పారదర్శకతలేని పునరావాసం ప్రమాదకరం -దేవి

అక్రమ రవాణాపై చాలా లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మాదకద్రవ్యాలు, ఆయుధాల దొంగ వ్యాపారం తర్వాత అంత స్థాయి ఆదాయాన్ని ఇచ్చేది అక్రమ రవాణా. వలసకీ, అక్రమ రవాణాకీ విడదీయలేని సంబంధం ఉంది. స్వదేశంలో రక్షణ లేనివాళ్ళు, యుద్ధాల నుండి, ప్రభుత్వాల నుండి పారిపోదల్చిన వారు, మైనారిటీలుగా వేటాడబడే వారూ తాము వెళ్ళదలచుకున్న దేశంలో చట్టాలు అనుమతించనపుడు ఆశ్రయించేది అక్రమ రవాణానే. ఉన్న గ్రామంలో, పట్టణంలో నిలువ నీడ లేనప్పుడు, ఉపాధి దొరకనప్పుడు, ఆదాయం అరకొరగా మారినపుడు స్వంతంగా పని చూసుకోగలమనే నమ్మకం లేనపుడు అరబ్బు దేశమైనా, ఆమెరికా కోసమైనా డబ్బు చెల్లించి మరీ అక్రమ రవాణా చేయించుకుంటారు. ఇటుక బట్టీలు, గాజు పరిశ్రమ, ఎంబ్రాయిడరీ, రెడీమేడ్‌ దుస్తుల తయారీ, ప్యాకేజింగ్‌, ఇళ్ళల్లో పనులు… సవాలక్ష పనుల కోసం వారంతట వారుగానో, ఏజెన్సీల ద్వారానో రవాణా చేయబడి ‘వెట్టి’ కార్మికులుగా మారతారు. వీరిలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు పనిచేయగల వయస్సు వారంతా ఉంటారు.

సాంప్రదాయక వృత్తులు ధ్వంసం కావటం, వ్యవసాయం దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోవడం, కరువులు, తుఫానులు వంటి విపత్తులు ఫ్యాక్టరీల మూత, అభివృద్ది (పరిశ్రమలు, డ్యాములు, రోడ్లు వగైరా) వలన తమ భూముల నుండి, ఇళ్ళ నుండి నిరాశ్రయులు కావటం వంటి సవాలక్ష కారణాల వలన ప్రతిరోజూ పదికోట్ల మంది ప్రజలు రోజువారీగా లేదా సీజనల్‌గా లేదా శాశ్వతంగా వలస పోతున్నారు. వారిలో అనేకమంది అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీనిలో ఎక్కువ భాగం నేరస్థ ముఠాలే చేస్తున్నాయి. అక్రమ రవాణా, ఇళ్ళల్లో పనికి, ఒంటెల పోటీకి, పరిశ్రమల్లో వెట్టి చాకిరీకి, వ్యభిచారానికి, అవయవ వ్యాపారానికి, అడుక్కు తినడానికి దేనికోసమన్నా జరగొచ్చు. అక్రమ రవాణాకు గురయిన వారికి మనిషిగా ఉండే హక్కులన్నీ నిరాకరించబడతాయి. అక్రమ రవాణా చేసి అక్రమంగా డబ్బు సంపాదించే ముఠాలు ప్రణాళికాబద్ధంగా ఆధునిక టెక్నాలజీతో రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థల్లోని అవినీతిపరుల అండతో యధేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు.

కాబట్టి అక్రమ రవాణాను ఆపదల్చుకుంటే మొదట ఆలోచించాల్సింది ఈ నేరస్థ ముఠాలను ఎట్లా పట్టుకుని శిక్షించాలి అని. రెండోది, అక్రమ రవాణాకు గురవుతున్న వారికి ఉన్న నిస్సహాయత ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? ఆ కారణాలు నివారించే మార్గాలు ఏమిటి? అక్రమ రవాణా నిరోధానికి దీర్ఘకాలిక, తాత్కాలిక చర్యలేమిటి? అని. నేరస్థులను తప్పిస్తున్న వ్యవస్థల్లో తీసుకురావలసిన మార్పులేమిటి అని ఆలోచించాక చివరగా వచ్చేది బాధితుల రక్షణ, పునరావాసం.

