-టి. సంపత్ కుమార్; టి. మాధవీలత
ఎప్పటికీ వాడని
తెల్ల కలువ
బహాయ్
రాతి చెమ్మల చలువ
ధూమ్ ధామ్ గా
వెలిసింది అక్షరధాం….
టెర్రరిస్టుల దృష్టిపడి
భక్తి ఢాం…ఢాం…
ఏ పుట్టలో
ఏ పాముందో..?
ఏ బస్సులో…??
ఢిల్లీ అంటే అదేమరి!
నలభైపైన ఉష్ణోగ్రత
పవర్‌కట్లు
ధూళి మేఘాలు
చమట రాగాలు
జీరోకి దగ్గర్లో…
చలిగాలులు
పవర్ కట్టయిందా
షివరింగ్ దారులు
రాజస్థాన్
ధూళి మేఘాలతో
ఢిల్లీ బుగ్గలనిండా
టాల్కమ్ పూస్తుంది
ఢిల్లీ పోలీసు లారికి
ఎంత టెక్కో!
గొప్పగొప్ప నేతల్ని
బాదింది మరి!!
బాపూ! నీ చివరి మాటలు
ఘనీభవించాయి
రాజ్‌ఘాట్‌లో
హే రామ్!
ఇద్దరూ డాక్టరేట్లు!
గొప్ప మేధావులు!!
కోట్ల ప్రజలు
ఇంకా వేలిముద్రలే!!!
దివంగత ప్రధానులకు
ఇంతచోటా?
పేదలకు ఎన్నో
బస్తీలు కట్టొచ్చు!