ఎన్నడూ చూడని దృశ్యం
అశృవులు రాల్చడానికి కళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి
ఎక్కడ వుంది మానవత్వం
ఏదీ మనిషిలో మనసు తత్వం
విద్యలేని వాడు వింత పశువైతే
మరి విద్య, విజ్ఞానం ఉండి, కనీస
మానవ ధర్మం లేనివాళ్ళను ఏమనాలి
ప్రేమ, అన్యాయం, అనుబంధం, జాలి, దయ, కరుణ
ఇవన్నీ కేవలం రక్తసంబంధం వల్లనే కలిగేవైతే
మరెందుకీ మానవత్వం
మనిషికి మరో మనిషిపై కనీస ధర్మం
లేనపుడు ఎందుకీ మనుగడ
మనకు మేధస్సును ఇచ్చిన దేవుడు కూడా
అయ్యో ఇదేదో పశువులకిచ్చినా భూమి
సుఖశాంతులతో ప్రేమగా ఉండేది
అని సిగ్గుపడతాడేమో…
నీకోసం నువ్వు బతకడానికే
జీవిస్తున్నాను అనుకుంటే
నువ్వు జీవించకు
అలా జీవించాల్సిన అవసరం లేదు
ప్రేమ, ఆప్యాయతలు డబ్బుతో కొనుక్కుంటూ
హృదయం అనేదే లేకుండా నిన్ను నువ్వు
అమ్ముకుంటూ…
ఛీ… ఎందుకు… ఎందుకు ఇలా
ఏమని రాయను
నా కలం కూడా ఈ ప్రపంచాన్ని చూసి సిగ్గుపడి
రాయలేక పోతోంది.
ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో
అది చెప్పిన సత్యాలు విను
స్వార్థం అనే అర్థం లేని పనులను విడిచి
నీ జీవితానికో కొత్త అర్థం వచ్చేలా మలచి
అందరూ బాగుండాలని తలచి
అందుకు నీ వంతు కృషి జోడించి
సాగిపో… అదే అదే నీ
జీవిత పరమార్థం.