అమ్మా నిన్నొక్కసారి
చూడాలమ్మా
నా గుండెచాటు బాధ నీతో
చెప్పాలమ్మా
నువ్వు నాతో లేవని
నువ్వెప్పుడు వస్తావని
ఎదురు చూస్తూ ఉన్నానమ్మా
నన్ను అందరూ నిందలపాలు
చేస్తున్నారమ్మా
ఇన్ని రోజులు నీ గుండెలో దాచుకుని
ఇప్పుడు ఎందుకిలా నన్ను వదిలేశావమ్మా
అమ్మా అమ్మా రా… అమ్మా
చాలా ఏడుపు వస్తుంది అమ్మా
నీ చేత్తో అన్నం తినాలని ఉందమ్మా
నీ ఒడిలో తలపెట్టి నిద్రపోవాలని ఉందమ్మా
రా… అమ్మా వచ్చి నా కన్నీళ్ళు తుడువమ్మా
నువ్వు లేని నేను లేనమ్మా