పరియేరుం పెరుమాళ్‌ గుర్రం ఎక్కిన పెరుమాళ్‌ (దేవుడు) – ఆలమూరు సౌమ్య

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి! ఎక్కడ మొదలెట్టాలి! తరతరాలుగా మకిలి పేరుకుపోయి, పేరుకుపోయి గట్టిపడి పెద్ద గుదిబండలాగ తయారైతే దాని నెత్తి మీద సరిగ్గా గురిచూసి నడిబొడ్డులో ఒక్క వేటు… అదే ఈ సినిమా! అతని భాషలో చెప్పాలంటే ”నరుక్కున మండైలో ఒన్న పోట్టాన్‌”. ఇదొక రష్ట్రశీషసవతీ… జీర్ణించుకోగలిగితే, కనీసం అంగీకరించగలిగితే మనలో మార్పు మొదలైనట్లే.

సినిమా మొదట్లోనే ఒక పాట వస్తుంది ”కరుప్పి నా కరుప్పి” అని. అందులో ఒక వాక్యం… ”మనల్ని చంపిందెవరో నాకు తెలుసు. అక్కడ చచ్చిందెవరో వాడికి మాత్రమే అర్థమవుతుంది…” ఇదే సినిమా. ఈ ఒక్క వాక్యంతో సినిమా మొత్తం చెప్పేసారు. ఒక మారుమూల పల్లెలో నలుగురు దళిత యువకులు వేటకుక్కలతో సహా ఒక చిన్న గుంటలో కాళ్ళు తడుపుకుంటూ సేద తీరుతుంటే, ఎగువ కులం వాళ్ళు అది చూసి ఆ గుంటలో ఉచ్చ పోసి, వీళ్ళకెంత ధైర్యం! గుణపాఠం చెప్పాలి అనుకుని, వాళ్ళ కుక్క కరుప్పిని చంపేస్తారు. అప్పుడు హీరో వేదన…

”చచ్చింది నువ్వా? బతుకున్నది నేనా?

చచ్చింది నేనా? బతికున్నది నువ్వా?

మనల్ని చంపిందెవరో నాకు తెలుసు. అక్కడ చచ్చిందెవరో వాడికి మాత్రమే అర్థమవుతుంది…”

అక్కడ చంపింది కుక్కను మాత్రమేనా?!! ప్రశ్న! ప్రశ్నతో మొదలవుతుంది కథ. వాళ్ళు ప్రశ్నించడం మొదలెట్టారు. మిగతా సమాజం ఆ ప్రశ్నను ఎదుర్కోలేక, ప్రశ్నించే హక్కును సహించలేక అనేకానేక పన్నాగాలు పన్నుతోంది. మొన్నటి ప్రణయ్‌ హత్య దీనికి సాక్ష్యం. అదే ఈ సినిమా!

ఆ పల్లెటూరులోని, దళితవాడలోని కుర్రాడు లా చదవాలని పట్నంలో లా కాలేజీలో చేరితే, ప్రశ్నించడం మొదలుపెడితే ఎలా తొక్కిపెట్టాలని చూసారో నగ్నంగా చూపించిన సినిమా. వీటన్నింటినీ ఇన్నాళ్ళూ భరించడం అలవాటైపోయినా, చదువు జీవితంలో ప్రవేశించగానే గొంతెత్తాలని, ప్రశ్నించాలని ప్రయత్నించిన ఓ కుర్రాడి కథే ఈ ”పరియేరుం పెరుమాళ్‌”.

చదువు… ఈ సినిమా చదువు యొక్క ఆవశ్యకతను తెలుపుతుంది. ముఖ్యంగా వెనుకబడ్డ వాళ్ళ జీవితాల్లో చదువు ఎంత అవసరమో చెబుతుంది. అంబేద్కర్‌ సిద్ధాంతాల సారాన్ని చెబుతుంది. కాలేజీలో ప్రిన్సిపల్‌ ఆ కుర్రాడితో ఒక మాట అంటారు… ”అబ్బాయ్‌, నేనూ నీ జాతి వాడినే! ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ చదువుకున్నాను.