కానీ ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో నివారణ చర్యలకు అరపేజీ కేటాయించి, నేరస్త ముఠాల శిక్షకు ముప్పావు పేజీ కేటాయించింది. అక్రమ రవాణాలో మిగిలిన అన్ని కోణాలను వదిలేసి ఒక్క వ్యభిచారం అనే అంశాన్నే పట్టుకున్నారు. పోనీ దీనిలోనన్నా నివారణ ఉందా అంటే పునరావాసం మొత్తం బిల్లు అంతా వ్యాపించిపోయింది. ఏటా దేశంలో రెండున్నర లక్షల మంది పిల్లలు, స్త్రీలు అక్రమ రవాణా ద్వారా వ్యభిచారంలోకి దిగుతున్నారని ప్రభుత్వ అంచనా. 20 ఏళ్ళలో 20 వేల మందికి పునరావాసం కల్పించామని చెప్పుకుంటున్న ఒక సంస్థ అటువంటి మరి కొన్ని సంస్థలు ఈ బిల్లు రూపకల్పనలో పూర్తి పాత్ర పోషించాయట. కనుక అక్రమ రవాణా బిల్లు కాస్తా వ్యభిచారం కోసం జరిగే అక్రమ రవాణా పునరావాస బిల్లుగా మారిపోయింది.

తీవ్రమైన నిరంతర లైంగిక దోపిడీకి పిల్లలను, స్త్రీలను ఎరవేయడం క్రూరం, దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికై జరిగే అక్రమ రవాణాను మనిషనే ఎవ్వరూ సమర్ధించరు, ఆమోదించరు. కానీ రకరకాల మాధ్యమాల ప్రభావం, విచ్చలవిడితనానికి వికృత కోరికలను రెచ్చగొడుతున్న, ఆమోదిస్తున్న జీవనశైలి పిల్లలు, స్త్రీలకు డిమాండ్‌ సృష్టిస్తున్నది. ”వలస” పోయి సంపాదించాల్సిన పరిస్థితి కుటుంబ జీవనానికి దూరం చేయడం వలన కూడా సెక్స్‌ వర్కర్ల అవసరాన్ని ఏర్పరుస్తున్నది. పేదరికం, అజ్ఞానం, సామాజిక అసమానతలు, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, దురలవాట్లు కలగలిసిన కుటుంబాలు అక్రమ రవాణా ముఠాలకు తేలికగా దొరికిపోతారు. అక్రమ రవాణా అరికట్టాలంటే మొదట పై కారణాలపై పోరాడాలి. తర్వాతనే నేరస్త ముఠాల పనిపట్టాలి. కానీ ఈ రెంటినీ పూర్వపక్షం చేసి ఈ కొత్త బిల్లు ”పునరావాసం” గురించే ఎందుకు మాట్లాడుతోంది. ఏనుగులు పట్టే కంతలు వదిలేసి చీమల రంధ్రాలపై యుద్ధం ఎందుకు ప్రకటించింది? ఎవరి కన్నీళ్ళు తుడవడానికి? ఎవరి ప్రయోజనాల కోసం?

తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడినా ఆర్థిక సంక్షోభాలు జరిగినా (నోట్ల రద్దు వంటివి కూడా) సెక్స్‌ వర్కర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. సెక్స్‌ వర్కర్లలో అధిక శాతం అక్రమ రవాణా వల్ల దీనిలో ప్రవేశించారనడానికి ఏ ఆధారం లేదు. సాంప్రదాయకంగా ఇటువంటి వృత్తిలో ఉన్న దేవదాసి, జోగిని, బసివి, మాతంగి వంటి మతం ఆమోదించిన కుటుంబాలు, సమాజాలు వెలివేసిన కులాలు ఇప్పటిదాకా పునరావాసానికి నోచుకోలేదు. వారు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. కుటుంబాలు పోషించడానికి వేరే దారి లేనపుడు ఈ వృత్తిలో దిగుతుంటారు. సెక్స్‌ వర్కర్లలో 70 శాతం పైగా బాల్య వివాహ బాధితులు, ఎనిమిది కంటే తక్కువ చదివినవారు ఉంటారు. అణగారిన కులాలకు చెందినవారే ఎక్కువ (అణగారిన కులాల స్త్రీల శరీరాల లైంగిక దోపిడీ ఆధిపత్య కులాల ఆమోదించబడిన హక్కు).

