వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గండికోట వారిజా!

ఎలా వున్నావ్‌? మనల్ని కవిత్వమే కలిపింది కదూ! మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీకంటే ముందుగా నీ జల పాతపు నవ్వు నన్ను చేరింది. మొఖమంతా వెన్నెలై కమ్మిన చిరునవ్వుతో, సముద్రపు హోరులాంటి మాటల సుడిగాలిలో నేనెప్పుడో చిక్కుకుపోయాను.

నేనూ, యాకూబూ కుప్పం నుంచి వచ్చి ‘పలమనేరు’లో ఆగాం కదా! మీ అత్తగారి ప్రేమ, బాలాజీ ప్రేమపూర్వక స్పందన, మా కోసం నువ్వు పెట్టిన ‘ఎమర్జెన్సీ’ లీవూ, మీ పాప చిరునవ్వులు ఇవన్నీ గుర్తొస్తే చాలా సంతోషమన్పిస్తుంది. అతి తక్కువ కాలంలోనే మనం ఆత్మీయతల అంచుల్ని దాటేసాం. మీరిద్దరే దానికి కారణం. ఆ రోజు ఏర్పాటు చేసిన సభలోనే ‘పుష్పాంజలి’గార్ని చూసాను. కథలు బాగా రాస్తారావిడ. మంచి స్నేహశీలి. చురుకైన మనిషి కదూ!

వారిజా నీకో విషయం చెప్పనా! ఫోన్లో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నా, ఒక కథ చదివి చాలా బాగుందంటూ ఉత్తరం రాశాను. జవాబు రాలేదెందుకో అనుకు న్నాను. తర్వాత ఎవరో కలిసినప్పుడు ‘ఎలా వున్నారని’ అడిగితే – ఆవిడెప్పుడో చనిపోయారు కదా! అనేశారు. షాక్‌ నాకు. నాకు తెలీకుండానే ఆ ఉత్తరంలో సంభాషిం చానామెతో. దార్లో తినండంటూ మీ అత్తగారు ఆప్యాయంగా ఇచ్చిన ప్యాకెట్టును కూడా మర్చిపోకముందే, ఆవిడ కూడా పైకి నడిచెళ్ళిపోయారని విని మనసు బరు వెక్కింది. తల్లీ కూతుళ్ళకంటే ఎక్కువగా, మంచి స్నేహితురాళ్ళలా ఉన్నారు మీరిద్దరూ. నీకు ‘రిషీవాలీ’ ట్రాన్స్‌ఫర్‌ అయిందని చెప్పావు. చాలా అద్భుతమైన ప్లేస్‌ కదా! నువ్వు అక్కడికి వెళ్ళకముందే నేనొకసారి మా చెల్లెలు కమలా వాళ్ళ కుటుంబంతో అక్కడికి వెళ్ళాను. వదిలి రాలేకపోయాను. అక్కడున్న పోస్టాఫీసులో నువ్విప్పుడు కూర్చొని ఉన్నావు. ఎంత విచిత్రం. కనీసం రెండు మూడు రోజులన్నా నీతో కలిసి ఉండాలి… అక్క డున్న ప్రకృతినంతా ఆవాహన చేసుకుంటూ. అమెరికా నుంచి వచ్చాక తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. సరేనా! చాలా కబుర్లు చెప్పుకోవాలి. వారిజా! నువ్వే ఒక పువ్వని ‘కాకినాడ’లో మనం మళ్ళీ కలిసి నప్పుడు తెల్సింది. ఎంత సుకుమారమైన భావనలు నీవి. వీరలక్ష్మి అక్కా వాళ్ళింట్లో మనమంతా గడిపిన క్షణాలు విలువైనవి కదూ! నీ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ నీ మనసు ప్రతిబింబాలే కదా!

నువ్వు రచయిత్రివి ఎట్లా అయ్యావ్‌ అని నేనప్పుడడిగితే మా నాన్న దయాకర్‌గారి వల్ల అన్నావు గుర్తుందా? పుంగనూరులో పుట్టిన ఆయన నిన్ను లైబ్రరీకి తీసుకెళ్ళి చదివించడం, ఏది మంచిది? ఏది చెడ్డది అని ఎలా విశ్లేషించుకోవాలో చెప్పేవా రన్నావ్‌? నీలో జ్ఞానతృష్ణను రేకెత్తించిన తొలి గురువు తండ్రి అయితే, మలి గురువు ‘పలమనేరు బాలాజీ’ కదూ! మీ ఇద్దర్నీ చూసి చాలా ముచ్చటేసింది. పరస్పర సహకారం, గౌరవం ఇచ్చుకునే జంట మీది. చాలా అరుదు ఇలా ఉండటం.