ఎప్పుడూ చదువుని విడిచిపెట్టలేదు. ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు వీళ్ళంతా సార్‌… సార్‌ అంటూ నా వెనుక పడుతున్నారు. చదువుకో! అదే నిన్ను నిలబెడుతుంది.” అదే ప్రిన్సిపల్‌ మరో సందర్భంలో ఒక టీచర్‌తో అన్న మాటలు…

”ఆ అప్పర్‌ క్యాస్ట్‌ వాళ్ళను ఆ పనులు చెయ్యొద్దని ఆపగలమా? తప్పని చెబితే వింటారా?

మరెందుకు ఈ కుర్రాడికి చెప్తున్నారు? పోరాడనివ్వండి.”

ఈ వాక్యంతో ఇన్నాళ్ళూ ఫేస్‌బుక్‌లో చూసిన అనేకానేక జ్జానబోధల పోస్టులు కళ్ళముందు గిర్రున తిరిగాయి. నాస్తికులు ఓరిమితో ఉండాలని, స్నేహంగా, ప్రేమగా చెప్పాలని, ఆస్తికులు మాత్రం విర్రవీగొచ్చని చేసిన జ్ఞానబోధలన్నీ గుర్తొచ్చాయి. మార్పు రావాలంటే నాస్తికులే ఓపికగా ఉండాలంట.

ఆస్తికులు ఎలాంటి అవాకులు చెవాకులైనా పేలొచ్చట. ఈ వాదనకు సమాధానమే ఆ ప్రిన్సిపల్‌ మాటలు. అధికారం కొందరి చేతుల్లో, వీళ్ళ శాసనాలను నడిపించడానికి మరో దళం! ఒక ముసలాయన డబ్బులు తీసుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళ కులం అమ్మాయి, తక్కువ కులం వాడిని ప్రేమించిందని, ప్రమాదం అని భావించగలిగేలా బస్సులోంచి తోసి చంపేస్తాడు.

మరో బారు జడున్న అమ్మాయికి గుండు గీసేసి, ఇంక వాడు మీ అమ్మాయిని చూడడులే, మన కులానికేం భయంలేదు అని ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇస్తాడు. మరో అమ్మాయి, తక్కువ కులం వాడిని ప్రేమించిందని పీక పిసికి చంపేస్తాడు.

ప్రాణం పోయినా ఫరవాలేదు, కులం పోకూడదు! వాళ్ళ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడని మరో అబ్బాయిని నీళ్ళల్లో ముంచి చంపేస్తాడు. ఈ హత్యలేవీ ఎవరికీ అనుమానం కలిగించవు. ‘ప్రమాదవశాత్తు’ అని అనిపించేలా ఉంటాయి. అదే ఈ దళారులు చేసేది. వాళ్ళవంతుగా మనుషులను చంపేసి, కులాన్ని కాపాడుతుంటారు. ఇదో వ్యవస్థ!

కుర్రాడి తండ్రి ఆడవేషం వేసుకుని భోగమ్మేళంతో పాటు డాన్సులు చేస్తుంటాడు. అతని గొంతు ఆడగొంతు. మనిషి రూపం ఆడవాళ్ళకు దగ్గరగా ఉంటుంది. అతన్ని తండ్రిగా చెప్పుకోలేక డబ్బులిచ్చి ఇంకో తండ్రిని తీసుకొస్తాడు కాలేజీకి. కొంత కథ నడిచాక, తన జీవితంలో తండ్రి పాత్ర గ్రహించి సొంత తండ్రినే కాలేజీకి తీసుకెళ్తాడు. అప్పుడు ప్రిన్సిపల్‌ అనే మాటలు…

”నీ తండ్రిని తండ్రిగా చెప్పుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. నా తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు. నేనెప్పుడూ ఆయన్ని ఏమార్చలేదు”. ఈ మాటల్లో ఆంతర్యం… నిన్ను నువ్వుగా గుర్తించుకోవడానికి సిగ్గుపడకు. నీ అస్తిత్వాన్ని నువ్వు గౌరవించు.

ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే రెండు వైపులా, రెండు పార్శ్వాలను చూపించింది. వెనుకబడిన వాళ్ళల్లో రెండు పార్శ్వాలు… ఒకటి హీరో తండ్రి… బానిసత్వం అలవాటుగా మారిపోయిన తరానికి ప్రతినిధి. వాళ్ళ జీవితాల్లో చదువు లేదు. ప్రశ్న లేదు. ఇదే ”+Iహజుచీ” అనుకుని అంగీకరించేసారు. ఎన్ని అవమానాలు చేసినా, అందుకే పుట్టాం అని మనసా ఒప్పుకునే మనుషులు. స్వదేశీ బానిసలు… అలవాటు చెయ్యబడిన స్థితి, ధిక్కారం చూపించలేని ఆర్థిక, సామాజిక పరిస్థితి, దేవుడు, దెయ్యం పేరుతో భయాలు… ఇవన్నీ బానిసత్వాన్ని ‘అశీతీఎaశ్రీ’ గా తీసుకునే పరిస్థితులను కలిగించాయి. తరతరాలుగా జరిగితే అలవాటైపోతుంది కూడా!

ఈ స్థితికి ప్రతినిధి ఆ కుర్రాడి తండ్రి. రెండో పార్శ్వం చదువుకుంటూ, ప్రశ్నించడం నేర్చుకుంటున్న ఆ కుర్రాడు. అలాగే అప్పర్‌ క్యాస్ట్‌లోనూ రెండు పార్శ్వాలు… కొంత సంయమనంతో వ్యవహరించినా, పిల్లలపై ప్రేమ కలిగి, గతాన్ని వదులుకోలేక, మార్పుని పూర్తిగా ఒప్పుకోలేకపోయినా, మారే దిశలో ప్రయత్నాలు చేస్తున్న ఆడపిల్ల తండ్రి. కులం, మతం అంటూ మనుషులకన్నా సంస్కృతి, సంప్రదాయమే మిన్న అనుకునే నేటి పూర్తి రైట్‌ వింగ్‌ యువకుడు.

చివరిగా రెండువైపులా మారుతున్న వాళ్ళిద్దరి మధ్య సంభాషణ…

”పిల్ల తండ్రి – నువ్వు మంచి కుర్రాడివి, మా వాళ్ళు ఇంత హింసించినా నువ్వు నా కూతురికి ఏమీ చెప్పలేదు. ఓర్పుతో పోరాడుతున్నావు. బాగా చదువుకో. పైకి రా. చూద్దాం!

ముందు ముందు రోజులు మారతాయనే నమ్మకం నాకుంది. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. నిన్నింత బాధపెట్టినందుకు క్షమించు”. కుర్రాడు – మారవు. మీరు మీలా ఉన్నంతవరకు, నన్ను ఆ కుక్కలా చూసినంతవరకూ పరిస్థితులు మారవు. మీరు, మేము అందరం చేయి చేయి కలిపి, ముందుకు అడుగేసేవరకూ పరిస్థితులు మారవు. అవును!

అందరూ కలిసి ముందుకు అడుగేసేవరకు ఏమీ మారదు!

ముఖ్యంగా ముందడుగు వెయ్యాల్సింది అధికారం చెలాయించేవాళ్ళు, అసమానత్వాన్ని ఆస్వాదించేవాళ్ళు.

ుaసవ a పశీష మారి సెల్వరాజ్‌. ఇదీ పా. రంజిత్‌ సినిమా. ఇదీ పా. రంజిత్‌ ముద్ర. బలమైన ముందడుగు!

చీశ్‌ీవ: ఈ సినిమా ూఎaఓశీఅ ూతీఱఎవ లో ఉంది. ూబప ుఱ్‌శ్రీవర కూడా ఉన్నాయి. చూడండి. గ్రహించండి. అంతా బాగుంది, ఎక్కడా ఏ వివక్షా లేదు అని అనుకునే వాళ్ళకు ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం. ఇది నిజం. ఇదే నిజం!

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.