నిశ్శబ్దం బద్దలైంది -సింగరాజు రమాదేవి

 

నిశ్శబ్దం బద్దలైంది. మహిళా లోకం గళం విప్పుతోంది. శతాబ్దాల తరతరాల అకృత్యాలను, అణచివేతను… ఆడవారు అనగానే అల్పంగా చూస్తూ అత్యాచారాలకు, వేధింపులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తోంది. నేను సైతం… మీ టూ… అంటూ లైంగిక వేధింపులు వ్యతిరేకంగా నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఏకమౌతోంది. పెద్ద మనుషుల ముసుగులో సంచరిస్తున్న గుంటనక్కల పేర్లు చెప్పి రచ్చకీడుస్తోంది. సిగ్గుపడాల్సింది ఆ నీచులు కానీ బాధితులమైన మేము కాదు అంటూ ముందుకొచ్చి పేర్ల జాబితాలు ప్రకటిస్తోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రచారం ఉద్యమ స్ధాయికి చేరుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చలకు దారితీసింది. సరికొత్త ధోరణులకు తెర తీసింది.

వీటన్నింటికీ ముందు… అసలు ఎక్కడుంది… ఇదంతా ఎలా మొదలయ్యిందంటే …హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు, పలు భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాత అయిన హార్వీ వైన్‌ స్టైన్‌పై ఒక తార లైంగిక వేధింపుల ఆరోపణ చెయ్యటమే! అలీస్సా మిలానో అనే నటి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన అనుభవాలు పోస్ట్‌ చేసి ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నవారు మీ టూ అని ట్వీట్‌ చేయమని కోరింది. అంతే… ఎప్పుడైతే ఒకరు గళం విప్పారో, ఒక్కసారిగా ఏళ్ళ తరబడి అవమానాభారాన్ని మౌనంగా మోస్తున్న ఎన్నో గొంతుకలు మౌనాన్ని ఛేదించి మాకూ ఇలాంటి అనుభవమే జరిగింది అంటూ వందల వేల సంఖ్యలో బయటికి వచ్చాయి. డ్యాం కున్న వరద గేట్లు ఒక్కసారిగా తెంచుకున్న వెల్లువలాగా ఈ ఆరోపణలు సామాజిక మాధ్యమాల్ని ముంచెత్తాయి. సమాజానికి ఆ వెల్లువ ముందు తలొంచక తప్పలేదు. ఫలితం! నేడు మానవ మృగమైన వైన్‌ స్టయిన్‌ను హాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ (ఆస్కార్‌ సంస్థ) వంటి పలు ప్రతిష్టాత్మక సంస్థల పదవుల నుండి తొలగించారు. అయితే ఇది మహిళలకే పరిమితం కాలేదు. నటుడు ఆడ్లర్‌, ప్రముఖ నటుడు కెవిన్‌ స్పేసీపై ఇలాంటి ఆరోపణే చేశారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు స్పేసీతో కలిసి ఒక చిత్రంలో నటించిన సమయంలో స్పేసీ తనను లైంగికంగా వేధించాడని చెప్పాడు. ఫలితం! స్పేసీని కోట్ల బడ్జెట్‌తో నిర్మితమయ్యే టీవీ షో ‘హౌజ్‌ ఆఫ్‌ కార్డ్స్‌’ తర్వాతి సీజన్‌ నుండి తప్పించారు. అలాగే అనేక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులపై ఇలాంటి వేటు పడింది.

పై సంఘటనలు కొన్ని కొత్త పాఠాలు చెబుతున్నాయి.

1. సంఘంలో తమ పరపతిని, పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అనేకమంది ప్రముఖులు లైంగిక నేరాలు చేస్తూ కూడా ఏళ్ళ తరబడి మర్యాదస్తుల ముసుగులో చెలామణి అవుతున్నారు. బాధితుల నిస్సహాయత, నిశ్శబ్దాలే వారికి

ఇన్నేళ్ళు శ్రీరామరక్షగా తమ ప్రతిష్టల పరదాలను కాపాడుకున్నారు.

