పచ్చ పచ్చ చెట్లురా !
పందిరిగా నిలిచెరా!
చల్ల చల్లని నీడ నిచ్చెరా!
స్వచ్ఛమైన గాలి వీచెరా!
అందమైన పూలు పూచెరా!
తియ్య తియ్యని పండ్లే పండెరా!
బాలలంత బహుబాగ తినెరా!
మనిషి కొక్క మొక్కరా!
మరి నాటమని ఇచ్చెరా!
వాడకొక్క మొక్కరా!
పెంచమని చెప్పరా!
వానలంత భలేగా వచ్చెరా!
వరుసగాను పెంచారు – ఊరునిండ చెట్లురా!
ఉంటే చల్ల గుండురా – ఎండ తరిమి కొట్టురా!
కుంటలు చెరువులు నిండురా – పంట బాగా పండురా!
పచ్చ చెట్లు మనకురా – ప్రాణవాయి విచ్చురా!
ప్రాణికోటి బ్రతుకులు – పరిఢవిల్ల చేయురా!