అమ్మ-నాన్న , ముద్దులకూతురు

వి ప్రతిమ
ఒక తెల్ల కాగితం మీద అమ్మః అన్న పదం వ్రాస్తే చాలు దానికి మించిన మమకార మహాకావ్యం మరోటుండదు అంటారు గోపీగారోచోట… నిజానికిది అక్షరలక్షలు చేసేమాట…
భగవంతుడు తాను ప్రతిచోటా వుండడం సాధ్యం కాక తల్లిని, తండ్రిని సృష్టించాడు తనకి బదులుగా అని చెప్పేది మా అమ్మమ్మ.
డాపప పి. విజయలక్ష్మి వ్రాసిన ఃఅమ్మ, నాన్న – నేనుః అన్న పుస్తకం చదువుతూంటే మస్తిష్కపు పొరలను చీల్చుకుని ఎక్కడెక్కడో లోతుకి ప్రయాణించి అనుబంధాల మీది దుమ్మును తుడిచి ఆనందార్ణవాలను మోసుకు రావాలన్పిస్తుంది ఎవరికయినా…
ఇది విజయలక్ష్మిగారి తొలి కావ్యం… ఆమె కవయిత్రిని కావాలని కలలుగనో, రచయిత్రిని కావాలనుకునో ఈ కవిత్వం వ్రాయలేదు. తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తాను ఏంచేయగలనా అని ఆలోచించి ఈ నివాళినర్పించారు. అమ్మా, నాన్న చనిపోయిన రోజున తన అక్కలు వడలు చేసి, పాయసం చేసి నైవేద్యం పెడతారు. అవి రెండూ చేయడం చేత కాదు కనుక తాను ఏ విధమైన నేవేద్యం సమర్పించగలనా అని మధనపడి ఈ కవిత్వం వ్రాశారు ఆమె.
నా ఈ గీతాలు
ఈనా నివేదన
మీకెలా చేర్చను
చేర్చినా చదవలేరు కదా
ఎందుకంటే
అమ్మ కళ్ళద్దాలు ఇక్కడే
దేవుడిగదిలో వున్నాయి భద్రంగాః అంటుంది
ఇది చదివి గుండె గొంతులోకి రాకుండా వుంటుందా?
ఇది కేవలం విజయలక్ష్మి బాల్యం మాత్రమే కాదు
తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ దాన్ని సార్వజనీనం చేసిన తీరు అపూర్వం. కవితందామో, గ్రంథమందామో, పుస్తకమనే అందామో కానీ యివన్నీ ఆమె గుండెలోతుల్లో నుండి మొలకెత్తిన అక్షరాలు.
అమ్మా, నాన్న వున్నప్పుడు… లేదా ఎవరయినా సరే దగ్గర వున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలీదు.వాళ్ళేదయినా మాట్లాడబోతే విసుగుపడతాం.. సమయం లేదు త్వరగా చెప్పమని కసురుకుంటాం కూడా. ఇది దాదాపుగా అందరికీ అనుభవైకవేద్యమే.
ఃఒక్కసారి రామ్మా
చాలా చెప్పాలి నీతోః అంటూ దయనీయంగా పిలుస్తుందీ కవయిత్రి… ఇంకెప్పుడూ నువ్వు మాట్లాడుతుంటే నాకు కేసుందని వెళ్ళిపోనమ్మా అంటూ సంజాయిషీ చెప్తుంది.. రకరకాల హోదాల్లో నుండి ఆమె తల్లిని పిలిచిన తీరు, ఒక్కసారి వచ్చిపొమ్మని బ్రతిమాలిన విధం పాఠకుడి గుండెని ద్రవీభవింప చేస్తుంది.
చాలా తేలికపదాల్లో, చిన్న చిన్న వాక్యాల్లో నుండి వస్తువుని సహజాతి సహజంగా చెప్పడం చాలా కష్టమైన విషయ మంటారు మేధావి రచయితలు… అలా చాలా మామూలు, రోజువారీ పదాల్లో నుండి ఎంతో సహజంగా ఒక గొప్ప జీవితాన్ని ఆవిష్కరించిందీ కవయిత్రి.
మొత్తం ఆ ఇల్లు, ఆవూరు, ఆకుటుంబం, వారిలోతైన అనుబంధాలు… ఒక అల్లరిపిల్ల యివన్నీ మన కళ్ళముందు ఒక ఆయిల్‌పెయింటింగులా పరుస్తుందామె.
శ్రీకృష్ణుడు చూసివుంటే
వదిలేవాడా మనవూరిని
ఇంతకంటే బావుంటుందా
మధురానగరంఃః అంటూ గొప్పగా ఉపమిస్తుంది.
మన ఇంటిని అంకణాల్లో, చదరపు టడుగుల్లో కొలవద్దు ప్లీజ్‌, రూపాయల్లో లెక్క కట్టొద్దని వేడుకుంటుంది.