”కష్టపడి నిజాయితీగా బతకొచ్చు కదా!” అనే శీలవంతులు చాలామంది. కానీ అసంఘటిత రంగంలో ఉపాధికి, వేతనానికి ఏ రకమైన హామీ లేకపోవడం వలన లైంగిక హింసకు గురయ్యేవారికి ఏ భద్రత కలిగించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడం కూడా సెక్స్‌ వృత్తిని ఎంచుకోవడానికి కారణం. ”కూలికి పోతే పక్కలోకొస్తేనే కూలి అన్నాడు మేస్త్రీ. వాడిచ్చే వంద రూపాయలకి అంత హింస అవసరమా? వేరే వాళ్ళ దగ్గరికి పోతే తడవకి వెయ్యి రూపాయలు వస్తాయని తోటి ఆమె ఉపాయం చెప్పింది. అది నిజమే కదా! అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే చవకగా ఎందుకమ్ముడు పోవాలి?” అని ప్రశ్నించింది ఒక ఆమె.

”పగలంతా రాళ్ళ పొలంలో పనిచేయాలి. ఇంటి చాకిరీ చేయాలి. తాగొచ్చి మొగుడు కదుములు తేలేట్టు కొడతాడు. మళ్ళీ పక్కలోకి రాకుంటే రచ్చ చేస్తాడు. ఇంత చేసినా కడుపు నిండటం కష్టం. ఏం చేయాలి? ఎవరో చెప్పారు తేలిగ్గా డబ్బులు వస్తాయని. వెళ్ళాను. కడుపునిండా తిండి. ఎండల్లో చాకిరీ లేదు. రాత్రికి ఓర్చుకుంటే చాలు. నా మొగుడిలాగ ఎవరూ కొట్టి రక్తం కళ్ళచూడరు. ఇంతో అంతో ఇంటికి పంపుతా”. ”మరి రోగాలొచ్చి చస్తే” అని ప్రశ్నిస్తే ”మొగుడి దెబ్బలకి చస్తే? ఆకలికి చస్తే? ఎట్లయినా చచ్చేదే కదా!” అంది తేలికగా మరొకామె, ”నీ అంతట నువ్వే ఎందుకు వెళ్ళావు?” అని అడిగినదానికి జవాబుగా. ఆమెకు పతివ్రతల కతలు ఎవరూ చెప్పి

ఉండరు పాపం. ఈ మర్యాదస్తులకి కుటుంబ హింస, మారిటల్‌ రేప్‌ పాతివ్రత్యంలో భాగం కదా!

”భర్త పనికి వెళ్ళే పరిస్థితి లేదు. అనారోగ్యం. చాలా డబ్బు కావాలి. మందులకి, ఆసుపత్రికి, తిండికి, పిల్లల చదువులకి… చదివింది అయిదో తరగతి. ఏం చేయను? ఎక్కడినుండి తెస్తున్నావని ఆయన అడగలేదు. పిల్లలకి తెలియదు, తెలియనివ్వను. ఈ అవసరాలు తీరితే అప్పుడు ఆలోచిస్తా. ఇందులో ఎవరికేం ఇబ్బంది. నేను ఏ మగాడినీ బలవంతం చేయను. ఇష్టపడే వస్తారు. దమ్ముంటే మగాళ్ళకి గొలుసులేయండి” అన్నది ఇంకొక మహిళ.

”మా శరీరం మేము అమ్ముకుంటున్నాం. ఎవరినీ దోపిడీ చేయటం లేదు. కష్టం, నష్టం, తిరస్కారం మాకే కదా! మా కుటుంబాలకి మేమే ఆధారం. తమ్ముళ్ళు ఒక దారికి రావాలి” చెప్పింది ఒక యువతి.

