గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి వసంత కన్నభిరాన్‌

మా విషయంలోనూ ఇటువంటి విషయాలే జరుగుతుంటాయి. ఒక ఎన్‌కౌంటరో, బాంబు దాడో జరుగుతుంది. దాని గురించి ఘోరంగా పోట్లాడుకుంటాము. నేనేం మాట్లాడినా తను ఉద్రేకపడిపోతాడు (నవ్వు)

అక్షయ చెల్లెలు స్నేహశీలి. ప్రేమగా ఉంటుంది. గుజరాతీలో ప్రముఖమైన నాటక ప్రక్రియ ”భావై” గురించి బాగా అధ్యయనం చేసింది. అన్నా చెల్లెళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది. అతను చెల్లి గురించి అన్ని విధాలా శ్రద్ధ తీసుకునేవాడు. చెల్లి బాధపడితే సహించలేకోయేవాడు. అలాగే అతని మరణం ఆమెను బాగా కృంగదీసింది. అన్న నవంబరు 12న మరణిస్తే అదే సంవత్సరం డిసెంబరు 11న ఆమె కన్నుమూసింది.

ఆమెకేమిటి జబ్బు?

తీవ్రమైన కీళ్ళ నొప్పులతో ఆమె చాలాకాలం బాధపడింది. కానీ 1994లో మా కుటుంబంలో చాలా మరణాలు సంభవించాయి. మా కుటుంబంలో ఆరుగురు మరణించారు. అది నిజంగా మాకొక పరీక్షా కాలం. ఆమెలో జీవన కాంక్ష మాయమైంది. అది చూసి అతను చాలా కలవరపడ్డాడు. బరోడా మంచి ప్రదేశం కాదు అదే బొంబాయిలోనైతే అతనికి మంచి సాహచర్యం లభించి ఉంది. అక్కడ రాజకీయ స్పృహ ఉన్న వ్యక్తులెవరూ లేరు. తాను ఒంటరి అయినట్లు అనిపించిందతనికి. ఇవన్నీ అతను నాతో చెప్పేవాడు. ఇది వారిమీద బాగా ప్రభావం చూపించి ఉంటుంది కావచ్చు కానీ నాకు బాగా తెలియదు.

మీ జీవితంలోని అందమైన క్షణాల గురించి చెప్పండి

అందమైన క్షణాలంటే, చాలా ఉన్నాయి మరి… అతను నాతో పెళ్ళి ప్రస్తావన చేసిన క్షణం అందమైనది. అప్పుడు మేము చైనీస్‌ రెస్టారెంట్‌లో ఉన్నాము. రెండు రోజులు సమయం తీసుకుని ఆలోచించి చెబుతానన్నాను. అప్పటినుంచీ రోజూ ఫోన్‌ చేసి నేను సరే అనేవరకూ అడిగేవాడు. సరేనన్నాక, అప్పుడు మేమొక రెస్టారెంట్‌కి వెళ్ళి ఒక సినిమా చూసి ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపాము. అప్పుడు మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. అతను తన ప్రేమను బాగా ప్రకటించేవాడు. అతనెక్కడికి వెళ్ళినా ఆ చోట నుంచీ నాకు ఒక చీర తెచ్చేవాడు. అతనికి మంచి అభిరుచి. ”నువ్వు నీరాకి అంత మంచి చీరెలు తెస్తావు. మాకు మాత్రం ఎప్పుడూ ఒకటే రంగు తెస్తావు” అని అతని చెల్లెళ్ళు అనేవారు.

అంత రాజకీయ కార్యకలాపాల్లో కూడా వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవారన్నమాట!

