క్షమిస్తావా చిట్టి… – అరవింద్‌

 

ఎల్లలు లేని మన స్నేహంలో

నీ నెలసరి నిషిద్ధ

రహస్యమైపోయింది కదా

నీ నెత్తుటిస్రావం అంటుగా

గడప బయట మౌనంగా

కూర్చుండిపోయింది.

నీ చిరునవ్వును శిథిలావస్థకు చేరే

ఆ మూడు రోజుల వెనుక నెత్తుటి-

కన్నీటి మరకలను

మన స్నేహం ఎప్పుడన్న

స్పృశించలే కదరా…

ఐనను…

సెక్స్‌ ఎడ్యుకేషన్‌ను బూతుగా

మార్చిన ఈ దేశానికి

మన స్నేహానికి పెద్ద తేడా

లేదనిపిస్తోందిరా…!

అరే చిట్టి

నెలసరి రోజుల్లోను తలెత్తి నిలబడు.

అదేమీ తప్పుకాదు, నేరం

అంతకన్నా కాదుగా…

చిట్టి…

ఈ దేశ హృదయంలో

గడ్డకట్టుకున్న అజ్ఞానాన్ని

నీ నెత్తుటి స్రావంతో కడిగిపారేద్దాం…?

దేశాన్నే కాదు-మన స్నేహాన్ని

కూడా…

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.