వీళ్ళ శీలాలపై పతివ్రతలపై వాపోయే నీతిపరులకూ, ధర్మసూక్తులు వల్లించే మతాధిపతులకూ ఏ రకమైన నీతి నియమాలున్నాయి? పరిస్థితులు వారినలా తయారు చేశాయనే మాట విస్మరించి వీరే సమాజానికి పీడ/కళంకం అనేవారు. వీరి దగ్గరికి పోయే రాజకీయ నేతలు, అధికారులు వీరి దగ్గర లంచాలు దండే పోలీసులనూ దేశాన్ని డొల్లచేసే కుంభకోణాధిపతుల్ని సినీ నటీనటుల శరీరాల్ని తెరపైనా తెరవెనుకా దోచుకునే బడా బాబుల్ని భుజాన మోస్తారు కదా! ఇటువంటి వారందరి అండదండల్తో పనిచేసే పునరావాస గృహాల నిర్వాహకులు సెక్స్‌ స్కాముల్లో ఉంటారు. వారి భర్తలు సెక్స్‌ వర్కర్లపై సినిమాలు తీసి ఊరుకోరు. దొరికిన నటీమణుల్ని సెక్స్‌ వర్కర్లుగా మారుస్తారు. సినిమాలకు, విలాస జీవనానికి, భవంతులకు, కార్లకు, అవార్డుల సంపాదనకు పునరావాసం స్త్రీల శరీరాలే పెట్టుబడి మరి. శవాలపై చిల్లర ఏరుకోవడంతో ఆగకుండా, శవాల సంఖ్య పెంచడానికి ప్రయత్నించేవారిని ఏమని పిలవాలి.

మేజరయిన వ్యక్తికి తన సంరక్షణ పైనా, శరీరంపైనా నిర్ణయం చేసుకునే హక్కు ప్రాథమికం. సెక్స్‌ వర్కర్లంటే నేరస్తులూ కాదు, మందబుద్ధులూ కాదు. ”వివాహేతర సంబంధం నేరం కాదు… అనైతికం కావచ్చు. కానీ ఆ సంబంధానికి కారణమయిన వివాహబంధాన్ని కూడా సమీక్షించాలి” అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నైతిక భాష్యకారులంతా ఆ తీర్పుపై నిర్ఘాంతపోయారు. కానీ సుప్రీంకోర్టు ఇంతకాలం ఎదిగిన స్త్రీలకు సంరక్షకులచే హామీలు ఇప్పిస్తున్న Iుూూ చట్టంపై మౌనం వహిస్తోంది. విటుడిగా ఉండే మగాడు తిరిగి ఆ పనిచేయడని హామీ అతని సంరక్షకులు, భార్యతో ఎందుకు ఇప్పించరు? ఎందుకంటే ‘మగాడి’కి అతనే సంరక్షకుడు. స్త్రీకి మాత్రం తండ్రి, భర్త లేదా పునరావాస ఎన్జీఓ సంరక్షకులు ఎందుకు?

ఆర్తిపాయి తదితరులు చేసిన అధ్యయనం (జుూఔ లో ప్రచురితం) ప్రకారం రెయిడ్స్‌లో దొరకబుచ్చుకుని పునరావాస గృహాలకు తరలించిన సెక్స్‌ వర్కర్లలో 79.6 మంది తిరిగి సెక్స్‌ వర్క్‌ చేయాల్సి వచ్చింది. సెక్స్‌ వర్క్‌లోకి బలవంతంగా దించితే తిరిగి అదే పనిలోకి ఎందుకు వెళ్తున్నారు? వృత్తి నైపుణ్యాలు లేకపోవడంవల్ల ఈ వృత్తి చేపడితే వృత్తి నైపుణ్యాలు నేర్పించాక ఎందుకు తిరిగి వెళ్తున్నారు? ఒకవేళ పరిస్థితుల ప్రభావం వలన వెళ్తే పరిస్థితులు మారాక ఎందుకు వెళ్తున్నారు? మోసపోయి ఈ వృత్తిలోకి దింపబడితే కొత్త జీవితం ఎందుకు ప్రారంభించరు? ప్రత్యామ్నాయం లేక ఈ వృత్తి చేపడితే ప్రత్యామ్నాయం దొరక్క తిరిగి వెళ్తున్నారా? ఇటువంటి ప్రశ్నలు అనేకం తలెత్తుతాయి.