అతను చాలా సున్నిత స్వభావుడు. నా మీద ఏ మాత్రం ఒత్తిడి ఉన్నా అతను కలవరం చెందేవాడు. నిరాశపరచడం అతనికి ఇష్టముండదు. కానీ అతని భావజాలం విషయంలో మాత్రం చాలా గట్టిగా

ఉంటాడు. కానీ మన వ్యక్తిగత జీవితం, మన లైంగిక జీవితం మనకు చాలా విలువైనవి. మా మధ్య చాలా స్వల్పమైన విభేదాలుండేవి కానీ అతను చాలా సహృదయుడు. మానసిక అణచివేతతో జీవనం గడిపేసిన వితంతువుల అనుభవాలు వింటూ ఉంటే నాకీ మంచి క్షణాలు గుర్తొస్తాయి. అంతెందుకు నాకు అతని భావాలు మరీ ప్రశంసనీయంగా కనబడుతున్నాయి. స్వభావరీత్యా నాకు ఆందోళన ఎక్కువ. అనవసర విషయాల గురించి చింతిస్తూ ఉంటాను. చిన్న విషయాలకు చిరాకు పడతాను. నన్నెవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారనో, ఉపయోగించుకుంటున్నారనో తెలిస్తే బాగా కలవరపడతాను.

అతనొక గోడ. నన్ను పడకుండా నిలబెట్టే గోడ. అతనితో నేను ప్రతి విషయమూ మాట్లాడతాను. నేను పనిచేసే శాఖలో సంభవించే ప్రతి విషయమూ మాట్లాడగలను. అతను నా దృష్టిని విశాలం చేశాడు. తనకి నామీద ఎందుకు కోపం వచ్చిందో చెప్పేవాడు. యూనివర్శిటీలో నా నిమగ్నత గురించి చర్చించేవాడు. నేను చేసిన పనినీ, నేను సాధించిన విజయాలనూ ఎప్పుడూ ప్రశంసించేవాడు. ”నేనెలా స్త్రీవాదినయాన”ని నేను మొదటిగా వ్రాసిన వ్యాసం అతను పోయాక 1995లో ”సౌమ్య శక్తి”లో ప్రచురితమైంది. కానీ నేను మాడ్రిడ్‌ వెళ్ళక ముందే అతనికి చూపించాను. అందులో మా అనుబంధాన్ని గురించి ఏమి చెప్పానో చూపించాను. ఆ వ్యాసంలో అతను ఒకే ఒక మార్పు చేశాడు.

అది నిగ్రహించుకోవడం కష్టం! కనీసం ఒక మార్పయినా చేయాలి కదా!

అందులో మా ముగ్గుర్ని గురించీ వ్రాశాను. మా స్వభావాలు భిన్నమైనవని వ్రాశాను. అతను బహిర్ముఖుడు, స్నేహశీలి. తల్లిగా స్నేహం చేస్తాడు. నేను మితభాషిని, అంతర్ముఖీనురాలిని. మా అబ్బాయి ఈ రెండింటి మిశ్రమం. మేం ముగ్గురం ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మాకు అత్యాశలు లేవు. మేము ఎప్పుడూ ఒకరికన్నా ఒకరం గొప్పవాళ్ళు కావాలనుకోలేదు. ఒకరిని మించి ఒకరం ఎదగాలనుకోలేదు. మేం సాధించినదాంతో తృప్తిపడ్డాం.

మీరు ఒకరి గురించి ఒకరు గర్వపడేవారు కదా!

”నిన్ను గురించి నువ్వు అంత తక్కువ చెప్పుకుంటావెందుకు? ఇంకొంచెం చెప్పుకోవచ్చు కదా” అనేవాడతను. ”అది చాలు నాకు. అంతే నేను కోరుకున్నది” అనేదాన్ని. మా అబ్బాయి గురించి ఏమి వ్రాశానంటే ఒక్కడే సంతానం కావడం వలన బాగా గారాబం జరిగిందన్నాను. అది చదివి వాడు నవ్వేశాడు. మేం ముగ్గురం ఒకర్నొకరం అర్ధం చేసుకున్నాం. ఒకర్నొకరు అర్థం చేసుకోవడం ద్వారా మా భిన్నత్వం ద్వారా మేము మానసికంగా ఎదిగాం. కొన్ని విషయాలలో నా కోసం అతనే రాజీపడ్డాడు. అతని స్నేహితుడిని (షా) నేను సహించాను కనుక రాజీపడడం తన విధిగా భావించాడు.

అతని సరళ మృదుస్వభావం గురించీ, బహిర్ముఖత్వం గురించీ, స్నేహశీలం గురించీ చెప్పారు. మీకు గుర్తున్న చిన్న చిన్న వ్యక్తిగత విషయాలను గురించి చెప్పారు. ఇప్పుడు మిహిర్‌ని చూస్తే అతనెంతో ఆనందించేవాడని చెప్పారు. మీరిద్దరి సాహచర్యం ఇంకెన్నో రోజులు లేదనుకున్న సమయం గురించి కూడా చెప్పారు.