కానీ సమయం లేదంటూ అతి తక్కువగా రాస్తున్నావ్‌? ఇది కరెక్ట్‌ కాదు. సమయం ఉంటుంది. ఎక్కడికీ పోదు. వాయిదా వేస్తామంతే. ఈ సారి బాలాజీగార్నే అడుగుతాను. రాసేవరకూ ఊరుకోవద్దని. ఎందుకంటే నువ్వు రాసిన కథలు కూడా మామూలివి కావు. కొత్త కొత్త థాట్స్‌, పాజిటివ్‌ టోన్‌తో ఉంటాయి. కానీ ఇప్పటివరకూ 5, 6 రాసుంటావంతే. ఓ పదన్నా రాసి పుస్తకం వేయకపోతే నీ దోస్తీ కటీఫ్‌. ‘వర్కింగ్‌ ఉమెన్‌ హెల్త్‌’ని పట్టించు కోదంటూ ‘బాడీ సర్వీసింగ్‌’ కథ రాశావు. 95లో అనుకుంటా ‘వార్త’లో వచ్చింది ఒక ‘ఉద్యోగస్తురాలి ఉత్తరం’ కథ… రచయిత్రిగా మిగలాలంటే, స్త్రీ ఎన్ని యుద్ధాలు చేయాలో, ఎన్ని ఒదులుకోవాలో రాశావందులో. టెన్త్‌ క్లాస్‌లో స్కూల్‌ ఫస్ట్‌ వస్తే, అమ్మ నాగరత్న, నాన్నగారు కలిసి ‘మహా ప్రస్థానం’ బహుమతిగా ఇచ్చారన్నావ్‌ కదూ!

నీ మొదటి కవిత కూడా ‘ఇస్త్రీ’ – స్త్రీ జీవితం ఎలా మడతపెట్టి, వెచ్చబెడ్తారో అద్భుతంగా చెప్పావు. ‘జ/శీ’ అనే కవిత కూడా విలక్షణమైంది. స్త్రీలు తోకల్లేకుండా బతకలేరా అని ప్రశ్నించావందులో. ‘పాట ఆత్మ’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా

ఉన్నాయి నీ కవిత్వ సంపుటి ‘ప్రియమైన మీకు గుప్పెడు’లో. ‘కవి సంగమం’ గ్రూప్‌ ఎఫ్‌బీలో చేరిన తర్వాత తక్షణ స్పందన

ఉంటుంది కాబట్టి 30 వరకూ కవితలు రాశానన్నావు. పెయింటింగ్స్‌ కూడా అద్భుతంగా వేస్తావు నువ్వు. ఫోటోగ్రఫీ నీ ప్రాణం కదూ!

స్త్రీ హృదయంలో కొంత మార్జిన్‌ ఉంచుకో వాలనీ, పర్సనల్‌ స్పేస్‌ ఉండా లంటూ రాశావు గుర్తుందా? రెండ్రోజుల క్రితం అనుకుంటా ‘కవి సంగమం’లో ‘మాట్లాడు కుందాం రా!’ అని కవిత రాశావు. సరే! నీతో ఉత్తరంలోనన్నా మాట్లాడదామని రాస్తున్నాను. ప్రణీత, పవిత్రలు ఎలా

ఉన్నారు? ప్రణీతను మేం దత్తత చేసుకుంటా మన్నాము గుర్తుందా నీకు? వారిజా! మరి ఉండనా? నీ నుంచి వచ్చే లేఖ కోసం కోయిలలా ఎదురుచూస్తూ

– నీ నేస్తం

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

One Response to వర్తమాన లేఖ – శిలాలోలిత

  1. gandikota varija says:

    మేడం ధన్యవాదాలు.మీ ఉత్తరం చాల సంతోషాన్ని ఇచ్చింది.స్పూర్తిని కలిగించింది.-గండికోట వారిజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.