అలుపెరుగని పోరాటం – దంగల్‌ – భవాని ఫణి

మనం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. స్సస్‌ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే’ అని ట్రైలర్‌ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, ఒక శిల్పకారుడు అతి నేర్పుగా చెక్కిన శిల్పంలా ఉంది సుమా’ అనే ఆలోచన మాత్రం రాక మానలేదు. సినిమా ఒక కథ, సినిమా ఒక కవిత, సినిమా ఒక క్షణికానందం, సినిమా ఒక జీవితకాల సత్యం, సినిమా ఒక వినోదం, సినిమా ఒక దుఃఖం, సినిమా ఒక వెతుకులాట నిజానికి సినిమా ఒక ఆట కూడా. పట్టూ విడుపూ తెలిసి ఉండటం, దాడి చేయడమెప్పుడో దెబ్బకు కాచుకోవడమెప్పుడో అర్థం చేసుకునే తెలివితో మెలగడం, ప్రత్యర్థి ఏమాత్రం ఊహించలేని ఎత్తులను సమయానుూలంగా వేయగల నేర్పరితనాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలు ఒక ఆటకు ఎంతో అవసరం. అదే విధంగా ఎక్కడ ఏ విధమైన ఎమోషన్‌ ని పండించాలో, ఏ భావ తీవ్రతను ఎక్కడి వరూ తీసుళ్లిె ఆపేయాలో, కథను ఎప్పుడు ఎటువంటి ఊహకు అందని విధంగా మలుపు తిప్పాలో తెలుసుకున్న దర్శకుడు ఏ కథాంశాన్ని తీసుకున్నా, దాన్ని సినిమాగా మలచడంలో విజయం సాధిస్తాడని దంగల్‌ సినిమా నిరూపించింది. ‘దంగల్‌’ అంటే రెజ్లింగ్‌ అని అర్థం.

నిజ జీవితానికి చెందిన కథను ఆసక్తికరమైన చిత్రంగా తీర్చిదిద్దడం అంత సులువైన విషయం కాదు. అందులోనూ అమ్మాయిల రెజ్లింగ్‌ పోటీలకు చెందిన కథాంశంతో ఇంత చక్కని సినిమాను మన వెండితెర వెనుకనుంచి ఇంతద్భుతంగా ప్రజంట్‌ చేసినందుకు దర్శకుడు నితేష్‌ తివారీని ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మహావీర్‌ సింగ్‌ పొఘాట్‌’ అనే ధీశాలి కథను దేశం మొత్తం తెలుసుకునేలా చేసి, ఎందరో అమ్మాయిల లక్ష్యాల నిండుగా ధైర్యాన్ని నింపిన అమీర్‌ ఖాన్‌ ని కూడా అభినందించాల్సిందే.

దేశానికి స్వర్ణపతకాన్ని తేవాలని కలలు గన్న మహావీర్‌, పేరు ప్రతిష్టలను తప్ప ధనాన్ని సంపాదించుకోలేకపోయిన కారణంగా రెజ్లింగ్‌ ని వదిలి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. తను కన్న కల, తనకు పుట్టబోయే కొడుకు ద్వారా నిజం చేసుకోవాలని బలంగా కోరుకున్న అతడు, వరసగా నలుగురు ఆడపిల్లలకి తండ్రవుతాడు. కలలన్నీ కల్లలు చేసిన విధిరాత కారణంగా విరక్తి చెందిన ఈ రెజ్లింగ్‌ ప్రేమికుడు, రెజ్లింగ్‌ ఆటపైనే ఆసక్తిని కోల్పోయి వాస్తవంతో రాజీపడిపోయి జీవించడం మొదలుపెడతాడు. అలా వాడిపోయి మరణించిపోతున్న అతనిలోని ఆశల వృక్షానికి అతని పెద్ద కూతుళ్లిద్దరూ వాళ్లలో దాగున్న పౌరుషాన్ని ప్రదర్శించడం ద్వారా తిరిగి మళ్లీ చిగురులేయిస్తారు.

అవును, కావాల్సింది, తేవాల్సింది స్వర్ణం. తెచ్చేది అమ్మాయైతేనేం? అబ్బాయైతేనేం? అన్న ఆలోచన అతనిలో తిరిగి జీవాన్ని నింపుతుంది. ఒక పల్లెటూళ్లో, అమ్మాయిలు వేలం ఇంటి పనులు చేయడానికీ, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికీ మాత్రమే పుడతారని బలంగా నమ్మే రోజుల్లో అతను తన ఇద్దరు ఆడపిల్లలకీ నిక్కర్లు తొడిగించి పొలాల వెంట పరుగులు తీయిస్తాడు. నీళ్లలోకి దూకించి ఈతలు కొట్టిస్తాడు. సుకుమారమైన మొగ్గల్లాంటి ఆ పసికందుల చేత ఎంతో కఠినమైన సాధన చేయిస్తాడు. ఎప్పుడూ ఎందుూ నోరెత్తి ఎరగని అతని భార్య  కూడా ఎదురు తిరిగి గట్టిగా అరిచి గోల చేసినా వినకుండా పిల్లల చేత మాంసం తినిపిస్తాడు. వాళ్ల కోసమే ప్రత్యేకంగా రెజ్లింగ్‌ సాధన చేసే ప్రదేశాన్నిఏర్పాటుచేసి తానే స్వయంగా శిక్షణనిస్తాడు. అబ్బాయిలతో కుస్తీ పట్లు పట్టిస్తాడు. ఎన్నో అవమానాలను భరిస్తాడు. ఆర్ధికపరమైన అనేకమైన ఇబ్బందులని అనుభవిస్తాడు. ఎన్నెన్నో ఆటుపోట్లని తట్టుకుని, నిర్భయంగా నిలబడి, నవ్విన నాప చేనే పండేలా చేసుకుంటాడు. తన కూతుళ్ళని గ్రామమే కాదు, మొత్తం దేశమే చూసి గర్వపడేలా తీర్చిదిద్దుతాడు.