అవును

ఇవన్నీ ఆయన గుర్తించారా?

అతని అంతరాలల్లో గుర్తించే ఉంటాడనుకుంటాను. అందుకే మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడపాలని కోరుకునేవాడు. మేము విడిగా ఉంటే అదే శాశ్వతమవుతుందనుకునేవాడు. ఆయన పన్నెండవ తేదీన మరణించాడు. నేను తొమ్మిదిన ముంబై వచ్చాను. మేమప్పుడు మా ఆడపడుచును చూసుకుంటూ బరోడాలో ఉన్నాము. తొమ్మిది రాత్రి రైలులో ముంబై బయలుదేరాను. అతను నన్ను సాగనంపడానికి వీధి తలుపుదాకా వచ్చాడు. కానీ ఒక మెట్టు తప్పిపోయింది. వంగిపోయాడు. ”ఇదేమిటిలా జరిగిపోయింది? నేను వెళ్ళను…” అన్నాను. ”కాదు… కాదు. నువ్వు వెళ్ళు. పని పూర్తి చేసుకుని రా. నాలుగు రోజులు వెళ్ళు. నువ్వొచ్చాక నేనెళ్తాను. నాకూ వెళ్ళాలని ఉంది” అన్నాడు. అప్పుడు కూడా నేను చెప్పాను, ”ఈ వాతావరణం నుంచీ నీకు పెద్ద మార్పు కావాలి. ముందు నువ్వైనా వెళ్ళాలి, నేనైనా వెళ్ళాలి” అని. ”ముందు నువ్వే వెళ్ళు” అన్నాడు. నాకు పెన్షన్‌కి సంబంధించిన పని ఉంది. అయినా వెళ్ళాలనే ఆసక్తి లేదు. కానీ అతనే ”కాదు నువ్వు వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం దిగులుపడకు” అన్నాడు. ఆ మర్నాడే మా ఆడపడుచు ”వదినని రమ్మని పిలువు” అంది.

”వద్దు వద్దు ఆమెని పిలవవద్దు, త్వరలోనే కోలుకుంటాను. ఈ నొప్పి తగ్గిపోతే ఇంకే సమస్యా ఉండదు” అన్నాడు. ఆ సమయంలో అతని మనసులో రెండు విషయాలున్నాయనుకుంటాను. తనింక బ్రతకననే సందేహం; బ్రతకాలనే ఆశ. అతనికి ఎవరినీ కష్టపెట్టడం ఇష్టముండదు. అందుకే నన్ను పిలవవద్దన్నాడు. రెండవదేమంటే అతను జీవితం మీద ఆశను కోల్పోతున్నాడు. గుజరాత్‌లోని రాజకీయ పరిస్థితి, ముఖ్యంగా బరోడాలోని పరిస్థితి అతనికి మిక్కిలి విచారం కలుగచేస్తోంది. బరోడా ఒక చైతన్యరహితమైన ప్రదేశం. అదివరకు మేము ముంబైలో ఉండగా అతనికి జీవన కాంక్ష ఉండేది, పనులు చేయాలని ఉండేది. జీవితం మీద ప్రేమ ఉండేది. బరోడాలో అంతా నిస్పృహ, చుట్టూరా నిస్పృహ!

ఇప్పుడు నాకు రెండు సంఘటనలు గుర్తొస్తున్నాయి. ఒకటి మా అబ్బాయి వేరే ఉంటాననడం. ఈ విషయం మిహిర్‌ తనతో చర్చించాడు. అది నేనిష్టపడనని వాడికి తెలుసు. అతను వాడిని పూర్తిగా సమర్ధించాడు. ఎందుకంటే గతంలో అతను కూడా ఆ పని చేసి ఉన్నాడు కదా! అప్పుడు వాళ్ళిద్దరూ నాతో మాట్లాడారు. నేను బాగా ఆందోళన చెందాను. ”వాడికి ఇక్కడ ఏమిటి లోపం? కావల్సినంత స్వేచ్ఛ ఉందిక్కడ. ఎందుకు వేరే వెళ్ళి ఉండాలి?” అన్నాను.