ఈ మొత్తం సమస్యలో మూడు కోణాలున్నాయి. ఒకటి ప్రత్యామ్నాయ మార్గాలు, ఉపాధి, వృత్తి నైపుణ్యం లేకనో మోసపోతే, అక్రమ రవాణా వల్లనో ఈ వృత్తిలో ప్రవేశించి నిరంతరం లైంగిక హింసకు, దోపిడీకి గురయ్యేవారికి చట్టంగాని, ప్రభుత్వం గానీ వాస్తవంలో ప్రత్యామ్నాయం చూపడం లేదు. సమాజం వారిని తిరిగి జనజీవన స్రవంతిలో కలుపుకోవడానికి పూర్తిగా నిరాకరిస్తుంది. చట్టం కూడా దీనిని ఒక నైతిక దృష్టితోనే చూస్తుంది. కానీ నిజానికిది ఒక అభివృద్ధి విధానానికి సంబంధించిన సమస్య. ఈ విధ్వంసక అభివృద్ధి నమూనా అణగారిన స్త్రీలకు గల సాంప్రదాయక ఆదాయాన్నే కాదు విలువల్ని కూడా ధ్వంసం చేస్తుంది. దానికి ప్రత్యామ్నాయం చూపదు. ఈ వినాశకర నమూనాను మార్చాలని లేదా దాని బాధితులకు గౌరవప్రదమయిన కనీస ఉపాధి కల్పించడం తమ బాధ్యత అనీ ప్రభుత్వం భావించడం లేదు.

ఇది వ్యక్తిగతంగా చేసుకున్న ఎంపిక. మానవతులు పిల్లల్ని చంపి తాము చస్తారు కానీ ఈ వృత్తి చేయరు కాబట్టి ఈ సెక్స్‌ వృత్తిలోకి వచ్చిన వారి నైతికతకు సంబంధించిన పతనంగానే ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. పరిస్థితుల ప్రభావంగా భావించే కొద్దిమంది కూడా ప్రభుత్వం చూపే అరకొర ప్రత్యామ్నాయాలు వీరు తీసుకోలేదని అసంతృప్తి చెందుతారు. ప్రభుత్వం అందించే పునరావాస పరిహారం కొత్త జీవితానికి సరిపడా ఉందా? నేర్పిస్తున్న వృత్తి నైపుణ్యాలు ఉపాధి కల్పిస్తున్నాయా? ప్రత్యామ్నాయ వృత్తిలో వారికి గౌరవం ఉందా? ఏ ప్రత్యామ్నాయ మార్గాల్లోనయినా ”నైతిక” దృష్టి గల పుణ్యపురుషులు వారిపై చేస్తున్న ఒత్తిడిలు, దాడులు వారిని తిరిగి అదే వృత్తిలోకి నెడుతున్నాయా? అనే పరిశీలన జరగడం లేదు. స్త్రీల శీలమే ఆమె నిజమైన సంపదగా భావించే పురుష సమాజానికి సెక్స్‌ వర్కర్లు

ఉండడం ఒక అవసరం. వలసలకి ప్రత్యామ్నాయం చూపని ఆర్థిక నీతి సెక్స్‌ వర్కర్ల సప్లై అనివార్యం చేస్తుంది మీడియా. జీవనశైలి వికృతమయిన, హింసాత్మక సెక్స్‌ వాంఛల్ని ఆమోదయోగ్యం చేస్తుంది. కుల సతుల్ని ఈ వికృతాల నుంచి కాపాడడానికి సెక్స్‌ వర్కర్లకు ఆహ్వానం లభిస్తుంది. అరాచక నేరస్థ ముఠాలు దీన్ని సొమ్ము చేసుకుంటాయి.

దీనిలో భాగంగానే సమస్య మూలాల నుండి చర్చించకుండా ప్రభుత్వం పురుషాధిక్య నైతిక కోణం నుండి ఈ కొత్త బిల్లుకు రూపకల్పన చేసింది. దీనిలో నివారణ ప్రసక్తి లేకపోవడానికి కారణం అది జరగదని, నివారించడానికి నిజాయితీగా ప్రయత్నం చేయదల్చుకోకపోవడమే. కానీ అక్రమ రవాణా, మాయమవుతున్న పిల్లలు, స్త్రీలు సమాజంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయి. ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాయి. కాబట్టి ఏదో జరుగుతున్నట్లు, చేస్తున్నట్లు కనబడాలి. దీనికోసం జరిగేదే పునరావాస నాటకం.

కొంతమంది స్వచ్ఛంద సేవకులు ఈ బృహత్తర బాధ్యత భుజాన్నేసుకుంటారు. ప్రభుత్వం నుండి విదేశాల్నుండి ఉద్ధరింపు నిధులు పొందుతారు. విలాసవంతమయిన సౌకర్యాలు అనుభవిస్తూ ఈ నీతితప్పిన స్త్రీల కోసం ‘గడీలు’ నిర్మిస్తారు. నాజీల కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపు మాదిరి వీరితో ఎవరినీ కలవనివ్వరు. బంధువులతో మాట్లాడనివ్వరు. ఆత్మహత్య చేసుకున్నా విచారణ కానీ, విచారం కానీ

ఉండదు. తమ జైలు క్రమశిక్షణ తట్టుకోలేక మరణించడం వారి బలహీనత అని జబ్బలు చరుచుకుంటారు. వీరి క్రమశిక్షణకు పోలీసులు కూడా అబ్బురపడి మాక్కూడా పౌరహక్కులు నిరాకరించే, ప్రశ్నించని ఇటువంటి అధికారం ఉంటే బాగుండనుకుంటారు.

