వైరుధ్యాలు లేని జీవితం – అసాధ్యం
వైషమ్యాలు లేని జీవితం – అసాధ్యం
సమాజమే వైరుధ్యాల మయం
మంచిని చెబుతూ… చెడును చూపిస్తూ
చెడును చూపి … చెడును పోషిస్తూ
మంచిగా మనగలగడం అసాధ్యం
చెడు వద్దు అంటూ చెడు పరిస్థితులు కల్పించడం
మంచిని చెబుతూ ఆదర్శంగా, ఉత్తమంగా జీవించమని
సూక్తి ముక్తావళిని ప్రభోదించడం
మంచి చెడుల మధ్య మనిషి ఊగిసలాడడం
విరుద్ధ ఆలోచనలతో ఘర్షణ పడడం
మోయలేని ఆదర్శాలను మోసుకుని
వైరుధ్య కారణంగా జీవించలేకపోవడం
మానవీయ విలువలు దెబ్బ తిన్నంతవరకు
ఒక మనిషికి ఏ అపకారం జరగనంతవరకు
అంతరాత్మ సాక్షిగా సహజంగా వ్యవహరించడం
దృఢమైన మనస్సు సంతరించుకున్నంతవరకు
మనిషిలో వైరుధ్యాలు ఆరోగ్యదాయకాలే