ఇటువంటి కష్టాలతో నిండిన కథను, హుషారుగా సాగిపోతున్న ప్రవాహమంత సులువుగా కళ్లముందు కదిలేలా చేసి కనికట్టు చేసాడు దర్శకుడు నితేష్‌. ముఖ్యంగా మహావీర్‌ పాత్రను ధరించిన అమీర్‌ ఖాన్‌ ఎక్కడా తనని తాను ప్రదర్శించుకోలేదు. ఎక్కడ ఆ పాత్ర ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే కనిపించి, కథను ఎంతో మెళకువతో ముందుకు నడిపించాడు. హుందాతనం, గాంభీర్యత నిండిన ఒక హర్యానా వాసి పాత్రలో అతడు ఒద్దికగా ఒదిగిపోయాడు. అరవై ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిగా తనని తాను సహజంగా చూపించుకోవడం కోసం, 30 జీేల బరువు పెరిగి 98 జీేల వరూ చేరుకున్నాడట అమీర్‌. ఈ అంకిత భావానికి తగ్గ ఫలితాన్ని కూడా దక్కించుకున్నాడు. అతి సాధారణమైన గంగి గోవులాంటి గ్రామీణ స్త్రీ పాత్రలో, అతని భార్యగా నటించిన సాక్షి తన్వార్‌ కూడా అంతే నెమ్మదిగా కుదురుకుపోయింది. ఇక కడిగిన ముత్యాల్లాంటి గీతా, బబితాలు బాల్యంలోనూ, యవ్వనంలోనూ కూడా ఎంతో అందంగా కనిపించి అద్భుతంగా అమరిపోయారు. మిక్కిలి శ్రద్ధగా ఏర్పాటు చేసిన ప్రతి రెజ్లింగ్‌ పోటీ అతి సహజంగా అనిపించి, నిజమైన పోటీలను చూస్తున్న అనుభూతిని కలుగజేసింది.

కథతో పెద్దగా సంబంధం లేని వ్యక్తి అయిన మహావీర్‌ సింగ్‌ తమ్ముడి కొడుకుతో కథ చెప్పించడం వలన, అతని ద్వారా హాస్యాన్ని జోడించడానికి సినిమాకు అవకాశం ఏర్పడి, కథలో ఒక విధమైన సరళత్వం మిళితమైంది. ఇక మరింత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు గురించి. ప్రీతoకు అందించిన మంచి ఊపున్న సంగీతానికి అమితాబ్‌ భట్టాచార్య  రచించిన సాహిత్యం భలే అందంగా జతూడింది. బాపూ సేహత్‌ లిేయే తూతో హానీకారక్‌ హై’ పాటైతే తప్పనిసరిగా విని తీరాల్సిందే. తెలుగు భాష తీయదనం గురించి ఎప్పుడూ తెలిసిందే గానీ హిందీ భాషలో ఎంతటి సౌందర్యం దాగుందో కదా అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని పాటల్ని వింటుంటే.

అతి కష్టమైన, శారీరకమైన శ్రమతో కూడిన ఈ రెజ్లింగ్‌ సైతం ఆడపిల్లల్ని అడ్డుకోలేదని మహావీర్‌ సింగ్‌ నిరూపించి చూపాడు. తన కూతుళ్ల తలరాతల్నీ, గీతల్నీ తనే గీసినా మరెందరో అమ్మాయిలకి కలలు కనేందుకు బంగారు దారుల్ని బహూకరించాడు అతడు. గీతా, బబితాలు కూడా తండ్రి శ్రమను వృధాగా పోనివ్వకుండా కష్టానికీ, శ్రమూ, అంతులేని త్యాగాలూ వెరవక, విజయపథంలోని తొలి బాటలుగా మారారు. ఈ ముగ్గురి జీవితాలనీ మరింత ఆసక్తికరంగా, ఆదర్శప్రాయంగా కనిపించే విధంగా తిరగరాసి, కదిలే చిత్రంగా మార్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు అమీర్‌, నితేష్‌ లు.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.