అతను చాలా నిర్మొహమాటంగా, ”నేనూ ఆ పనే చేశాను. అతని బ్రతుకు అతన్ని బ్రతకనీ. బొంబాయిలోనే

ఉంటాడుకదా. మనల్ని కలుస్తూనే ఉంటాడు కదా” అన్నాడు.

రెండవది మిహిర్‌ వివాహం చేసుకోకుండా కలిసి ఉండే పద్ధతి ఎంచుకున్నప్పుడు. మేము వాడితో మాట్లాడాం. వాడికి… కాస్త… ఈ సంఘటనలు… అప్పుడు…

మీరు ఒకరికొకరు సాయపడ్డారా?

మా జీవితంలోని క్లిష్ట సమయాల్లో మేం ఒకరికొకరు సాయం చేసుకున్నాం.

మీ ఇద్దరూ కలిసి ఎక్కువ ఆనందించిన విషయాలేంటి?

మేం ఇద్దరం కలిసి సంగీతం వినేవాళ్ళం. సీరియల్స్‌ చూసేవాళ్ళం. చాలా టీవీ ప్రోగ్రామ్స్‌ కలిసి చూసేవాళ్ళం. నేను రెమింగ్టన్‌ స్టీల్‌, ఓప్రా షో ఇష్టపడేదాన్ని. మేమిద్దరం కొన్ని హిందీ, గుజరాతీ కార్యక్రమాలను ఇష్టంగా చూసేవాళ్ళం.

మీరు ముందు పోయి ఉంటే మీరు లేకుండా ఆయన మనగలిగే వారనుకుంటున్నారా? నేను మాట్లాడిన స్త్రీలలో చాలామంది తాము పోతే తమ భర్తలు బ్రతకలేరని చెప్పారు.

నేనూ అదే భావిస్తాను. నేను చాలామందితో చెప్పాను. నేను ముందుపోతే ఆయన భరించలేడని. జీవితం చాలా కష్టమై మరణించవలసిన సమయం కంటే ముందే పోయి ఉండేవాడు.

ఆయన పోయాక ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది?

పదకొండేళ్ళు గడచిపోయాయి. అతను మరణించగానే నాకు జబ్బు చేసింది. రక్తపోటు బాగా పెరిగింది. నా శరీరం గురించిన స్పృహ బాగా పెరిగింది. నా ఆరోగ్య సమస్యల గురించి బాగా పట్టించుకోవడం మొదలుపెట్టాను. వాటి గురించి మర్చిపోయి ఇతర కార్యకలాపాల మీద దృష్టి పెట్టాలి.

ఇప్పుడేం చెబుతున్నారు, ఆయనతో?

ఆయన లేకుండా కాలం ఎలా గడుపుతున్నానో చెబుతూ ఉంటాను. ఇదొక పరీక్షా సమయం అని చెబుతూ ఉంటాను. నేనేం చదువుతున్నానో నన్ను నేను నిలబెట్టుకోవడానికి సహాయపడుతున్న విషయాల గురించి వ్రాయాలనుకుంటున్నాను.

మీరు చదివే విషయాలు మీకు సహాయపడుతున్నాయా? లేక చదవడం ఒక్కటే సహాయపడుతోందా?

మొదట్లో చదవడం మీద మనసు పెట్టలేకపోయేదాన్ని. తరువాత నేను కొన్ని స్త్రీ వాద రచనలూ, విషాదాన్ని తట్టుకొని నిలబడిన వారి రచనలూ చదవడం మొదలుపెట్టాను. గుజరాతీ యువ సాహితీ నేస్తం నాకొక పుస్తకం అంకితం ఇచ్చారు. అదొక ఇంగ్లీష్‌ కవతకు అనువాదం. అందులో ఇలా ఉంటుంది. ”నువ్వు వెళ్ళిపోతావని నేనెందుకు తెలుసుకోలేకపోయాను? నువ్వు వెళ్ళిపోయేటపుడు నీ పక్కనే నిద్రపోతున్నాను. మనం ఎన్ని మధుర క్షణాలు గడిపాం కలిసి?” ఇటువంటి పుస్తకాలు నాకెంతో సాయపడ్డాయి. నన్ను చూడడానికొచ్చే స్నేహితులు కూడా నాకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అటువంటి ఒక పుస్తకం ”హోప్‌”.

