నేను 2005లో భూమిక కుటుంబంలో అడుగుపెట్టాను. భూమికతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నాను. మొదట్లో అంతా కొత్తగా ఏమీ అర్థమయ్యేది కాదు. అప్పుడు ఒక చెయ్యి నా వెనుక ఉండి నడిపించింది, అది ఎవరో కాదు సత్యవతి. 2005లో సర్క్యులేషన్ మేనేజర్‌గా అడుగుపెట్టినప్పటి రోజులు గుర్తుకు వస్తే అసలు నేనేనా అనిపిస్తుంది. భూమిక నా జీవితంలో ఎంతో అందమైన పొదరిల్లు. భూమికతో కలిసి నడుస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.
– ఎస్. లక్ష్మి, హైదరాబాద్