నిధులు పండించే దయామయులకు మాత్రం ఈ గడీల తలుపులు నిరంతరం తెరిచి ఉంటాయి. వారి ముందు ఆనందంగా నవ్వకపోతే ఈ గతిలేని స్త్రీలకు నరకం చూపుతారు. వారు గాని తిరగబడితే కుట్ర సిద్ధాంతాలు ప్రచారమవుతాయి. మాఫియా ముఠాలు కుట్రపూరితంగా కొందర్ని బాధితులుగా ఈ గృహాల్లో ప్రవేశపెట్టి హింసకు తెగబడ్డారని వాపోతారు. బాధితులు నేరస్థులవుతారు. నిర్వాహకులు పాపం బాధితులవుతారు. వీరికి బిరుదులు, అవార్డులు, సన్మానాలు… మీడియా, ప్రభుత్వం, పోలీసుల అండ. పాపం నిజమైన బాధితుల గోడు వినేందుకు ఎవ్వరూ ఉండరు. ప్రారంభంలో బస్సుల్లో తిరిగిన ఈ స్వచ్ఛంద గడీల నిర్వాహకులు ఖరీదయిన భవంతులు, పెద్ద కార్లు ఎట్లా సంపాదించుకున్నారని కానీ, సినిమాలకు పెట్టుబడులు ఎక్కడివి అని కానీ ప్రభుత్వాలు ప్రశ్నించవు. తీస్తా సెతల్వాక్‌, అరుణారాయ్‌లు కాదు కదా సతాయించి విదేశీ నిధులు అని ప్రచారం చేయడానికి?

స్త్రీ కామిని, చంచలబుద్ది, ఉన్నత కార్యాలకు ఉద్దేశించబడిన పురుషుడిని వాంఛల జాలంలో కట్టేసే పాపి కాబట్టి ఈ మనుధర్మాన్ని ఈ స్వచ్ఛంద గడీల్లో అమలు జరుపుతారు. ఈ పాప పంకిల స్త్రీలకు శారీరక హింస, మానసిక వెలి, ఒంటరితనం. దానికి తోడు కామాన్ని నాశనం చేసే సాత్వికాహారం ఇస్తారు. పురుషులు కదా డిమాండ్‌ చేసేది. అత్యాచారాలు, లైంగిక దాడి చేసేది. అతనికి సాత్వికాహారం, హింస విధిస్తే సమస్య పరిష్కారం అవుతుందనే తర్కం ఇక్కడ పనిచేయదు. మతానికి, కులానికి, సామాజిక ఆర్థిక వ్యత్యాసాలకి బలవుతున్న స్త్రీలు మాత్రం బాధితులు కాకుండా నేరస్తులవుతారు. తద్వారా వ్యక్తిగత ఎంపిక, నీతి ముందుకు తెచ్చి ప్రభుత్వాలు బాధ్యతల నుండి చేతులు దులిపేసుకుంటారు.

మరి వారి వ్యక్తిగత నైతిక ప్రవర్తనే దీనికి కారణం అయితే ఈ దేశ పౌరులుగా వ్యక్తిగతంగా నీతిగా ఉండాలా? పునరావాసం కావాలా? సెక్స్‌ వృత్తి కొనసాగించాలా? అనే నిర్ణయం కూడా వారిదే అయ్యుండాలి కదా! ఆ హక్కుని వారినుండి గుంజేసి పోలీసులకు, పునరావాస నిర్వాహకులకు అప్పగించడానికి కారణం ఏమిటి? ఇది వారి ప్రాథమిక హక్కుల, మానవ హక్కుల ఉల్లంఘన కాదా! అక్రమ రవాణా, గృహాలపై దాడుల్లో చట్టాల ఉల్లంఘన, హింస, అమానుషత్వం రాజ్యమేలుతుంటే ఈ స్త్రీలకు మానవ హక్కులు లేవని ప్రకటించడం కాదా!

