సీనియర్ రచయిత్రి కొండవీటి సత్యవతి గారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఆమె ప్రారంభించిన స్త్రీ వాద పత్రిక ‘భూమిక’ పాఠకుల మీద, తద్వారా సమాజం మీద చాలా పురోగమన ప్రభావం చూపింది. భూమికలో ఇంచుమించుగా అన్ని శీర్షికలలో స్త్రీ వాదం ఉంటుంది. సత్యవతిగారి ఆశయమే అది. మిగతా సమస్యలు లేవా? అంటే ఉన్నాయి. కానీ ఎవరైతే బాధితులో వాళ్ళ జీవితాలను మెరుగుపరచే మార్గంగా రచయితలు, పత్రికా సంపాదకులు కృషి చేయాలి కదా!
సత్యవతిగారు పత్రిక ద్వారానే కాకుండా కొంతమంది స్త్రీవాద రచయిత్రులను తీసుకొని వెనుకబడిన గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఆలోచనా విధానాలను మార్చడానికి కూడా చాలా శ్రమ తీసుకుంటున్నారు. అది కూడా నాకు చాలా నచ్చింది. పాతికేళ్ళు విజయవంతంగా నడిచిన భూమిక పత్రిక పండగరోజున …………. ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి, నెల్లూరు