కానీ నీరాబెన్‌! ఈ కాలాన్ని, అంటే ఈ పదకొండేళ్ళని ఎట్లా చూస్తున్నారు మీరు?

పదకొండేళ్ళు!! మొదట్లో అది నాకు నిజంగా గడ్డుకాలమే. అంటే అప్పుడు చాలా సమస్యలుండేవి. అక్షయ చనిపోగానే నెలలోగానే మా ఆడపడుచు చనిపోయింది. మరొకవైపు నేను Iూఔూ (8) లోనూ, జఔణూ లోనూ బాగా పనిలో ఉన్నాను. అక్కడ చేయవలసిన పని ఎక్కువగా ఉంది. ఎన్నో వ్రాయవలసి ఉంది. అప్పుడు అక్షయ స్నేహితులూ, సహోద్యోగులూ నాకు బాగా సాయం చేశారు. నేనెక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా నా వెంట ఉన్నారు, పుస్తకాలొచ్చాయి. ఎక్కడైనా సంగీత కచేరీలున్నా, ఇంకే కార్యక్రమాలున్నా నాకు తెలియచేసేవాళ్ళు. మా బంధువులు కూడా నాకు అండగా నిలబడ్డారు. మా అమ్మ, సోదరులు, చెల్లెళ్ళు, బావగారు అందరూ. మొదటి నెలలో నాకు వంట్లో బాగుండక మా అన్న ఇంట్లో ఉన్నాను.

ఈ ఇంటికి తిరిగి రావడం ఎలా ఉంది?

అది నిజంగా చాలా క్లిష్టమైన అనుభవమే! నేనిక్కడికి రాగానే ప్రతిదీ… అతను ప్రతి చోటా కూర్చుని ఉన్నట్లే అనిపించేది. మంచం మీద, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర, టీవీ ముందు. మొదట్లో అతని బట్టలు ముట్టుకోలేకపోయేదాన్ని. చాలా రోజుల వరకూ అతని బట్టల బీరువా తెరవలేదు. ఎందుకంటే తెరిచిన తక్షణమే జ్ఞాపకాలు ముసురుకుంటూ వస్తాయి. చాలా విషయాలు, స్వల్ప విషయాలు… ప్రతిసారీ అతనిప్పుడుంటే బాగుండుననిపించేది. అది పూడ్చలేని శూన్యం! దానిని పూరించాలంటే… రెండు మూడు విషయాలు అవసరం అనుకుంటాను. మొదటిది మనకి బాగా సన్నిహితులు మనని ప్రేమించేవారి శ్రద్ధ, కుటుంబ అండ, మానసికంగా బాగా సన్నిహితంగా

ఉండే కుటుంబం అయితే మరీ మంచిది. రెండవది నా సహోద్యోగుల నుంచీ నాకందిన తోడ్పాటు. వాళ్ళు నాకు కొన్ని బాధ్యతలు అప్పగించి పనిలో మునిగిపోయేలా చేశారు. ఈ అవకాశాలే నా జీవితాన్ని పునర్నిర్మించుకునేలా చేశాయి. నేనొక ఒంటరి జీవితంలో స్థిరపడిపోలేదు. రీసెర్చ్‌ సెంటర్‌, స్పారో (9), జఔణూ, Iూఔూ లతో నాకున్న అనుబంధం, నిమగ్నత ఒకవైపూ, నా కార్యకర్త స్నేహితులు మరొకవైపు నేను మళ్ళీ బ్రతుకు బండి లాగడానికి తోడ్పడ్డారు. ముంబయ్‌లోని నా యువ స్నేహితులు తృప్తి, కల్పన, సంధ్య, పూణె నుంచి దివ్య, షర్మిల మరికొందరు నాకు చాలా సాయం చేశారు. నాకు ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ఇచ్చారు.

నేను మీతో ఒక విషయం నిస్సంకోచంగా చెబుతాను. మొదట్లో నాకు గుర్తింపు వస్తున్నప్పుడు కొంతమంది నేను అక్షయ భార్యను కనుకనే నన్ను గుర్తిస్తున్నారని అనేవాళ్ళు.