ఏ ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఎవరు అక్రమ రవాణా నేరస్తులో, ఎవరు బాధితులో పోలీసులు ఎట్లా నిర్ధారిస్తారు? దివ్యదృష్టితోనా! మరి అక్రమ రవాణాకు సహకరించే పోలీసులే నేరస్తుల్ని నిర్ధారించడమనే అంశాలు పోలీసులకు చట్టం ఎందుకు కట్టబెడుతోంది? మానవ హక్కుల ఉల్లంఘన చట్టబద్ధం చేయదల్చుకుందా? ఇప్పటికే నైతిక స్వచ్ఛత కాపాడదల్చుకున్న పోలీసుల అత్యుత్సాహంతో విదేశీ గూఢచారుల్ని చిత్రహింసల పాల్జేసినట్టు ఈ సెక్స్‌ వర్కర్లపై తమ ప్రతాపం చూపుతున్నారు. అక్రమ రవాణాదారు అన్ని హక్కులూ పొంది నెలరోజుల్లో విడుదలయిపోయి హాయిగా దందా కొనసాగిస్తుంటే బాధిత మహిళలు ఏళ్ళ తరబడి పునరావాస గృహాల్లో వృత్తి నైపుణ్యాల పేరిట వెట్టి చాకిరీ చేస్తూ ఏ హక్కులూ లేకుండా మగ్గిపోతున్నారు.

ఉద్దరిస్తున్నాం కనుక పారదర్శకత అక్కరలేదు అనడం దుర్మార్గం. స్త్రీలకు నిర్ణయించుకునే హక్కు ఉంటే పునరావాస గృహాలు మూతబడతాయి. విలాస జీవితాలు, అవార్డులు ఉండవు. ఎవరయితే నిధులూ, గడీలు లేకుండా పునరావాసం గురించి వారి వారి సమూహాలు, సామాజిక పునరావసం గురించి, నివారణ గురించి ప్రశ్నిస్తారో, పనిచేస్తారో వారంతా సెక్స్‌ వృత్తిని ప్రోత్సహిస్తున్నట్లే. అంటే, అమెరికా అన్నట్లు మాతో లేకుంటే మాకు శత్రువే అన్న పద్ధతన్నమాట.

ప్రపంచ వ్యాప్తంగా అక్రమ రవాణా పెద్ద సమస్య. మానవ అక్రమ రవాణాలో స్త్రీలకు, పిల్లలకు అదీ కూడా సెక్స్‌ వర్క్‌కు సంబంధించింది ఒక భాగం మాత్రమే. దీని నివారణకు సవాలక్ష ప్రత్యామ్నాయాలు, విధానాలు ఉన్నాయి. కానీ గత నలభై ఏళ్ళుగా విఫలమయిన నమూనా (వ్యభిచార గృహాలపై దాడి, పునరావాసం) ను మళ్లీ ఒక చట్టంగా తేవడం అవివేకులు కూడా చేయరు. ఛాందసులు, స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే చేయగలరు.

పునరావాస గృహాల భాగోతం ముజఫర్‌పూర్‌ నుండి హైదరాబాద్‌ దాకా పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్నా కానీ నిర్లజ్జగా దాన్ని సమర్ధించేవారిని ఏం చేయాలి? జనజీవితాన్ని ప్రభావితం చేసే అంశం ఏదయినా, ఏ సామాజిక సేవ అయినా నిధులు పొందినా, పొందకపోయినా అది పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఉండి తీరాలి. వేయిగొడ్లను తిన్న రాబందు ఒక్క సుడిగాలికి రాలినట్లు వేయిమందికి పునరావాసం కల్పించినా పదిమంది హక్కుల్ని కాలరాయటం నేరమవుతుంది. ఈ మానవ హక్కుల

ఉల్లంఘన జాతీయ, అంతర్జాతీయ చట్టాలన్నింటి దృష్టిలో నేరమే. హక్కుల ఉల్లంఘన జరగకుండా, పారదర్శకత లేకుండా పునరావాసం చేయలేమంటే ఆ పునరావాసం అవసరం లేదు. ఏ ఒక్కరి జీవితంపైనా ఎంత గొప్ప సేవకులయినా ఇతరుల నిర్ణయాధికారం ఇచ్చే చట్టం రాజ్యాంగ విరుద్ధం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.