-అంజనా బక్షీ
నా మూగ భాషని
నీకు వినిపించగలిగి వుంటే ఎంత బావుండేది!
నా కోరికల గొంతుని
అప్పుడైతే నొక్కేసి వుండేదానివి కాదేమో!
నేను కూడా స్వేచ్ఛగా బతకాలనుకున్నాను
నీ గర్భంలోంచి పుట్టి
నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొట్టాలనుకున్నాను.
నేను మళ్ళీ కొత్త సృష్టి చేద్దామనుకున్నాను.
నీ పైట చాటున దాగి
నా బుల్లి బుల్లి చేతులతో నిన్ను తాకాలనుకున్నాను
నా చిన్నారి గొంతు విప్పి
నిన్ను నోరారా ‘అమ్మా’ అని పిలవాలనుకున్నాను
కానీ నాకా అవకాశం ఇవ్వనేలేదు నువ్వు
నన్ను సృష్టించావు కాని
నా అస్తిత్వాన్ని మట్టిలో కలిపేశావు
చెప్పవా అమ్మా?
ఎందుకలా చేశావు?
నువ్వూ ఒక ఆడదానివేగా?
ఈ కవిత చదివి నేనేమి మాట్లాడలేక పోతున్నాను.కానీ నా కళ్ళు మాట్లాడుతున్నాయి.కన్నీటి భాషలొ…