అది మామూలే!

(నవ్వు) కొంతమందయితే నా పేరుతో అతనే వ్రాస్తున్నాడనుకునేవారు. తరువాత నేను ఒంటరినైనప్పుడు అనుకునేదాన్ని. నిజంగా అతనిప్పుడొచ్చి నా బదులు వ్రాస్తే బాగుండును అని. అతను నాతో ఉండి నా కోసం వ్రాస్తే ఎంత బాగుంటుంది. మేం కలిసి గడిపిన ఈ జీవితం ఎప్పుడూ తిన్నని బాట కాదు. అయితే సంఘర్షణలు, భిన్నాభిప్రాయాలూ ఉన్నంత మాత్రాన మా వైవాహిక జీవితంలో అన్యోన్యత లేదని కాదు. ఇవన్నీ కూడా మనని ఇంకా దగ్గరికి తెస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తాయి. కానీ అంతర్వాహినిగా ఒకరిపై ఒకరికి ప్రేమ, ప్రశంసా ఉండాలి.

గౌరవం కూడా! ఇచ్చి పుచ్చుకోవాలి. అది చాలా ముఖ్యం.

అవును అది చాలా ముఖ్యం. అది లేకపోతే సంఘర్షణ ఇద్దర్నీ చీలుస్తుంది. సమస్యలు సృష్టిస్తుంది. మా మధ్య వాదాలుండేవి. కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరిమీద రుద్దడం ఉండేది కాదు. అభిప్రాయ భేదాలుండొచ్చు. కానీ అభిప్రాయాలు మనమీద రుద్దడాన్ని సహించలేము. తమ అభిప్రాయాలను గురించిన స్పృహతో ఉండి, వాటిని గౌరవించుకునే స్త్రీల వైవాహిక జీవితం అంత సరళంగానూ, సూటిగానూ ఉండదనుకుంటాను. ఎందుకంటే అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎట్లా పరిష్కరించుకోవాలి ఎట్లా ఎదుటివారిని మెప్పించాలి?

ఒకటి, రెండు విషయాలు నన్నింకా వెంటాడుతున్నాయి. ఉద్యమం ఒక తోడ్పాటునిచ్చే వ్యవస్థగా ఎట్లా పనిచేస్తుంది? ఉదాహరణకి నాకు బంధువులు లేరనుకోండి నా కుటుంబం నాకే మాత్రం అండగా నిలవదు. అప్పుడు ఉద్యమం నాకేం చేస్తుంది. నేను తట్టుకుని నిలబడగలిగేదాన్నా? తట్టుకుని నిలబడడం అంటే మానసికంగా, సృజనాత్మకంగా అని నా భావన. శారీరకంగా కాదు. భావోద్రేకాల ఉరవడిని నిలువరించడానికి వ్యూహాలంటే ఏమీలేవు. మనని పట్టించుకునే ప్రేమ పూరితమైన కుటుంబం ఉంటే, ఏం చేసయినా మనకోసం కొంత సమయం తీసుకుంటుంది. స్త్రీల ఉద్యమంలో ఇది సాధ్యమా? ఇటువంటి బంధాలను సృష్టించి నిలపగలమా అనేదే మనముందున్న సవాలు.

రెండో విషయం ఏంటంటే ఇటువంటి క్లిష్ట సమయంలో మనం కుటుంబాలను ఎట్లా అంచనా వేస్తాం? మనకు అండగా నిలిచే కుటుంబం లేకపోతే ఏమవుతుంది? ముఖ్యంగా పశ్చిమంలో కుటుంబ సంబంధాలు అంత పటిష్టంగా లేనిచోట!

