నిండు ముత్తైదువ మన తెలుగు
ముచ్చట గొలుపే తొలిసంధ్య వెలుగు
అనుస్వార రూప అక్షరాల జిలుగు
అన్నమయ్య పదాల తెలుగు తళుకు
సిద్ధేంద్రుని నాట్యపు పాదాల కులుకు
వేమన పరివర్తన పద్యాల కొత్త పలుకు
అజంత మైన పదాల పోహళింపు
అజరామరమగు అలంకారపు పవళింపు
కృష్ణరాయని మన్ననలందిన తెలుగు
బ్రౌను వర్యుని మాన్యత నందినదీ వెలుగు
అవధానపు అలంకార శోభితమే జిలుగు
పద్యపు పూలమాల లల్లిన దీ తళుకు
ప్రబంధాల నడకల వయ్యారమీ కులుకు
విస్తృతమౌ వర్ణమాల స్పష్టమైన పలుకు
అమరావతి బౌద్ధసీమ ప్రకాశించు తెలుగు వలపు
రాణ్మహేంద్రి నన్నాయార్య గౌతమీ పరవళ్ళ తెలుగు తలపు