తాను కాలిపోతూ
ప్రపంచానికి వెలుగును
నలుదిశలకు పంచుతుంది దీపం!
మనుషులకాహ్లాదాన్ని పంచి
చేతులతో నలిపివేయబడి
విలపిస్తూ మరణిస్తాయి
పూలు!
రెండూ… అపురూప త్యాగాలే!
స్వార్థచింతన లేని దృశ్యాలే!
ఇదేంటి!… పూలు కిందకొరిగి
వెలుగును అమాంతంగా తోసేసాయి?
ఒక్క… అక్షర దోషంతో…
ఇన్ని ప్రాణాలు
చీకట్లో కల్సిపోయాయి?
తొక్కిసలాటను సృష్టించి
దిక్కులను స్థంభింపచేసాయి?
వాన రాకడ…ప్రాణం పోకడా!
అంటే… ఇదేనేమో!
ఫుల్ గిర్గయా!
పూలూ గిర్గయా!