జీవితాన్ని అత్యంత తేలిగ్గా తీసుకునే ఈజీగోయింగు పురుషుడి భార్య తప్పనిసరిగా రాటుదేలుతుంది. కొవ్వొత్తయి కరిగి పోతుంది.
చూపుపోయాక నాన్నకు చేతికర్రవైన నువ్వు భారతావనికి ముందే వుండి వుంటే గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని వుండేది కాదేమో అంటూ తల్లితండ్రులిరువురి ప్రేమైక అనుబంధాన్ని గురించి మాట్లాడుతుంది.. ఃప్రేమంటే ఇదిః అంటూ ప్రేమైక జీవన సౌందర్యాన్ని గురించి చెప్తుంది… ఆత్మల్ని సబ్బుపెట్టి కడుక్కోవల్సిన, శుభ్రపరుచు కోవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తుంది.
మామూలు పదాలతో జీవితాన్ని ఆవిష్కరించిందని అన్నానే గానీ పాఠకుల్ని అబ్బురపరిచే అభివ్యక్తులు కూడా ఇందులో వున్నాయి.
ఃగుండెల్లో తడి కంటిలోనికి రానంటోందిః అంటుంది
నిజానికి మనం ముసుగులేసు కోవడం మొదలుపెట్టాక దాదాపుగా అందరం ఏడవడం మానేశాం. గుండెల్లోని తడిని కంటిలోనికి రానివ్వకుండా అక్కడే అణిచేస్తున్నాం. లేదంటే ముసుగు తడిచి చివికిపోతుందన్న భయం కూడ కావచ్చు.
ఆ క్రమంలో ఏడవాల్సిన సమయంలో కూడా ఏడుపు రాకుండా కంట తడి తగలకుండా అయిపోయాం మనం. ఇంతవుంది ఈ ఒక్క చిన్న వాక్యంలో…
అలాగే మరో కవితలో
క్రమంగా అలగటం మర్చిపోయాను
బ్రతిమాలడం వుంటేనే కదా
అలకకు అందంః అంటూ ముగిస్తుంది
ఈ బ్రతిమాలడం వుంటేనే కదా అలకకు అందం అన్న ఈ ఒక్క వాక్యం గురించి ఎంతయినా చెప్పుకుంటూ పోవచ్చు… ఎంతయినా సమీక్షించుకు పోవచ్చు… మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయి పోయి మనుషులు మను షుల్ని కాకుండా వస్తువుల్ని ప్రేమించేటు వంటి దారుణమైన సామాజిక సందర్భంలో వున్నాం మనమిప్పుడు.
అలగడం… ఒకవేళ అలిగినా బ్రతిమాలడం, బుజ్జగించడం అన్న పదాలన్ని ఎప్పుడో జీవిత నిఘంటువులోంచి తీసి పారేశాం. వాటిని మళ్ళీ మన హృదయ పుస్తకాల్లోకి చేర్చుకోవలసిన అవసరాన్ని చాలా అలవోగ్గా జీవితంలోంచి విప్పి చెప్తుంది.
సుందరకాండ, అరణ్యకాండ, యుద్ధ కాండ అన్న మూడుకవితల్లో బాల్యం … లేదా పెళ్ళికి ముందువరకూ, పెళ్ళి తర్వాత, నడివయస్సు వృద్ధాప్యంలో యుద్ధం.. ఇలా పరస్పరానుబంధంలో ఈ మూడు కవితలు వ్రాశారనిపిస్తుంది.
కథలయితే ఒకరికొకరం చెప్పుకోగలం కానీ కవిత్వాన్ని ఎవరికి వాళ్ళుగా చదివి అనుభూతించాల్సిందే… చివరగా ఆమె ఏమంటుందంటే తల్లితండ్రుల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. లేదంటే అంతకు నాలుగురెట్ల సమయం గిల్టీగా ఫీలవడానికి కేటాయించాల్సి వుంటుంది అని హెచ్చరిస్తుంది.
ఒకే ఒకసారి కలిసినప్పటికీ భావోద్వేగంతో, గుండ్రాళ్ళ మీద స్వచ్ఛంగా పారే సెలయేరులా ఆమె మాట్లాడిన తీరు చాలా దగ్గరితనాన్ని కలిగించింది… ఆమెలోని భావుకత్వానికి చిన్న పాదు చేసి చెంబుడు నీళ్ళు పోయగలిగితే గొప్ప రచ యిత్రి బయటికి వస్తుందనిపిస్తోంది.
మా నెల్లూరు రచయితల జీవితాలలో మరో గొప్ప కలంతోడవగలదన్న స్వార్థంతో ఏమాత్రం తీరికలేని తనంలోంచి కూడా నేనీ పుస్తకాన్ని పరిచయం చేయదలిచాను.
తల్లితండ్రులున్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా కొని చదవాల్సిన పుస్తకం ఇది.
అమ్మానాన్న-నేను: డా.పి.విజయలక్ష్మి
వెల: అమూల్యం
కాపీలు: డా. పి. విజయలక్ష్మి, 16 పప /246, గాంధీనగర్‌, నెల్లూరు 524 001

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో