వర్తమాన లేఖ – శిలాలోలిత

 

ప్రిియమైన కల్పనా ఎలా వున్నావ్‌? మంచువానలు మొదలైనట్లున్నాయి కదూ! మంచు కురుస్తుంటే చూడటం ఎంత అద్భుతంగా ఉంటుందో, చలికి గడ్డకట్టిన శరీరం అంత భయంకరంగానూ ఉంటుంది కదూ! ఆకాశం-భూమితో, మనతో, చెట్లతో మాట్లాడడానికి అలా తెల్లతెల్లగా కురుస్తూ పలకరిస్తుందేమో అనిపిస్తుందొక్కోసారి.

తెలంగాణా ప్రభుత్వం జరుపుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు నిన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా అన్పించింది. అలా అన్నా నిన్నోసారి చూస్తాను కదా అని కూడా సంతోషపడ్డాను.

కల్పనా ‘అనింద్‌’ ఎలా ఉన్నాడు? చిన్నప్పుడు చూశాను. విజయవాడలో పుట్టి పెరిగిన నువ్వు 1986 నుంచి కాలమిస్టుగా ఆంధ్రజ్యోతిలో ‘టీవీ సమీక్ష’ రాయడంతో సాహిత్య జీవితం ఇంచుమించుగా ప్రారంభమైందని చెప్పవచ్చు కదూ! సంగీత, నృత్య కళాకారుల్ని, సాహితీవేత్తల్ని ఇంటర్వ్యూలు చేసేదానివి. 88’లో అనుకుంటా రేడియోలో ‘న్యూస్‌రీడర్‌’గా చేరి పదేళ్ళకు పైగా ఉన్నావు. 89’ నుంచి 2003 వరకు ఆంధ్రభూమిలో సబ్‌ఎడిటర్‌గా ఉద్యోగం.

కల్పనా నీ తొలి కవిత ‘ఏకాంతం’ గుర్తుందా నీకు. 2001లో ‘నేను కనిపించే పదం’ కవితా సంపుటి వేశావు. అందులో టైటిల్‌ కవిత నీకు చాలా ఇష్టమనేదానివి. అలాగే మీ నాన్నగారు రెంటాల గోపాలకృష్ణగారి మీద రాసిన ‘చివరి మాటల కోసం’ కూడా నీకింకా నచ్చిన కవిత కదూ! 3, 4 తరగతుల్లోనే గురజాడ ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాఠం విని ఇంటికొచ్చి బాగా ఏడ్చానన్నావ్‌. ఎందుకు పూర్ణమ్మ అలా చనిపోవాలన్నదే నీ బాధ. బహుశా అప్పట్నుంచే ప్రశ్నించడం, ఆలోచించడం, ఎదుర్కోవాలనే బీజం పడిందనుకోవచ్చు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, అణచివేతలు నిన్ను కల్లోలపరచేవి. రష్యన్‌ సాహిత్యాన్ని, అన్నాకెరినా, పుష్కిన్‌ లాంటి వెన్నో చదివేదానివి. వీథి చివర్లలోనే ఉన్న లైబ్రరీ వరకు వెళ్ళకుండానే, ఇంట్లోనే ఉన్న వేల పుస్తకాలు నీలో సాహిత్య తృష్ణను పెంచి పోషించాయి. ద్వివేదుల విశాలాక్షి రాసిన ‘గోమతి’ నువ్వు చదివిన మొదటి నవల. నదుల పేర్లు స్త్రీలకు పెడితే విషాదంతోనే ముగుస్తాయన్న మీ నాన్నగారి మాటలు నిన్నెంతగానో ఆలోచింపజేశాయి, అదెలా కరెక్టవుతుందని. ఈ ప్రశ్నించే తత్వం, విమర్శించే నైజం, ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, అనుభవిస్తున్న జీవన సంఘర్షణే అప్రయత్నంగా ఫెమినిజమ్‌ వైపు నిన్ను లాక్కెళ్ళిపోయింది. ఓల్గా నీకెంతో ఇష్టురాలైపోయింది. కల్పనా! మొన్నే ఓల్గా కొత్త నవల ‘యశోబుద్ధ’ వచ్చింది. చాలా అద్భుతమైన నవల. నువ్వెళ్ళేటప్పుడు నీకు గిఫ్ట్‌గా ఇస్తాను. 2010లో బ్లాగ్‌లో నువ్వు రాసిన సీరియల్‌ నవల ‘తన్హాయి’. బాగా రెస్పాన్స్‌ వచ్చింది. ఎందరో నీకు మిత్రులయ్యారు. ‘ప్రేమ అనేది అప్రయత్నంగా పుడుతుంది. కంట్రోల్‌ చేయాలని చూడకూడదు, రహస్యంగా ఉంచొద్దు. అదొక సహజమైన చర్య. ఆనందపడే ఘటన’ అనే థీమ్‌తో రాసిన నవల కదూ! 10 నెలల పాటు రాశావు.

అలాగే కథలు కూడా చాలా రాశావు. ‘గే మ్యారేజ్‌’ మీద రాసిన ‘సంచయనం’ (ఆంధ్రజ్యోతిలో) మంచి కథ. అలాగే ‘కప్‌లెట్స్‌’, ‘లెస్బియన్స్‌’ మీద రాసింది కూడా మంచి కథ. విభిన్నమైన అంశాలు, ఎవరూ ఇంతవరకూ రాయడానికి ప్రయత్నించనివీ, వినూత్నపద్ధతిలో చెప్పాలనే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటావు.

అవును కల్పనా! మూడేళ్ళపాటు ‘సారంగ’ వెబ్‌ మ్యాగజైన్‌కు కూడా అఫ్సర్‌తో పాటు ఎడిటర్‌గా పనిచేశావు కదూ! ప్రవాస స్త్రీల గురించి రావాల్సినంతగా కథలు రాలేదనీ, నీకు రాయాలని ఉందనీ అన్నావొకసారి. రాస్తుంటే గుర్తొచ్చింది. ‘చేరా’గారున్నప్పుడు జరిగిన సంఘటన. అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్‌ వాళ్ళ సభా నిర్వహణ బాధ్యతంతా నువ్వు తీసుకుని నిర్వహించిన తీరును ఆయన చాలా మెచ్చుకున్నారు. వందల మందికి ఫోన్లు చేస్తూ ఓపిగ్గా, నవ్వుతూ, గలగలా మాట్లాడే నీ ధోరణి చాలా బాగుందని ముచ్చటపడ్డారు గుర్తుందా? ‘అజంతా’ అవార్డ్‌ నీకొచ్చినప్పుడు చాలా సంతోషపడ్డావు కదూ! అలాగే ఆటా అవార్డ్‌, వంశీరాజు అవార్డ్‌, అప్పాజోస్యుల అవార్డ్‌ వచ్చాయి కదూ! కవిత్వం రాయడమే నీకు చాలా ఇష్టం. కథలు రాయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నీ ప్రావీణ్యతను చూపించావు. కవిత్వమే తృప్తినిస్తుందనేదానివి. విమర్శా వ్యాసాలు కూడా 30కి పైగా రాశావు. తొందర్లో పుస్తకం వెయ్యాలి తల్లీ! రెండో నవల కూడా మొదలు పెట్టావుగా. 100 సంవత్సరాల్లో మూడు తరాల స్త్రీల జీవితాల్ని ఇతివృత్తంగా తీసుకున్నానన్నావ్‌. చాలా మంచి నవల అవుతుందది. నీకు ఆదర్శం, స్నేహం, పి.సత్యవతిగారు, సి.సుజాత అన్నావ్‌. మంచి స్నేహితులు కదూ వాళ్ళిద్దరూ. కొండవీటి సత్యవతి కూడా అంతే. వాళ్ళతో ఉంటే కొద్దిసేపట్లోనే పదేళ్ళ పిల్లల్లా స్వచ్ఛంగా మారిపోతాం. ఇప్పుడు రాస్తున్న కొత్త తరంలో సామాన్య, సింధుమాధురి నీకిష్టమైన రైటర్స్‌ అన్నావు.

ప్రతిభలో, వ్యుత్పత్తిలో, ఆలోచనా సరళిలో, రచనా విధానంలో మీరిద్దరూ ఇద్దరే. కానీ, జనం స్త్రీ పక్షపాతులు కాకపోవడంతో నీకు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నదే నా తపన. మీరిరువురూ స్వయం ప్రకాశకులే అయినా, ఒక దగ్గరికొచ్చేసరికి ఒకరికి మరొకరు ఛాయగా మిగలాల్సిన స్థితే ఎదురవుతుంది. ఆ మధ్య ‘వంశీకృష్ణ’ ఓ వ్యాసంలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

ప్రస్తుతం నువ్వు అమెరికాలో ‘మెంటల్‌ హెల్త్‌కేర్‌’ ఆర్గనైజేషన్‌లో జాబ్‌ చేస్తున్నావు కదూ! ఈ ఉద్యోగం నీకెంతో తృప్తినిస్తుందన్నావ్‌ కూడా. నీ కొత్త నవల తొందర్లోనే పూర్తవ్వాలని ఎదురు చూస్తున్నాను.

అవునూ కల్పనా! భరతనాట్యంలో డిప్లొమా కూడా చేశావు. మంచి నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్నావు కూడా. ఏమైందా నాట్యం? ఎంతో కష్టపడి నాలుగేళ్ళపాటు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నావు. చాలా ఇష్టం కూడా నీకు. 1995లో కదూ నిన్ను తొలిసారిగా చూసింది. నీ చిరునవ్వు, నీ తత్వం, నీ కలుపుగోలుతనం నచ్చిందప్పుడు. కొన్ని నెలలపాటు మనమంతా కలిసున్న ఆ రోజులు తలుచుకుంటుంటే ఇప్పుడు గమ్మత్తుగా ఉంది. మధ్యమధ్య కలవడం చాలా తగ్గిపోయినా, నీ పట్ల నా స్నేహం ఎప్పుడూ చెదిరిపోలేదు. ప్రస్తుతానికి ఉండనా మరి.

– నీ శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.