2. అయితే ఈ వేధింపుల నేరాలు బయటపడినప్పుడు హాలీవుడ్‌ కానీ, సభ్య సమాజం కానీ ఆ రంగంలో పైకి రావాలంటే మామూలే అని కొట్టి పారేయకుండా బాధితుల పక్షాన నిలిచి బలవంతులైన వారిపై చర్యలు తీసుకోవడమనేది ప్రధానమైన మార్పుగా, మహిళల విజయంగా గుర్తించాలి.

రాయా సర్కార్‌ లిస్ట్‌: లైంగిక వేధింపులనేవి ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదు, అన్ని రంగాలలో ఉంటుందని పలువురు తారలు చెప్పారు. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ, అభ్యుదయ వాదులుగా, విద్యావేత్తలుగా విశ్వవిద్యాలయాల్లో విద్యాబోధన చేస్తూ వేలమంది విద్యార్థులకు ఆరాధ్యులైన ఎంతో మంది అధ్యాపకులు కూడా ఇలాంటి నేరస్థులు అని రాయా సర్కార్‌ లిస్ట్‌ను బయటపెట్టింది. న్యాయశాస్త్ర విద్యార్థి అయిన రాయా సేకరించి బయల్పరచిన ఈ జాబితాలో కొందరి పేర్లు చూసి చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది అధ్యాపక రంగంలో పెద్ద దుమారమే లేపింది. పిహెచ్‌.డికి తమవద్ద పనిచేసే అనేకమంది విద్యార్థినులను ఆయా అధ్యాపకులు లైంగికంగా వేధించారని ఆరోపణ.

సభ్యసమాజానికి ఇది తీవ్రమైన నిరాశకు గురిచేసే అంశం. ఎందుకంటే ఉన్నతమైన చదువులు మనిషిలో విజ్ఞానంతోపాటు, భావ విస్తృతిని, అభ్యుదయ భావాలను, సంస్కారాన్ని, ఉన్నత విలువలను పెంపొందిస్తాయని ఆశిస్తాం. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు బయట సమాజంలో లేని స్వేచ్ఛను కల్పిస్తూ, కొత్త భావాలకు, ఉన్నతమైన ఆలోచనలకు, నిర్మాణాత్మకమైన చర్చలకు వేదికలై, రాజకీయ చైతన్యానికి నిలయాలై భావి భారత పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతాయని ఆశిస్తాం. కానీ దానికి వ్యతిరేకంగా బయట సమాజంలోని కుళ్ళే అక్కడా బయటపడడం తీవ్రంగా పరిగణించాలి.

మన దేశంలో ప్రముఖులపై గతంలో బయటపడ్డ ఇలాంటి కొన్ని ఆరోపణలు – ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త పచౌరీపై, సంచలనాత్మక జర్నిలిజంకు పేరు గాంచిన పత్రిక తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌పై, ఆర్మీ అధికారి కె.పి.ఎస్‌.గిల్‌పై. ఇక మతపెద్దల విషయానికి వస్తే… సత్యసాయి బాబా, నిత్యానందస్వామి, తాజాగా ఆశారామ్‌ బాపు, డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌, మళయాళ హీరో దిలీప్‌… ఇంకా ఎందరో…

వీరంతా కూడా తమ అధికారాన్ని, పదవులను దుర్వినియోగ పరచి నేరం చేసిన వాళ్ళే. అయితే పురుషాధిక్య సమాజం మిగతా నేరాల కన్నా లైంగిక నేరాల పట్ల కొంత ఉదాశీసత ప్రదర్శిస్తుంది. మగవాళ్ళన్నాక అంతే అనో, ఆ ఒక్కటి తప్ప మిగతా అంతా మంచివాడనో, చూసీ చూడనట్లు వదిలేస్తారు. లేకపోతే అదొక అదనపు అర్హతగానో, పురుషత్వానికి నిదర్శనంగానో భావించి దానిపై హాస్యమాడుతుంటారు. ఇంకొన్ని సందర్భాలలో ఆడవాళ్ళపైనే నిందలు మోపి వారే రెచ్చగొట్టారనో, వాళ్ళ గుణం మంచిది కాదనో, వారు ‘అటువంటి’ వారే అని అలాంటి వారితో ఇంకెలా ప్రవర్తిస్తారని రకరకాల వాదనలతో సమస్యను పక్కదోవ పట్టించి బాధితులనే నేరస్థులను చేస్తారు. అందుకే చాలాసార్లు మహిళలు ఇలాంటివి బయటకు చెప్పుకోరు. న్యాయం జరగకపోగా, తమ పరువే బజారున పడుతుందని భయపడతారు. ఇప్పటివరకు ఎక్కువ కేసుల్లో జరిగింది కూడా అదే.