వాళ్ళకీ వ్యక్తిగతంగా ఇటువంటి కష్టాలొస్తాయి. వాటిని వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు? ఈ విషయం నన్ను బాగా ఆలోచింపచేస్తోంది. నేను గమనించాను. వైవాహిక జీవితంలో ఆనందం సృష్టించుకోలేని దంపతులూ, వైవాహిక జీవితంలో అణచివేత మాత్రమే అనుభవించిన దంపతులూ విడిపోతారు. అందులోనే గొప్ప ఉపశాంతి. భర్త మరణానంతరం జీవితం సంతోషంగా గడిపే స్త్రీలను కూడా చూశాను. నెత్తిమీద పెద్ద భారం దిగిపోయినట్లు భావిస్తారు వాళ్ళు. ఒక సంపూర్ణమైన సంపద్వంతమైన జీవితం అనుభవించిన స్త్రీకి ఉండే సంతృప్తే అప్పుడు వీళ్ళకి ఉంటుందనుకుంటాను. క్రమంగా మార్పు వస్తున్న సమయం ఇది. ఈ జీవితానికి అలవాటుపడుతూ నేను మరింత సృజనాత్మక కృషి చెయ్యాలి. ఈ సవాళ్ళను నేను ఎదుర్కోవాలి. అతనుంటే నాకు పెద్ద అండ, ఆనందమూనూ, కానీ అతను లేడు. కానీ ఇది కూడా సంతృప్తిగానే ఉంది. ఇట్లా వ్రాసుకున్నాను. చదివి వినిపిస్తాను.

సరిగ్గా సంవత్సరం అయింది నిన్ను చూసి. ఆ రోజు రాత్రి పదింటికో, పదిన్నరకో నిన్ను వదిలి వెళ్ళాను.

అదే ఆఖరి చూపు:

ఇవి నా భావాలు కొన్ని. నేనివ్వన్నీ మీతో నిజాయితీగా పంచుకున్నాను. నాకెంతో బలాన్నిచ్చినవి. నాకెన్నో అవకాశాలొచ్చాయి. నా జీవితం కొనసాగించడానికి ఒక ధ్యేయాన్నిచ్చిన నా స్నేహితులు, సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఎన్నోసార్లు ఆరోగ్యసమస్యలు వచ్చాయి. సరిపోయినంత కాలం బ్రతికాను, అలసిపోయాను అనిపించింది. కానీ ఒక అర్థవంతమైన జీవితం గడపాలి. ప్రజలకు సహాయపడాలి. ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనే కోరిక లేదు. చివరగా ఒకటి చదివి వినిపించి ఆపేస్తాను.

నేను వెయ్యిమంది శాంతి మహిళలలో ఒకరిగా గుర్తింపబడిన వార్త అందినప్పుడు వ్రాసుకున్నాను.

ఇవ్వాళ మళ్ళీ నాకు మాట్లాడాలనిపిస్తోంది.

నీ సమక్షంలో, నీతో ఆనందం పంచుకోవాలనిపిస్తోంది.

మా కుటుంబం ముస్లిం వ్యతిరేకం. కానీ మేమిద్దరం మత సామరస్యాన్ని కోరుకుంటాం. ఆ విషయమై మిహిర్‌ పనిచేస్తున్నాడు కూడా. కనుక దాని గురించి మాట్లాడడం చాలా కష్టం. నేను ముస్లిం మతతత్వాన్ని అనుభవించలేదు. కాబట్టి నాకు తెలియదు. హిందూ మతతత్వం చాలా స్పష్టమైనదని తెలుసు.

నా చెల్లెలు యు.ఎస్‌.లో ఉంటుంది. ఆమె కొడుకు ఈ మధ్యనే ‘పర్జానియా’ అనే సినిమా తీశాడు. పర్జాన్‌ అనేది ఒక పార్శి అబ్బాయి పేరు. 2002లో గుజరాత్‌ మత ఘర్షణలలో చిక్కుకుపోయిన ఒక పార్శీ కుటుంబం కథ అది. ఈ మధ్యన మా ముగ్గురు అక్కచెల్లెళ్ళం ఆ సినిమా చూద్దామనుకున్నాం. అహ్మదాబాద్‌లో ఉన్న చెల్లెలికి ఆ సినిమా నచ్చలేదు. సినిమాలో సాంకేతికత నచ్చింది కానీ అందులో సెంటిమెంట్‌ నచ్చలేదామెకి. ఆ సినిమాను గుజరాత్‌ ప్రజలు సహించరని చెప్పింది. తరువాత మా రెండో చెల్లెలు కూడా అహ్మదాబాద్‌లో ఆ సినిమాని ఎవరూ మెచ్చరన్నది. అలాంటి విషయాలున్నాయి…

మేమూ ఎదుర్కొన్నాం ఇటువంటివి… చాలా కష్టం.

