను మిళితంచేసి అన్ని స్థాయిలలో సమన్వయంతో కూడిన స్పందన అవసరం. దీనిని అన్ని రంగాలలో చొప్పించాలి. జెండర్, హెచ్ఐవి/ ఎయిడ్స్ కు ప్రాధాన్యం కల్పించేలా చేసింది.

హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాధికి దారితీసే,దానివల్ల ఏర్పడిన అసమానతలను సరిచేయడానికి మనకున్న సామర్థ్యంపై ఈ వ్యాధికి వచ్చే స్పందన ప్రభావం వుంటుంది. మనం లైంగికత, లైంగిక సంబంధాలలో సమానత్వ అంశాలపై బహిరంగంగా చర్చించాలి, హెచ్ఐవి/ ఎయిడ్స్ తో జీవిస్తున్న వారిపట్ల వివక్ష, సాంఘిక తిరస్కారాన్ని వ్యతిరేకించాలి, ఎక్కువగా బాధితులైనవారు, సమస్యని నిర్వచించాలి, పరిష్కారాన్ని వారే కనుగొనాలి. దిగువస్థాయినుంచి అంతర్జా తీయ స్థాయివరకు అంతటా సమిష్టి కార్యాచరణ ద్వారా ఈ సమస్యను ఒక సమిష్టి కార్యక్రమంగా మలచేందుకు మన శక్తిని ఉపయోగించాలి. “నాహెచ్ఐవి స్థితి గురించి బహిరంగం గా మాట్లాడటంవల్ల,హెచ్ఐవి వ్యభిచారం వల్ల, దేవుడిచ్చే శిక్షవల్ల వస్తుందన్న చాలామంది అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఇది, మిగిలిన చాలామంది హెచ్ఐవి పాజిటివ్ ప్రజలు తమ పరిస్థితిని జీర్ణించుకోవడానికి దోహదం చేసింది. వాళ్ళునన్నిపుడు సంపూర్ణ వ్యక్తిగా చూస్తున్నారు, ఒక హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిగా నేనిపుడు తిని, తాగి పనికి వెళ్ళినట్లే, లైంగిక సంబంధం కూడా కలిగి వుండవచ్చని వారు ఇపుడు అంగీకరిస్తున్నారు.”

Share
This entry was posted in అనువాదాలు, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.