మన దేశంలో కులం, వర్గం కూడా ఈ వేధింపులలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రింది వర్గానికి, కింది కులాలకు చెందిన స్త్రీలు ఇంకా తేలికగా ఈ వేధింపులకు గురవుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు మెల్లమెల్లగా మార్పు వస్తోంది. సమాజం వీటిపట్ల స్పందించే తీరు కూడా మారుతోంది. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిన నిరసన జ్వాల మనకు తెలిసిందే. అందుకు ఫలితంగా నిర్భయ చట్టం రావటం కూడా జరిగింది. ఇక పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 అంతకు ముందు నుండే అమల్లో ఉన్న విశాఖ గైడ్‌లైన్స్‌… చట్టపరంగా ఉన్న రక్షణలు. అదేకాక అమెరికా, తదితర దేశాల్లో బయట పడిన ఈ కేసుల్లో త్వరిత గతిన ఆయా సంస్థలు, యాజమాన్యాలు, నేరస్థులను పని నుండి తొలగించడం చేశారు. ఇది ఖచ్చితంగా ఒక ముందడుగు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయంలో మహిళలకు అండగా తాము ఉంటామని అనేకమంది పురుషులు ప్రకటించడం కూడా స్వాగతించదగ్గ పరిణామం.

ఇటీవలే హర్యానాలో ఒక మహిళా డీజేను ఒక రాజకీయ నాయకుడి కొడుకు వెంటపడి కిడ్నాప్‌కు యత్నించడం, ఆమె తప్పించుకుని ధైర్యంగా, వారికి వ్యతిరేకంగా పోలీసు రిపోర్టు ఇవ్వటం, ఐ.ఏ.ఎస్‌ అయిన ఆమె తండ్రి ఆమెకు బాసటగా నిలవడం, అనేకమంది పౌరులు కూడా ఆమెకు మద్దతు ప్రకటించడం చూశాం. ఇవన్నీ సభ్యసమాజం మహిళా సమస్యల పట్ల సానుకూల దృక్పథం ఏర్పరచుకుంటోందని అనడానికి సంకేతాలు.

ఒక తాజా వార్త! మీ టూ క్యాంపెయిన్‌ మొదలుపెట్టి, మహిళలు ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్యను బహిర్గతం చేసి, చర్చకు పెట్టినందుకు గాను ఆ క్యాంపెయిన్‌లో ప్రముఖులైన కొందరు మహిళలను ఈ ఏడాది పర్సన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ప్రతిష్టాత్మక టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే సమస్య తీవ్రతను నేడు అందరూ గుర్తించి ఒప్పుకోవడమే స్త్రీ లోకపు విజయం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పక్కకు నెట్టి ఈ గౌరవం దక్కించుకోవడం మరింత సంతోషించదగ్గ విషయం.

మహిళలు నేడు ఇల్లు వదిలి చదువు కోసం, పని కోసం, అనేక రంగాలలో కృషి చేస్తూ సమాజంలో ఒక సమాన స్థానం కోసం, గౌరవమైన హోదా కోసం, మనుషులకు కావలసిన కనీస అవసరాల కోసం, మర్యాద కోసం పోరాడుతున్నారు. మరి ఈ పోరాటంలో కుటుంబం, సమాజం, చట్టం…ఈ మూడింటి రక్షణ, సహకారం, ప్రోత్సాహం ఎంతో అవసరం. ఒక హింసారహిత సమ సమాజ నిర్మాణానికి ఇది చాలా అవసరం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.