చాలా కష్టం. అక్షయ కూడా ఇదే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువంటి వాటితో వ్యవహరించడం కష్టం. అతను వెంటనే వాదన మొదలుపెట్టేవాడు కానీ ఈ మత రాజకీయాలనూ, శివసేన స్థానాన్నీ గురించిన వాదనలతో అతను నెగ్గలేకపోయేవాడు. తనను తాను నిగ్రహించుకోలేకపోయేవాడు. బంధువులకి అతనంటే గౌరవమే కానీ వాళ్ళ నమ్మకాలను వాళ్ళు ఒదులుకోలేరు కదా? అతను తరచూ అనేవాడు, ”మనం వాళ్ళను గౌరవిస్తాం వాళ్ళను నొప్పించలేము. అందుకని వాళ్ళతో వాళ్ళ రాజకీయాలు మనం చర్చించవద్దు. వాళ్ళు కూడా మనతో అలా చేయవచ్చు కదా” అని. ఎంతసేపటికీ తమని గురించి మాట్లాడుతూ ఎదుటివారిని గౌరవించని వాళ్ళను చూస్తే అతనికి కోపంగా ఉండేది. చివరి చివర్లో మనుషుల్లోని జడత్వాన్నీ, అసహనాన్నీ చూసి చాలా నిస్పృహ చెందేవాడు, చింతించేవాడు.

ఎలా నిర్వహించుకొస్తున్నారు జీవితాన్ని ఇప్పుడు?

ఆరోగ్యం బాగానే ఉంది. ఆర్థిక భద్రత ఉంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చెయ్యలేం కదా! ఆర్థిక భద్రత ఉండడం వలన స్వతంత్రంగా మంచి సౌకర్యంగా మంచి జ్ఞాపకాలతో జీవిస్తున్నాను. ఇవేవీ లేకపోతే జీవితం మీద ప్రేమ ఉండదు.

అది నిజం

అధీనత స్వరూపం ఏదైనా మనకొక తోడ్పాటు వ్యవస్థ లేకపోతే ఇటువంటి విషాదాన్ని తట్టుకోవడం కష్టం. మన వ్యక్తిత్వంలో ఆ ధైర్యం నిక్షిప్తమై ఉన్నప్పటికీ మనం ఎంచుకునే విషయాలవల్లా, అందుకు అనువైన పరిస్థితులవల్లా కొంతమంది కొన్ని పనులు చెయ్యగలుగుతారు.

నిస్సందేహంగా! చిన్నప్పుడు మనం పోరాడగలం, వృద్ధాప్యంలో దీనికోసం పోరాడడం చాలా కష్టం

అవును చాలా కష్టం. మీరు శారీరకంగా ఏమీ చేయలేరనుకోండి అప్పుడెలా? అప్పుడే మనకి రాజ్యం నుంచీ తోడ్పాటు కావాలి లేదా సామాజిక తోడ్పాటు వ్యవస్థ ఉండాలి. అప్పుడు జీవితం జీవించడానికి కాస్త వీలుగా ఉంటుంది.

నిజం. రేపటి భోజనం ఎట్లా అని ఆలోచించే పరిస్థితుల్లో దుఃఖించడానికి సమయమెక్కడ?

అయినప్పటికీ, ఆ నష్టం, ఆ శూన్యం, ఆ దుఃఖం అంతర్వాహినిగా ఉంటూనే ఉంటాయి. మీ మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. చాలామందితో చెబుతూ ఉంటాను కూడా. మీరు, కల్పనా ఎయిర్‌పోర్ట్‌ నుంచీ వచ్చారు. అప్పుడు మీరన్నారు ”ఏడవాలనిపిస్తే ఏడవండి. మన ఉద్వేగాలను వ్యక్తీకరించుకోవడానికి బెరుకు పడక్కర్లేదు. బలహీనత అనుకుంటారని భయపడక్కర్లేదు. మనం స్వేచ్ఛ పొందాం కనుక దుఃఖం ప్రకటించకూడదని అనుకుంటారు చాలామంది. అది కష్టం”.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.