వాళ్ళు గోడకు దగిలించుకున్న
రాధాకృష్ణులు కారు…
అమర ప్రేమికుల్లా లైలామజ్నూలో కాదు!
రోజూ మనం టీవి సీనిమాల్లో చూస్తున్న
కులం పంజరాల్లో ఎగిసిపడే
ప్రేమ పాపురాలు కారు..
వాళ్ళు నిజంగా ప్రేమికులు…
కులాంకారం రక్తపుటేరులై
పారుతున్న ధనాంకార
రాజ్యం మీద ఎగిసిపడిన
ప్రణయామృతం వాళ్లు…
కులం అడ్డుగోడల్ని
ధనహంకారపు పరువు కోటల్ని
ఆడుకొని తమ దేహం
హృదయాల్ని బిల్లంభులు
బాణాలుగా అమానవీయతపై
సంధించిన వాళ్ళు..
కుల దురహంకార కోటగోడలపై
నిల్చోని… ఏది ప్రేమో..పరువో
కులం కన్నా గుణం మిన్నని
ఎలుగెత్తి… ప్రేమశిఖరాల పైనుండి
ప్రణయామృతాన్ని వర్షించిన
సౌందర్య ప్రేమికులు వాళ్ళు….
దుర్మార్గ
కనిపెంచిన వాళ్ళ ఆధిపత్యం కన్నా
ఆత్మీయంగా అండగ నిలిచే
మానవీయతకు ప్రణమిల్లిన వాళ్లు
అహంకారపు కోటల్లో..
ఆధిపత్యం అక్రమ సంపాదనలే
పరువు పరుపుల్లో కుృలుకే
దుర్మార్గాన్ని…. ప్రేమ ఖడ్గాలతో
అంతమొందించాలనుకున్నా
సగం హృదయాన్ని కోసేసి…
నెత్తుటి మడుగున… ఖడ్గాల
అంచులకు అమృతాన్ని పూసి
ప్రేమించడం అంటే
ప్రేమని కోసం ప్రాణమివ్వడం
మానవత్వం అంటే…
కులాలకన్నా గుణాలే మిన్నని
మనుషుల హృదయాల్లో
ఒండిన ప్రణయామృతం…